వైరల్‌ : టాస్‌ వేశారు.. కాని కాయిన్‌తో కాదు | Melbourne Renegades Won The Toss Flipping Bat Became Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ : టాస్‌ వేశారు.. కాని కాయిన్‌తో కాదు

Published Sun, Jan 3 2021 1:11 PM | Last Updated on Sun, Jan 3 2021 4:47 PM

Melbourne Renegades Won The Toss Flipping Bat Became Viral - Sakshi

పెర్త్‌ : క్రికెట్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు టాస్‌ వేయడం ఆనవాయితీ. టాస్‌ వేయడానికి ఎక్కడైనా కాయిన్‌ను ఉపయోగిస్తారు.. కానీ బిగ్‌బాష్‌ లీగ్‌లో కాయిన్‌కు బదులు బ్యాట్‌ను ఫ్లిప్‌ చేసి టాస్‌ ఎంచుకోవడం వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం పెర్త్‌ స్కార్చర్స్‌‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ మధ్య జరుగుతున్న మ్యచ్‌లో చోటుచేసుకుంది. టాస్‌ సమయంలో కాయిన్‌కు బదులుగా బ్యాట్‌ను వాడారు.  మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ కెప్టెన్‌ బ్యాట్‌ ఫ్లిప్‌తో టాస్‌ గెలిచిన మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. (చదవండి: సెకన్ల వ్యవధిలో సూపర్‌ రనౌట్‌)

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ స్కార్చర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జోష్‌ ఇంగ్లిస్‌ 72 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కొలిన్‌ మున్రో 52 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ పరాజయం ముంగిట నిలిచింది. ఇప్పటికే 9 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 59 పరుగులతో ఓటమి అంచున నిలిచింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement