![సమీస్‌లో సాకేత్](/styles/webp/s3/article_images/2017/09/3/61445026706_625x300.jpg.webp?itok=v5Cyh2_P)
సమీస్‌లో సాకేత్
హోచి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంతోపాటు డబుల్స్ విభాగంలోనూ అతను సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.
సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-1, 2-6, 6-3తో లామసినె (ఫ్రాన్స్)పై నెగ్గాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 5-7, 6-4, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో బెగా-ఫాబియానో (ఇటలీ) జోడీపై గెలిచింది.