tributes to ysr
-
ఇదీ సామాజిక న్యాయం
సాక్షి ప్రతినిధి, కడప: సామాజిక న్యాయం అనేది మాటలకే పరిమితం కాదని, మొట్టమొదటిసారిగా సాధ్యమే అని ఆచరించి చూపిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. తమ ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో శనివారం దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ ఎంపీ అభ్యర్థులను, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఒక్క అనకాపల్లి పార్లమెంట్ స్థానం మినహా 25 ఎంపీ, 175 అసెంబ్లీ సీట్లు కేటాయించామని చెప్పారు. 50 శాతం సీట్లను కచ్చితంగా నా.. నా.. నా.. అని సంబోధిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కచ్చితంగా అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనదన్నారు. ఇది నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ అమలు చేశామని చెప్పారు. దాన్ని మనస్ఫూర్తిగా... స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ రోజు 50 శాతం అంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్ధానాలు.. మొత్తం 200 స్థానాలకు గాను 100 స్థానాల్లో ఈ వర్గాల వారికే సీట్లు ఇవ్వగలగడం చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం అని తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీకి మాత్రమే ఆ ధైర్యం ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు, 18 ఎంపీ స్థానాల్లో మార్పులు చేశాం. దాదాపు 99 స్థానాలు అంటే 50 శాతం స్థానాల్లో మార్పులు చేశాం. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చేమో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టికెట్ రాని వాళ్లందరికీ సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుందని భరోసా ఇస్తున్నా. విప్లవాత్మక మార్పులు.. కనీవినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఐదేళ్ల పాలన సాగింది. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా బట¯Œన్ నొక్కడం ద్వారా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లింది. ఇలా రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ చూడలేదు. ఎప్పుడూ జరగని ఘట్టం. లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా ఇవ్వగలుగుతారా? అనే పరిస్థితి నుంచి.. ఇది సాధ్యమే అని ఐదేళ్ల పరిపాలనలో చూపించాం. గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, 50–60 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం, వీటన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెయ్యడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా గుర్తుండి పోతుంది. గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులు మారాయి, స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి.. ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయం బాగు పడింది. మహిళా సాధికారత సాధ్యమైంది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు.. మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చేసి చూపించిన ప్రభుత్వంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడగలిగిందని చెప్పడానికి గర్వపడుతున్నా. వీటన్నింటి వల్ల ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నింటి వల్ల దేవుడి ఆశీస్సులతో మళ్లీ 2–3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుపోయేలా అడుగులు వేస్తాం. 59 స్థానాలు బీసీ అభ్యర్థులకే.. మొత్తం 200 స్థానాల్లో ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయించాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 11 స్థానాలు వీరికి కేటాయించాం. మహిళలకు ఇంతకు ముందుకన్నా బెటర్‌గా చేశాం. ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. వచ్చే ఎన్నికలకి ఇంకా వేగంగా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12 శాతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఇది పూర్తిగా సంతృప్తి కలిగించే అంశం కాకపోయినప్పటికీ లాస్ట్ టైమ్ కన్నా బెటర్‌గా చేశాం. బహుశా ఏ ఇతర పార్టీ కన్నా బెటర్‌గానే ఉంటుందనుకుంటున్నాం. గతంలో 19 సీట్లు ఇస్తే ఈసారి 24దాకా తీసుకుపోగలిగాం. ఇది కూడా ఒక విశేషమే. వచ్చే ఎన్నికలకి ఇంకా పెద్ద సంఖ్యలో ఇచ్చేలా అడుగులు ముందుకు వేస్తాం. ఇవాళ విడుదల చేసిన జాబితా 200 మందిలో 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మందిలో 75 శాతం గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారిని మనం ఎంపిక చేశాం. మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఇవాళ 7 స్థానాలకు పెంచగలిగాం. మొత్తం మీద 50 శాతం నా.. నా.. నా.. అని పిలుచుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. -
మహానేత మెమోరియల్‌కు మహానగరంలో చోటేదీ?
సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించుకోడానికి ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక మెమోరియల్‌ను కూడా ఏర్పాటు చేయలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శుక్రవారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్సార్ 73వ జయంతి, వైఎస్సార్టీపీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఎగుర వేసి కేక్ కట్ చేశారు. అనంతరం షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ స్మారకార్థం హైదరాబాద్‌లో స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ ఘాట్ కోసం ప్రసాద్ ఐమాక్స్ పక్కన 20 ఎకరాల భూమి కేటాయించామన్నారు. ఏడాదిలోగా పను లు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ భూమిని వెనక్కి తీసుకుని అన్యాయం చేశారు’అని అన్నారు. 2004లో వైఎస్సారే కేసీఆర్‌ను కేంద్రమంత్రిగా, హరీశ్‌రావును రాష్ట్రమంత్రిగా చేశా రని గుర్తుచేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రతి పథకంలోనూ తెలంగాణకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని షర్మిల స్పష్టం చేశారు. రైతు సమస్యలపై రైతు ఆవేదన యాత్ర, రైతుగోస దీక్షలు చేపట్టామని చెప్పారు. పోడు పట్టాల కోసం, దళితులు బీసీల కోసం తమ పార్టీ పోరాడిందని, ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున నిలబడ్డ ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ అని అన్నారు. నిరుద్యోగుల కోసం 31 నిరాహార దీక్షలు చేశామని, ఇంకా చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పోరాటం వల్లే కేసీఆర్‌కు సోయి వచ్చి 80 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ పేరు కోసం పనిచేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెబుతున్న దొంగమాటలు నమ్మే వారు ఇక్కడ లేరన్నారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధులు తూడి దేవేందర్, పిట్టా రాంరెడ్డి, వాడుక రాజగోపాల్ పాల్గొన్నారు. వైఎస్సార్‌కు నివాళి పంజగుట్ట: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి పురస్కరించుకుని ఆయన కుమార్తె, వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల పంజగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
మహానేత వైఎస్సార్‌కు సీఎం ఘన నివాళి
వేంపల్లె : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిలు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయలోని నెమళ్ల పునరుత్పత్తి కేంద్రం పక్కన ఉన్న చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పాస్టర్లు బెనహరబాబు, నరేష్, మృత్యుంజయలు ప్రార్థనలు చేశారు. అనంతరం సీఎం జగన్ బంధువులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పులివెందుల వెళ్లారు. తిరిగి సాయంత్రం 5.45 గంటలకు ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సుమారు గంటపాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. నేడు శనివారం పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సాక్షి, జాగిత్యాల: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మహానేత జయంతి సందర్భంగా జాగిత్యాలలో ఆయన జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ''తెలుగుజాతికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహా నాయకుడు వైఎస్సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బాట వేసిన నాయకుడు. ఏపీ, తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్సార్. వైఎస్సార్‌కు భారతరత్న ప్రకటించేలా ఏపీ, తెలంగాణ సీఎంలు కేంద్రాన్ని కోరాలి'' అని తెలిపారు -
మహానేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు: సజ్జల
సాక్షి,తాడేపల్లి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ శ్రేణులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..'' మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. తొలి నుంచి వైఎస్ఆర్తో అడుగులు వేసిన వాళ్లమే. వైఎస్సార్ జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించుకోవటం ద్వారా వైఎస్ ఆశయాలను పునశ్చరించుకుని పునరంకితం అవుతాం. వైఎస్‌కు పచ్చదనం అంటే చాలా ఇష్టం. అందుకే ఈసారి మొక్కలు నాటడం కూడా చేస్తున్నాం షర్మిల వైస్సార్ కూతురు ఆశీర్వచనం తీసుకున్నారు.పార్టీ పేడతానని షర్మిల గతంలోనే చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఉండాలనే అక్కడ పార్టీ విస్తరించలేదు. షర్మిల పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రెవేటికరణ వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసాం. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి.ప్రెవేటికరణ వ్యతిరేకంగా ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తాం.'' అని తెలిపారు. -
ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు
విశాఖపట్నం: జిల్లాలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి. తెలుగువారికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో రాజశేఖరరెడ్డి నిలిచిపోతారు. దేశంలో సంక్షేమ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆర్. తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్ పయనిస్తున్నారు. సంక్షేమం కోసం రాజశేఖరరెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే సీఎం జగన్ వంద అడుగులు ముందుకు వేస్తున్నారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి, పార్టీ కన్వీనర్ కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, అక్రమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల, చింతలపూడి, తైనాల విజయ్ కుమార్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వైయస్సార్ జిల్లా: రాజంపేట మండలంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకముందు ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, అకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట పాత బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. గుంటూరు: నగరంపాలెంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. కృష్ణా: దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా.. ఉంగుటూరు మండలం తేలప్రోలులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వింత శంకర్ రెడ్డి, వాసు రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, తోట వెంకయ్య పాల్గొన్నారు. కడప: వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాష వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, మేయర్ సురేష్ బాబు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, ఏపీ ఏనార్టీ డైరెక్టర్ ఇలియస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిష్ణారెడ్డి కమలాపురం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహమండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రాజుపాలెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ ఉత్తమారెడ్డి పాల్గొన్నారు. కర్నూలు: జిల్లా వ్యాప్తంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, కర్నూలు మేయర్ బి.వై. రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుకా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా దేవరపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ: ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి వెల్లంపల్లి, మల్లాది విష్ణు. ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని.. వైఎస్ఆర్ అడుగు జాడల్లో సీఎం జగన్ వెళ్తున్నారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. పేదలందరి జీవితాల్లో వైఎస్ఆర్ వెలుగులు నింపారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నెల్లూరు: గాంధీబొమ్మ సెంటర్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి అనిల్‌కుమార్. ''తండ్రి ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. అన్నివర్గాల సంక్షేమాన్ని చూస్తూ జనహృదయనేతగా ఎదుగుతున్నారు'' అంటూ అనిల్ తెలిపారు. -
మేరీల్యాండ్‌లో వైఎస్సార్‌కు ఘన నివాళి
మేరీలాండ్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఫ్రెడెరిక్ నగరంలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది అయన పరిపాలన, పధకాలు, అభివృద్ధి. ఈ మూడు సమంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత కేవలం ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి పార్థ సారధి రెడ్డి బైరెడ్డి, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు వెంకట్ యర్రం, రాజశేఖర్ యరమల, రాంగోపాల్ దేవపట్ల, మురళి బచ్చు, శ్రీనివాస్ పూసపాటి, నాగిరెడ్డి, లోకేష్ మేడపాటి, సోమశేఖర్ పాటిల్, పూర్ణ శేఖర్ జొన్నల, లక్ష్మి నారాయణ, రామకృష్ణ, శ్రీధర్ వన్నెంరెడ్డి, సాయి జితేంద్ర లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
కాలిఫోర్నియాలో మహానేతకు ఘన నివాళి
కాలిఫోర్నియా : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 11వ వర్ధంతిని పురష్కరించుకుని కాలిఫోర్నియా బే ఏరియాలో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైస్సార్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కెవి రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కెవిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణం లేని నేత అని, ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆరోగ్య శ్రీ , 108, 104 లాంటి అనేక కార్యక్రమాలు, నేటి కరోనా లాంటి క్లిష్ట కాలంలో ప్రజలును ఆదుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ముఖ్య సభ్యులైన సుబ్రహ్మణ్యం రెడ్డివారి, హరి శీలం, కిరణ్ కూచిభట్ల, కృష్ణారెడ్డి, అంకిరెడ్డి, బే ఏరియా వైఎస్సార్ అభిమానులు, ఇతర స్టూడెంట్ విభాగం నాయకులూ పాల్గొన్నారు. -
న్యూజిలాండ్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వెల్లింగ్టన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను న్యూజిలాండ్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 25 మంది సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదానం చాలా మందికి ఉపయోగపడుతుందని దాతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో.. వైఎస్సార్సీపీ ఏపీఎన్ఆర్టీఎస్ కో-ఆర్డినేటర్ కృష్ణ చైతన్య, ప్రతాప్ రెడ్డి, అంబటి మహేష్, కైపు మహేష్, మిట్టపల్లి అఖిల్, బుజ్జి బాబు నెల్లోరి.. ఇంకా అనేక మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 71వ జయంతి తెలంగాణలోనూ ఘనంగా జరిగింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి సర్కిల్లో కేక్ కట్‌చేశారు. నల్గొండ మిర్యాలగూడ నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి వేడుకలలో భాగంగా గూడూరు, కొండ్రపోల్, బొత్తలపాలెం, దామచర్లలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లను పంచిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇంజమ్ నర్సిరెడ్డి, మిర్యాలగూడ అధ్యక్షుడు పిల్లుట బ్రహ్మం, దామచర్ల అధ్యక్షుడు అన్నెం కరుణాకర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా భువనగిరిలోనిన కిసాన్ నగర్లో శక్తీ మిషన్ అధ్యక్షురాలు కర్తాల శ్రీనివాస్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తులు సత్యనారాయణలు వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిరిసిల్ల వైఎస్సార్ జయంతిని సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల ధరూర్ మండల కేంద్రంలో వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. -
రాష్ట్ర వ్యాప్తంగా మహానేత వైఎస్సార్‌కి ఘన నివాళి
సాక్షి, అమరావతి: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నివాళులర్పించారు. వైఎస్సార్ కడప: వైఎస్సార్ జయంతి సందర్భంగా వేంపల్లిలో ఉర్దూ జూనియర్ కళాశాలను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఉర్దూ కళాశాల మంజూరుకు సహకరించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్దికి ముస్లిం మైనారిటీలు కృతజ్ఞతలు తెలిపారు. నాడు వైఎస్సార్ ఇచ్చిన హామీని వైఎస్సార్ జయంతి సందర్భంగా నేడు సీఎం వైఎస్ జగన్ నెరవేర్చడంతో మైనారిటీలు ఆనందం వ్యక్తం చేశారు. వేంపల్లిలో ఉర్దూ జునియర్ కలాశాలకు రూ.4 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రొద్దుటూరులో వైఎస్సార్ జయంతి సందర్భంగా రూ. 86 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 311 మందికి వైఎస్ఆర్సీపీ నాయకులు పంపిణీ చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య బద్వేలు, గోపవరం ,అట్లూరు మండలంలోని పలు చోట్ల ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగులో ఘనంగా వైఎస్సార్ 71వ జన్మదిన జయంతి వేడుకలు జరిగాయి. పట్టణంలోని సాయిరాం థియేటర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరు: జిల్లాలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలతో మంత్రి అనిల్ కుమార్ ఘనంగా నివాళులు అర్పించారు. రాపూరు, సైదాపురం, పొదలకూరు, కలువాయి, చేజర్ల మండలాల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. అదే విధంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ చేశారు. డక్కిలి, వెంకటగిరిలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూల మాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు, వైఎస్ఆర్సీపీ నేత కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర, మార్టేరు,పెనుగొండ, ఆచంటలో దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహాలకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు ఘనంగా వైఎస్సార్ రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆదర్శ రైతులను సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం అహర్నిశలు కృషి చేసిన వైఎస్సార్ పుట్టిన రోజు నాడు రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు ఇంచార్జ్ గోకరాజు కనక రంగరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహ రాజు పెదఅమిరం గ్రామంలో కేక్ కట్ చేసి, వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యాలయంలో దివంగత నేత వైఎస్సార్ 71వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భీమవరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పూల మాల వేసి, కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కామన నాగేశ్వరరావు , ఏఎస్ రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు గోదావరి: రాజమండ్రిలో వైఎసాఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం పార్టీ కార్యాలయంలో వైయస్సార్ జయంతోత్సవం నిర్వహించారు. నగరంలోని పలు చోట్ల ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అదే విధంగా కొంతమూరులో రైతులకు సన్మానం చేశారు. కృష్ణా: గుడివాడలో దివంగత నేత వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రి కొడాలి నాని పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, రాష్ట్ర నాయకులు శశిభూషణ్, మండల హనుమంతరావు, గొర్ల శీను, అడప బాబ్జి, పాలేరు చంటి పాల్గొన్నారు. పెడన మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జోగి రమేష్ దివంగత నేత వైఎస్సార్ 71వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ బండారుమల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ బండారూ ఆనందప్రసాద్, మాజీ కౌన్సిలర్లు గరిక ముక్కు చంద్రబాబు, మెట్ల గోపి, కటకం ప్రసాద్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. ఆ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో రైతు దినోత్సవం వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. ఈ రోజు తమ ప్రభుత్వానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి గుర్తు చేశారు. రాజశేఖరరెడ్డి ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ రెండు అడుగులు వేసి పాలన సాగిస్తున్నారని తెలిపారు. మహానేత రాజశేఖరరెడ్డి ఆత్మ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటుందని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా కైకలూరు మార్కెట్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు నోబుల్, ముంగర నరసింహారావు, అడవి కృష్ణ, గాదిరాజు నారాయణరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు తిరుపతి ఘనంగా జరిగాయి. తుడా సర్కిల్లో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే గొప్ప నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. తెలుగు రాష్టాల ప్రజల మనస్సులను చురగొన్న వైఎస్సార్ గొప్ప పాలనను అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ తండ్రికి మించిన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలో వైఎస్సార్ 71వ జయంతిని ఎమ్మెల్యే వెంకటేగౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం: జిల్లాని చీరాలలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహనికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పూల మాల లేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి దివంగత నేత రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. ఆయన జన్మదినాన్ని ర్తెతు దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయ౦ అన్నారు. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్రం రెండుగా విడిపోయేది కాదన్నారు. రాజధాని పేరుతో చ౦ద్రబాబు వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఒంగోలులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొని చర్చి సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి , శిద్ధా రాఘవరావు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. చీమకుర్తిలో దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం నల్ల కాలువ గ్రామ సమీపంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మృతి వనంలో ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి. వైయస్ఆర్ కాంస్య విగ్రహానికి నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బివై రామయ్య, శిల్ప భువనేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా బ్రహ్మణ కొట్కూరులో ‘వైఎస్సార్ రైతు దినోత్సవం’ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, అధికారులు పాల్గొన్నారు. ఆదోనిలో వైస్సార్ జయంతి సందర్భంగా వైస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలాభిషేకం చేసి పుల మాల వేశారు. అనంతపురం: వైఎస్సార్ జయంతి సందర్భంగా కదిరిలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డా. సిద్దారెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా మడకశిరలో వైఎస్సార్ సర్కిల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పూల మాల వేసి నివాళులు అర్పించారు. విశాఖ పట్నం: దివంగత మహానేత వైఎస్సార్ 71 జయంతిని పురస్కరించుకుని పాయకరావుపేటలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే గొల్ల బాబురావు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతు భరోసా కేంద్రo నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యలమంచిలిలో ఘనంగా వైస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. వైస్సార్ విగ్రహానికి డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు బొద్దపు ఎర్రయ్యదొర,రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదెపు గోవింద్, రంగా సాయి, బెజవాడ నాగేశ్వరరావు, కర్రి శివ, వియ్యపు గోపి పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా విశాఖ నార్త్ కన్వీనర్ కేకే రాజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బాలయ్య శాస్త్రి లే అవుట్లో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. శ్రీకాకుళం వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సీఈసీ మెంబర్ అందవరపు సూరిబాబు పాల్గొన్నారు. టెక్కలిలో వైఎస్సార్ 71 వ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ కాకుళం పార్లమెంట్ కన్వినర్ దువ్వాడ శ్రీనివాస్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వినర్ పేరాడ తిలక్ పాల్గొన్నారు. రణస్థలంలో చ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. నరసన్నపేటలో వైఎస్సార్ 71 వ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆమదాలవలసలో వైఎస్ రాజశేకరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకొని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాలకొండలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే వి.కళావతి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు. రాజాంలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే కంబాల జోగులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. పలాసలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు పూల మాల వేసి నివాళులు అర్పించారు. గుంటూరు : జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. తెనాలిలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేదలకు అన్నదానం చేశారు. అదే విధంగా రైతు దినోత్సవం సందర్భంగా ఆదర్శ రైతులకు సన్మానం చేశారు. నిజాంపట్నంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు పూల మాల వేసి నివాళులు అర్పించారు. మంగళగిరిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్కే పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. బాపట్లలో వైఎస్సార్ జయంతి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కేక్ కట్ చేశారు. అనంతరం వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద జెండా అవిష్కరించారు. నరసరావుపేటలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో రైతు భరోసా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. -
మహానేత...నిను మరువలేం
సాక్షి, అమరావతి బ్యూరో: రైతును రాజును చేయడానికి ఆయన వేసిన ప్రతి అడుగు ప్రజల గుండెల్లో రాజన్నను రైతు బాంధవుడిగా నిలిపింది. దీంతో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రైతు దినోత్సవంగా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 852 రైతు భరోసా కేంద్రాల్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలను బుధవారం జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాపై రాజన్న చెరగని ముద్ర వేశారు. టీడీపీ కంచుకోటకు బద్దలు కొట్టి 2004లో మొత్తం 19 నియోజకవర్గాల్లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి రాజకీయ ఉద్దండులను సైతం విస్మయపరిచారు. ముఖ్యమంత్రిగా జిల్లా ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉంది. పులిచింతల ప్రాజెక్టును నిర్మించి సస్యశ్యామలం చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా, నాగార్జున సాగర్ ఆయకట్టుకు జీవం పోశారు. ఆరోగ్యశ్రీకి ఈ జిల్లాలోనే అంకురార్పణ చేసి లక్షలాది మంది రోగుల ప్రాణాలకు పురుడు పోశారు. గతంలో జిల్లాలో సీఎం హోదాలో డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జిల్లాలో 57 సార్లు పర్యటించారంటే ఆయనకు జిల్లాపై ఎంత మమకారం ఉందో తెలుస్తోంది. రాజన్న పాలన రైతులకు సువర్ణ యుగం దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలన రైతులకు ఓ సువర్ణయుగం. రైతుల బతుకు చిత్రాన్ని మార్చే క్రమంలో జలయజ్ఞం కింద జిల్లాలో ఆయన పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించారు. వైఎస్సార్ చివరి సంతకం చేసిన ఫైల్ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చేదే. ఈ బీమాతో జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. జిల్లాకు అధిక ప్రాధాన్యం జిల్లా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆయన ఆర్థికంగా, రాజకీయంగా గుంటూరు జిల్లాకు అధిక ప్రాధాన్యం కల్పించారు. జిల్లాకు నాలుగు మంత్రి పదవులు కేటాయించడంతోపాటు, పథకాల అమలులో సైతం పెద్ద పీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.12వేల కోట్ల రుణమాఫీలో జిల్లా రైతులు దాదాపు 6.7 లక్షల మందికి రూ.560 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. ఇందిర ప్రభ జిల్లాలో ప్రారంభించి జిల్లా రైతులకు పెద్ద పీట వేశారు. ఇందిరమ్మ ఫేజ్–2 ఇళ్లను జిల్లాలోనే ప్రారంభించారు. రాజీవ్ పల్లెబాట ద్వారా ఎన్నో గ్రామాలకు తాగునీరందించి పల్లె వాసుల మనస్సులో చెరగని ముద్ర వేశారు. గుంటూరు నగరానికి దాహర్తి తీర్చేందుకు రూ.6.50 కోట్లతో తక్కెళ్లపాడు రా వాటర్ ప్లాంట్ నుంచి తక్కెళ్లపాడు నీటి శుద్ధి వాటర్ పాంట్ల వరకు రెండోపైపు లైను నిర్మించారు. నగర ప్రజల నీటి కష్టాలు తీర్చిన మహానేతను నగర ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రూ.460 కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకానికి ఆయనే అంకురార్పణ చేశారు. రైతులకు విద్యుత్ బకాయి మాఫీ చేయడం ద్వారా జిల్లాలో 80వేల మంది రైతులకు లబ్ధి కలిగింది. విద్యుత్ బకాయిల మాఫీ ద్వారా జిల్లాలోని రైతులకు రూ.36 కోట్ల లబ్ధి కలిగింది. ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లాలోని 80వేల మంది రైతులకు ఏడాదికి రూ.281.60 కోట్ల లబ్ధి చేకూరింది. దీంతోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరుపేదల పాలిటి అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008 లో గుంటూరు నుంచే ఆయన ప్రారంభించడం జిల్లాప్రజలు మరిచిపోలేని తీపి జ్ఞాపకం. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ కోసం 2008 ఫిబ్రవరి 2న రూ. 4,444.41 కోట్లతో నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు అనుమతి ఇచ్చారు. దీని ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో 6.74 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కృష్ణా పశ్చిమడెల్టాలో కాలువల ఆధునికీకరణ కోసం రూ.4,573 కోట్లు కేటాయించారు. ఇందులో గుంటూరు జిల్లాకు సంబంధించి రూ. 1760.15 కోట్లను కాల్వల ఆధునికీకరణకు కేటాయించారు. ఇందులో రూ.1187 కోట్ల పనులు జరిగాయి.దీని ద్వారా జిల్లాలో 5.22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుంది. మొత్తం మీద మహానేత కాలంలో జిల్లా వాసులకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను ఆయన పూర్తి చేసి జిల్లావాసుల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. సాగునీటిప్రాజెక్టులకు పెద్ద పీట జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టు 2004 అక్టోబరు 15న రూ.680 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో విజయవాడ, గుంటూరు నగరాల తాగునీటి దాహర్తి తీర్చడంతోపాటు కృష్ణా డెల్టాలో 13 లక్షల ఆయకట్టు స్థిరీకరించడానికి ఉపయోగపడుతోంది. దీనిని 2013 డిసెంబరు 7న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. -
స్నేహ పరిమళాలకు చిహ్నం
వైఎస్ రాజశేఖరరెడ్డి అంటేనే ఓ భరోసా. ఆయన చెంత ఉంటే తరగని సంతోషం. స్నేహమంటే ఏమిటో చాటిన మహామనీషి వైఎస్సార్.. అని ఆయన చిన్ననాటి మిత్రులు నేటికీ చెమ్మగిల్లిన కళ్లతో నెమరు వేసుకుంటారు. ఆయనతో గడిపిన మధుర క్షణాలు చిరస్మరణీయమని కథలు కథలుగా చెప్పుకుంటారు. మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి బళ్లారి నగరంతో విడదీయలేని అనుబంధం దాగి ఉంది. సాక్షి, బళ్లారి: కడప గడ్డమీద పుట్టి తిరుగులేని నాయకునిగా ఎదిగి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలనకు కొత్త నిర్వచనం చెప్పిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు తలచుకోగానే ప్రతి తెలుగు గుండె పులకితమవుతుంది. తెలుగుదనానికి నిండెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన జన్మదినం నేడు. మహానేతతో కలిసి చదువుకున్న పాత మిత్రులకు బళ్లారి నగరం నెలవు. మా వైఎస్సార్ అని ఆయన మిత్రులు సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టి పెరిగింది, రాజకీయంగా రాణించి మహానేతగా ఖ్యాతి పొందింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయితే, విద్యాభ్యాసం దాదాపు కర్ణాటకలో సాగడంతో కర్ణాటకతో కూడా అంతే బంధం పెనవేసుకుంది. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న సమయంలో ఆయన బళ్లారిలో కుటుంబంతో సహా కొంతకాలం ఉన్నారు.రాజారెడ్డి తన కుమారులను, కుమార్తెను బళ్లారిలో చదివించేందుకు ఏర్పాట్లు చేశారు. రాజారెడ్డి బళ్లారిలో కుటుంబంతో సహా రాకముందే వైఎస్సార్ కొన్ని నెలలు బళ్లారిలోనే హాస్టల్లో ఉండి చదువుకున్నారు. వైఎస్సార్ బళ్లారిలో 7వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీతో పాటు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఆరేళ్ల పాటు విద్యాభ్యాసం చేశారు. వైఎస్సార్ హైస్కూల్ విద్యను సెయింట్ జాన్స్ పాఠశాలలో çపూర్తి చేసుకొని, అనంతరం పీయూసీ తర్వాత 1964లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ బళ్లారిలో చదివారు. ముఖ్యంగా వైఎస్సార్ బళ్లారిలో హైస్కూల్లో చదువుకునే రోజుల్లో సెయింట్ జాన్స్ హైస్కూల్‌కు హెడ్మాస్టర్గా ఉన్న ఫ్రాన్సిస్ జేవియర్ వైఎస్సార్ వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా చెబుతారు. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్సార్‌ను హైదరాబాద్‌లో కలిసిన బళ్లారి బాల్యమిత్రులు వైఎస్సార్ రాజకీయాల్లోకి చేరిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. కొంతకాలానికి ఆయనను కలవడానికి వెళ్తే ఎంతో అభిమానంగా పలకరించారు. పాత స్నేహాన్ని గుర్తుపెట్టుకుని పేరుపేరునా పిలవడం ఆశ్చర్యపరచింది. మాకు ఆనంద భాష్పాలు వచ్చాయి అని పలువురు పాతమిత్రులు గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్‌ను క్యాంప్ ఆఫీస్‌లో కలిసేందుకు వెళ్లాం. సార్ బిజీగా ఉన్నారు, కలవడం ఇబ్బందిగా ఉంటుందని అక్కడి అధికారులు మాకు చెప్పారు. అయితే ఎంతో కష్టంతో తమ పేర్లను వైఎస్సార్‌కు చేర్చాం. తమ పేర్లు వైఎస్సార్‌కు చేరిన ఐదు నిమిషాల్లో తమ వద్దకే ఆయన లోపల నుంచి వచ్చి పలకరించడంతో పాటు తన వెంట లోపలికి తీసుకెళ్లడంతో పాటు తమనే కాకుండా అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో కూర్చొన్న తర్వాత ప్రతి ఒక్క క్లాస్మేట్లను పేరుపేరునా గుర్తు చేసుకుంటూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత ఎప్పుడు హైదరాబాద్ లేక ఆయన ఎక్కడ ఉన్న తాము అక్కడికి వెళితే ముందుగా తమకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు. స్నేహితులు అంటే ఆయనకు పంచప్రాణాలు. చిన్నప్పుడు హాస్టల్, పాఠశాలలో ఎలా మాట్లాడేవారు ఏ కష్టమొచ్చినా తనకు చెప్పాలని సూచించారు. స్నేహానికి ప్రతిరూపంగా, నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే ధీరత్వం ఆయన సొంతం అని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ కొంతకాలంపాటు డిగ్రీ చదివిన బళ్లారి వీరశైవ కాలేజ్ గుల్బర్గాలో వైద్యవిద్య బళ్లారిలో ఎస్ఎస్ఎల్సీ ముగిసిన తర్వాత పీయూసీ చదవడానికి విజయవాడలోని లయోలా కాలేజీకి వెళ్లారు.తరువాత డిగ్రీ బళ్లారిలోని వీరశైవ కళాశాలలో చదువుతుండగానే గుల్బర్గాలోని వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ కూడా కర్ణాటకలోనే పూర్తి చేయడంతో ఆయన విద్యాభ్యాసంలో అధిక భాగం కన్నడనాట కొనసాగిందని చెప్పవచ్చు. మహానేత వైఎస్ఆర్ కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి మిత్రులను, చదివిన పాఠశాలను ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. రాత్రి ఒంటిగంట వరకూ చదువే వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు డిగ్రీలో పరిచయం అయ్యారు. నగరంలోని వీరశైవ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే రోజుల్లో వైఎస్సార్ తనతో ఎంతో స్నేహంగా మెలిగేవారు. వారి ఇంటికి వెళ్లేవారం. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి కూడా తమను ఎంతో అప్యాయంగా పలకరించేవారు. హెచ్ఎల్సీ క్వార్టర్స్‌లో ఎప్పుడూ కలుసునేవాళ్లం. సీఎం అయిన తర్వాత కూడా కలిస్తే చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వైఎస్సార్‌కు ఎంతో జ్ఞాపకశక్తి ఉండేది. రాత్రి 1 గంట వరకు పుస్తకాలను చదివేవారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లో మంచి పట్టు సంపాదించారు. ఎల్లప్పుడు చిరునవ్వులు చిందిస్తూ అందరిని పలకరించేవారు.అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధగా ఉంది. – గాజుల మురళీధర్, బళ్లారి సద్గుణాల సమాహారం పువ్వు పుట్టగానే పరమళిస్తుందని అన్నట్లు బాల్యం నుంచే ఆయనలో ఎన్నో సుగుణాలు అందరినీ ఆకర్షించేవి. బళ్లారిలో చదువుతున్న రోజుల్లోనే చిన్నప్పటి నుంచి సేవ చేయాలనే తపన, తోటి విద్యార్థులకు అండగా ఉంటూ వారి కష్టాలను పంచుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంచి నడవడికతో చెరగని ముద్ర వేసుకున్నారు. తోటి విద్యార్థులకు హాస్టల్‌లోను, స్కూల్లోను ఎంతో అండగా ఉండటమే కాకుండా పేద విద్యార్థులకు ఫీజులు కూడా చెల్లించేవారని స్నేహితులు చెప్పుకుంటారు. తండ్రి రాజారెడ్డి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో ఆయన తోటి విద్యార్థులకు ఫీజులు కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా వ్యక్తమయ్యేవి. అందరూ కావాలనుకునే వ్యక్తి బళ్లారిలో సెయింట్‌జాన్స్ హైస్కూల్లో కలిసి చదువుకోవడంతో పాటు హాస్టల్లో రెండేళ్ల పాటు ఒకే చోట ఉండి చదువుకున్నాం. ఆయన చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలతో కనిపించేవారు. తోటి విద్యార్థులకు ఎలాంటి కష్టమొచ్చినా తనవిగా భావించి సమస్యలు పరిష్కరించేవారు. అందరి మిత్రుల్లో వైఎస్సార్ రూటే సపరేటు. అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి. వైఎస్సార్ ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మేము ఇంటికి వెళ్లి కలిశాము. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. – బాల్యమిత్రుడు అశ్వర్థసింగ్, కమలాపురం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అపర భగీరథుడు.. తండ్రికి తగ్గ తనయుడు!
నీ చిరునవ్వు.. మా గుండెల్లో చెరగని జ్ఞాపకం నీ నాయకత్వం.. మా బతుకుల్ని వెలిగించిన దీపం నీ సంక్షేమాభిలాష.. మా పాలిట సంజీవని మా ఆత్మ బంధువైన.. నిన్ను ఎన్నటికీ మరువం రాజన్నా అభివృద్ధి ఎంత ముఖ్యమో.. సంక్షేమమూ అంతే ముఖ్యమని నమ్మిన ప్రజానాయకుడు.. బీడు భూముల్లో ఆనందపు సిరులు నింపేందుకు జలయజ్ఞం చేపట్టిన రైతు బాంధవుడు.. పేద ప్రజల ఆరోగ్యమే తనకు మహాభాగ్యమన్న మహానేత.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్న రాజనీతిజ్ఙుడు రాజన్న. ప్రజాసేవలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటానన్న ఆ మేరునగ ధీరుడు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాయి. రాజన్న ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగనన్నకు ఓ దిక్సూచిలా పనిచేస్తున్నాయి. అపర భగీరథుడు.. తండ్రికి తగ్గ తనయుడు (సాక్షి, వెబ్ ప్రత్యేకం) : ‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పాడి పంటలతో పులకించాలి. బీడు బడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరుడు నిండాలి’’ అని వైఎస్సార్ ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి పేరిట వ్యవసాయ రంగాన్ని విస్మరించి గ్లోబలైజేషన్ వెంట పరుగులు పెడుతున్న పాలకులకు మట్టి వాసనను మళ్లీ పరిచయం చేశారు. దేశానికి వెన్నెముకైన రైతును రాజును చేసేందుకు జలయజ్ఞం ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని సంకల్పించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి.. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరాన్ని ఆరంభించి, అనుమతులు తెచ్చి 80 శాతం పనులు పూర్తి చేశారు. గుండ్లకమ్మ, వెలిగొండ, అలీసాగర్, సుద్దవాగు, దేవాదుల, సురంపాలెం, మద్దువలస, పెద్దేరు ఇలా పదుల సంఖ్యలో ప్రాజెక్టులను పూర్తి చేసి అపర భగీరథుడిగా అన్నదాతల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అంతేగాక ఉచిత విద్యుత్ పథకం మీద తొలి సంతకం చేసి.. ‘వ్యవసాయం దండగ.. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’ అన్న గత పాలకుల మాటలు తలకిందులు చేసి వ్యవసాయాన్ని పండుగ చేశారు. అలా రాజన్న పాలనలో స్వర్ణయుగం చూసిన రైతులకు రాష్ట్ర విభజన తర్వాత మరోసారి కష్టాలు మొదలయ్యాయి. రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హామీలను తుంగలో తొక్కి రైతులకు తీరని అన్యాయం చేసింది. ఐదేళ్ల పాలనలో అడుగడుగునా కష్టాల పాలు చేసింది. అటువంటి సమయంలో రాజన్న వారసుడు జగనన్న అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ‘‘వైఎస్సార్ రైతు భరోసా’’ పేరిట బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడాది పాలనలోనే 49.43 లక్షల మంది రైతులకు రూ.10,209.32 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. అంతేగాక రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.2,000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో జనతా బజార్ ఏర్పాటు చేయడం సహా... రైతులు పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తులు కూడా ఇందులో అమ్ముకునే వీలు కల్పించారు. వీటి ద్వారా ప్రభుత్వమే 30 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లో పోటీ పెంచి మంచి ధర లభించేలా ప్రణాళికలు రచించారు. అదే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) ఏర్పాటు చేసి.. వీటి ద్వారా రైతులకు ఎన్నో సేవలతోపాటు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపులో సమూల మార్పులు చేసి, రైతులపై ఏ మాత్రం భారం పడకుండా వారు కేవలం ఒక రూపాయి కడితే చాలు.. ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. సన్న, చిన్న కారు రైతులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం ద్వారా ఉచిత బోర్ వెల్స్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా అనేక రకాలుగా రైతులకు అండగా నిలబడుతూ రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పేదల పాలిట సంజీవని.. ప్రతిధ్వనిస్తున్న విప్లవ శంఖం! ముఖ్యమంత్రి యెడుగూరి సందింటి రాజశేఖర్‌రెడ్డిని రాజన్నగా పేద ప్రజలకు చేరువ చేసిన అతి ముఖ్యమైన పథకాల్లో ఆరోగ్య శ్రీ ఒకటి. నిజానికి ఇది వైఎస్సార్ మానస పుత్రిక వంటిది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించేలా రూపొందించిన ఈ ఆరోగ్య బీమా పథకం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రజల పాలిట సంజీవనిలా మారింది. 2007లో ఆరోగ్యశ్రీ తొలుత 3 జిల్లాల్లో 163 వ్యాధులకు చికిత్స అందించేలా రూపొందించారు. ఆ తర్వాత రెండేళ్ల కాలంలోనే ఈ సేవలను విస్తరించి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 942 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించారు. కేన్సర్, గుండె జబ్బులు, న్యూరో, గర్భ కోశవ్యాధులు, ప్రమాదాల బారిన పడిన వారు ఇలా లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. పార్టీలకు అతీతంగా అర్హులందరు వైద్య సహాయం పొందారు. 108 సర్వీసులతో ఎంతో మందిని సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చడం సహా 104 వాహనాలు(సంచార వైద్యశాలలు )లతో ఎంతో మందికి ఔషధాలు అందించారు. ‘‘నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండడుగులు ముందుకేస్తా’’ అన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని 90 శాతం వాగ్దానాలను అమలు చేశారు. రాష్ట్రంలోని 95.85 శాతం కుటుంబాలకు ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పేరుతో పేద కుటుంబాలకు భరోసా కల్పించారు. రాష్ట్రంలోని 1,42,54,134 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేసే కొత్త కార్డులను పంపిణీ చేశారు. కొత్తగా 1,000 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి, మొత్తం 2,059 వ్యాధులకు వైద్యం అందించే పైలట్ ప్రాజెక్టుకు జనవరిలోనే శ్రీకారం చుట్టారు. క్యాన్సర్ సహా 2,059 వ్యాధులకు వైద్యం చేయిస్తామని.. బిల్లు రూ.1,000 దాటితే పథకం వర్తిస్తుందని ప్రకటించారు. అవ్వా తాతలకు కంటి వెలుగు పథకం తీసుకువచ్చారు. అదే విధంగా వైద్య రంగంలో సమూల మార్పులు చేపట్టి.. . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలను సంపూర్ణంగా మార్చివేసేందుకు నాడు –నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపుగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున 11,197 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్ర పౌరులందరికీ హెల్త్ రికార్డులను సిద్ధం చేయబోతున్నారు. భారీగా వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు సింగిల్ నోటిఫికేషన్ జారీ చేయించారు. 16 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించబోతున్నారు. ఇక జూలై 1న వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన 108, 104 కొత్త వాహనాల ప్రారంభోత్సవం ఎంత కన్నుల పండువగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1,088 వాహనాలు ఒకేసారి సేవల్లోకి బయలుదేరి వెళ్లాయి. రాజన్న వారసుడి ప్రజారోగ్య రథయాత్రకు ప్రజలంతా నీరాజనం పట్టారు. 108, 104 వాహనాలు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి వివిధ జిల్లాలకు తరలివెళ్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో మరోసారి పేద ప్రజల కళ్లల్లో ఆశాజ్యోతులు వెలిగించారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు లభించాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మూడు ప్రధాన నగరాల్లో 130 ఆసుపత్రులను ఎంపానల్ చేశారు. అంతేగాకుండా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ దేశంలోనే రికార్డు స్థాయిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం సహా.. ప్రాణాంతక వైరస్ సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫీజు రీయింబర్స్మెంట్.. రెండడుగులు ఎక్కువే! పేదరికం ప్రతిభకు ప్రతి బంధకం కాకూడదని.. ఉన్నత విద్యనభ్యసించాలనే కలకు ఆటంకం కారాదని భావించారు వైఎస్సార్. కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన వ్యక్తి ఒకరు ఉన్నా.. ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ఆయన నమ్మారు. అందుకే చదు‘కొన’లేని విద్యార్థులకు చేయూత అందించడమే లక్ష్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే పేద విద్యార్థుల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించేలా పథకాన్ని రూపొందించారు. ఈ విప్లవాత్మక పథకం ద్వారా లబ్ది పొంది ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నత విద్యావంతులయ్యారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా కెరీర్లో స్థిరపడ్డారు. వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన నవరత్నాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కూడా ఒకటి. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదని.. ఏ ఉన్నత చదువుకైనా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (జగనన్న విద్యా దీవెన) అమలు చేస్తున్నామని ప్రకటించారు. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే.. అది చదువేనని విశ్వసించిన ఆయన గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాట వేశారు. అదే విధంగా జగనన్న వసతిదీవెన పథకం కింద ప్రతి విద్యార్థికి భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందించేందుకు సిద్ధమయ్యారు. అంతేగాకుండా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ‘అమ్మ ఒడి’ అమలు చేశారు. ‘జగనన్న గోరుముద్ద’పేరిట మధ్యాహ్న భోజనం పథకంలో మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘జగనన్న విద్యా కానుక’తో బుక్స్, నోట్స్, యూనిఫాం, షూస్, బ్యాగ్ తదితరాలు పంపిణీ చేస్తున్నారు. నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు నాంది పలికారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తూనే.. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సన్నద్ధులను చేసేందుకు, ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అవ్వాతాతలకు అండగా.. వైఎస్సార్ పెన్షన్ కానుక వృద్ధాప్యం భారం కాకూడదనే ఆలోచనతో వైఎస్సార్ అర్హులైన అవ్వాతాతలందరికీ క్రమం తప్పకుండా పెన్షన్లు అందే ఏర్పాటు చేశారు. ఆసరాలేని వృద్ధులు, దివ్యాంగులు, ఆర్థిక సాయం ఎదురు చూసేవారికి ఈ పెన్షన్లు చేయూతనిచ్చాయి. కేవలం 75 రూపాయిల కోసం ప్రభుత్వాధికారుల చుట్టూ పడిగాపులు పడే పరిస్థితులను మార్చి అర్హులందరికీ పెన్షన్ అందేలా ఆయన చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ వైఎస్సార్ పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం చేసి తండ్రి ఆశయ వారసత్వాన్ని నిలబెట్టారు. ఓ అడుగు ముందుకేసి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుడి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు.‘గడప వద్దకే పెన్షన్’ కార్యక్రమాన్ని అమలు చేసి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, రోగుల కళ్లలో ఆనందం నింపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం.. ప్రజల వద్దకే పాలనను ఆవిష్కృతం చేశారు. నాడు ప్రజాప్రస్థానం పేరుతో రాజన్న చేపట్టిన పాదయాత్ర 1,470 కిలోమీటర్లు కొనసాగింది.. ఆ యాత్ర నుంచే ‘ప్రజా మేనిఫెస్టో’ రూపుదిద్దుకుని... రైతును రాజు చేసింది... నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందించింది... అన్నివర్గాల ప్రజలకు మేలు చేసి కోట్లాది మంది గుండెల్లో ‘మహానేత’ను కొలువుదీరేలా చేసింది... ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ప్రజాశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ఎన్నికై సంక్షేమ పాలన అందిస్తున్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా అప్పులు స్వాగతం పలికినా చిరునవ్వు చెరగనీయక ముందుకు సాగుతున్నారు. మేనిఫెస్టోలో 129 హామీలిస్తే ఏడాది కాలంలోనే 77 హామీలను అమలు చేసి, మరో 36 హామీలు అమలుకు తేదీలతో క్యాలెండర్ ప్రకటించి.. ఇంకా మిగిలి ఉన్న 16 హామీలను కూడా ఈ ఏడాది పరుగులు పెట్టిస్తామని ప్రకటించారు. రైతు భరోసా, అమ్మఒడి, పింఛన్ కానుక, ఆరోగ్యశ్రీ, వాహన మిత్ర, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, వైఎస్సార్ కాపునేస్తం తదితర పథకాలు అమలు చేశారు. అక్కాచెల్లెమ్మలకు పెద్దపీట వేస్తూ దాదాపు 30 లక్షల మందికి పైగా పేద మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చేందుకు సన్నద్ధమయ్యారు. వైఎస్సార్ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఇంత గొప్పగా ప్రజల రుణం తీర్చుకుంటూ, తండ్రి పేరు ప్రతిష్టలు నిలబెడుతూ... నువ్వు మాతోనే ఉన్నావన్న అభయం ఇస్తున్న తనయుడిని కన్న రాజన్నా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!! అలాగే రైతు దినోత్సవ శుభాకాంక్షలు!! -
నేడు వైఎస్సార్ 71వ జయంతి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. తన తండ్రికి నివాళులర్పించడానికి సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు తన కుటుంబసభ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇడుపులపాయలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం పాల్గొనే కార్యక్రమాలివీ... ► గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సాంకేతిక విద్యనందించేందుకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరగతి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ► ట్రిపుల్ ఐటీకి వాడే విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు ఇడుపులపాయ నెమళ్ల పార్కు పక్కన మూడు మెగావాట్ల సామర్థ్యంతో రెస్కో కోలబ్రేషన్ సిస్టమ్‌తో సోలార్ విద్యుత్ ప్లాంటు నిర్మించారు. ఇందుకు 18 ఎకరాల ట్రిపుల్ ఐటీ స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీకి యూనిట్‌కు రూ.7.66తో విద్యుత్ బిల్లును చెల్లిస్తున్నారు. ఈ సోలార్ ప్లాంటు ద్వారా యూనిట్‌కు రూ.3.45తో బిల్లును చెల్లించవచ్చు. దీంతో ఏటా రూ.1.81 కోట్ల మేరకు ఆర్జీయూకేటీ యూనివర్సిటీకి ఆదా అవుతుంది. ఇందుకు సంబంధించిన శిలాఫలాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ► ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరిస్తారు. ► ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులు ప్రపంచస్థాయికి ఎదగాలనే లక్ష్యంతో రూ.10.10 కోట్లతో ఏర్పాటు చేసే కంప్యూటర్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. ► అలాగే క్యాంపస్‌లో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో 2,500 మంది విద్యార్థులు పట్టేలా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ ఆడిటోరియంకు కూడా శంకుస్థాపన చేస్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో... ఇదిలా ఉండగా, వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 9.15 గంటలకు మహానేతకు ఘనంగా నివాళులర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డితోపాటుగా పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
ఆత్మబంధువుకు ఆత్మీయ నివాళి
జన హితం కోసం అహర్నిశలు శ్రమించిన యోధుడు.. దూరమైనా దగ్గరైన మహా మనీషి.. దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డికి ఊరూవాడా ఘన నివాళులర్పించాయి. సేవా కార్యక్రమాలతో స్మరించుకున్నాయి. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు సామాన్య జనం జోహార్లు అర్పించారు. వాడవాడలా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలతో అలంకరించి సుమాంజలి ఘటించారు. అన్న, వస్త్ర దానాలు, రోగులకు పండ్ల పంపిణీ, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలతో స్మరించుకున్నారు. సాక్షి, పట్నంబజారు(గుంటూరు) : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహానేత వైఎస్సార్ చిత్రపటానికి హోం మంత్రి మేకతోటి సుచరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా రక్తదానం చేశారు. పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం పాల్గొన్నారు. మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రేపల్లె పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి మోపిదేవి ఆధ్యర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో 301 మంది రక్తదానం చేశారు. నియోజకవర్గంలోని పలు చోట్ల అన్నసంతర్పణ, సేవా కార్యక్రమాలు జరిగాయి. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ముస్తఫా ఆవిష్కరించారు. నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో నిర్వహించిన అన్నదాన, సేవా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పశ్చిమ నియోజవకర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం నియోజకవర్గంలోని నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. దాచేపల్లి మండలంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి యనమోలు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. బాపట్ల నియోజవకర్గంలోని అన్ని మండలాలు, బాపట్ల పట్టణంలో పార్టీ నేతల ఆధ్వర్యంలో మహానేత వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడదల రజనీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నియోజకవర్గంలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళగిరిలో రక్తదాన శిబిరం మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అన్నదాన, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగారెడ్డిపాలెంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. పొన్నూరు పట్టణం, నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కిలారి రోశయ్య పాల్గొన్నారు. తాళ్లపాలెంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతిని ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిర్వహించారు. నియోజవకర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అంబటి, పార్టీ నేత నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కమ్మెల శ్రీధర్ దంపతులు వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాడికొండలో భారీ అన్నదానం జరిగింది. తెనాలి నియోజవకర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నియోజవకర్గవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలిలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు. వేమూరు నియోజకవర్గ వ్యాప్తంగా మహానేత వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. కొల్లూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొని మహానేతకు నివాళి అర్పించారు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో హోమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తొలుత ఇందిరాగాంధీ బొమ్మసెంటరులోని వైఎస్సార్ కాంస్య విగ్రహానికి, శాలివాన బజారులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. -
ఇడుపులపాయలో ఘనంగా వైఎస్సార్ జయంతి
-
జోహార్.. వైఎస్సార్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, వైఎస్సా ర్సీపీ నాయకులు, అభిమా నులు మహానేతకు నివా ళులర్పించారు. వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
'వైఎస్ఆర్ లేని లోటు పూడ్చలేనిది'
-
'వైఎస్ఆర్ లేని లోటు పూడ్చలేనిది'
హైదరాబాద్ : పదికోట్లమంది తెలుగువారి హృదయాల్లో వైఎస్ఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట సర్కిల్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆకస్మిక మృతిని తెలుగువారు ఇప్పటికీ జీర్ణించుకోలేకుండా ఉన్నారని, వైఎస్ లేని లోటు పూడ్చటం ఎవరి తరం కాదన్నారు. అన్నివర్గాలకు కూడా సమానమైన, నమ్మకమైన నాయకత్వం ఇచ్చిన నేత వైఎస్ఆర్ అని అన్నారు. ఓటమిలోనూ, విజయంలో వైఎస్ఆర్ ఎప్పుడూ కాంగ్రెస్‌లోనే ఉన్నారని, ఆయన బాటలోనే తాము ముందుకు వెళతామని రఘువీరా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ సేవలు మరవలేనివన్నారు. ఆయన సేవలను పొన్నాల గుర్తు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షులతో పాటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్కు నివాళులు అర్పించారు.