the semi-final
-
భళా... భారత్
క్వార్టర్స్‌లో స్పెయిన్‌పై గెలుపుతో సెమీస్‌లోకి జూనియర్ హాకీ ప్రపంచకప్ లక్నో: టైటిల్ ఫేవరెట్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత జట్టు జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–1తో స్పెయిన్‌పై గెలిచింది. ఈ మ్యాచ్ ఆరంభంలో భారత్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచలేకపోయింది. అందివచ్చిన పెనాల్టీ కార్నర్లను పదేపదే చేజార్చింది. రక్షణ పంక్తి కూడా చురుగ్గా కదల్లేకపోయింది. సమన్వయలేమితో పాటు అనవసర తప్పిదాలతో వెనుకబడింది. దీంతో కిక్కిరిసిన మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలోని ప్రేక్షకులు ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పదనుకున్నారు. అయితే భారత్ తుదికంటా పోరాడి ద్వితీయార్ధంలో చేసిన రెండు గోల్స్‌తో ఊపిరి పీల్చుకుంది. 22వ నిమిషంలోనే స్పెయిన్ జట్టుకు మార్క్ సెరాహిమా గోల్ అందించాడు. ఆ తర్వాత తీవ్రంగా పోరాడిన భారత్ ఎట్టకేలకు 57వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్ చేసిన గోల్‌తో స్కోరును 1–1తో సమం చేసింది. దీనికి కొనసాగింపుగా మరో 9 నిమిషాల తర్వాత హర్మన్‌ప్రీత్ (66వ ని.లో) గోల్ చేసి భారత్‌ను ఈ మ్యాచ్‌లో ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. ఇక మ్యాచ్ చివరిదాకా ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా ఆడటంతో భారత్ 2–1 స్కోరుతో విజయం సాధించింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో భారత్... ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
జొకోవిచ్‌కు మళ్లీ కలిసొచ్చింది
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. తొమ్మిదో సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-2తో రెండు సెట్లు గెలిచి... మూడో సెట్లో తొలి గేమ్‌లో 15-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో సోంగా ఎడమ మోకాలికి గాయమైంది. దాంతో ఇక ఆడలేనంటూ సోంగా చెప్పడంతో జొకోవిచ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టోర్నీలో మూడోసారి కనీసం మూడు సెట్లు కూడా ఆడకుండానే జొకోవిచ్‌ను విజయం వరించడం విశేషం. రెండో రౌండ్లో జొకోవిచ్‌కు వెసెలీ (చెక్ రిపబ్లిక్) నుంచి వాకోవర్ లభించగా... మూడో రౌండ్లో యూజ్నీ (రష్యా) తొలి సెట్లోనే గాయం కారణంగా తప్పుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో సోంగా మూడో సెట్ తొలి గేమ్‌లో వైదొలిగాడు. సెమీఫైనల్లో గేల్ మోన్ఫిల్స్తో జొకోవిచ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మోన్ఫిల్స్ 6-4, 6-3, 6-3తో తన దేశానికే చెందిన లుకాస్ పురుుపై గెలుపొందాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్‌పై ఐదు సెట్ల పోరులో సంచలన విజయం సాధించిన పురుు క్వార్టర్ ఫైనల్లో మాత్రం వరుస సెట్లలో ఓటమి చవిచూశాడు. మోన్ఫిల్స్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. -
సెమీస్‌లో నీరజ్ ఓటమి
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్ల ఒలింపిక్ అర్హత టోర్నీలో భారత బాక్సర్ నీరజ్ గోయట్ (69కేజీ) సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. గురువారం జరిగిన బౌట్లో నీరజ్ 0-3తో అరాజిక్ మరుత్జాన్ (జర్మనీ) చేతిలో ఓడాడు. అయితే ఈ ఓటమి తనను రియో బెర్త్‌కు దూరం చేయలేదు. సిసోకో డియే యూబా (స్పెయిన్)తో జరిగే బౌట్లో నెగ్గితే మూడో క్వాలిఫయర్‌గా బెర్త్ దక్కించుకుంటాడు. -
సమీస్‌లో సాకేత్
హోచి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజ్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంతోపాటు డబుల్స్ విభాగంలోనూ అతను సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-1, 2-6, 6-3తో లామసినె (ఫ్రాన్స్)పై నెగ్గాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 5-7, 6-4, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో బెగా-ఫాబియానో (ఇటలీ) జోడీపై గెలిచింది. -
సెమీస్‌లో కృష్ణప్రియ
సెమీస్‌లో కృష్ణప్రియ కాకినాడ: ఆలిం డియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన కె. శ్రీకృష్ణప్రియ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కృష్ణప్రియ 21-7, 21-15తో ముద్ర ధనంజే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. -
ఆసియా బాక్సింగ్ టోర్నీలో ఆరు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో సర్జూబాల (48 కేజీలు), మీనా కుమారి దేవి (54 కేజీలు), బాసుమత్రి (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), స్వీటీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో తమ ప్రత్యర్థులను ఓడించారు. -
దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్
ముంబై: దేశవాళీ టోర్నీ దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 116 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన సెంట్రల్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 296 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (105 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 113) అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. కరుణ్ నాయర్ (62 బంతుల్లో 9 ఫోర్లతో 77)తో కలిసి అపరాజిత్ నాలుగో వికెట్‌కు 124 పరుగులు జత చేశాడు. సెంట్రల్ జట్టులో పంకజ్‌సింగ్ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం సెంట్రల్ జోన్ జట్టు 36.3 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అర్జిత్ గుప్తా (49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66) మినహా అందరూ విఫలమయ్యారు. సౌత్ కెప్టెన్ వినయ్ కుమార్ 8 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. సోమవారం జరిగే సెమీఫైనల్లో సౌత్‌జోన్ జట్టు వెస్ట్‌జోన్‌తో తలపడుతుంది. ఆదివారం (నేడు) జరిగే సెమీస్‌లో ఈస్ట్‌తో నార్త్ తలపడుతుంది.