
సాక్షి, విశాఖపట్టణం: మాజీ సైనికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి సుచరిత తెలిపారు. రక్షణ శాఖ మాజీ ఉద్యోగులకు రాయితీ ద్వారా పరిశ్రమలు.. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్తాన్‌పై భారత్ విజయానికి సూచికగా చేపట్టిన స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని శుక్రవారం ఆర్కే బీచ్‌లోని విక్టరీ ఎట్ సీ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తూర్పు నౌకదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజెంద్ర బహుదుర్ హోంమంత్రికి అందజేశారు. నాటి విజయంలో భాగస్వాములైన నేవీ సిబ్బందిని మంత్రి సత్కరించారు. స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలో నేవీ అవసరాలు తీర్చడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని తెఉలిపారు. భారత్ రక్షణలో విశాఖ తీరం కీలకమని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సైనికులు నాటి యుద్ధ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు.
చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?
చదవండి: ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి