న్యూజిలాండ్ ‘ఎ’ జట్లతో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. మూడు రోజులు, నాలుగు రోజుల మ్యాచ్‌లో బరిలోకి దిగే జట్టుకు అభిషేక్ నాయర్ (ముంబై)... వన్డే జట్టుకు ఉన్ముక్త్ చంద్ (ఢిల్లీ) నాయకత్వం వహిస్తారని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ‘ఎ’ జట్లతో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. మూడు రోజులు, నాలుగు రోజుల మ్యాచ్‌లో బరిలోకి దిగే జట్టుకు అభిషేక్ నాయర్ (ముంబై)... వన్డే జట్టుకు ఉన్ముక్త్ చంద్ (ఢిల్లీ) నాయకత్వం వహిస్తారని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.
రెండు జట్లలోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికీ చోటు లభించలేదు. ఈనెల 31 మొదలయ్యే ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లకు విశాఖపట్నం వేదికగా నిలుస్తుంది. తొలుత ఈనెల 31 నుంచి సెప్టెంబరు 2 వరకు మూడు రోజుల మ్యాచ్... తర్వాత సెప్టెంబరు 5 నుంచి 8 వరకు నాలుగు రోజుల మ్యాచ్ ఉంటుంది. సెప్టెంబరు 11, 13, 15వ తేదీల్లో మూడు వన్డేలున్నాయి. ఈ సిరీస్ తర్వాత వెస్టిండీస్ ‘ఎ’ జట్టుతో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు మరో సిరీస్ జరుగుతుంది.