ధనమ్మకు కన్నీటి వీడ్కోలు
Published Thu, Oct 31 2013 2:06 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
ఫిరంగిపురం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీఎల్పీ ఉపనేత, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత మాతృమూర్తి నన్నం ధనమ్మ భౌతికకాయానికి పలువురు ప్రము ఖులు ఘననివాళులు అర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనమ్మ హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందిన విషయం విదితమే. ఫిరంగిపురంలో బుధవారం ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. బాలయేసు కెథెడ్రెల్ దేవాలయం ప్రాంగ ణం వెనుక భాగంలో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ధనమ్మ భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానూభూతి తెలిపారు.
సంతాపం తెలిపిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ రెహమాన్, గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ సమన్యయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, సీజీసీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, సీఈసీ సభ్యుడు కోన రఘుపతి, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు మేరిగ విజయలక్ష్మి, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహరనాయుడు, పార్టీ నేతలు షేక్ షౌకత్, నసీర్‌అహ్మద్, లాలుపురం రాము, నూనె మామహేశ్వరరెడ్డి, తురకపాలెం సర్పంచి నాగేశ్వరావు,
మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య, వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు కొల్లిపర రాజేంద్రప్రసాద్, ఈపూరి అనూప్, మందపాటి శేషగిరిరావు, ఫిరంగిపురం, తుళ్ళూరు, పెద్దకాకాని మండలాల పార్టీ కన్వీనర్లు కొల్లి శివారెడ్డి, నిమ్మగడ్డ రవికుమార్, గోళ్ళ శ్యామ్‌ముఖర్జీ, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, మండల నాయకులు యనమాల ప్రకాష్, కొమ్మారెడ్డి చిన్నప్పరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, ఎస్‌కె ఖాశీం, దాసరి బాలస్వామి, సేవా నాగరాజు, ఎండ్రిడ్డి ఎల్లారెడ్డి, గేరా జేమ్స్, చిట్టా శివరామకృష్ణారెడ్డి, ఫిరంగిపురం,
113 తాళ్ళూరు సర్పంచ్‌లు డేగల ప్రభాకర్ పద్మావతి, పెరికెల వసుంధరావెళంగణిరాజు, యనమాల ఆశ్వీరాదం, పచ్చల పెద్దబ్బాయి, బొడపాటి అంజిరెడ్డి, బొడపాటి వెంకటేశ్వరరెడ్డి, బాలయేసు దేవాలయం, మార్నింగ్‌స్టార్ కళాశాల ఫాదర్ లు బెల్లంకొండ జయరాజ్, ఎం.సుందరబాబు, ఎంపీడీవో ఎన్.రోహిణి, తహశీల్దార్ సీహెచ్ విజయజ్యోతికుమారి, సబ్‌రిజిస్ట్రార్ జాన్‌మోహన్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు స్వర్ణ సూర్యప్రకాశరావు, మాజీ జెడ్‌పీటీసీ చుక్కా రాజబాబు, సాలె సాల్మన్‌రాజు, గుడిపూడి వెళంగిణిరాజు, పోలిశెట్టి చిన్నయ్య, రాయపూడి సుందరావు తదితరులు ఉన్నారు. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాల నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
Advertisement
Advertisement