ఫైనల్లో నార్త్‌జోన్ | The final of the North | Sakshi
Sakshi News home page

ఫైనల్లో నార్త్‌జోన్

Published Tue, Mar 25 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

ఫైనల్లో నార్త్‌జోన్

ఫైనల్లో నార్త్‌జోన్

విశాఖపట్నం: నార్త్‌జోన్ జట్టు దేవధర్ ట్రోఫీ ఫైనల్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో నార్త్‌జోన్ 100 పరుగుల తేడా తో సౌత్‌జోన్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది.


టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గంభీర్ (2), నితిన్(16), మన్‌దీప్ (0) విఫలమైనప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రజత్ పాలివాల్ (113 బంతుల్లో 107 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. సౌత్ బౌలర్ వినయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత సౌత్‌జోన్ 36.3 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. కరుణ్ (51), ఉతప్ప (47) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. హర్భజన్ సింగ్ (3/35), పర్వేజ్ రసూల్ (3/15) మూడేసి వికెట్లు తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement