సాక్షి, గుంటూరు: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే
ఆ అనుభూతి మరిచిపోలేం..
అన్నా, మీరు పాదయాత్రలో మా కష్టసుఖాలు తెలుసుకుని నేను విన్నాను. నేను ఉన్నాను అన్న మాటకు కట్టుబడి సీఎం అయిన తర్వాత వలంటీర్ వ్యవస్ధను ఏర్పాటుచేసి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లారు. నాకు కేటాయించిన 64 కుటుంబాలలో ఏ కుటుంబం ఏ పథకానికి అర్హులో గుర్తించి వారికి ఆ పథకం అందించేటప్పుడు వారి మొహాల్లో ఆనందం, పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి నెలా పింఛన్ ఇచ్చేటప్పుడు అవ్వాతాతలు మా పెద్దకొడుకుకు మా దీవెనలు ఉంటాయని మా చేతులు తాకినప్పుడు ఉండే అనుభూతి మరిచిపోలేం.
నా పరిధిలో వృద్దాప్య పింఛన్ తీసుకునే తాత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఒకటో తారీకు నేను రాత్రి 12 వరకు ఆయన దగ్గర కూర్చుని యాప్ ఓపెన్ అవగానే ఆయనకు పింఛన్ ఇచ్చాను. ఆ తర్వాత 2,3 గంటలకు దురదృష్టవశాత్తూ ఆయన చనిపోయారు. అప్పుడు తన భార్య వచ్చి నన్ను హత్తుకున్నప్పుడు ఇది కదా సేవ అని అనిపించింది, మన ప్రభుత్వంలో రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు.
ప్రతి నెలా రైస్ తీసుకుంటూ అక్కా మీ వల్లే మాకు సాధ్యమైందనేటప్పుడు సంతోషంగా ఉంటుంది. తల్లి గర్భంలోని శిశువు నుండి వృద్దాప్యం వరకు ప్రతి ఒక్కరికీ... వారికి సంక్షేమ పథకాలు అందించే సీఎంను ఎవరు వదులుకుంటారు. ఇన్ని పథకాలు ఇస్తున్న సీఎంగారి వైపు, మన రాష్ట్రం వైపు చూడకుండా ఎవరైనా ఉంటారా. అందుకే మీరు ప్రజల గుండెల్లో ప్రత్యక్ష దైవమయ్యారు. మేం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని మా వలంటీర్ల తరపున హామీ ఇస్తున్నాను. ప్రజలు మీ కోసం సిద్దంగా ఉన్నారన్నా, మీ పాలన కోసం మళ్లీ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ధన్యవాదాలు.
-దాసరి జ్యోత్స్నా దేవి, వలంటీర్, గొల్లపాలెం, ఫిరంగిపురం మండలం
మీ పాలనలో మరోసారి మేం పనిచేయడానికి సిద్దం..
అన్నా, నా క్లస్టర్‌లో 62 కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకు మీ పథకాలు అందాయి. మీరు పాదయాత్రలో అందరికీ భరోసా ఇచ్చారు, మీరు మీ మాట నిలబెట్టుకున్నారు, మీరు 2,62,000 మంది వలంటీర్ సైన్యాన్ని సిద్దం చేశారు. మీ ఆశయాలను నిలబెట్టేలా మేం పనిచేశాం. గతంలో సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి. కానీ ఈ రోజు ప్రతి గడప తొక్కి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తున్నారు. అన్నా నా పరిధిలో 22 ఏళ్ల యువకుడు కూలి పనులకు వెళ్లి 4 వ అంతస్ధు నుంచి కిందపడి చావు అంచులవరకూ వెళ్లాడు. కానీ ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ ఉచిత వైద్యం సంజీవనిలా పనిచేసింది. అతని కుటుంబానికి ఆరోగ్య ఆసరా నెలకు రూ. 5,000 చొప్పున రెండునెలలకు రూ.10 వేలు ఇచ్చాం. నా పరిధిలో ఉన్న వారికి పింఛన్లు ఇచ్చేటప్పుడు సంతోషంగా పండుగలా తీసుకుంటున్నారు,
మీ చిరునవ్వు మాకు ఆత్మస్ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వలంటీర్ వ్యవస్ధను మొదట్లో చాలా కించపరిచి మాట్లాడారు. కానీ మీరు మాకు అండగా నిలిచి ఇచ్చిన ధైర్యం మాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. మీరు నా వలంటీర్లు అంటూ అన్న ప్రతి సారి మాకు రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేశాం. మేం ఈ జన్మలో మరిచిపోలేం, మాలోని ప్రతిభను గుర్తించి మాకు ఇచ్చే ఈ అవార్డులను పెంచడం చాలా సంతోషంగా ఉంది. అన్నా మీ పాలనలో మరోసారి మేం పనిచేయడానికి సిద్దం. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, మా వలంటీర్ కుటుంబ సభ్యులందరి తరపునా మీకు ధన్యవాదాలు.
షేక్ జుబేర్, వలంటీర్, బేతపూడి, ఫిరంగిపురం
అందరికీ నమస్కారం, అన్నా మీరు సీఎం అయిన తర్వాత దాదాపు 2,55,000 కు పైగా వలంటీర్లను గుర్తించి వారి ద్వారా అందిస్తున్న సేవలు ప్రపంచానికే ఆదర్శం, చంద్రబాబు అనేక మాటలు చెప్పి మాట తప్పిన విషయం అందరికీ తెలుసు, మీరు ఈ వలంటీర్ వ్యవస్ధ తీసుకొచ్చినప్పుడు అనేకమంది అవాకులు చవాకులు మాట్లాడారు, ఇప్పుడు అదే నోటితో పొగుడుతున్నారు. అది కదా పాలన అంటే.. గతంలో వలంటీర్లను ఇంటికి రానివ్వడానికి జంకేవారు కానీ ఇప్పుడు మా అమ్మాయి, అబ్బాయి అని మాట్లాడుతున్నారు, సూర్యుడి కంటే ముందు తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో వలంటీర్లు సైనికుల్లా సేవలందించారు, వారి సేవలకు గర్వపడుతున్నాం, ఈ రోజు పెద్దలెవరికైనా బాగులేకపోతే బిడ్డలకు ఫోన్ చేసినా చేయకపోయినా వలంటీర్‌కు చేసి అడుగుతున్నారు.
మిమ్మల్ని మళ్లీ సీఎం చేసుకుంటాం..
ఒక వలంటీర్‌ను స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత మీదే అన్నా, మన దేశం హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం చూసింది కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి మీరు, ఒకే నోటిఫికేషన్‌తో 1,35,000 సచివాలయ సిబ్బందిని కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ఉద్యోగాలు కల్పించారు, కేంద్రం లెక్కల ప్రకారం 16 లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించబడ్డాయి, పేద ప్రజల గుండె చప్పుడు మీరు, ఈ ప్రాంతంలో కార్మెల్ మాత కొండ పైకి ఘాట్ రోడ్డు అడుగుతున్నారు, మిమ్మల్ని మళ్లీ సీఎం చేసుకుని ఆ కోరిక తీర్చుకుంటాం. ధన్యవాదాలు.
-మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు
ఇదీ చదవండి: 11/11 : రాజ్యసభలో YSRCP 100% స్కోరు
Comments
Please login to add a commentAdd a comment