PC: Melbourne Renegades
Unmukt Chand- BBL: ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ టి20 లీగ్ టోర్నీలో మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఉన్ముక్త్ చంద్ గుర్తింపు పొందాడు. హోబర్ట్ హరికేన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఉన్ముక్త్ బరిలోకి దిగి ఆరు పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆరోన్ ఫించ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
కాగా 2012లో ఉన్ముక్త్ కెప్టెన్సీలో టీమిండియా అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లకే విదేశీ టి20 లీగ్‌లలో ఆడే అర్హత ఉంది. దాంతో 28 ఏళ్ల ఉన్ముక్త్ గత ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం బీబీఎల్‌లో మెల్‌బోర్న్ రెనెగెడ్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
చదవండి: Glenn Maxwell: 'క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా'
Seymour is smokin' them 🔥pic.twitter.com/WwKXFn6bW7
— Melbourne Renegades (@RenegadesBBL) January 18, 2022
Comments
Please login to add a commentAdd a comment