Phirangipuram
-
మన వాలంటీర్ల వ్యవస్థ తులసి ముక్క: సీఎం జగన్
-
అన్నా.. మీ చిరునవ్వే.. మాకు ఆత్మస్థైర్యం.. వాలంటీర్ల భావోద్వేగం
సాక్షి, గుంటూరు: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే ఆ అనుభూతి మరిచిపోలేం.. అన్నా, మీరు పాదయాత్రలో మా కష్టసుఖాలు తెలుసుకుని నేను విన్నాను. నేను ఉన్నాను అన్న మాటకు కట్టుబడి సీఎం అయిన తర్వాత వలంటీర్ వ్యవస్ధను ఏర్పాటుచేసి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లారు. నాకు కేటాయించిన 64 కుటుంబాలలో ఏ కుటుంబం ఏ పథకానికి అర్హులో గుర్తించి వారికి ఆ పథకం అందించేటప్పుడు వారి మొహాల్లో ఆనందం, పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి నెలా పింఛన్ ఇచ్చేటప్పుడు అవ్వాతాతలు మా పెద్దకొడుకుకు మా దీవెనలు ఉంటాయని మా చేతులు తాకినప్పుడు ఉండే అనుభూతి మరిచిపోలేం. నా పరిధిలో వృద్దాప్య పింఛన్ తీసుకునే తాత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఒకటో తారీకు నేను రాత్రి 12 వరకు ఆయన దగ్గర కూర్చుని యాప్ ఓపెన్ అవగానే ఆయనకు పింఛన్ ఇచ్చాను. ఆ తర్వాత 2,3 గంటలకు దురదృష్టవశాత్తూ ఆయన చనిపోయారు. అప్పుడు తన భార్య వచ్చి నన్ను హత్తుకున్నప్పుడు ఇది కదా సేవ అని అనిపించింది, మన ప్రభుత్వంలో రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతి నెలా రైస్ తీసుకుంటూ అక్కా మీ వల్లే మాకు సాధ్యమైందనేటప్పుడు సంతోషంగా ఉంటుంది. తల్లి గర్భంలోని శిశువు నుండి వృద్దాప్యం వరకు ప్రతి ఒక్కరికీ... వారికి సంక్షేమ పథకాలు అందించే సీఎంను ఎవరు వదులుకుంటారు. ఇన్ని పథకాలు ఇస్తున్న సీఎంగారి వైపు, మన రాష్ట్రం వైపు చూడకుండా ఎవరైనా ఉంటారా. అందుకే మీరు ప్రజల గుండెల్లో ప్రత్యక్ష దైవమయ్యారు. మేం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని మా వలంటీర్ల తరపున హామీ ఇస్తున్నాను. ప్రజలు మీ కోసం సిద్దంగా ఉన్నారన్నా, మీ పాలన కోసం మళ్లీ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ధన్యవాదాలు. -దాసరి జ్యోత్స్నా దేవి, వలంటీర్, గొల్లపాలెం, ఫిరంగిపురం మండలం మీ పాలనలో మరోసారి మేం పనిచేయడానికి సిద్దం.. అన్నా, నా క్లస్టర్లో 62 కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకు మీ పథకాలు అందాయి. మీరు పాదయాత్రలో అందరికీ భరోసా ఇచ్చారు, మీరు మీ మాట నిలబెట్టుకున్నారు, మీరు 2,62,000 మంది వలంటీర్ సైన్యాన్ని సిద్దం చేశారు. మీ ఆశయాలను నిలబెట్టేలా మేం పనిచేశాం. గతంలో సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి. కానీ ఈ రోజు ప్రతి గడప తొక్కి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తున్నారు. అన్నా నా పరిధిలో 22 ఏళ్ల యువకుడు కూలి పనులకు వెళ్లి 4 వ అంతస్ధు నుంచి కిందపడి చావు అంచులవరకూ వెళ్లాడు. కానీ ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ ఉచిత వైద్యం సంజీవనిలా పనిచేసింది. అతని కుటుంబానికి ఆరోగ్య ఆసరా నెలకు రూ. 5,000 చొప్పున రెండునెలలకు రూ.10 వేలు ఇచ్చాం. నా పరిధిలో ఉన్న వారికి పింఛన్లు ఇచ్చేటప్పుడు సంతోషంగా పండుగలా తీసుకుంటున్నారు, మీ చిరునవ్వు మాకు ఆత్మస్ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వలంటీర్ వ్యవస్ధను మొదట్లో చాలా కించపరిచి మాట్లాడారు. కానీ మీరు మాకు అండగా నిలిచి ఇచ్చిన ధైర్యం మాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. మీరు నా వలంటీర్లు అంటూ అన్న ప్రతి సారి మాకు రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేశాం. మేం ఈ జన్మలో మరిచిపోలేం, మాలోని ప్రతిభను గుర్తించి మాకు ఇచ్చే ఈ అవార్డులను పెంచడం చాలా సంతోషంగా ఉంది. అన్నా మీ పాలనలో మరోసారి మేం పనిచేయడానికి సిద్దం. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, మా వలంటీర్ కుటుంబ సభ్యులందరి తరపునా మీకు ధన్యవాదాలు. షేక్ జుబేర్, వలంటీర్, బేతపూడి, ఫిరంగిపురం అందరికీ నమస్కారం, అన్నా మీరు సీఎం అయిన తర్వాత దాదాపు 2,55,000 కు పైగా వలంటీర్లను గుర్తించి వారి ద్వారా అందిస్తున్న సేవలు ప్రపంచానికే ఆదర్శం, చంద్రబాబు అనేక మాటలు చెప్పి మాట తప్పిన విషయం అందరికీ తెలుసు, మీరు ఈ వలంటీర్ వ్యవస్ధ తీసుకొచ్చినప్పుడు అనేకమంది అవాకులు చవాకులు మాట్లాడారు, ఇప్పుడు అదే నోటితో పొగుడుతున్నారు. అది కదా పాలన అంటే.. గతంలో వలంటీర్లను ఇంటికి రానివ్వడానికి జంకేవారు కానీ ఇప్పుడు మా అమ్మాయి, అబ్బాయి అని మాట్లాడుతున్నారు, సూర్యుడి కంటే ముందు తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో వలంటీర్లు సైనికుల్లా సేవలందించారు, వారి సేవలకు గర్వపడుతున్నాం, ఈ రోజు పెద్దలెవరికైనా బాగులేకపోతే బిడ్డలకు ఫోన్ చేసినా చేయకపోయినా వలంటీర్‌కు చేసి అడుగుతున్నారు. మిమ్మల్ని మళ్లీ సీఎం చేసుకుంటాం.. ఒక వలంటీర్‌ను స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత మీదే అన్నా, మన దేశం హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం చూసింది కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి మీరు, ఒకే నోటిఫికేషన్‌తో 1,35,000 సచివాలయ సిబ్బందిని కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ఉద్యోగాలు కల్పించారు, కేంద్రం లెక్కల ప్రకారం 16 లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించబడ్డాయి, పేద ప్రజల గుండె చప్పుడు మీరు, ఈ ప్రాంతంలో కార్మెల్ మాత కొండ పైకి ఘాట్ రోడ్డు అడుగుతున్నారు, మిమ్మల్ని మళ్లీ సీఎం చేసుకుని ఆ కోరిక తీర్చుకుంటాం. ధన్యవాదాలు. -మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు ఇదీ చదవండి: 11/11 : రాజ్యసభలో YSRCP 100% స్కోరు -
సీఎం జగన్ ఫిరంగిపురం పర్యటన
-
కర్రసాము: ‘చంటి చేతిలో కర్ర నాగుపాములా నాట్యం చేస్తుంది’
సాక్షి, గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఎవరైనా జీవనోపాధి కోసం వృత్తిని, ఆత్మసంతృప్తి కోసం ప్రవృత్తిని ఎంచుకోవడం సహజం. అయితే, ప్రవృత్తినే ప్రధాన వృత్తిగా చేసుకుని ఆ రంగంలో రాణించడం కొందరికే సాధ్యపడుతుంది. అటువంటి కోవలోకే వస్తాడు ఖరీదు సాంబయ్య అలియాస్ చంటి. మరుగున పడిపోతున్న మన సంప్రదాయ కళ కర్రసాము (సిలంబం)లో అనేక విన్యాసాలు చేయడంతోపాటు జాతీయ పోటీల్లో ప్రతిభకనబరిచాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టర్కీలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు సైతం ఎంపికయ్యాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన చంటికి నిత్యం ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నా సాధన, శిక్షణ మాత్రం నిరాఘాటంగా సాగిపోతూనే ఉంటాయి. సాధనతో పట్టు గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం చంటి స్వగ్రామం. అయితే, జీవనోపాధిని వెదుక్కుంటూ భార్యతోపాటు ఇద్దరు ఆడపిల్లలు చాలా కాలం కిందట గుంటూరుకు మకాం మార్చాడు. కర్రసాము సాధన చేస్తూనే చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఉన్నదాంట్లోనే జీవించేవాడు. అయితే, పెరుగుతున్న సంసారం, చాలని సంపాదన, మరో పక్క ప్రాణంగా