
భారత అగ్రశ్రేణి బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ శుక్రవారం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలిసింది.

ఇటీవల ఎలోర్డా కప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్‌ను అభినందించిన సచిన్... ఆమె పారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలవాలని ఆకాంక్షించారు.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరనాథ్ కూడా నిఖత్‌తో పాటు సచిన్‌ను కలిశారు.














