BBL 2021: Young Spectator Gets Forehead Injured Try to Catching Ball - Sakshi
Sakshi News home page

BBL 2021: బ్యాట్స్‌మన్‌ భారీ సిక్స్‌.. అభిమాని తల పగిలి రక్తం

Published Tue, Dec 14 2021 9:18 PM | Last Updated on Wed, Dec 15 2021 9:27 AM

BBL 2021: Young Spectator Gets Forehead Injured Try To Catching Ball - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌) 2021లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్‌మన్‌ కొట్టిన భారీ సిక్స్‌ను క్యాచ్‌గా తీసుకుందామని భావించిన అభిమాని తల పగిలి రక్తం కారడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం పెర్త్‌ స్కార్చర్స్‌, హోబర్ట్‌ హరికేన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. హోబర్ట్‌ హరికేన్స్‌ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్లో ఆండ్రూ టై బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్‌ బెన్‌ మెక్‌డెర్మోట్‌ భారీ సిక్స్‌ బాదాడు. స్టాండ్స్‌లోకి వస్తున్న బంతిని ఒక అభిమాని ఉత్సాహంతో క్యాచ్‌ అందుకోవాలని ప్రయత్నించాడు.

చదవండి: BBL 2021: 60 బంతుల్లో శతకం.. మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం

అయితే బంతి దురదృష్టవశాత్తూ అతని తల బాగంలో కుడివైపు బలంగా తగిలింది. దీంతో కుప్పకూలిన సదరు అభిమాని నుదుట నుంచి రక్తం కారడం మొదలైంది. ఇది చూసిన తోటి ప్రేక్షకులు కాస్త ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతన్ని సర్జన్‌ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు స్టేడియం నిర్వాహకులు ప్రకటించారు. 

చదవండి: ఆస్ట్రేలియా అండర్‌-19లో భారత సంతతి కుర్రాడు.. వింత బౌలర్ల జాబితాలో చోటు

మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ స్కార్చర్స్‌ మిచెల్‌ మార్ష్‌(60 బంతుల్లో 100,6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు, లారీ ఇవాన్స్‌( 40; 24 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హోబర్ట్‌ హరికేన్స్‌ 19 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెన్‌ మెక్‌డెర్మోట్‌ 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్‌ స్కార్చర్స్‌ బౌలర్లలో టైమల్‌ మిల్స్‌ 3, ఆస్టన్‌ అగర్‌, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు తీశారు.

చదవండి: Ruturaj Gaikwad: సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్‌.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement