BBL 2021: Perth Scorchers Batter Mitchell Marsh Smash Century 60 Balls - Sakshi
Sakshi News home page

BBL 2021: 60 బంతుల్లో శతకం.. మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం

Published Tue, Dec 14 2021 8:03 PM | Last Updated on Wed, Dec 15 2021 8:54 AM

BBL 2021: Perth Scorchers Batter Mitchell Marsh Smash Century 60 Balls - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ 2021లో మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం సృష్టించాడు. బీబీఎల్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ తరపున ఆడుతున్న మార్ష్‌ 60 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు బాదాడు. హోబర్ట్‌ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్ష్‌ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. బీబీఎల్‌ మార్ష్‌కు ఇది డెబ్యూ సెంచరీ కాగా.. ఈ సీజన్‌లో రెండోది. ఓవరాల్‌గా బిగ్‌బాష్‌ లీగ్‌ చరిత్రలో 28వ శతకం. ఇంతకముందు పెర్త్‌ స్కార్చర్స్‌కే చెందిన ఓపెనర్‌ కొలిన్‌ మున్రో ఈ సీజన్‌లో తొలి శతకంతో మెరిశాడు.  

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ స్కార్చర్స్‌ మిచెల్‌ మార్ష్‌(60 బంతుల్లో 100,6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు, లారీ ఇవాన్స్‌( 40; 24 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హోబర్ట్‌ హరికేన్స్‌ 19 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెన్‌ మెక్‌డెర్మోట్‌ 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్‌ స్కార్చర్స్‌ బౌలర్లలో టైమల్‌ మిల్స్‌ 3, ఆస్టన్‌ అగర్‌, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు తీశారు.
Click Here For Video: Mitchel Marsh Century

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement