కాన్పూర్: కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (82 బంతుల్లో 77 నాటౌట్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీ సహాయంతో దేవధర్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’పై ఉన్ముక్త్ సేన 5 వికెట్లతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ జట్టు 44.2 ఓవర్లలో 161 పరుగులు చేసింది. పర్వేజ్ రసూల్ (94 బంతుల్లో 66; 6 ఫోర్లు; 1 సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (91 బంతుల్లో 58; 4 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పవన్ నేగి, నాథూ సింగ్‌లకు మూడేసి, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘బి’ 29.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 162 పరుగులు చేసి నెగ్గింది.
భారత్ ‘బి’ శుభారంభం
Published Tue, Jan 26 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
Advertisement
Advertisement