సాక్షి,తాడేపల్లి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ శ్రేణులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..'' మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. తొలి నుంచి వైఎస్‌ఆర్‌తో అడుగులు వేసిన వాళ్లమే. వైఎస్సార్ జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించుకోవటం ద్వారా వైఎస్ ఆశయాలను పునశ్చరించుకుని పునరంకితం అవుతాం. వైఎస్‌కు పచ్చదనం అంటే చాలా ఇష్టం. అందుకే ఈసారి మొక్కలు నాటడం కూడా చేస్తున్నాం
షర్మిల వైస్సార్ కూతురు ఆశీర్వచనం తీసుకున్నారు.పార్టీ పేడతానని షర్మిల గతంలోనే చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఉండాలనే అక్కడ పార్టీ విస్తరించలేదు. షర్మిల పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రెవేటికరణ వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసాం. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి.ప్రెవేటికరణ వ్యతిరేకంగా ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తాం.'' అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment