Devadhar Trophy
-
భారత్ ‘బి’ శుభారంభం
కాన్పూర్: కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (82 బంతుల్లో 77 నాటౌట్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీ సహాయంతో దేవధర్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’పై ఉన్ముక్త్ సేన 5 వికెట్లతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ జట్టు 44.2 ఓవర్లలో 161 పరుగులు చేసింది. పర్వేజ్ రసూల్ (94 బంతుల్లో 66; 6 ఫోర్లు; 1 సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (91 బంతుల్లో 58; 4 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పవన్ నేగి, నాథూ సింగ్‌లకు మూడేసి, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘బి’ 29.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 162 పరుగులు చేసి నెగ్గింది. -
ఇండియా ‘ఎ’ కెప్టెన్‌గా రాయుడు
దేవధర్ ట్రోఫీ న్యూఢిల్లీ: దేవధర్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘ఎ’ జట్టుకు అంబటి తిరుపతి రాయుడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఇండియా ‘ఎ’తో పాటు ఇండియా ‘బి’, విజయ్ హజారే ట్రోఫీ చాంపియన్ గుజరాత్ జట్లు తలపడుతాయి. ఢిల్లీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ ఇండియా ‘బి’కి సారథ్యం వహించనున్నాడు. ట్రోఫీలో ఐదు రోజుల్లో నాలుగు వన్డేలు జరుగుతాయి. రాయుడు నేతృత్వంలోని ‘ఎ’ జట్టులో మురళీ విజయ్, అమిత్ మిశ్రా, రసూల్, ఓజా, ఆరోన్ తదితరులుండగా... ‘బి’ జట్టులో రంజీ ట్రోఫీ టాప్ రన్ స్కోరర్ శ్రేయాస్ అయ్యర్‌తో పాటు షెల్డన్ జాక్సన్, కరణ్ శర్మ, మయాంక్ అగర్వాల్ లాంటి యువ ఆటగాళ్లు బరిలోకి దిగబోతున్నారు. -
దేవధర్ ఫైనల్లో వెస్ట్‌జోన్
ముంబై: అక్షర్ పటేల్ (38 బంతుల్లో 64 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 80; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో... దేవధర్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టు ఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో వెస్ట్ 2 వికెట్లతో సౌత్‌జోన్‌ను ఓడించింది. టాస్ గెలిచిన వెస్ట్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 314 పరుగులు చేసింది. మయాంక్ (86), అపరాజిత్ (56), మనీష్ పాండే (55) అర్ధసెంచరీలు చేశారు. వెస్ట్‌జోన్ జట్టు 47.1 ఓవర్లలో 8 వికెట్లకు 319 పరుగులు చేసి నెగ్గింది. జాక్సన్ (51), రాయుడు (54) అర్ధసెంచరీలు చేశారు. 174 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న వెస్ట్‌జోన్‌ను... అక్షర్, సూర్యకుమార్ కలిసి గట్టెక్కించారు. బుధవారం జరిగే ఫైనల్లో వెస్ట్‌జోన్, ఈస్ట్‌జోన్ తలపడతాయి. -
దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్
ముంబై: దేశవాళీ టోర్నీ దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 116 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన సెంట్రల్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 296 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (105 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 113) అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. కరుణ్ నాయర్ (62 బంతుల్లో 9 ఫోర్లతో 77)తో కలిసి అపరాజిత్ నాలుగో వికెట్‌కు 124 పరుగులు జత చేశాడు. సెంట్రల్ జట్టులో పంకజ్‌సింగ్ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం సెంట్రల్ జోన్ జట్టు 36.3 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అర్జిత్ గుప్తా (49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66) మినహా అందరూ విఫలమయ్యారు. సౌత్ కెప్టెన్ వినయ్ కుమార్ 8 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. సోమవారం జరిగే సెమీఫైనల్లో సౌత్‌జోన్ జట్టు వెస్ట్‌జోన్‌తో తలపడుతుంది. ఆదివారం (నేడు) జరిగే సెమీస్‌లో ఈస్ట్‌తో నార్త్ తలపడుతుంది. -
ఫైనల్లో నార్త్‌జోన్
విశాఖపట్నం: నార్త్‌జోన్ జట్టు దేవధర్ ట్రోఫీ ఫైనల్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో నార్త్‌జోన్ 100 పరుగుల తేడా తో సౌత్‌జోన్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గంభీర్ (2), నితిన్(16), మన్దీప్ (0) విఫలమైనప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రజత్ పాలివాల్ (113 బంతుల్లో 107 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. సౌత్ బౌలర్ వినయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత సౌత్‌జోన్ 36.3 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. కరుణ్ (51), ఉతప్ప (47) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. హర్భజన్ సింగ్ (3/35), పర్వేజ్ రసూల్ (3/15) మూడేసి వికెట్లు తీసుకున్నారు.