సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 71వ జయంతి తెలంగాణలోనూ ఘనంగా జరిగింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి సర్కిల్‌లో కేక్ కట్‌చేశారు.
నల్గొండ
మిర్యాలగూడ నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి వేడుకలలో భాగంగా గూడూరు, కొండ్రపోల్, బొత్తలపాలెం, దామచర్లలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లను పంచిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇంజమ్ నర్సిరెడ్డి, మిర్యాలగూడ అధ్యక్షుడు పిల్లుట బ్రహ్మం, దామచర్ల అధ్యక్షుడు అన్నెం కరుణాకర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా భువనగిరిలోనిన కిసాన్ నగర్‌లో శక్తీ మిషన్ అధ్యక్షురాలు కర్తాల శ్రీనివాస్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తులు సత్యనారాయణలు వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సిరిసిల్ల
వైఎస్సార్ జయంతిని సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
జోగులాంబ గద్వాల
ధరూర్ మండల కేంద్రంలో వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
Published Wed, Jul 8 2020 3:25 PM | Last Updated on Wed, Jul 8 2020 3:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment