బిగ్‌బాష్(బీబీఎల్ 10) లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఆటగాడుజోష్ ఇంగ్లిస్ క్రికెట్ ప్రపంచానికి కొత్త షాట్‌ను పరిచయం చేశాడు. సిడ్నీ సిక్సర్స్ బౌలర్ బెన్‌డార్సిస్ వేసిన వైడ్ డెలివరిని ఇంగ్లిస్ చివరి నిమిషంలో ఫ్లిక్ చేశాడు. కాగా ఎవరు ఊహించిన విధంగా బంతి బ్యాట్ వెనకవైపు తాకుతూ కీపర్‌ను దాటుకుంటూ వేగంగా బౌండరీలైన్ దాటింది. ఇంగ్లిస్ ఆడిన ఈ తరహా షాట్ ఇప్పటివరకు ఎవరు చూడలేదు. ఈ కొత్త షాట్‌కు క్రికెట్ పుస్తకాల్లో కూడా పేరు లేదు.
శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఈ షాట్ నమోదైంది.ఇంగ్లిస్ ఆడిన షాట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌లో షేర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ కొత్త షాట్ ఏమైనా కనిపెట్టాడా చెప్పండి అంటూ కామెంట్ చేసింది. అయితే అతని షాట్ చూసిన కామెంటేటర్లు.. ఓ.. నో.. బిగ్‌బాష్ లీగ్‌లో అతి దారుణమైన షాట్ ఇదే అంటూ కామెంట్ చేశారు. అయితే ఇంగ్లిస్ ఆడిన షాట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇంగ్లిస్ నువ్వు ఆడిన ఈ కొత్త షాట్‌కు పేరేంటి బాబు.. కవర్ డ్రైవ్.. స్ట్రెయిట్ డ్రైవ్ లాగా బ్యాక్‌వర్డ్ డ్రైవ్ అయి ఉండొచ్చు.' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే!
కాగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇంగ్లిస్ 69 పరుగులు(5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ టర్నర్ 33 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సిడ్నీ బ్యాటింగ్‌లో జేమ్స్ విన్స్ 53 బంతుల్లోనే 98 పరుగులు( 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ జోష్ ఫిలిపి 45 పరుగులతో రాణించాడు. చదవండి: అది జాతీయ జంతువు.. అందుకే కట్ చేయలేదు
Did Josh Inglis just invent a new shot?!? #BBL10 pic.twitter.com/slVuZ70lGl
— cricket.com.au (@cricketcomau) January 30, 2021
Comments
Please login to add a commentAdd a comment