దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్ | Southzone in Devadhar semi final | Sakshi
Sakshi News home page

దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్

Published Sun, Nov 30 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్

దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్

ముంబై: దేశవాళీ టోర్నీ దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 116 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన సెంట్రల్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 296 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (105 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 113) అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు.

కరుణ్ నాయర్ (62 బంతుల్లో 9 ఫోర్లతో 77)తో కలిసి అపరాజిత్ నాలుగో వికెట్‌కు 124 పరుగులు జత చేశాడు. సెంట్రల్ జట్టులో పంకజ్‌సింగ్ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం సెంట్రల్ జోన్ జట్టు 36.3 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అర్జిత్ గుప్తా (49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66) మినహా అందరూ విఫలమయ్యారు. సౌత్ కెప్టెన్ వినయ్ కుమార్ 8 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. సోమవారం జరిగే సెమీఫైనల్లో సౌత్‌జోన్ జట్టు వెస్ట్‌జోన్‌తో తలపడుతుంది. ఆదివారం (నేడు) జరిగే సెమీస్‌లో ఈస్ట్‌తో నార్త్ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement