ఇటీవల అమెరికాలో భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మరవకముందే న్యూజిలాండ్‌లో ఓ భారతీయ విద్యార్థి మృతి ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్‌జిత్ సింగ్(28) పంజాబ్ చెందిన విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెండాడు. గుర్‌జిత్ తండ్రి నిశాన్ సింగ్.. సాగుభూమి అమ్మి మరీ అతన్ని న్యూజిలాండ్‌కు పంపించారు. న్యూజిలాండ్‌లోని ఓ టెలికాం కంపెనీలు పనిచేస్తున్న గుర్‌జిత్.. డునెడిన్ సీటీలో నివాసం ఉంటున్నాడు.
వారం రోజులు కిందట గుర్‌జిత్ తన ఇంటి వద్దనే గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురైనట్లు తెలుస్తోంది. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసిన అధికారులు.. పదునైన ఆయూధంతో పలుమార్లు పొడవటంతో మృతి చెందినట్లు వెల్లడించారు. ఇక గుర్‌జిత్ మృతి చెందిన చోట ఇంటి అద్దం పగిలి అతను రక్తం మడుగులో పడిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గుర్‌జిత్ సింగ్ తండ్రి నిశాన్ సింగ్ సోమవారం న్యూజిలాండ్‌లోని డునెడిన్ సీటీ చేరికొని తన కొడుకు మృతిపై కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకు మృతికి కారణమైన నిందితుడికి శిక్షపడే వరకు తనకు తృప్తి ఉండదని తెలిపారు. స్థానిక పోలీసులు, అక్కడి సిక్కు కమ్మూనిటీ ప్రతినిధులు నిశాన్ సింగ్‌కు అండగా నిలిచారు. ఒటాగో పంజాబి కమ్మూనిటీ ఫౌండేషన్ ట్రస్ట్.. ‘గీవ్‌ఏలిటిల్ పేజీ’ పేరుతో ఫండ్స్ సేకరించి గుర్‌జిత్ సింగ్ కుటుంబానికి అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ హత్య కేసులో ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment