ఆత్మబంధువుకు ఆత్మీయ నివాళి  | AP Home Minister Mekathoti Sucharitha Gave Tribute To YS Rajashekar Reddy Memorial | Sakshi
Sakshi News home page

ఆత్మబంధువుకు ఆత్మీయ నివాళి 

Published Wed, Sep 4 2019 10:37 AM | Last Updated on Wed, Sep 4 2019 10:37 AM

AP Home Minister Mekathoti Sucharitha Gave Tribute To YS Rajashekar Reddy Memorial - Sakshi

గుంటూరులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా. చిత్రంలో హోం మంత్రి సుచరిత, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం తదితరులు

జన హితం కోసం అహర్నిశలు శ్రమించిన యోధుడు.. దూరమైనా దగ్గరైన మహా మనీషి.. దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డికి ఊరూవాడా ఘన నివాళులర్పించాయి. సేవా కార్యక్రమాలతో స్మరించుకున్నాయి. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు సామాన్య జనం జోహార్లు అర్పించారు. వాడవాడలా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలతో అలంకరించి సుమాంజలి ఘటించారు. అన్న, వస్త్ర దానాలు, రోగులకు పండ్ల పంపిణీ, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలతో స్మరించుకున్నారు. 

సాక్షి, పట్నంబజారు(గుంటూరు) : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరులోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మహానేత వైఎస్సార్‌ చిత్రపటానికి హోం మంత్రి మేకతోటి సుచరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా రక్తదానం చేశారు. పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్‌ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌ గాంధీ, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం పాల్గొన్నారు. మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రేపల్లె పట్టణంలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి మోపిదేవి ఆధ్యర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో 301 మంది రక్తదానం చేశారు. నియోజకవర్గంలోని పలు చోట్ల అన్నసంతర్పణ, సేవా కార్యక్రమాలు జరిగాయి. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని ఎమ్మెల్యే ముస్తఫా ఆవిష్కరించారు.

నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో నిర్వహించిన అన్నదాన, సేవా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పశ్చిమ నియోజవకర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం నియోజకవర్గంలోని నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. దాచేపల్లి మండలంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి యనమోలు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. బాపట్ల నియోజవకర్గంలోని అన్ని మండలాలు, బాపట్ల పట్టణంలో పార్టీ నేతల ఆధ్వర్యంలో మహానేత వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడదల రజనీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నియోజకవర్గంలోని వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి మాచర్ల ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

మంగళగిరిలో రక్తదాన శిబిరం
మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అన్నదాన, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగారెడ్డిపాలెంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. పొన్నూరు పట్టణం, నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కిలారి రోశయ్య పాల్గొన్నారు.  తాళ్లపాలెంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌ వర్ధంతిని ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిర్వహించారు. నియోజవకర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో  అంబటి, పార్టీ నేత నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కమ్మెల శ్రీధర్‌ దంపతులు వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాడికొండలో భారీ అన్నదానం జరిగింది. తెనాలి నియోజవకర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ నియోజవకర్గవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలిలో మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు. వేమూరు నియోజకవర్గ వ్యాప్తంగా మహానేత వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున  పాల్గొన్నారు. కొల్లూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొని మహానేతకు నివాళి అర్పించారు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యం జరిగిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో హోమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తొలుత ఇందిరాగాంధీ బొమ్మసెంటరులోని వైఎస్సార్‌ కాంస్య విగ్రహానికి, శాలివాన బజారులోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement