రాష్ట్ర వ్యాప్తంగా మహానేత వైఎస్సార్‌కి ఘన నివాళి | Tribute To Late YS Rajasekhara Reddy For His Birth Anniversary in AP - Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా మహానేత వైఎస్సార్‌కి ఘన నివాళి

Published Wed, Jul 8 2020 2:25 PM | Last Updated on Wed, Jul 8 2020 5:21 PM

All Leaders Give Tribute To Late YS Rajasekhara Reddy For His Birth Anniversary - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నివాళులర్పించారు. 

వైఎస్సార్‌ కడప: వైఎస్సార్‌ జయంతి సందర్భంగా వేంపల్లిలో ఉర్దూ జూనియర్ కళాశాలను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఉర్దూ కళాశాల మంజూరుకు సహకరించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్దికి  ముస్లిం మైనారిటీలు కృతజ్ఞతలు తెలిపారు. నాడు వైఎస్సార్‌  ఇచ్చిన హామీని వైఎస్సార్‌ జయంతి సందర్భంగా నేడు సీఎం వైఎస్ జగన్‌ నెరవేర్చడంతో మైనారిటీలు ఆనందం వ్యక్తం చేశారు. వేంపల్లిలో ఉర్దూ జునియర్ కలాశాలకు రూ.4 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

  • ప్రొద్దుటూరులో వైఎస్సార్‌ జయంతి సందర్భంగా రూ. 86 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను  311 మందికి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పంపిణీ చేశారు. 
  • దివంగత మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య బద్వేలు, గోపవరం ,అట్లూరు మండలంలోని పలు చోట్ల ఉన్న వైఎస్సార్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
  • జమ్మలమడుగులో ఘనంగా వైఎస్సార్ 71వ జన్మదిన జయంతి వేడుకలు జరిగాయి. పట్టణంలోని సాయిరాం థియేటర్ వద్ద  ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 


నెల్లూరు:

జిల్లాలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలతో మంత్రి అనిల్ కుమార్ ఘనంగా నివాళులు అర్పించారు. 

  • రాపూరు, సైదాపురం, పొదలకూరు, కలువాయి, చేజర్ల మండలాల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి.
  • వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. అదే విధంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ చేశారు.
  • డక్కిలి, వెంకటగిరిలో వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ  బల్లి దుర్గా ప్రసాదరావు, వైఎస్‌ఆర్‌సీపీ నేత కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.


పశ్చిమ గోదావరి 
జిల్లాలోని ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర, మార్టేరు,పెనుగొండ, ఆచంటలో దివంగత నేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహాలకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. 

  • నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు ఘనంగా వైఎస్సార్‌ రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆదర్శ రైతులను సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం అహర్నిశలు కృషి చేసిన వైఎస్సార్‌ పుట్టిన రోజు నాడు రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు ఇంచార్జ్ గోకరాజు కనక రంగరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు. 
  • ఉండి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్‌ నరసింహ రాజు పెదఅమిరం గ్రామంలో కేక్ కట్ చేసి, వైఎస్సార్‌  విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
  • వైఎస్‌ఆర్‌సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యాలయంలో దివంగత నేత వైఎస్సార్‌ 71వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు వైఎస్సార్‌  చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
  • భీమవరంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో  దివంగత నేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పూల మాల వేసి, కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర  కార్యదర్శులు  కామన నాగేశ్వరరావు , ఏఎస్ రాజు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.


తూర్పు గోదావరి: 

రాజమండ్రిలో వైఎసాఆర్‌సీపీ సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం పార్టీ కార్యాలయంలో వైయస్సార్ జయంతోత్సవం నిర్వహించారు. నగరంలోని పలు చోట్ల ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అదే విధంగా కొంతమూరులో రైతులకు సన్మానం చేశారు.

కృష్ణా:
గుడివాడలో దివంగత నేత వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా  పార్టీ కార్యాలయంలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రి కొడాలి నాని పూల మాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, రాష్ట్ర నాయకులు శశిభూషణ్, మండల హనుమంతరావు, గొర్ల శీను, అడప బాబ్జి, పాలేరు చంటి పాల్గొన్నారు.

  • పెడన మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జోగి రమేష్ దివంగత నేత వైఎస్సార్‌ 71వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ బండారుమల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ బండారూ ఆనందప్రసాద్‌, మాజీ కౌన్సిలర్లు గరిక ముక్కు చంద్రబాబు, మెట్ల గోపి, కటకం ప్రసాద్ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
  • దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ నివాళులు అర్పించారు. ఆ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్, నగర వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో రైతు దినోత్సవం వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. ఈ రోజు తమ ప్రభుత్వానికి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం వైఎస్‌ జగన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి  గుర్తు చేశారు. రాజశేఖరరెడ్డి ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ రెండు అడుగులు వేసి పాలన సాగిస్తున్నారని తెలిపారు. మహానేత రాజశేఖరరెడ్డి ఆత్మ వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతుగా ఉంటుందని తెలిపారు. 
  • దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా కైకలూరు మార్కెట్ సెంటర్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు నోబుల్, ముంగర నరసింహారావు, అడవి కృష్ణ, గాదిరాజు నారాయణరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్తూరు: 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు తిరుపతి ఘనంగా జరిగాయి. తుడా సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పూల మాలలు  వేసి  నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే గొప్ప నాయకుడు వైఎస్సార్‌ అని కొనియాడారు. తెలుగు రాష్టాల ప్రజల మనస్సులను చురగొన్న వైఎస్సార్‌ గొప్ప పాలనను అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్‌ తండ్రికి మించిన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.

  • పలమనేరు పట్టణంలో వైఎస్సార్‌ 71వ జయంతిని ఎమ్మెల్యే వెంకటేగౌడ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

ప్రకాశం:
జిల్లాని చీరాలలో మహానేత  వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద  వైఎస్సార్‌ విగ్రహనికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ పూల మాల లేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి దివంగత నేత రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. ఆయన  జన్మదినాన్ని ర్తెతు  దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయ౦ అన్నారు.
రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్రం రెండుగా విడిపోయేది కాదన్నారు. రాజధాని పేరుతో చ౦ద్రబాబు వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.

  • ఒంగోలులో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి  జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొని చర్చి సెంటర్‌లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ  మాగుంట శ్రీనివాసులురెడ్డి , శిద్ధా రాఘవరావు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
  • చీమకుర్తిలో  దివంగత నేత ముఖ్యమంత్రి  వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా  గాంధీనగర్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


కర్నూలు 
జిల్లాలోని ఆత్మకూరు మండలం నల్ల కాలువ గ్రామ సమీపంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మృతి వనంలో ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి. వైయస్ఆర్ కాంస్య విగ్రహానికి నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బివై రామయ్య, శిల్ప భువనేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

  • వైఎస్సార్‌ జయంతి సందర్భంగా బ్రహ్మణ కొట్కూరులో ‘వైఎస్సార్‌ రైతు దినోత్సవం’  కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, అధికారులు పాల్గొన్నారు.
  • ఆదోనిలో వైస్సార్ జయంతి  సందర్భంగా  వైస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలాభిషేకం చేసి పుల మాల వేశారు.

అనంతపురం:
వైఎస్సార్ జయంతి సందర్భంగా కదిరిలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డా. సిద్దారెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • వైఎస్సార్ జయంతి సందర్భంగా మడకశిరలో వైఎస్సార్ సర్కిల్‌లో  ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పూల మాల వేసి నివాళులు అర్పించారు. 

విశాఖ పట్నం: 
దివంగత మహానేత  వైఎస్సార్  71 జయంతిని పురస్కరించుకుని పాయకరావుపేటలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే గొల్ల బాబురావు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతు భరోసా కేంద్రo నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

  • యలమంచిలిలో ఘనంగా వైస్సార్ జయంతి వేడుకలు జరిగాయి.  వైస్సార్ విగ్రహానికి డీసీసీబీ చైర్మన్‌ సుకుమార్ వర్మ పూల మాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు బొద్దపు ఎర్రయ్యదొర,రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదెపు గోవింద్, రంగా సాయి, బెజవాడ నాగేశ్వరరావు, కర్రి శివ, వియ్యపు గోపి పాల్గొన్నారు.  
  • దివంగత నేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా విశాఖ నార్త్ కన్వీనర్ కేకే రాజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బాలయ్య శాస్త్రి లే అవుట్‌లో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.

శ్రీ‌కాకుళం
వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా  వైఎస్సార్‌ విగ్ర‌హానికి జిల్లా పార్టీ అధ్య‌క్షురాలు కిల్లి కృపారాణి, ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సీఈసీ మెంబ‌ర్ అంద‌వ‌ర‌పు సూరిబాబు పాల్గొన్నారు.

  • టెక్క‌లిలో వైఎస్సార్‌ 71 వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ విగ్ర‌హానికి వైఎస్‌ఆర్‌సీపీ ‌కాకుళం పార్ల‌‌మెంట్ క‌న్విన‌ర్ దువ్వాడ శ్రీ‌నివాస్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ క‌న్విన‌ర్ పేరాడ తిల‌క్ పాల్గొన్నారు.
  • ర‌ణ‌స్థ‌లంలో చ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్ కుమార్ వైఎస్సార్‌ విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
  • న‌ర‌స‌న్నపేటలో వైఎస్సార్‌ 71 వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. 
  • ఆమ‌దాల‌వ‌ల‌సలో వైఎస్‌ రాజశేకరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకొని రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వైఎస్సార్‌  విగ్రహాన్ని ఆవిష్క‌రించారు. 
  • పాల‌కొండలో వైఎస్సార్‌ విగ్ర‌హానికి ఎమ్మెల్యే వి.క‌ళావ‌తి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పాల‌వ‌ల‌స విక్రాంత్ పాల్గొన్నారు.
  • రాజాంలో వైఎస్సార్‌ విగ్ర‌హానికి  ఎమ్మెల్యే కంబాల జోగులు పూల‌ మాల వేసి నివాళులు అర్పించారు.
  • ప‌లాసలో వైఎస్సార్‌  విగ్ర‌హానికి ఎమ్మెల్యే సీదిరి అప్ప‌ల‌రాజు పూల మాల వేసి నివాళులు అర్పించారు.

గుంటూరు : 
జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. తెనాలిలో వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేదలకు అన్నదానం చేశారు. అదే విధంగా  రైతు దినోత్సవం సందర్భంగా ఆదర్శ రైతులకు సన్మానం చేశారు. 

  • నిజాంపట్నంలో  వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు పూల మాల వేసి నివాళులు అర్పించారు. 
  • మంగళగిరిలో  వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్కే పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.  
  • బాపట్లలో వైఎస్సార్  జయంతి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కేక్ కట్ చేశారు. అనంతరం వైస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద  జెండా అవిష్కరించారు.
  • నరసరావుపేటలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పూల మాల వేసి ఘన నివాళులు  అర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో రైతు భరోసా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement