unmukt chand
-
అమెరికాలో సచిన్‌కు సత్కారం.. దేవుడు ఇక్కడే ఉన్నాడన్న ఉన్ముక్త్! (ఫొటోలు)
-
సౌతాఫ్రికా ఓపెనర్ ఊచకోత.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో! అయినా పాపం
మేజర్ లీగ్ క్రికెట్ 2024లో సీటెల్ ఓర్కాస్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది. ఈ లీగ్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓర్కాస్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.ఓర్కాస్ బ్యాటర్లంతా విఫలమైనప్పటకి ఆ జట్టు ఓపెనర్, దక్షిణాఫ్రికా స్టార్ ర్యాన్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రికెల్టన్ నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.నైట్‌రైడర్స్ బౌలర్లలో జాన్సన్, రస్సెల్, నరైన్, డ్రై తలా వికెట్ సాధించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అతడితో పాటు జాసన్ రాయ్ 27 పరుగులతో రాణించాడు. సీటెల్ ఓర్కాస్ బౌలర్లలో గనూన్, హార్మత్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడీ, కీమో పాల్ చెరో వికెట్ సాధించారు. ఏదమైనప్పటకి సీటెల్ ఓర్కాస్ ఓటమి పాలవ్వడంతో ర్యాన్ రికెల్టన్ అద్భుత ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది. -
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును యూఎస్ఏ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టుకు మోనాంక్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరీ అండర్సన్‌కు చోటు దక్కింది. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అండర్సన్.. గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ నుంచి ఎన్వోసీ తీసుకుని అమెరికాకు మకాం మార్చాడు. ఇప్పుడు అతడికి ఏకంగా సెలక్టర్లు వరల్డ్‌కప్ జట్టులో ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ జట్టులో భారత సంతతికి చెందిన ఐదుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. కెప్టెన్ మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్ భారత మూలాలు కలిగి ఉన్నారు.ఈ జట్టులో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు చోటు దక్కలేదు. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అమెరికా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 1న డల్లాస్ వేదికగా కెనడాతో తలపడనుంది.అమెరికా వరల్డ్‌కప్ జట్టు..మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, కోరీ ఆండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్టుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, షాడ్లీ వాన్ షాల్క్విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్. -
IPL 2024: సన్‌రైజర్స్ కోచ్‌గా దూరం.. ఆ ‘టీమ్’లో స్పీడ్‌గన్!
ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి తరుణం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో 21 మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఓవైపు క్రికెటర్లు ఆటతో అలరిస్తుంటే.. వారి ఆటను విశ్లేషిస్తూ మాటల గారడితో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన కామెంటేటర్లు సిద్ధమవుతున్నారు. ఇందులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి, దిగ్గజం సునిల్ గావస్కర్ సహా భారత్ నుంచి తరలివెళ్లి అమెరికాకు ఆడుతున్న ఉన్ముక్త్ చాంద్ వరకు లిస్టు పెద్దదిగానే ఉంది. ఇక వ్యక్తిగత కారణాల దృష్ట్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా తప్పుకొన్న సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఇంటర్నేషనల్: స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జాక్వెస్ కలిస్, టామ్ మూడీ, పాల్ కాలింగ్‌వుడ్. ఇంగ్లిష్ కామెంట్రీ: సునిల్ గావస్కర్, రవి శాస్త్రి, బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ క్లార్క్, సంజయ్ మంజ్రేకర్, ఆరోన్ ఫించ్, ఇయాన్ బిషప్, నిక్ నైట్, సైమన్ కటిచ్, డ్యారీ మోరిసన్, క్రిస్ మోరిస్, క్యాటీ మార్టిన్, సామ్యూల్ బద్రి, గ్రేమ్ స్వాన్, దీప్‌దాస్ గుప్తా, హర్షా భోగ్లే, పుమెలెలో ముబాంగ్వా, అంజుమ్ చోప్రా, మురళి కార్తిక్, డబ్ల్యూవీ రామన్, నటాలీ జెర్మనోస్, డారెన్ గంగ, మార్క్ హొవార్డ్, రోహన్ గావస్కర్. తెలుగు: మిథాలీ రాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి. సుమన్, కళ్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర్రావు, రాకేశ్ దేవా రెడ్డి, డానియల్ మనోహర్, రవి రాక్లే, శశికాంత్ ఆవులపల్లి, ఎం ఆనంత్ శ్రీక్రిష్ణ, వింధ్య మేడపాటి, గీతా భగత్, అంబటి రాయుడు. హిందీ: హర్భజన్ సింగ్ ఇర్ఫాన్ పఠాన్ అంబటి రాయుడు రవిశాస్త్రి సునీల్ గవాస్కర్ వరుణ్ ఆరోన్ మిథాలీ రాజ్ మహ్మద్ కైఫ్ సంజయ్ మంజ్రేకర్ ఇమ్రాన్ తాహిర్ వసీం జాఫర్ గురుకీరత్ మన్ ఉన్ముక్త్ చంద్ వివేక్ రజ్దాన్ రజత్ భాటియా దీప్ దాస్‌గుప్తా రామన్ భానోట్ పదమ్జెట్ సెహ్రావత్ జతిన్ సప్రు. -
సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘దేశం మారితేనైనా ఫలితం ఉంటుందేమో!’
ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గురువారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన 14వ సెంచరీ నమోదు చేశాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో కేవలం 89 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. డబుల్ సెంచరీ దిశగా బ్యాట్ ఝులిపిస్తూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్‌పై ప్రశంసలు కురిపిస్తున్న టీమిండియా అభిమానులు.. అదే సమయంలో బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకున్నాడు. రంజీల్లో పరుగుల వరద పారించి టీమిండియా టెస్టు జట్టు రేసులో ఎల్లప్పుడూ ముందే ఉన్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని కనికరించడం లేదు. ప్రధాన జట్టుకు ఈ ముంబై ఆటగాడిని ఎంపిక చేయడం లేదు. అయితే, ఇంగ్లండ్ లయన్స్‌తో స్వదేశంలో మూడు అనధికారిక టెస్టు సిరీస్‌లో తలపడే భారత-ఏ జట్టులో మాత్రం చోటిచ్చారు. ఇందులో భాగంగా వామప్ మ్యాచ్‌లో 96 పరుగులతో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్.. తొలి అనధికారిక టెస్టులో 55 పరుగులతో పర్వాలేదనిపించాడు. అంతకు ముందు సౌతాఫ్రికా గడ్డపై ఈ 26 ఏళ్ల ముంబై బ్యాటర్ మొత్తంగా 102 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి టెస్టుకు విరాట్ కోహ్లి దూరం కాగా సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు పిలుపునిస్తారని అతడి అభిమానులు భావించారు. కానీ మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్‌తో కోహ్లి స్థానాన్ని భర్తీ చేయడంతో సర్ఫరాజ్‌కు మరోసారి మొండిచేయే ఎదురైంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడు సెంచరీ బాదిన తర్వాత నెట్టింట బీసీసీఐపై ట్రోలింగ్ మొదలుపెట్టారు ఫ్యాన్స్. ‘‘తన బ్యాటింగ్‌లో తార స్థాయికి వెళ్లిన తర్వాత .. రెండు- మూడు ఛాన్సులు ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ జట్టు నుంచి తప్పిస్తారు. ఇదంతా భరించే బదులు.. అతడు ఉన్ముక్త్ చాంద్‌ను సంప్రదించి.. దేశం నుంచి వలస వెళ్లి.. అక్కడే క్రికెట్ ఆడుకుంటే మంచిది!! ఇక్కడుంటే మాత్రం సర్ఫరాజ్ ఖాన్‌కు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాకపోవచ్చు. మన సెలక్టర్ల ఆలోచనలు ఏమిటో ఎవరికీ అర్థం కావు కదా. ఏదేమైనా అతడికి అన్యాయం జరుగుతుందనేది మాత్రం వాస్తవం’’ అంటూ ఫైర్ అవుతున్నారు. If you are him and not getting selected for test cricket,what are you thinking??? pic.twitter.com/uVzUfvNPTx — Irfan Pathan (@IrfanPathan) January 24, 2024 కాగా గత రంజీ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరఫున బరిలోకి దిగి సగటు 92.66తో 556 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక 2021/22 సీజన్లో 982 పరుగులతో అతడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. HUNDRED FOR SARFARAZ KHAN...!!!! Hundred from just 89 balls against England Lions 🔥 India A lost 4 quick wickets in the space of 22 runs and then Sarfaraz show started - A special knock. pic.twitter.com/PDz5WGCfaj — Johns. (@CricCrazyJohns) January 25, 2024 ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో.. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఓవరాల్‌గా 65 ఇన్నింగ్స్‌లో 3751 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలా మెరుగైన గణాంకాలు నమోదు చేస్తున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం టీమిండియాలో చోటు దక్కకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వెళ్లి సెటిలయ్యాడు. యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెటర్‌గా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా ఇదే గతి పట్టిస్తారేమోనంటూ అతడి అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వారిపై ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమితమైన ఆసక్తి.. కోహ్లి విషయంలో మాత్రం ఎందుకో అలా..
WPL Auction 2023: నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన తొలి మహిళల ఐపీఎల్ వేలంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, అండర్-19 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్‌గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ కోసం ఆర్సీబీ సైతం తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు భారత సివంగిని దక్కించుకుంది. షెఫాలీని ఢిల్లీ దక్కించుకున్న తర్వాత సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్ చంద్ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. వీరి తర్వాత భారత్‌ను అండర్-19 వరల్డ్‌కప్-2022 విజేతగా నిలిపిన యశ్ ధుల్‌ను 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, నేటి భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పై పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లి ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్ చేసుకుంది. -
బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్.. తొలి భారత క్రికెటర్‌గా!
2012 అండర్ 19 ప్రపంచకప్‌ను ఉన్ముక్త్ చంద్ సారథ్యంలోని యువ భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం ఉన్ముక్త్ చంద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత క్రికెట్లో మరో విరాట్ కోహ్లి అవుతాడని అంతా భావించారు. అయితే ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో చాలాకాలం పాటు ఎదురుచూసి టీమిండియాకు ఆడే అవకాశాలు రాకపోవడంతో 2021లో భారత్‌ను వీడి యుఎస్ఏకు వలస వెళ్లాడు. ఇక భారత్‌ను వీడి వెళ్లిన చంద్ విదేశీ లీగ్‌ల్లో సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన తొలి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు సాధించిన చంద్.. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2022 సీజన్లో చటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ఉన్ముక్త్ చంద్ ఆడనున్నాడు. తద్వారా బీపీఎల్‌లో డ్రాఫ్ట్ అయిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో కూడా చంద్ తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే ఏ ప్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్ -
క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయం..
భారత్ అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని ఉన్మక్త్ చంద్ స్వయంగా తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. ఉన్ముక్త్ చంద్ షేర్ చేసిన ఫోటోలో అతని ఎడమ కన్ను పూర్తిగా ఉబ్బిపోయి కనిపించకుండా పోయింది. కంటి గాయంపై ఉన్మక్త్ చంద్ స్పందిస్తూ.. ''అథ్లెట్ అంటే జీవితం చాలా సాఫీగా సాగిపోతుందని అనుకుంటారు చాలామంది. అయితే అది ఏ మాత్రం నిజం కాదు. కొన్ని సార్లు మనం విజయంతో తిరిగి వస్తాం, మరికొన్ని రోజులు నిరాశగా, ఓటమి భారాన్ని, గాయాలను ఇంటికి మోసుకురావాల్సి ఉంటుంది. పెద్ద ప్రమాదం తప్పినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.. కష్టపడండి కానీ జాగ్రత్తగా ఉండండి... తృటిలో కన్ను పోయేది... నన్ను విష్ చేసినవారందరికీ థ్యాంక్యూ'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఉన్ముక్త్ చంద్ 2012లో అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టును విజేతగా నిలిపాడు. అతని కెప్టెన్సీలోనే భారత్ జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది. అయితే అండర్ 19 వరల్డ్‌కప్ సక్సెస్‌తో టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం అవుతాడనుకున్న ఉన్ముక్త్ చంద్.. చాలాకాలం పాటు ఎదురుచూసి టీమిండియాకు ఆడే అవకాశాలు అడుగంటడంతో గతేడాది భారత్‌ను వీడి యుఎస్ఏకు వలస వెళ్లాడు. ఉన్ముక్త్ ప్రస్తుతం కోరే ఆండర్సన్, లియామ్ ప్లంకెట్, జుయాన్ థెరాన్, సమీ అస్లాం తదితరులతో కలిసి యూఎస్ఏ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. భారత క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించి యూఎస్ఏకి మకాం మార్చిన ఉన్ముక్త్.. 2021 సీజన్ అమెరికన్ మైనర్ లీగ్‌లో పరుగుల వరద పారించాడు. ఆ సీజన్లో సిలికాన్ వ్యాలీ స్ట్రైయికర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతను.. 16 ఇన్నింగ్స్‌ల్లో 612 పరుగులు సాధించి సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. It’s never a smooth ride for an athlete. Some days you come home victorious, other days disappointed&there are some when you come home with bruises and dents.Grateful to God to have survived a possible disaster. Play hard but be safe. It’s a thin line. Thanku for the good wishes pic.twitter.com/HfW80lxG1c — Unmukt Chand (@UnmuktChand9) October 1, 2022 చదవండి: Unmukt Chand: టీమిండియాకు ఆడాలనుకున్నాడు.. అయితే అదే జట్టుకు ప్రత్యర్ధిగా..! దురదృష్టాన్ని కొని తెచ్చుకోవడం అంటే ఇదే! -
సౌతాఫ్రికా టీ20 లీగ్‌పై కన్నేసిన భారత అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్
భారత అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ (2012) ఉన్ముక్త్ చంద్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభంకాబోయే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (ఎస్ఏ20) తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఉన్ముక్త్.. సెప్టెంబర్ 19న జరిగే ఎస్ఏ20 లీగ్ వేలం కోసం తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొన్న మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ఉన్ముక్త్.. ఎస్ఏ20 లీగ్ వేలంలో కూడా అమ్ముడుపోతే, అక్కడ ఆడబోయే తొలి భారత క్రికెటర్‌గానూ రికార్డు నెల్పుతాడు. కాగా, 2012 వరల్డ్ కప్ విజయం తర్వాత రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ఉన్ముక్త్.. ఆతర్వాత క్రమంగా అవకాశాలు కనుమరుగు కావడంతో భారత్‌ను వదిలి అమెరికాకు వలస పోయాడు. అక్కడ యూఎస్ మైనర్ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న ఉన్ముక్త్.. బిగ్ బాష్ లీగ్ 2022లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున అవకాశం రావడంతో ఆస్ట్రేలియాకు మకాం మార్చాడు. ఉన్ముక్త్ 2024 టీ20 వరల్డ్‌కప్‌లో యూఎస్ఏ తరఫున ఆడాలని ఆశిస్తున్నాడు. ఉన్ముక్త్ 2012 ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయమైన 111 పరుగులు చేసి, యువ భారత్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆడిన ఉన్ముక్త్.. ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చ లేక అక్కడి నుంచి కూడా ఔటయ్యాడు. చదవండి: టీమిండియాకు ఆడాలనుకున్నాడు.. అయితే అదే జట్టుకు ప్రత్యర్ధిగా..! -
టీమిండియాకు ఆడాలనుకున్నాడు.. అయితే అదే జట్టుకు ప్రత్యర్ధిగా..!
USA To Host T20 World Cup 2024: 2012 అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియాను జగజ్జేతగా నిలిపిన నాటి భారత యువ జట్టు సారథి ఉన్ముక్త్ చంద్.. త్వరలోనే ఓ అరుదైన ఘనతను సాధించనున్నాడు. ఏ జట్టుకైతే (భారత్) ప్రాతినధ్యం వహించాలని కలలు కన్నాడో, త్వరలో అదే జట్టుకు ప్రత్యర్ధిగా బరిలోకి దిగే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోనున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ ఆతిధ్య హక్కులను కరీబియన్ దీవులతో (వెస్టిండీస్) పాటు యూఎస్ఏ కూడా దక్కించుకోవడంతో ఉన్ముక్త్ ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాడు. వివరాల్లోకి వెళితే.. HUGE NEWS!!! The @ICC has today confirmed automatic qualification for #TeamUSA🇺🇸 as co-host of ICC Men's T20 World Cup 2024 alongside West Indies!! FULL DETAILS➡️: https://t.co/2y8kc4k7ty#T20WorldCup🏏 #WeAreUSACricket🇺🇸 pic.twitter.com/KDc26Rjyk1 — USA Cricket (@usacricket) April 10, 2022 క్రికెట్‌కు విశ్వవ్యాప్తంగా ఆదరణ తీసుకురావాలనే ఉద్దేశంతో ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీని వెస్టిండీస్‌తో పాటు యూఎస్ఏలో నిర్వహించేందుకు సన్నాహకాలను మొదలుపెట్టింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో హోస్ట్ కంట్రీ హోదాలో యూఎస్ఏ తొలిసారి మెగా టోర్నీకి అర్హత సాధించింది. దీంతో ఆ దేశ జాతీయ జట్టుకు ఆడుతున్న ఉన్ముక్త్ చంద్ పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు ప్రత్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. Unmukt Chand, Corey Anderson (ex-NZ) and some ex-SA players may play against their own countries :))) https://t.co/U1xa0ITMvH — Saumya Narain (@Freak1411) April 12, 2022 ఉన్ముక్త్ చంద్‌తో పాటు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా తమ సొంత దేశాలకు ప్రత్యర్ధులుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. వివిధ కారణాల చేత ప్రస్తుతం యూఎస్ఏ తరఫున క్రికెట్ ఆడుతున్న కోరే ఆండర్సన్ (న్యూజిలాండ్), లియామ్ ప్లంకెట్ (ఇంగ్లండ్), జుయాన్ థెరాన్ (సౌతాఫ్రికా), సమీ అస్లాం (పాకిస్థాన్) టీ20 వరల్డ్‌కప్ 2024లో తమతమ సొంత దేశాలతో తలపడే ఛాన్స్ ఉంది. వీరిలో కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ కోరే ఆండర్సన్ 36 బంతుల్లోనే సెంచరీ చేసి ఆతర్వాత కివీస్ జాతీయ జట్టు నుంచి కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే. USA qualified for the next t20i WC So Unmukt Chand may play against India then 😄 @UnmuktChand9 pic.twitter.com/oqmorWbib5 — Bibhu (@Bibhu224) April 11, 2022 ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్‌కప్ సక్సెస్‌తో టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం అవుతాడనుకున్న ఉన్ముక్త్ చంద్.. చాలాకాలం పాటు ఎదురుచూసి టీమిండియాకు ఆడే అవకాశాలు అడుగంటడంతో గతేడాది భారత్‌ను వీడి యుఎస్ఏకు వలస వెళ్లాడు. ఉన్ముక్త్ ప్రస్తుతం కోరే ఆండర్సన్, లియామ్ ప్లంకెట్, జుయాన్ థెరాన్, సమీ అస్లాం తదితరులతో కలిసి యూఎస్ఏ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. భారత క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించి యూఎస్ఏకి మకాం మార్చిన ఉన్ముక్త్.. 2021 సీజన్ అమెరికన్ మైనర్ లీగ్‌లో పరుగుల వరద పారించాడు. ఆ సీజన్లో సిలికాన్ వ్యాలీ స్ట్రైయికర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతను.. 16 ఇన్నింగ్స్‌ల్లో 612 పరుగులు సాధించి సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఉన్ముక్త్ చంద్.. ఆ లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు -
U19 World Cup: విరాట్ కోహ్లీ సరసన చేరిన యశ్ ధుల్
అండర్ 19 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై సెంచరీతో కదంతొక్కిన యువ భారత కెప్టెన్ యశ్ ధుల్(110 బంతుల్లో 110; 10 ఫోర్లు, సిక్స్).. అరుదైన ఘనతను సాధించాడు. ఈ విభాగపు వరల్డ్ కప్ టోర్నీల్లో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో విరాట్ కోహ్లి (2008), ఉన్ముక్త్ చంద్(2012)లు మాత్రమే ఈ ఘనత సాధించారు. యాదృచ్చికంగా ఈ ముగ్గురు ఢిల్లీకి చెందిన వారే కావడం విశేషం. కాగా, సెమీఫైనల్లో కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్(108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో టీమిండియా.. ఆసీస్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. 2016, 2018, 2020 సీజన్లలో కూడా యువ భారత్ తుది పోరుకు అర్హత సాధించి టైటిల్ ఫైట్‌లో నిలిచింది. 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్ సారధ్యంలో తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన యువ భారత్.. 2008లో కోహ్లి నాయకత్వంలో, 2012లో ఉన్ముక్త్ చంద్, 2018లో పృథ్వీ షా కెప్టెన్సీల్లో టైటిల్ సాధించింది. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. భారత జట్టులో యష్ ధుల్, షేక్ రషీద్ మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారత యువ బౌలర్లలో విక్కీ వత్సల్ మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీయగా, నిషాంత్ సింధు, రవి కుమార్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్ తాంబే, రఘువంశీలు చెరో వికెట్ తీశారు. ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్లో యువ భారత్.. ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: కోహ్లి వందో టెస్ట్ కోసం భారీ ఏర్పాట్లు.. కన్ఫర్మ్ చేసిన గంగూలీ -
Yash Dhull: మరో ఉన్ముక్త్ చంద్ కాకుంటే చాలు.. అశ్విన్ కౌంటర్!
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికపుడు తన అప్డేట్లు పంచుకునే అశూ.. యూట్యూబ్ చానెల్లో క్రికెట్‌కు సంబంధించి తన అభిప్రాయాలు పంచుకుంటాడు. ఇటీవల పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు అశ్విన్ తనదైన శైలిలో బ్యాట్ చేతబట్టి స్టెప్పులేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు. అండర్-19 భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్‌కు అండగా నిలిచాడు. ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. యశ్ ధుల్ సారథ్యంలోని జట్టు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్‌గా తనదైన వ్యూహాలతోనే కాదు... బ్యాటర్‌గానూ 110 పరుగులతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు యశ్. ఈ క్రమంలో అతడిపై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా... ‘‘కెప్టెన్ యశ్ ధుల్ తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అద్భుత ప్రయాణానికి ఇది నాంది అని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన ఓ నెటిజన్... ‘‘ఏదేమైనా యశ్... మరో ఉన్ముక్త్ చంద్లా అయిపోకూడదు’’ అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు అశూ కౌంటర్ వేశాడు. ‘‘కాస్త ఆశావాదాన్ని ప్రోత్సహించండయ్యా’’ అని సదరు నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. కాగా 2012లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, జాతీయ జట్టు తరఫున ఆడాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. ఈ క్రమంలో రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ అమెరికాకు వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకుని.. ‘బిగ్‌బాష్’ మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఉన్ముక్త్ మాదిరే.. యశ్ ధుల్ కాకూడదంటూ నెటిజన్ పేర్కొనగా.. అశూ అందుకు తనదైన శైలిలో బదులిచ్చాడు. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! hope it doesnt goes the unmukt chand way — Rohit Pungalia (@RohitPungalia) February 2, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) -
BBL: ‘బిగ్‌బాష్’ మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా...
Unmukt Chand- BBL: ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ టి20 లీగ్ టోర్నీలో మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఉన్ముక్త్ చంద్ గుర్తింపు పొందాడు. హోబర్ట్ హరికేన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఉన్ముక్త్ బరిలోకి దిగి ఆరు పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆరోన్ ఫించ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా 2012లో ఉన్ముక్త్ కెప్టెన్సీలో టీమిండియా అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లకే విదేశీ టి20 లీగ్‌లలో ఆడే అర్హత ఉంది. దాంతో 28 ఏళ్ల ఉన్ముక్త్ గత ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం బీబీఎల్‌లో మెల్బోర్న్ రెనెగెడ్స్కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: Glenn Maxwell: 'క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా' Seymour is smokin' them 🔥pic.twitter.com/WwKXFn6bW7 — Melbourne Renegades (@RenegadesBBL) January 18, 2022 -
Unmukt Chand: ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్... ఫొటోలు వైరల్
Cricketer Unmukt Chand Married To His Girlfriend Simran Khosla Pics Viral: క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి సిమ్రన్ ఖోస్లాను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉన్ముక్త్.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దేశవాళీ క్రికెట్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన ఉన్ముక్త్ చంద్.. అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలోనే 2012 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, టీమిండియాకు ఆడాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆరంభంలో ఉన్ముక్త్ చంద్ అమెరికాకు మకాం మార్చాడు. అక్కడ మైనర్ లీగ్ క్రికెట్లో తన ప్రతిభను నిరూపించుకున్న 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్... బిగ్‌బాష్ లీగ్‌కు సంతకం చేసిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక ఉన్ముక్త్ భార్య సిమ్రన్ ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: Viral Video: సోధి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. రోహిత్ శర్మ షాక్ Today, we decided on forever! 21.11.21 💕💍#SimRANtoChand@KhoslaSimran pic.twitter.com/enG4qCCeAi — Unmukt Chand (@UnmuktChand9) November 21, 2021 -
చరిత్ర సృష్టించిన ఉన్ముక్త్ చంద్.. ఆ లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు
Unmukt Becomes First Indian Male Cricketer To Sign For Big Bash League: భారత మాజీ ఆటగాడు, టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)కు ప్రాతినిధ్యం వహించనున్న తొలి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వచ్చే నెల(డిసెంబర్) నుంచి ప్రారంభంకానున్న బీబీఎల్ 2021-22 సీజన్లో మెల్బోర్న్ రెనిగేడ్స్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఉన్ముక్త్.. చాలాకాలంగా టీమిండియా ఆడే అవకాశాలు రాకపోవడంతో ఇటీవలే భారత్‌ను వీడి యుఎస్ఏకు వలస వెళ్లాడు. అక్కడ మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న అతను.. సిలికాన్ వ్యాలీ స్ట్రయికర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే, 2012 అండర్-19 ప్రపంచకప్‌లో ఉన్ముక్త్ సారధ్యంలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలసిందే. ఆ టోర్నీ ఫైనల్లో ఉన్ముక్త్ (111 నాటౌట్) వీరోచిత సెంచరీతో భారత్‌కు కప్ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియా-ఏకు కెప్టెన్‌గా ఎంపికైన అతను 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. అయితే అతనికి భారత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో నిరాశ చెంది యుఎస్ఏకు వలస వెళ్లాడు. ఉన్ముక్త్ కెరీర్లో 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 120 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో దాదాపు 8000 పరుగులు సాధించాడు. 28 ఏళ్ల ఉన్ముక్త్.. ఐపీఎల్లో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ జట్ల తరఫున 21 మ్యాచ్‌లు ఆడి 300 పరుగులు స్కోర్ చేశాడు. చదవండి: Rohit Sharma: రాత్రికి రాత్రే చెత్త ఆటగాళ్లం అయిపోము కదా.. ఇప్పుడు.. -
ఉన్ముక్త్ చంద్ పరుగుల సునామీ.. రికార్డు శతకం నమోదు
Unmukt Chand Scores 132 From 69 Balls: అమెరికాలో జరుగుతున్న టోయోటా మైనర్ లీగ్‌లో భాగంగా ఆస్టిన్ అథ్లెటిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిలికాన్ వ్యాలీ స్ట్రైకర్స్ జట్టు కెప్టెన్, మాజీ భారత బ్యాటర్ ఉన్ముక్త్ చంద్ బౌండరీలు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. 69 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి లీగ్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ(132 నాటౌట్) నమోదు చేశాడు. ఉన్ముక్త్ వీర విహారం ధాటికి సిలికాన్ వ్యాలీ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్టిన్ అథ్లెటిక్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. Unmukt Chand scored unbeaten 132 runs from 69 balls including 15 fours and 7 sixes for Silicon Valley Strikers in Minor League Cricket in USA.pic.twitter.com/8iKuoKmJmx — Johns. (@CricCrazyJohns) September 27, 2021 అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉన్ముక్త్ జట్టు.. 3 బంతులు మిగిలి ఉండగానే, 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉన్ముక్త్ తుఫాను ఇన్నింగ్స్‌తో తన జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఉన్ముక్త్ చేసిన స్కోర్‌లో 102 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయంటే అతను ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడో అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే, ఈ అమెరికన్ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్ ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మొత్తంగా 434 బంతులను ఎదుర్కొన్న అతను.. 53.20 సగటు, 122.58 స్ట్రైక్ రేట్‌తో 534 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. చదవండి: "ఆ రెండు నిర్ణయాలే" కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణం..! -
XYZలకు అవకాశాలు వస్తుంటే టార్చర్ అనుభవించా, అందుకే రిటైర్మెంట్ ప్రకటించా..
న్యూఢిల్లీ: ఎంతో ప్రతిభ కలిగి 28 ఏళ్లకే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్న భారత అండర్-19 జట్టు మాజీ సారధి ఉన్ముక్త్ చంద్ తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయంపై స్పందించాడు. గత రెండేళ్లుగా అవకాశాలు లేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని వాపోయాడు. తాను బయట ఉండి అర్హత లేని XYZలకు అవకాశాలు వస్తుంటే మానసిక క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పానని వెల్లడించాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్ముక్త్ మాట్లాడుతూ.. ‘గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచింది. చివరి సీజన్లో ఢిల్లీ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. జట్టులోని సహచరులు కనీసం నన్ను గుర్తించలేదు. వారంతా మైదానంలో ఆడుతుంటే.. నేను డగౌట్‌కు పరిమితమవ్వాల్సి వచ్చింది. ఒంటరిగా పెవిలియన్‌లో కూర్చొవడం మానసిక క్షోభలా అనిపించింది. ఇది మెంటల్‌గా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇక భారత్‌లో తనకు అవకాశాలు రావని నిర్ధారించుకుని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది' అని ఈ ఢిల్లీ కుర్రాడు చెప్పుకొచ్చాడు. చదవండి: Anderson-Bumrah: అతనే అండర్సన్‌పైకి బుమ్రాను ఉసిగొల్పి ఉంటాడు.. ప్రస్తుతం యూఎస్ లీగ్‌లో ఆడుతున్న ఉన్ముక్త్.. తన క్రికెట్ భవిష్యత్తు కోసం యూఎస్‌ను ఎంచుకోవడంపై కూడా స్పందించాడు. మూడు నెలల క్రితం అమెరికా వెళ్లినప్పుడు అక్కడి క్రికెట్‌ను దగ్గరి నుండి చూశానని, అక్కడ పలు మ్యాచ్‌లు కూడా ఆడానని, అక్కడి స్థితిగతులపై స్పష్టత వచ్చాకే అక్కడ క్రికెట్ ఆడాలనుకుని నిర్ణయించుకున్నాని చెప్పుకొచ్చాడు. అప్పటికే కోరె అండర్సన్, సమిత్ పటేల్, హర్మీత్ సింగ్ వంటి అంతర్జాతీయ ప్లేయర్లు యూఎస్ లీగ్‌లలో ఆడుతున్నారని, వారి సలహాలతో తాను కూడా అక్కడి లీగ్‌లలో ఆడాలని నిర్ణయించుకున్నాని వెల్లడించాడు. భారత్‌లో క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాక కాస్త ఉపశమనంగా ఉందని, ఇప్పుడు తాను చేయాల్సిన పనిపై స్పష్టత వచ్చిందని తెలిపాడు. కాగా, ఉన్ముక్త్ చంద్.. 2012 అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రపంచకప్‌లో ఉన్ముక్త్.. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా రాణించాడు. ఆ ప్రపంచకప్ ఫైనల్లో ఉన్ముక్త్.. వీరోచిత సెంచరీ(111 నాటౌట్)తో టీమిండియాను జగజ్జేతగా నిలిపాడు. దాంతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బాటలోనే ఉన్ముక్త్ కూడా టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ, ఈ యువ ఆటగాడికి టీమిండియా నుంచే కాదు కనీసం దేశవాళీల్లో కూడా సరైన అవకాశాలు దక్కలేదు. దీంతో అతను విసుగుచెంది భారత్‌లో క్రికెట్‌కు వీడ్కోలు పలికి విదేశీ లీగ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. చదవండి: చెన్నై జట్టులో 'జోష్'.. మరింత పదునెక్కిన సీఎస్కే పేస్ దళం -
అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లో ఉన్ముక్త్ చంద్.. తొలి మ్యాచ్‌లోనే డకౌట్
కాలిఫోర్నియా: భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత అండర్–19 జట్టు మాజీ కెప్టెన్, ఢిల్లీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో రెండేళ్ల ఒప్పందం చేసుకున్నాడు. ఎంఎల్‌సీలో భాగంగా కాలిఫోర్నియాలో శనివారం మొదలైన టయోటా మైనర్ లీగ్ టి20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో 28 ఏళ్ల ఉన్ముక్త్ సిలికాన్ వ్యాలీ స్ట్రయికర్స్ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. సాన్‌డియాగో సర్ఫ్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ మూడు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉన్ముక్త్ చంద్ జట్టు(సిలికాన్ వ్యాలీ స్ట్రయికర్స్) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. షెహాన్ జయసూర్య(74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాన్‌డియాగో సర్ఫ్ రైడర్స్ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఈ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్ సహా చాలామంది ఇండో అమెరికన్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. -
Unmukt Chand: ఉన్ముక్త్ చంద్ రిటైర్మెంట్.. పెప్సీ యాడ్ వైరల్
ఢిల్లీ: భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ భారత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశాడు. 28 ఏళ్ల వయసులోనే ఉన్ముక్త్ చంద్ గుడ్‌బై చెప్పడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. కాగా విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే భారత్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఉన్ముక్త్ బీసీసీఐకి రాసిన లేఖలో తెలిపాడు. భారత క్రికెట్లో అవకాశాలు లేక యునైటెడ్ స్టేట్స్ మేజర్ లీగ్ క్రికెట్(ఎమ్మెల్సీ)తో మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదిలా ఉంటే ఉన్ముక్త్ చంద్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతని పాత పెప్సీ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యాడ్‌లో ఉన్ముక్త్ చంద్‌తో కలిసి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, సురేశ్ రైనాలు ఉండడం విశేషం. ఇక యాడ్ విషయానికి వస్తే.. అండర్ 19 కెప్టెన్‌గా ఉన్న ఉన్ముక్త్ తన ప్రాక్టీస్ ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్ వస్తుండగా.. అక్కడే సీనియర్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ చూస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగు ఫ్రిజ్‌లో పెప్సీ కనిపిస్తుంది. వెంటనే లోపలికి వెళ్లిన అతను పెప్సీ తాగుతుంటాడు. అప్పుడే ధోని వచ్చి మా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చావు.. అని అడుగుతాడు. అప్పుడే సీన్లోకి కోహ్లి, రైనాలు కూడా ఎంటర్ అవుతారు. ఆ తర్వాత అందరు కలిసి ఉన్ముక్త్‌ను ఆట పట్టిస్తారు. చివరికి అందరు కలిసి పెప్సీ యాడ్‌కు ముగింపు పలుకుతారు. ఇక 2012 అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్ముక్త్ చంద్ (111 పరుగులు నాటౌట్) వీరోచిత సెంచరీతో భారత్‌కు కప్ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియా- ఏకు కెప్టెన్‌గా ఎంపికైన ఉన్ముక్త్ 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. ఈ మధ్య కాలంలో అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి 30 మంది ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే అతనికి ఇండియా జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. స్వతహాగా మంచి టెక్నిక్‌తో షాట్లు ఆడే ఉన్ముక్త్ ఆ తర్వాత ఎందుకనో మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన నమోదు చేయలేక వెనుకబడిపోయాడు. ఇక ఉన్ముక్త్ చంద్ 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 4505 పరుగులు, ఇక టీ20 క్రికెట్లో 77 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన చంద్ 1565 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఆడిన ఉన్మక్త్ చంద్ 21 మ్యాచ్‌ల్లో 300 పరుగులు సాధించాడు. -
భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ చంద్
ముంబై: భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ శుక్రవారం భారత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే తాను భారత్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఉన్ముక్త్ చంద్ స్పష్టం చేశాడు. ఇదే విషయమై ఉన్మక్త్ ట్విటర్ వేదికగా బీసీసీఐకి సుధీర్ఘ నోట్ రాశాడు. కాగా 2012 అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్ముక్త్ చంద్ (111 పరుగులు నాటౌట్) వీరోచిత సెంచరీతో భారత్‌కు కప్ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియా- ఏకు కెప్టెన్‌గా ఎంపికైన ఉన్ముక్త్ 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. ఈ మధ్య కాలంలో అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి 30 మంది ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే అతనికి ఇండియా జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. స్వతహాగా మంచి టెక్నిక్‌తో షాట్లు ఆడే ఉన్ముక్త్ ఆ తర్వాత ఎందుకనో మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన నమోదు చేయలేక వెనుకబడిపోయాడు. ఇక ఉన్ముక్త్ చంద్ 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 4505 పరుగులు, ఇక టీ20 క్రికెట్లో 77 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన చంద్ 1565 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఆడిన ఉన్మక్త్ చంద్ 21 మ్యాచ్‌ల్లో 300 పరుగులు సాధించాడు. ఇక భారత్ క్రికెట్‌కు తన రిటైర్మెంట్పై ఉన్ముక్త్ చంద్ స్పందిస్తూ..'' భారత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం కాస్త బాధ కలిగించింది. తాజా రిటైర్మెంట్తో భారత్ క్రికెట్‌కు ఇక ప్రాతినిధ్యం వహించలేననే విషయం ఒక నిమిషం నా గుండెను ఆపేసింది. కానీ విదేశీ లీగ్‌ల్లో ఆడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంతకాలం నాకు అండగా నిలిచిన భారత క్రికెట్ ప్రేమికులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. T1- On to the next innings of my life #JaiHind🇮🇳 pic.twitter.com/fEEJ9xOdlt — Unmukt Chand (@UnmuktChand9) August 13, 2021 -
కట్టుతో ‘శత’క్కొట్టి...
బిలాస్పూర్: పదహారేళ్ల క్రితం వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత దిగ్గజం అనిల్ కుంబ్లే గాయపడినా కూడా తలకు కట్టుతో బరిలోకి దిగడం గుర్తుందా! ఇప్పుడు దాదాపు అదే తరహాలో ఢిల్లీ యువ బ్యాట్స్‌మన్ ఉన్ముక్త్ చంద్ మైదానంలోకి దిగి బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. సోమవారం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో ఉన్ముక్త్ దవడకు బలమైన దెబ్బ తగిలింది. ఇక మ్యాచ్‌కు దూరం కావడం ఖాయమే అనిపించింది. అయితే టీమ్ మేనేజ్మెంట్ వద్దంటున్నా వినకుండా చంద్ ఆడేందుకు సన్నద్ధమయ్యాడు. 125 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగులు చేసిఢిల్లీ 307 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఉత్తరప్రదేశ్ 252 పరుగులకే ఆలౌటై 55 పరుగులతో ఓటమిపాలైంది. ఉన్ముక్త్ పట్టుదలపై భారత క్రికెట్ వర్గాల్లో భారీ ఎత్తున ప్రశంసలు కురిశాయి. -
హ్యాట్సాఫ్.. ఉన్ముక్త్ !
న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెటర్, అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అసమాన పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగిన ఈ యువ బ్యాట్స్‌మన్ సెంచరీ సాధించాడు. ఒకపక్క గాయం బాధ పెడుతున్నా ఓర్చుకుని జట్టుకు భారీ స్కోరు అందించి విజయంలో కీలక భూమిక పోషించాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఉన్ముక్త్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. యూపీ 45.3 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఉన్ముక్త్ గాయపడ్డాడు. బంతి బలంగా తగలడంతో అతడి దవడకు తీవ్రగాయమైంది. నొప్పిని లెక్కచేయకుండా ముఖానికి కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్‌కు దిగాడు. అతడి పోరాటస్ఫూర్తికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు అనిల్ కుంబ్లేను గుర్తు చేసుకున్నారు. 2002లో ఆంటిట్వాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తలకు గాయమైనా కుంబ్లే కట్టు కట్టుకుని బౌలింగ్ చేశాడు. అంతేకాదు డేంజరస్ బ్యాట్స్‌మన్ బ్రియన్ లారా వికెట్ పడగొట్టాడు. -
తొలి రెండు మ్యాచ్‌లకు ఉన్ముక్త్ చంద్!
ఢిల్లీ: ఈ సీజన్లో జరిగే రంజీ టోర్నీలో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్ముక్త్ చంద్‌ను నియమించారు. ఈ రంజీ జట్టుకు సంబంధించి సీనియర్ ఆటగాళ్లైన గౌతం గంభీర్, విరాట్ కోహ్లిలు జాతీయ జట్టుకు ఆడుతుండటంతో ఉన్ముక్ను సారథిగా నియమిస్తూ డీడిసీఏ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ తన తొలి రెండు రంజీ మ్యాచ్‌లను అస్సాం, మహారాష్ట్రలతో ఆడనుంది. ఈ మేరకు 15 సభ్యులతో కూడిన ఢిల్లీ జట్టును ప్రకటించారు. ఇందులో సీమర్లు పవన్ సుయాల్, నవదీప్ సైనీ, వికాస్ తోకర్, ప్రదీప్ సంగ్వాన్, పర్విందర్ అవానాలకు చోటు దక్కింది. అయితే మరో సీమర్ సరాంగ్ రావత్ కు జట్టులో చోటు దక్కలేదు. గత సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడిన రావత్ వికెట్లు తీయడంలో విఫలం చెందడంతో అతనికి చోటు కల్పించలేదు. ఇదిలా ఉండగా, ఓపెనర్‌గా మోహిత్ శర్మ తిరిగి జట్టులో కలవనున్నాడు. -
భారత్ ‘బి’ శుభారంభం
కాన్పూర్: కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (82 బంతుల్లో 77 నాటౌట్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీ సహాయంతో దేవధర్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’పై ఉన్ముక్త్ సేన 5 వికెట్లతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ జట్టు 44.2 ఓవర్లలో 161 పరుగులు చేసింది. పర్వేజ్ రసూల్ (94 బంతుల్లో 66; 6 ఫోర్లు; 1 సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (91 బంతుల్లో 58; 4 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పవన్ నేగి, నాథూ సింగ్‌లకు మూడేసి, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘బి’ 29.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 162 పరుగులు చేసి నెగ్గింది. -
భారత్ ‘ఎ’దే సిరీస్
♦ మూడో వన్డేలో టీమిండియా గెలుపు ♦ సురేశ్ రైనా సెంచరీ ♦ రాణించిన సంజూ శామ్సన్ బెంగళూరు : తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా (94 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్) మూడో వన్డేలో చెలరేగిపోయాడు. బంగ్లాదేశ్ ‘ఎ’ బౌలర్లను ఊచకోత కోస్తూ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ ‘ఎ’ జట్టు 75 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) బంగ్లాదేశ్ ‘ఎ’పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఉన్ముక్త్ చంద్ సారథ్యంలోని టీమిండియా ‘ఎ’ 2-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ (99 బంతుల్లో 90; 10 ఫోర్లు, 1 సిక్స్), ఉన్ముక్త్ చంద్ (68 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్), రిషి ధావన్ (15 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఉన్ముక్త్ చంద్‌తో కలిసి రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించిన శామ్సన్... రైనాతో కలిసి మూడో వికెట్‌కు 116 పరుగులు సమాకూర్చాడు. షఫీయుల్ ఇస్లామ్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 32 ఓవర్లలో 217 పరుగులుగా నిర్దేశించారు. షబ్బీర్ (41), మోమినుల్ (37) మినహా మిగతా వారు విఫలం కావడంతో బంగ్లాదేశ్ 6 వికెట్లకు 141 పరుగులే చేసి ఓడింది. అరవింద్, కుల్దీప్లకు రెండేసి వికెట్లు దక్కాయి.