స్టన్నింగ్‌ క్యాచ్‌.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది | Will Parker Unbelievable Catch Before Sliding Boundary Ropes BBL 2021-22 | Sakshi
Sakshi News home page

BBL 2021-22: స్టన్నింగ్‌ క్యాచ్‌.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది

Published Fri, Jan 21 2022 8:10 PM | Last Updated on Sat, Jan 22 2022 7:28 AM

Will Parker Unbelievable Catch Before Sliding Boundary Ropes BBL 2021-22 - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌లో(బీబీఎల్‌ 2021-22) అద్భుత సన్నివేశం కొద్దిలో మిస్‌ అయింది. హరికేన్‌ హోబర్ట్స్‌ ఆటగాడు విల్‌ పార్కర్‌ బౌండరీ లైన్‌పై స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నప్పటికి.. బౌండరీ లైన్‌ తాకడంతో అంపైర్లు సిక్స్‌గా ప్రకటించారు. అయితే పార్కర్‌ బౌండరీ లైన్‌ తాకకుండా క్యాచ్‌ తీసుకొని ఉంటే చరిత్రలో నిలిచిపోయేవాడు. హోబర్ట్‌ హరికేన్స్‌, అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ మూడో బంతిని మాట్‌ షార్ట్‌ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ కొట్టాడు. అక్కడే ఉన్న పార్కర్‌ పరిగెత్తుకొచ్చి విల్లులా వొంగి.. డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టాడు. అప్పటికే బౌండరీ లైన్‌ టచ్‌ చేయడంతో పార్కర్‌ ఏం చేయలేక బంతిని విసిరాడు. రూల్‌ ప్రకారం అంపైర్లు సిక్సర్‌ ఇవ్వడంతో పార్కర్‌ విన్యాసం వృథాగా మిగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ 22 పరుగులతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హోబర్ట్‌ హరికేన్స్‌ 19.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement