1/13
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అమెరికాలోని క్రికెట్ అభిమానులు సత్కరించారు.
2/13
అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు నేషనల్ క్రికెట్ లీగ్ (ఎన్‌సీఎల్) ఏర్పాటుకు సచిన్ తనవంతు కృషి చేశాడు.
3/13
దీంతో డాలాస్‌లోని కౌబాయ్స్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) మ్యాచ్ సందర్భంగా ఎన్‌సీఎల్ సంబంధించిన టీమ్ యజమాని జెర్రీ జోన్స్ ప్రత్యేకంగా తయారు చేసిన ‘10 జెర్సీ’ని సచిన్‌కు అందజేసి సన్మానించారు.
4/13
కొత్తగా క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు నిర్వహించబోయే ఎన్‌సీఎల్‌కు సచిన్ సహ యజమానిగా ఉన్నాడు.
5/13
‘క్రికెట్ నాకెంతో ఇచ్చింది. ఓ క్రికెటర్‌గా డాలస్‌కు విచ్చేసిన నాపై యువ అథ్లెట్ల అభిమానం, కురిపిస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది’ అని సచిన్ అన్నాడు.
6/13
అంకితభావం, నిబద్ధత, తపనతో పాటు మనపై మనకున్న విశ్వాసం మనల్ని లక్ష్యంవైపు నడిపిస్తాయన్నాడు.
7/13
అది క్రికెట్‌లో అయినా... జీవితంలో అయినా మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని చెప్పాడు.
8/13
ఆదివారం టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలోనూ సచిన్‌తో వందల మంది అథ్లెట్లు కలిశారు.
9/13
మరోవైపు.. భారత జట్టులో అవకాశాలు దక్కక అమెరికాకు ఆడుతున్న అండర్-19 వరల్డ్‌కప్ కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్ కూడా సచిన్‌ను కలిశాడు
10/13
‘దేవుడు ఇప్పుడు డాలస్‌లో ఉన్నాడు.. మిమ్మల్ని కలవడం సంతోషకరం సర్’ అంటూ సచిన్‌తో దిగిన ఫొటోను ఉన్ముక్త్ పంచుకున్నాడు.
11/13
12/13
13/13