ఉతప్ప శతకం: భారత్ ‘ఎ’ విజయం | Uthappa's century: India 'A' win | Sakshi
Sakshi News home page

ఉతప్ప శతకం: భారత్ ‘ఎ’ విజయం

Published Mon, Sep 9 2013 2:39 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

ఉతప్ప శతకం: భారత్ ‘ఎ’ విజయం - Sakshi

ఉతప్ప శతకం: భారత్ ‘ఎ’ విజయం

సాక్షి, విశాఖపట్నం: ఓపెనర్ రాబిన్ ఉతప్ప (114 బంతుల్లో 103; 8 ఫోర్లు; 5 సిక్స్) సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల అనధికార సిరీస్‌లో భారత ‘ఎ’ శుభారంభం చేసింది. మరో ఓపెనర్, కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (88 బంతుల్లో 94; 9 ఫోర్లు; 6 సిక్స్) కూడా చక్కటి సహకారం అందించడంతో స్థానిక వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరిగిన తొలి అనధికార వన్డేలో ఆతిథ్య జట్టు ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది.
 
 ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 49.4 ఓవర్లలో 257 పరుగులు చేసింది. ధావల్ కులకర్ణి, రాహుల్ శర్మ, అశోక్ మెనరియా మూడేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత జట్టు ఓపెనర్ల జోరుతో 44.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 261 పరుగులు చేసి నెగ్గింది. ఉతప్ప ఆరంభం నుంచే ఎదురుదాడి ప్రారంభించగా ఆ తర్వాత ఉన్ముక్త్ కూడా జోరు పెంచాడు. రెండో వన్డే మంగళవారం జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement