దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న సీఎం జగన్
వేంపల్లె : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిలు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయలోని నెమళ్ల పునరుత్పత్తి కేంద్రం పక్కన ఉన్న చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పాస్టర్లు బెనహరబాబు, నరేష్, మృత్యుంజయలు ప్రార్థనలు చేశారు.
అనంతరం సీఎం జగన్ బంధువులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పులివెందుల వెళ్లారు. తిరిగి సాయంత్రం 5.45 గంటలకు ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సుమారు గంటపాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. నేడు శనివారం పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు.
ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment