
వెల్లింగ్టన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను న్యూజిలాండ్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ న్యూజిలాండ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 25 మంది సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదానం చాలా మందికి ఉపయోగపడుతుందని దాతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో.. వైఎస్సార్‌సీపీ ఏపీఎన్‌ఆర్టీఎస్ కో-ఆర్డినేటర్ కృష్ణ చైతన్య, ప్రతాప్ రెడ్డి, అంబటి మహేష్, కైపు మహేష్, మిట్టపల్లి అఖిల్, బుజ్జి బాబు నెల్లోరి.. ఇంకా అనేక మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






Comments
Please login to add a commentAdd a comment