Mekathoti Sucharitha
-
'ఏ ల్యాండ్‌మైన్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది'
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ హోం మంత్రి సుచరిత 'సాక్షి టీవీ'తో మాట్లాడారు. 'గతంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. ఇప్పుడు కేవలం రెండు జిల్లాలకే పరిమితమైంది. వారి సంఖ్యాబలం 50కి పడిపోయింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. మనబడి నాడు-నేడు పథకం ద్వారా మౌళిక సదుపాయాలు పెంచాం. అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు సహాయం చేస్తున్నాం. మహిళలకు సాధికారత కోసం రూ. 75 వేలు సహాయం చేస్తున్నాం. ఈ పథకాలన్నీ ఆర్థికంగా స్థిరపడేందుకు తోడ్పడుతున్నాయి. పేదరిక నిర్మూలనకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి. సచివాలయ వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. అటవీ ప్రాంతాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌కి తరలించాలని కోరాం. మారుమూల ప్రాంతాలలో మూడు కిలోమీటర్లకు ఒక పోస్టాఫీస్ ఉండాలని కోరా. 4జీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరా. ఈ కార్యకలాపాల వల్ల నక్సల్స్ ప్రాబల్యం తగ్గుతుంది. గతంలో ఎప్పుడు ఏ ల్యాండ్ మెయిన్ పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది. ఏజెన్సీలో పర్యటించాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏజెన్సీలో రాజకీయ నేతలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఈ సమస్య పూర్తిగా తొలగిపోలేదు. అందుకే ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తతతో ఉంది. చదవండి: (సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్: 539 కొత్త 104 వాహనాలు) మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ పెంచాలని కోరాము. రోడ్లు వేసేందుకు ఉన్న ప్రతిబంధకాలను తొలగించి అనుమతివ్వాలని కోరా. అటవీ ప్రాంతాలలో టెలికాం, మౌళిక వసతులు సౌకర్యాలు పెంచాలని కోరాం. విభజన చట్టం మేరకు సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. బాక్సైట్ తవ్వకాలను ఆపేసిన నేపథ్యంలో, అవసరమైన ఖనిజాలను ఒరిస్సా నుంచి ఇవ్వాలి' అని కోరినట్లు మంత్రి సుచరిత తెలిపారు. -
మాజీ సైనికులకు అండగా సీఎం జగన్: హోం మంత్రి సుచరిత
సాక్షి, విశాఖపట్టణం: మాజీ సైనికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి సుచరిత తెలిపారు. రక్షణ శాఖ మాజీ ఉద్యోగులకు రాయితీ ద్వారా పరిశ్రమలు.. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్తాన్‌పై భారత్ విజయానికి సూచికగా చేపట్టిన స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని శుక్రవారం ఆర్కే బీచ్‌లోని విక్టరీ ఎట్ సీ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తూర్పు నౌకదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజెంద్ర బహుదుర్ హోంమంత్రికి అందజేశారు. నాటి విజయంలో భాగస్వాములైన నేవీ సిబ్బందిని మంత్రి సత్కరించారు. స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలో నేవీ అవసరాలు తీర్చడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని తెఉలిపారు. భారత్ రక్షణలో విశాఖ తీరం కీలకమని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సైనికులు నాటి యుద్ధ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? చదవండి: ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి -
దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది: సుచరిత
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు తీర ప్రాంతం ఒక వరమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థిక ప్రగతి, అభివృద్ధికి చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ కార్యాలయంలో ‘ఎర్టీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టం’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు వివిధ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేస్తోందన్నారు. ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. అలాగే ప్రకృతి విపత్తు కూడా ఉంటుంది కాబట్టి, ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను తీసుకు వచ్చామని హోంమంత్రి తెలిపారు. (దృష్టి మళ్లించడానికే ఆ దిక్కుమాలిన రాతలు..!) ఏదైనా విపత్తు సంభవించే ప్రమాదం ఉన్నప్పుడు ముందస్తుగా అప్రమత్తం చేస్తే ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడవచ్చన్నారు. విపత్తు ముందుగా తెలుసుకునే రాష్ట్రంగా ఏపీ...దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. తుఫానులు, వరదలు, భూకంపం, ఉప్పెనలు, సునామీలు, భారీ అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, నష్టాల తీవ్రతను తగ్గించేందుకు ఈ ముందస్తు హెచ్చరికలు చాలా ఉపయోగపడతాయని హొంమంత్రి సుచరిత పేర్కొన్నారు. (రణ్‌బీర్‌ను మరోసారి ప్రశంసించిన బిగ్‌బీ) -
ఆత్మబంధువుకు ఆత్మీయ నివాళి
జన హితం కోసం అహర్నిశలు శ్రమించిన యోధుడు.. దూరమైనా దగ్గరైన మహా మనీషి.. దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డికి ఊరూవాడా ఘన నివాళులర్పించాయి. సేవా కార్యక్రమాలతో స్మరించుకున్నాయి. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు సామాన్య జనం జోహార్లు అర్పించారు. వాడవాడలా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలతో అలంకరించి సుమాంజలి ఘటించారు. అన్న, వస్త్ర దానాలు, రోగులకు పండ్ల పంపిణీ, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలతో స్మరించుకున్నారు. సాక్షి, పట్నంబజారు(గుంటూరు) : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహానేత వైఎస్సార్ చిత్రపటానికి హోం మంత్రి మేకతోటి సుచరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా రక్తదానం చేశారు. పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం పాల్గొన్నారు. మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రేపల్లె పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి మోపిదేవి ఆధ్యర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో 301 మంది రక్తదానం చేశారు. నియోజకవర్గంలోని పలు చోట్ల అన్నసంతర్పణ, సేవా కార్యక్రమాలు జరిగాయి. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ముస్తఫా ఆవిష్కరించారు. నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో నిర్వహించిన అన్నదాన, సేవా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పశ్చిమ నియోజవకర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం నియోజకవర్గంలోని నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. దాచేపల్లి మండలంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి యనమోలు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. బాపట్ల నియోజవకర్గంలోని అన్ని మండలాలు, బాపట్ల పట్టణంలో పార్టీ నేతల ఆధ్వర్యంలో మహానేత వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడదల రజనీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నియోజకవర్గంలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళగిరిలో రక్తదాన శిబిరం మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అన్నదాన, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగారెడ్డిపాలెంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. పొన్నూరు పట్టణం, నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కిలారి రోశయ్య పాల్గొన్నారు. తాళ్లపాలెంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతిని ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిర్వహించారు. నియోజవకర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అంబటి, పార్టీ నేత నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కమ్మెల శ్రీధర్ దంపతులు వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాడికొండలో భారీ అన్నదానం జరిగింది. తెనాలి నియోజవకర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నియోజవకర్గవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలిలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు. వేమూరు నియోజకవర్గ వ్యాప్తంగా మహానేత వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. కొల్లూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొని మహానేతకు నివాళి అర్పించారు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో హోమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తొలుత ఇందిరాగాంధీ బొమ్మసెంటరులోని వైఎస్సార్ కాంస్య విగ్రహానికి, శాలివాన బజారులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. -
ఎమ్మెల్యేలుగా మేము...
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుధవారం శాసన సభలో ప్రమాణ స్వీకారం చేశారు..రాష్ట్ర శాసనసభకు జిల్లా నుంచి ఎన్నికైన 17 మంది శాసనసభ్యుల్లో బుధవారం 16 మంది శాసనసభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. నరసరావుపేట నుంచి ఎన్నికైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాల వలన హాజరుకాలేకపోయారు. శాసనసభలో ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యులు వరుసగా విడదల రజని, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, కాసు మహేష్‌రెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, కిలారి వెంకట రోశయ్య, మేరుగ నాగార్జున, మద్దాళి గిరిధర్, అనగాని సత్యప్రసాద్. -
తాడికొండతో...తరాల అనుబంధం
సాక్షి, తాడికొండ : గుంటూరు జిల్లాలో ప్రధాన పార్టీల తరుఫున ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులే అధికంగా పోటీ చేయడం విశేషం. మొత్తం 8 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గుంటూరు ఎంపీగా వైఎస్సార్ సీపీ తరఫున తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బాపట్ల ఎంపీగా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన నందిగం సురేష్ బరిలో నిలిచారు. ఇక అసెంబ్లీ అభ్యర్థులుగా ఫిరంగిపురం గ్రామానికి చెందిన మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్థానికత కోటాలో తాడికొండ నియోజకవర్గానికి ఉండవల్లి శ్రీదేవి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా, పెదపరిమి గ్రామానికి చెందిన నంబూరు శంకర్రావు పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాడికొండ గ్రామానికి చెందిన మహమ్మద్ ముస్తఫా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండో సారి ఎన్నికలకు వెళ్తున్నారు. సీపీఐ తరుఫున మంగళగిరి నుంచి తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రావెల కిషోర్‌బాబుది తాడికొండ మండలం రావెల గ్రామమే. -
టీ బిల్లు చర్చలపై కేంద్రానికి పంపిన నివేదిక ఇవ్వండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 బిల్లుపై జరిగిన చర్చల సారాంశంపై కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రతిని తనకు ఇప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు మేకతోటి సుచరిత విజ్ఞప్తి చేశారు. ఆమె మంగళవారం ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద రాష్ట్ర శాసనసభా కార్యాలయం పౌరసమాచార అధికారి(పీఐఓ)కి దరఖాస్తు చేశారు. చట్టంలోని నిబంధనల ప్రకారం, వీలైనంత త్వరగా 30 రోజులు దాటకుండా ఈ సమాచారం ఇప్పించాలని ఆమె తన దరఖాస్తులో కోరారు. బిల్లుపై జరిగిన చర్చలో తమ ప్రసంగాల ద్వారా ఎంత మంది సభ్యులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు? లిఖిత పూర్వకంగా ఎంత మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు? వారి పేర్లు, అభిప్రాయాల వివరాలను ఇప్పించాలని కోరారు. బిల్లుపై జరిగిన చర్చలో రాష్ట్ర విభజనకు మొత్తం ఎంత మంది సభ్యులు అనుకూలంగా ఉన్నారు? ఎంత మంది వ్యతిరేకంగా ఉన్నారు? ఎంత మంది తటస్థంగా ఉన్నారు? ఈ వివరాలన్నీ సభ్యుల పేర్లు, పార్టీలపరంగా ఇప్పించాలని కోరారు. జనవరి 30న సభ ఆమోదించిన తీర్మానాల ప్రతులను కూడా ఇప్పించాలని సుచరిత విజ్ఞప్తి చేశారు. -
ధనమ్మకు కన్నీటి వీడ్కోలు
ఫిరంగిపురం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీఎల్పీ ఉపనేత, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత మాతృమూర్తి నన్నం ధనమ్మ భౌతికకాయానికి పలువురు ప్రము ఖులు ఘననివాళులు అర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనమ్మ హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందిన విషయం విదితమే. ఫిరంగిపురంలో బుధవారం ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. బాలయేసు కెథెడ్రెల్ దేవాలయం ప్రాంగ ణం వెనుక భాగంలో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ధనమ్మ భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానూభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ రెహమాన్, గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ సమన్యయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, సీజీసీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, సీఈసీ సభ్యుడు కోన రఘుపతి, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు మేరిగ విజయలక్ష్మి, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహరనాయుడు, పార్టీ నేతలు షేక్ షౌకత్, నసీర్‌అహ్మద్, లాలుపురం రాము, నూనె మామహేశ్వరరెడ్డి, తురకపాలెం సర్పంచి నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య, వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు కొల్లిపర రాజేంద్రప్రసాద్, ఈపూరి అనూప్, మందపాటి శేషగిరిరావు, ఫిరంగిపురం, తుళ్ళూరు, పెద్దకాకాని మండలాల పార్టీ కన్వీనర్లు కొల్లి శివారెడ్డి, నిమ్మగడ్డ రవికుమార్, గోళ్ళ శ్యామ్‌ముఖర్జీ, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, మండల నాయకులు యనమాల ప్రకాష్, కొమ్మారెడ్డి చిన్నప్పరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, ఎస్కె ఖాశీం, దాసరి బాలస్వామి, సేవా నాగరాజు, ఎండ్రిడ్డి ఎల్లారెడ్డి, గేరా జేమ్స్, చిట్టా శివరామకృష్ణారెడ్డి, ఫిరంగిపురం, 113 తాళ్ళూరు సర్పంచ్‌లు డేగల ప్రభాకర్ పద్మావతి, పెరికెల వసుంధరావెళంగణిరాజు, యనమాల ఆశ్వీరాదం, పచ్చల పెద్దబ్బాయి, బొడపాటి అంజిరెడ్డి, బొడపాటి వెంకటేశ్వరరెడ్డి, బాలయేసు దేవాలయం, మార్నింగ్‌స్టార్ కళాశాల ఫాదర్ లు బెల్లంకొండ జయరాజ్, ఎం.సుందరబాబు, ఎంపీడీవో ఎన్.రోహిణి, తహశీల్దార్ సీహెచ్ విజయజ్యోతికుమారి, సబ్‌రిజిస్ట్రార్ జాన్మోహన్కుమార్, కాంగ్రెస్ నాయకులు స్వర్ణ సూర్యప్రకాశరావు, మాజీ జెడ్పీటీసీ చుక్కా రాజబాబు, సాలె సాల్మన్‌రాజు, గుడిపూడి వెళంగిణిరాజు, పోలిశెట్టి చిన్నయ్య, రాయపూడి సుందరావు తదితరులు ఉన్నారు. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాల నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.