ప్రేమించే కర్రసాము.. అన్నిటికి న్యాయం చేయడం కష్టంగానే ఉండేది. భార్య సలహా తీసుకుని పూర్తిగా కర్రసాము పైనే దృష్టి సారించి తక్కువ సమయంలోనే దానిపై పట్టు సాధించాడు. చంటి చేతిలో కర్ర నాగుపాములా నాట్యం చేస్తుందని ఆయన అభిమానులంటారు. పోటీల్లో పాల్గొంటూ పేద పిల్లలకు గ్రామ గ్రామాలు తిరిగి ఉచితంగా కర్రసామును నేర్పిస్తుంటాడు. కొన్ని పాఠశాలల్లో పార్ట్‌టైమ్ శిక్షణనిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చంటి మాత్రమే కాదు ఆయన శిష్యులు కూడా రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తున్నారు. (చదవండి: సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు!) చంటి సాధించిన విజయాలివి ► ఈ ఏడాది నవంబర్‌లో నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం ► నెల్లూరు జిల్లా సిలంబం స్టిక్ అసోసియేషన్ మేజర్ ధ్యాన్‌చంద్ సర్టిఫికెట్, యూనివర్సల్ ఎచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్, మెడల్ బహూకరణ ► కర్నూలులో జరిగిన ఏపీ కర్రసాము పోటీలో కాంస్య పతకం ► ఈ నెలలో కృష్ణాజిల్లాలో జరిగిన స్టేట్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం, ట్రైనింగ్ సర్టిఫికెట్ బహూకరణ ► గోవాలో జరిగిన జాతీయ పోటీల్లో చంటికి 21.7 పాయింట్లు సాధించి బంగారు పతకం గెలుపొందినా అక్కడ స్థానిక రాజకీయాలతో ఐదో స్థానం స్థానం ఇచ్చారు.తర్వాత తప్పు తెలుసుకున్న అసోసియేషన్ సభ్యులు ఫిబ్రవరిలో టర్కీలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేసి గౌరవించారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో కర్నూలులో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. (చదవండి: ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్) కర్రసాము ప్రాణం నాకు కర్రసామంటే ప్రాణం. దాన్నే జీవనోపాధిగా చేసుకున్నాను. మన దేశ ప్రాచీన క్రీడల్లో కర్రసాముకు ప్రత్యేక స్థానముంది. దీనిని యువతరం తప్పకుండా నేర్చుకోవాలి. ముఖ్యంగా యువతులకు ఆత్మరక్షణతోపాటు మనోధైర్యం వస్తుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా ముందుకెళుతున్నా. దాతలు సహకరిస్తే అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొంటా. కర్రసామును జీవనోపాదిగా చేసుకోవడాన్ని అదృష్టంగా బావిస్తాను. నా కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది – చంటి -
నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి
యడ్లపాడు(గుంటూరు): హైదరాబాద్ బిర్యానీ.. రాజస్తానీ పానీపూరీ.. ఆత్రేయపురం పూతరేకులు.. కాకినాడ కాజ.. మచిలీపట్నం బందర్‌లడ్డు.. మందస కోవా.. గుంటూరు కారం.. ఇవన్నీ తయారు చేసే విధానం ఒకటే. పట్టణం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సైతం నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో తయారైన ఐటం ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అందుకే ఆయా ప్రాంతాల పేరుతో అవి ప్రసిద్ధి చెందాయి. అలా ప్రసిద్ధి చెందిన స్నాక్‌ఐటంలలో ‘మసాలా పకోడి’ ఒకటి. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఫిరంగిపురం మసాలా పకోడి తయారీకి ప్రత్యేకమని చెప్పాలి. మసాలా ఐటమ్స్‌లో ‘మగధీర’ మనం మసాలా దోశ, మసాలా వడ, మసాలా ఇడ్లీ, ముంత మసాలా (పిడతకింద పప్పు) ఇలా మసాలాతో చేసే బ్రేక్‌ఫాస్టు, స్నాక్స్ అనేకం చూశాం.. తిన్నాం. ఆ కోవకు చెందినదే మసాల పకోడి. శనగపిండితో తయారు చేసే పకోడిలో మెత్త పకోడి, గట్టి పకోడి అని రెండు రకాలు ఎక్కువగా స్ట్రీట్‌ఫుడ్స్ బండ్లపై చూస్తుంటాం. తింటుంటాం. కాని మసాలా పకోడిలా ప్రత్యేకమైంది. కేవలం ఫిరంగిపురంలో మాత్రమే స్పెషల్‌గా లభించిన చోటా వీటిని తిన్నామంటే ఆ టేస్ట్‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. నాడు ఫిరంగులు..నేడు పకోడీలు తయారీ అద్దంకి రెడ్డిరాజులు కొండవీడును రెండోరాజధానిగా చేసుకుని పాలించే క్రమంలో రాజ్య సంరక్షణకు అవసరమైన ఫిరంగులను తయారీ, రవాణా కేంద్రంగా వర్థిల్లిన ప్రాంతమే ఫిరంగిపురం. భారతస్వాతంత్య్రానికి ముందు నుంచే ఈ చారిత్రక ప్రాంతంలోనే మసాలా పకోడి విక్రయాలు చేయడం విశేషం. ప్రస్తుతం ఫిరంగిపురం రాష్ట్రీయ రహదారిపక్కనే ఉన్న దుకాణాల బజారును పకోడిలా సెంటర్‌గా పిలుస్తారు. మద్రాసు నుంచి వచ్చిన మసాలా పకోడి మద్రాసు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మసాలా పకోడిని రాజమహేంద్రవరం నుంచి వలస వచ్చిన పెద్దకోట్ల లూర్థు ఇక్కడ వారికి తొలిసారిగా పరిచయం చేశారు. అప్పట్లో గారెలు, బజ్జీ, పకోడి వంటి బాండీ రకాలను కొద్దిమంది అమ్ముతున్నారు. స్థానికుల వద్దే అలవాటు పడ్డ కస్టమర్లు తనదుకాణానికి రావాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో అతని వద్ద పనిచేస్తున్న మద్రాసు వాసితో మసాలా పకోడిని తయారు చేయించడం ప్రారంభించాడు. కొత్త దుకాణం, కొత్త రుచి ఆనోటా ఈనోటా పాకి ఊళ్లోవారినే కాదు సమీప గ్రామాల ప్రజల్ని ఆకర్షించేలా చేసింది. దీంతో పది మంది పనివాళ్లతో చేసేస్థాయికి వ్యాపారం ఎదిగింది. ఐదుతరాలుగా అదే రుచి అందిస్తూ... 1940లో లూర్థు ద్వారా ప్రారంభమైన ఈ మసాలా పకోడి నేటికీ ఆయన వంశీయులు తయారు చేసి విక్రయించడం జరుగుతుంది. కేవంల శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, చెక్క, లవంగా, అల్లం వంటి ఆరు దినుసులతో మసాలా పకోడి తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఐదోతరం వారు ఇక్కడ మూడు దుకాణాలను పక్కపక్కనే ఏర్పాటు చేసుకున్నప్పటికీ అందరూ లూర్థు పకోడి పాత దుకాణం అంటూ పేరు పెట్టుకోవడం గమనార్హం. ఈ మూడు దుకాణాల్లో లూర్థు, బాలసురేంద్ర, అన్నదమ్ములు చెందిన పిల్లలే వీటిని తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. దేశవిదేశాలకు, రాజకీయ ప్రముఖులకు పరిచమైన పకోడి లూర్థు మసాలా పకోడి దేశ రాజధాని ఢిల్లీ, బొంబాయి తదితర మహానగరాలకు వెళ్లడమే కాదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మాజీ మంత్రులు సైతం గుంటూరు వాసులు అందించే ఊరగాయ పచ్చళ్లతో పాటు మసాలా పకోడి తీసుకెళ్లేవారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో పాటు రాష్ట్రంలోని ఎందరో రాజకీయ, పారిశ్రామిక పెద్దలు వీటి రుచి చూసిన వారే. అంతేకాదు లాక్‌డౌన్‌కు ముందు వరకు ప్రతినెలా రెండుసార్లు అమెరికా, జపాన్‌లో ఉన్న మన తెలుగు వారు వీటిని కొరియర్లో తెప్పించుకోవడం పరిపాటి. సో ఈ సారి మీరెప్పుడైనా ఫిరంగిపురం వెళ్తే మసలా పకోడిని ఓ పట్టు పట్టండి. -
ముగ్గురిని బలితీసుకున్న కారు
ఫిరంగిపురం (తాడికొండ): కారు ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు మృత్యువాత పడిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 113 తాళ్లూరు గ్రామానికి చెందిన దంపతులు షేక్ చిన్న మస్తాన్ (55), షేక్ నూర్జహాన్ (45), వారి కుమారుడు షేక్ హుస్సేన్ (25)లు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై అమరావతికి వెళ్తున్నారు. అమీనాబాద్ శివారు తులసీ సీడ్స్ సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీ కొనడంతో ముగ్గురూ కిందపడి, తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆటోలో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందారు. తండ్రి పొలం పనులు చేసుకుంటుండగా, తల్లి ఉపాధి హామీ పనులకు వెళుతోంది. కుమారుడు పేరేచర్ల సమీపంలోని జోసిల్ కంపెనీలో పనికి వెళ్తుంటాడు. ముగ్గురూ మృతిచెందడంతో ఇక ఆ ఇంట్లో ఎవరూ మిగలలేదు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన మిర్చీ లారీ
గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుదురుపాడు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చీ లోడుతో వెళ్తున్న లారీ ఫ్లైఓవర్‌పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన యువకుడు
గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడులో దారుణం చోటు చేసుకుంది. మహిళపై కిరోసిన్ పోసి యవకుడు నిప్పంటించాడు. దాంతో యువతి బిగ్గరగా గట్టిగా కేకలు వేయడంతో... చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని మంటలార్పి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమెను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వివరించారు. నిందితుడు గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు తన వాంగ్మూలంలో వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. -
జీపు, లారీ ఢీ: నలుగురు మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములోరిపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనం... ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రా రోమ్ ఫిరంగిపురం
రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన చర్చిలలో ఒకటైన ఫిరంగిపురం చర్చి ఆంధ్రా రోమ్‌గా భాసిల్లుతోంది. అద్భుతమైన ఆర్కిటెక్ట్, ఇంజినీరింగ్ ప్రమాణాలతో ఎటువంటి ఆధారం లేకుండా నిర్మించిన టూంబ్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రాంగణంలో ఉన్న బాల ఏసుదేవాలయం రాష్ట్రంలో అతి పెద్ద రెండవ ఎత్తై క్రైస్తవ దేవాలయం. ఈ గ్రామానికి చెందిన సుమారు 200 మంది ఫాదర్లుగా, మఠకన్యలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారంటే క్రైస్తవ్యానికి సంబంధించి ఈ గ్రామ ప్రాధాన్యమేమిటో అర్ధమవుతుంది. సుమారు రూ.45 లక్షలతో సుమారు 81 అడుగుల ఎత్తులో ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన ఫాదర్ తియోడర్ డిక్మన్ మెమోరియల్ బెల్ టవర్‌ను ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రారంభించనున్నారు. - న్యూస్‌లైన్, ఫిరంగిపురం ల్లా మొత్తం మీద క్రెస్త్తవులు ఎక్కువగా నివసించే గ్రామంగా ఫిరంగిపురం పేరొందింది. గ్రామంలో క్రైస్తవ సంఘం 18వ శతాబ్దంలోనే వెలసినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అప్పటినుంచి ఈనాటి వరకు విదేశీ, స్వదేశీ గురువులు ఎంతో మంది ఇక్కడ క్రైస్తవ సంఘాలను ప్రోత్సహిస్తూ ఫిరంగిపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అభివృద్థి పరిచారు. కొంతకాలం ఫ్రెంచ్ గురువులు మత బోధనలు చేసి విద్యా, వైద్య సౌకర్యాలను ప్రజలకు అందించారు. 1846 నాటికే ఫిరంగిపుర క్రైస్తవ విచారణ కింద 16 గ్రామాలు ఉన్నాయి. లండన్ మిల్ హిల్ సభకు చెందిన మత గురువులు తియోడర్ డిక్మన్ స్వామి 1875లో ఫిరంగిపురం మత గురువులుగా వచ్చి బాలయేసు దేవాలయం శిథిలావస్థలో ఉండడం చూసి చలించిపోయారు. బాలఏసు కెథెడ్రెల్ దేవాలయానికి పునాదులు వేసి అహోరాత్రులు శ్రమించి 1891 నాటికి దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దేవాలయ నిర్మాణ సమయంలో చర్చి పీఠ పైభాగంలో పెద్ద టూంబ్ ఉంటుంది. ఇది ఎటువంటి దూలం గానీ, మరే ఇతర ఆధారం గాని లేకుండా నిర్మించడం ఇక్కడి విశిష్టత. దేవాలయ శిల్పచాతుర్యం ఎంతో రమణీయంగా ఉంటుంది. రాష్ట్రంలో అతి పెద్ద రెండవ ఎత్తై ప్రముఖ దేవాలయంగా ఈ బాలఏసు దేవాలయం పేరొందింది. 1891లో ఫాదర్ డిక్మన్ దైవసేవకునిగానే ఉంటూ కొండపై కార్మెల్‌మాత దేవాలయాన్ని, పునీత అన్నమ్మ మఠాన్ని స్థాపించి 1915 జూలై 4న చనిపోయారు. అనంతరం విచారణ గురువులుగా వచ్చిన మత గురువులు మత వ్యాప్తితో పాటు గ్రామాభివృద్ధి, విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఫిరంగిపురంలో ఏటా జరిగే క్రిస్మస్ వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివస్తారు. ఈ వేడుకలు డిసెంబర్ 24, 25,26 తేదీల్లో జరుగుతుంటాయి. ఇక్కడ పనిచేసిన గురువులు తమ త్యాగబుద్ధితో, నిరాడంబర జీవితంతో ఈ ప్రాంత ప్రజలను ఆకట్టుకొని ఇక్కడి ప్రజలను క్రైస్తవ్యం వైపు మరల్చారు. గ్రామానికి చెందిన సుమారు 200 మంది ఫాదర్లుగా, మఠకన్యలుగా వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారంటే ఈ గ్రామ విశిష్టతను అర్ధం చేసుకోవచ్చు. ఆనాడు తుపాను వచ్చి వందల గృహాలు పూర్తిగా పాడైతే అప్పటి గురువు బోనాల స్వామి ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్నారు. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ ఆ గురువుకు బీదలతండ్రి అనే బిరుదు ఇచ్చాడు. మొట్టమొదట పోర్చుగ్రీసు వారు ఈ గ్రామానికి రావడంతో పరంగీలు ఉండే పురంగా వాడుకలో ఫిరంగిపురంగా మారింది. ఇక్కడి మిషనరీలు ఆధ్యాత్మిక విషయాల్లోనే కాక పలు పాఠశాలలు, కళాశాలలు నిర్మించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యాలతో పాటు గ్రంథాలయాలకు స్థలాలు, ఆట స్థలాలు, విద్యుత్ సౌథానికి స్థలం కేటాయించారు. అనేకమంది పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, మైక్రోఫైనాన్స్ మహిళాభివృద్ధికి తోడ్పడుతున్నారు. 2009 మే నెలలో విచారణ గురువులుగా వచ్చిన ఫాదర్ బెల్లంకొండ జయరాజు చర్చి నూతనీకరణ పనులను రూ.40 లక్షలతో ప్రారంభించి అత్యంత వేగంగా పని పూర్తి చేసి గ్రామంలోని ప్రజలందరి మన్ననలను పొందారు. విచారణ గురువులకు నివాసంగా ఉన్న పాత బంగ్లా భవనంలో యాత్రీకులకు సౌకర్యాలను కల్పించారు. గ్రామానికి చెందిన కొంతమంది కళాకారులు డిక్మన్ పరిషత్ పేరుతో కళాపరిషత్ని స్థాపించి నాటికలను ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో చర్చి ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో సుమారు రూ.45 లక్షలతో సుమారు 81 అడుగుల ఎత్తులో ఫాదర్ తియోడర్ డిక్మన్ మెమోరియల్ బెల్ టవర్ నిర్మాణం చేపట్టారు. ఈ నెల 8 తేదీన టవర్‌పై మరియతల్లి విగ్రహం, సుమారు 500 కేజీల బరువు కలిగిన పోలాండ్ గంటను ప్రతిష్టించారు.ఈ నెల 24 తేది అర్ధరాత్రి దివ్యపూజా బలి కార్యక్రమానికి వస్తున్న గుంటూరు పీఠాధిపతి డాక్టర్ గాలిబాలి గంటను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో అతి పెద్ద రెండో చర్చిగా ఫిరంగిపురం చర్చి జిల్లాలో ప్రత్యేకత సంతరించుకుంది. ప్రతి ఏడాది 24 వ తేదీ అర్ధరాత్రి గుంటూరు పీఠాధిపతి డాక్టర్ గాలిబాలి క్రీస్తు జయంతి వేడుకలను ప్రారంభించి దివ్యపూజాబలిని సమర్పించి శాంతికపోతాన్ని ఎగురవేసి వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం శాంతిసందేశం ద్వారా క్రీస్తుజననం గురించి వివరిస్తారు. నూతనంగా దివ్యసత్ప్రసాదాన్ని తీసుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 25వ తేదీ జరిగే ఏసుక్రీస్తు జయంతికి ఫిరంగిపురం ముస్తాబయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జోసిల్ కంపెనీ సౌజన్యంతో మంచినీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఫాదర్ బెల్లంకొండ జయరాజు తెలిపారు. నూతనంగా సుమారు 32 మరుగుదొడ్లు, క్షౌరశాలను ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఫాదర్ బంగ్లాలోని పాత భవనాన్ని భక్తుల విశ్రాంతి భవనంగా మార్చి వారికే తక్కువ రుసుం ఇచ్చేలా చూస్తామన్నారు. గ్రామంలో తేరు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. - ఫాదర్ జయరాజు -
ధనమ్మకు కన్నీటి వీడ్కోలు
ఫిరంగిపురం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీఎల్పీ ఉపనేత, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత మాతృమూర్తి నన్నం ధనమ్మ భౌతికకాయానికి పలువురు ప్రము ఖులు ఘననివాళులు అర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనమ్మ హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందిన విషయం విదితమే. ఫిరంగిపురంలో బుధవారం ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. బాలయేసు కెథెడ్రెల్ దేవాలయం ప్రాంగ ణం వెనుక భాగంలో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ధనమ్మ భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానూభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ రెహమాన్, గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ సమన్యయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, సీజీసీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, సీఈసీ సభ్యుడు కోన రఘుపతి, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు మేరిగ విజయలక్ష్మి, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహరనాయుడు, పార్టీ నేతలు షేక్ షౌకత్, నసీర్‌అహ్మద్, లాలుపురం రాము, నూనె మామహేశ్వరరెడ్డి, తురకపాలెం సర్పంచి నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య, వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు కొల్లిపర రాజేంద్రప్రసాద్, ఈపూరి అనూప్, మందపాటి శేషగిరిరావు, ఫిరంగిపురం, తుళ్ళూరు, పెద్దకాకాని మండలాల పార్టీ కన్వీనర్లు కొల్లి శివారెడ్డి, నిమ్మగడ్డ రవికుమార్, గోళ్ళ శ్యామ్‌ముఖర్జీ, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, మండల నాయకులు యనమాల ప్రకాష్, కొమ్మారెడ్డి చిన్నప్పరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, ఎస్కె ఖాశీం, దాసరి బాలస్వామి, సేవా నాగరాజు, ఎండ్రిడ్డి ఎల్లారెడ్డి, గేరా జేమ్స్, చిట్టా శివరామకృష్ణారెడ్డి, ఫిరంగిపురం, 113 తాళ్ళూరు సర్పంచ్‌లు డేగల ప్రభాకర్ పద్మావతి, పెరికెల వసుంధరావెళంగణిరాజు, యనమాల ఆశ్వీరాదం, పచ్చల పెద్దబ్బాయి, బొడపాటి అంజిరెడ్డి, బొడపాటి వెంకటేశ్వరరెడ్డి, బాలయేసు దేవాలయం, మార్నింగ్‌స్టార్ కళాశాల ఫాదర్ లు బెల్లంకొండ జయరాజ్, ఎం.సుందరబాబు, ఎంపీడీవో ఎన్.రోహిణి, తహశీల్దార్ సీహెచ్ విజయజ్యోతికుమారి, సబ్‌రిజిస్ట్రార్ జాన్మోహన్కుమార్, కాంగ్రెస్ నాయకులు స్వర్ణ సూర్యప్రకాశరావు, మాజీ జెడ్పీటీసీ చుక్కా రాజబాబు, సాలె సాల్మన్‌రాజు, గుడిపూడి వెళంగిణిరాజు, పోలిశెట్టి చిన్నయ్య, రాయపూడి సుందరావు తదితరులు ఉన్నారు. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాల నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.