Avanti Srinivas
-
వారెవ్వా..! కుదిరితే ఎర.. లేకుంటే వధ్యశిల!
చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఎలాంటి వంచనాత్మకమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టిందో.. ఆచరణాత్మకం కాని ఎలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో.. ప్రజలకు తెలుసు. ఎన్డీయే సర్కారు ఆ హామీలను నిలబెట్టుకుంటుందో లేదో వేచిచూస్తూ వైఎస్సార్సీపీ ఆరునెలల గడువు ఇచ్చింది. ప్రజలకు అదే ధోరణిలో మాయమాటలు చెప్పడం తప్ప.. ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల విషయంలో నోరు మెదపకుండా ప్రభుత్వం వంచిస్తూనే పాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ దాటిపోయిందనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ పోరుబాటలో కార్యచరణకు దిగుతుండడం.. కూటమి సర్కారులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీ ఉద్యమ ప్రణాళికకు జడుసుకుంటున్న ప్రభుత్వం రాజకీయం కుటిల వ్యూహాలను అమల్లో పెడుతోంది. ఆ పార్టీ నాయకులను లోబరచుకోవడం.. తమకు అనుకూలంగా మార్చుకుని.. తమ చేతి కీలుబొమ్మల్లాగా ఆడించడం.. వైఎస్సార్సీపీ మీదకే అస్త్రాల్లాగా ప్రయోగించడం అనేది అధికార పార్టీ అనుసరిస్తున్న తాజా వ్యూహంగా ఉంది. వైఎస్సార్సీపీ బలహీన పడుతున్నట్టుగా ప్రజల్లో ఒక తప్పుడు భావనను క్రియేట్ చేయడానికి వైఎస్సార్సీపీ నాయకులతో రాజీనామాలు చేయించడం ఒక తక్షణ ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి ఇన్నాళ్లుగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన, తనను మంత్రిని చేసిన వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి ఊహాగానాలు రాయొద్దని మీడియాకు విన్నవించుకున్నారు. ఒకవైపు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొంటూ.. మరోవైపు కనీసం ఏడాది రోజులైనా ప్రభుత్వానికి హామీలు నెరవేర్చడానికి టైం ఇవ్వకుండా.. అప్పుడే ఉద్యమాలు చేయడం కరెక్టు కాదని అవంతి సూత్రీకరించడం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. తాడేపల్లిలో కూర్చుని నిర్ణయాలు చేస్తోంటే అమలు చేయడానికి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటూ అవంతి అనడాన్ని లోతుగా గమనిస్తే.. ఆ మాటల వెనుక ‘ఉండవల్లి’ స్క్రిప్టు ఉన్నదనే సంగతి ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, తమ హామీలు తీర్చడానికి ప్రజలు అయిదేళ్ల గడువు ఇచ్చారని, అప్పుడే పోరాటాలు సరికాదని.. ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా అవంతి శ్రీనివాస్ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.వైఎస్సార్సీపీ నాయకుల మీద తెలుగుదేశం అండ్ కో పార్టీలు రెండు రకాల గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలకు గేలం వేసి, ఎర వేసి, ప్రలోభపెట్టి ఆకర్షించడం ఒక పద్ధతి. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి వస్తే మంచి భవిష్యత్తు చూపిస్తామని ఆశ పెడతారు. గేలం వేస్తే లొంగని వారిని బెదిరిస్తున్నారు. వధ్యశిల బెదిరింపు అన్నమాట. వారి కెరీర్ అంతం అయ్యేలాగా కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. ఈ రెండురకాల వక్ర మార్గాల్లో ఏదో ఒకదానికి వైఎస్సార్సీపీ నాయకులు లొంగిపోతున్నారు. అయితే రాజీనామా చేసిన నేతలకు మంచి భవిష్యత్తు అనేది బూటకం మాత్రమే. మంత్రి పదవి ఆశ పెట్టి బాలినేని శ్రీనివాస రెడ్డిని చేర్చుకున్నారు. ఆయనతో జగన్ మీద నానా నిందలు వేయించారు. తీరా ఇప్పుడు కరివేపాకు లాగా తీసి పక్కన పడేశారు. తెలుగుదేశం కూటమి పార్టీల ప్రలోభాలకు లొంగి వైఎస్సార్సీపీని వీడుతున్న వారి భవిష్యత్తు కూడా అంతేనని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.:::ఎం.రాజేశ్వరిఇదీ చదవండి: యనమల గతి ఇక ఇంతేనా? -
భీమిలి సీటు గెలిచి సీఎం జగన్ కి బహుమతిగా ఇస్తా...
-
‘విశాఖ గర్జన రోజే పవన్ మీటింగ్ అవసరమా?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ గర్జన కోసం జేఏసీ సిద్దమైంది. ఇందులో భాగంగానే బుధవారం మంత్రి గుడివాడ అమర్నాథ్.. మూడు రాజధానులకు మద్దతుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ సాధన కోసం జేఏసీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖ రావడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలి అని కోరారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖ గర్జన అంటే పవన్ కల్యాణ్ నిద్ర లేచారు. విశాఖ గర్జన రోజే విశాఖలో పవన్ మీటింగ్ అవసరమా?. ఉత్తరాంధ్రకు ఉపయోగపడే రాజధాని ఎందుకు వద్దు?. అమరావతిలో 29 గ్రామాలే.. ఇక్కడ 6వేల గ్రామాలు. ఉత్తరాంధ్ర రైతులు చాలా పేదవాళ్లు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల కోసం నిలుద్దాము అని స్పష్టం చేశారు. -
‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ, బీజేపీ నాయకులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు. విశాఖ రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. జేఏసీ కార్యాచరణకు అనుగుణంగానే విశాఖ గర్జన ర్యాలీ జరుగుతుంది. రైతు సంఘాలు, విద్యార్థులు, న్యాయవాదులు ఈ ర్యాలీలో పాల్గొంటారు. టీడీపీ అధినేత డైరెక్షన్లోనే పాదయాత్ర నడుస్తోంది. పెయిడ్ ఆర్టిస్టులు తమ యాత్రను విరమించుకోవాలి’ అని స్పష్టం చేశారు. మరోవైపు, మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీల నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. పార్టీలకు అతీతంగా అందరూ విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబుకు భయపడి వారి గొంతు నొక్కేసుకుంటున్నారు’ అని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే నినాదం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. వికేంద్రీకరణ జరగకపోతే భావితరాలు క్షమించవు అంటూ కామెంట్స్ చేశారు. -
పరిపాలనా వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి: మంత్రి గుడివాడ
-
‘వైజాగ్ సినిమా హబ్ కావాలంటే పెద్దలు ముందుకు రావాలి’
‘‘చిత్రపరిశ్రమను విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌కి మీరు (అల్లు అరవింద్) మాస్టర్. అల్లు రామలింగయ్యగారి పేరు మీద రాజమండ్రిలో హోమియోపతి మెడికల్ కాలేజీ పెట్టినట్లు వైజాగ్‌లో అల్లు రామలింగయ్యగారు, చిరంజీవిగారి పేర్లు కలిసి వచ్చేలా ఓ యాక్టింగ్ కాలేజీ పెట్టించాలని అరవింద్‌గారిని కోరుతున్నాను. విశాఖపట్నం సినిమా హబ్ కావాలంటే అరవింద్‌గారి వంటి పెద్దలు ముందుకు రావాలి. చిరంజీవిగారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయి. వైజాగ్ సినిమా హబ్ అయితే లోకల్ టాలెంట్ చాలామంది వస్తారు. వైజాగ్‌లో ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రభుత్వం, ప్రజల సహకారం ఉంటుంది’’ అని ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వైజాగ్‌లో జరిగిన ‘గని’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ ధరలను పెంచింది. ‘ఆర్ఆర్ఆర్’కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇండియాలో కలెక్షన్స్ వైజ్‌గా టాప్‌లో ఉంది. ఇండియాలో రెండు బ్లాక్‌బస్టర్స్ మనవే. అల్లు బాబీ తన తండ్రి అల్లు అరవింద్ స్థాయి ప్రొడ్యూసర్ కావాలి. పదేళ్ల క్రితం వరుణ్ తేజ్ స్టార్ హీరో అవుతాడని చెప్పాను. ఇప్పుడు వరుణ్ తేజ్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని చెబుతున్నాను. ‘పుష్ప’ సినిమాతో బన్నీ ఇండియాను షేక్ చేశాడు’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘‘కేజీఎఫ్’ చూసినప్పుడు వరుణ్‌తో ఇలాంటి సినిమా తీయాలి కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఏదో ఒక రోజు వరుణ్‌తో అలాంటి సినిమా చేస్తాను. కిరణ్ మంచి దర్శకుడు అవుతాడు. అల్లు బాబీకి సినిమా పట్ల మంచి నాలెడ్జ్ ఉంది. వైజాగ్ పై ప్రేమతో మంత్రిగారు నాకు ఇచ్చిన సలహాను తప్పకుండా తీసుకుంటా. మా నాన్నగారు పాలకొల్లులో పుట్టి సినిమాల్లోకి వెళ్లాలని మద్రాసు వెళ్లారు. అలా సినిమా పరిశ్రమలో యాభై ఏళ్లు పైన ఉన్నారు. నేను నిర్మాతగా టాలీవుడ్‌తో సరిపోదని, హిందీలో కూడా సినిమాలు తీశాను. కానీ బన్నీ ఇండియా స్టార్ అవ్వడమే కాకుండా ఇతర దేశాల్లోని క్రికెటర్స్ కూడా తగ్గేదేలే స్టెప్‌ను అనుకరించేలా చేశాడు. అల్లు పతాకాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్లాడు’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘మా అన్నయ్య అల్లు బాబీ పూర్తి స్థాయి నిర్మాత అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అన్నయ్య కథ ఓకే చేస్తే మినిమమ్ గ్యారంటీ. మా కజిన్ సిస్టర్ వివాహం సిద్ధుతో జరిగింది. సిద్ధు ఇప్పుడు ‘గని’తో నిర్మాత అయ్యాడు. వరుణ్ ఎన్నుకునే కథలు, అతని జర్నీ నన్ను గర్వపడేలా చేస్తాయి’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘నేను కిరణ్‌ను నమ్మాను. ‘గని’ సినిమా చూశాక తప్పు చేయలేదనిపించింది. కల్యాణ్ బాబాయ్‌గారి ‘తమ్ముడు’ సినిమా చాలా ఇష్టం. తమ్ముడు అంత కాకపోయినా ఆ సినిమా అంత బాగుండాలని ప్రయత్నం చేశాం. చిరంజీవిగారి గురించి మాట్లాడకపోతే నాకు ఇన్ కంప్లీట్‌గా ఉంటుంది. మా పెదనాన్నగానే కాదు.. ఓ యాక్టర్‌గా కూడా ఆయన నాకు స్ఫూర్తి. నాతో పాటు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్న నాన్నగారికి (చిరంజీవిని ఉద్దేశిస్తూ..) థ్యాంక్స్’’ అన్నారు. కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘గని’ త్రీ ఇయర్స్ కల.. కష్టం. ఒక వ్యక్తి నమ్మకం. అతనే వరుణ్. పవన్ కల్యాణ్‌గారికి ‘తమ్ముడు’ ఎలాంటి మైల్స్టోన్ అయ్యిందో.. వరుణ్ తేజ్ కెరీర్లో ‘గని’ అలా మైల్స్టోన్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమా చేసే ప్రయత్నం చేశాం’’ అన్నారు అల్లు బాబీ. ‘‘వరుణ్ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా ఎలా వస్తుందని అల్లు అర్జున్‌గారు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. అల్లు అరవింద్‌గారు మంచి గైడ్‌లైన్స్ ఇస్తారు’’ అన్నారు సిద్ధు ముద్ద. ఏపీ ఎన్ ఫోర్స్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్, ‘గని’ చిత్రబృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ పై మంత్రి అవంతి సీరియస్
-
6 వేలకు పైగా ఎకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
పురంధేశ్వరి, పవన్ కల్యాణ్‌పై మంత్రి అవంతి సీరియస్..
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలో భూ సేకరణపై పిల్ కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ సేకరణకు చర్యలు చేపట్టిందన్నారు. దీంతో విశాఖ జిల్లాలో లక్షా 84 వేల మందికి లబ్ధి చేకూరనుందని అన్నారు. అనకాపల్లి, భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌తో పాటు గాజువాక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు. భూ సేకరణతో 6,116 ఎకరాల్లో ఒక్కొక్కరికి 70 గజాలు ఇళ్ల స్థలం దక్కుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలని టీడీపీ కుట్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం అభివృద్ధిలో దూసుకువెళ్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్యానికి వైఎస్ఆర్సీపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వరిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏపీ అప్పుల గురించి పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. కేంద్రం అప్పులు చేయడం లేదా.. విభజన హామీల అమలుపై బీజేపీ నాయకులు, ఆమె చేసున్న కృషి ఏమిటి..? స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటికే సీఎం రెండు సార్లు కేంద్రానికి లేఖ రాశారు. పురంధేశ్వరికి చిత్త శుద్ది ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి. పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిజంగా పవన్ కల్యాణ్‌కు ఏపీపై శ్రద్ధ ఉంటే కేంద్రంపై స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయవచ్చు కదా’ అని అవంతి సూటిగా ప్రశ్నించారు. -
కావాలనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నారు: అవంతి శ్రీనివాస్
-
వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధిపై హత్యాయత్నం
సాక్షి,విశాఖపట్నం: నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబుపై హత్యా యత్నం జరిగిందన్న వార్త తెలుసుకొని స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు ఆయనతో తిరిగిన అనుచరులు, ఆయనను చూసిన స్థానికులు శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో నిశ్చేష్టులయ్యారు. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో గతంలో ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. గవరపేటలో ఉన్న తన ఇంటి నుంచి సాయంత్రం 5.30 గంటల సమయంలో బైక్ పై ఒంటరిగా ఆయన బయలుదేరారు. శారదానది అవతల పొలాల్లో నిర్మించుకుంటున్న అతిథి గృహానికి వెళుతుండగా.. సమీపంలో నది వంతెన అవతలకు చేరే సరికి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చే శాడు. మెడపై కత్తితో నరకడానికి ప్రయత్నించగా బుల్లిబాబు తన చేతులతో అడ్డుకున్నారు. దీంతో చేతి వేళ్లు రెండు తెగిపడ్డాయి. మరో రెండు వేళ్లకు తీ వ్రగాయమైంది. తలపైన కూడా బలమైన గాయం తగిలింది. చేతిని అడ్డుపెట్టకపోతే మెడపై తగిలి ప్రాణానికి ప్రమాదం జరిగి ఉండేదని సమాచారం. సంఘటన అనంతరం అగంతకుడు పరారయ్యాడు. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా కొత్త వ్యక్తులు తచ్చాడుతున్నట్టు స్థానికులు చెప్పారు. రెక్కీ నిర్వహించి, పకడ్బందీగా పథకం ప్రకారం హత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్ఐ సురేష్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కశింకోటలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న బుల్లిబాబు ఇంటికి అభిమానులు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితుడి గుర్తింపు కంచిపాటి నాగ ఉదయ్ సాయి హత్యాయత్నానికి పాల్పడినట్టు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశామని అనకాపల్లి సీఐ జి. శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఈ సంఘటనలో ఒకరే హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. సాయి భార్య గ్రామ వలంటీర్‌గా గతంలో పనిచేసేవారు. ఆమెను ఇటీవల తొలగించారు. ఇందుకు బుల్లిబాబు కారణమని అపోహతో హత్యాయత్నానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. పరామర్శించిన ఎమ్మెల్యే అమర్, రత్నాకర్ అనకాపల్లి టౌన్: బుల్లిబాబు చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రికి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్ హుటాహటిన వెళ్లారు. ఆయన పరి స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ ఆస్పత్రికి తరలించారు. పార్టీ నేతలు మందపాటి జానకీరామరాజు, గొర్లి సూరిబాబు బుల్లిబాబును పరామర్శించారు. చదవండి: చిట్టీ డబ్బులు అడిగినందుకు .. ఒంటిపై పెట్రోల్ పోసి.. మంత్రి ముత్తంశెట్టి పరామర్శ ఆరిలోవ: విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత మల్ల బుల్లిబాబు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. బుల్లిబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడ వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
మాజీ సైనికులకు అండగా సీఎం జగన్: హోం మంత్రి సుచరిత
సాక్షి, విశాఖపట్టణం: మాజీ సైనికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి సుచరిత తెలిపారు. రక్షణ శాఖ మాజీ ఉద్యోగులకు రాయితీ ద్వారా పరిశ్రమలు.. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్తాన్‌పై భారత్ విజయానికి సూచికగా చేపట్టిన స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని శుక్రవారం ఆర్కే బీచ్‌లోని విక్టరీ ఎట్ సీ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తూర్పు నౌకదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజెంద్ర బహుదుర్ హోంమంత్రికి అందజేశారు. నాటి విజయంలో భాగస్వాములైన నేవీ సిబ్బందిని మంత్రి సత్కరించారు. స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలో నేవీ అవసరాలు తీర్చడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని తెఉలిపారు. భారత్ రక్షణలో విశాఖ తీరం కీలకమని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సైనికులు నాటి యుద్ధ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? చదవండి: ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి -
పేద ప్రజల పాలిట దేవుడు వైఎస్ఆర్
-
సింహాచలం: కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బృందం పర్యటన
సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. కేంద్ర ప్రతినిధులతో ప్రసాదం పథకంపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చర్చించారు. ఆలయంలో యజ్ఞశాల నిర్మాణం తలపెట్టామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం వెయిటింగ్ హాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించామన్నారు. గిరి ప్రదక్షిణ కోసం ఒక మట్టి రోడ్‌తో ట్రాక్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. పర్యాటక శాఖ సహాయ కార్యదర్శి ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ, ఈ పథకం పర్యాటక శాఖ పర్యవేక్షిస్తోందన్నారు. పరిశీలన పూర్తయ్యాక డీపీఆర్ పనులు పూర్తి చేస్తామని ఎస్.ఎస్.వర్మ తెలిపారు. -
సింహాచలం: ‘అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం’
విశాఖ: టీడీపీ హయాంలోనే సింహాచలం భూములు అన్యాక్రాంతమయ్యాయి.. దీనిలో అధికారుల పాత్ర ఉండటంతో చర్యలు తీసుకున్నాం అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం అన్నారు. రుషికొండ రిసార్ట్స్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు. కొత్తవి కట్టేందుకు పాత రిసార్ట్స్ తొలగిస్తే.. టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఇప్పుడున్నవాటి స్థానంలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మిస్తాం అన్నారు. కొత్త రిసార్ట్స్ కోసం మొదటి దశలో రూ.92 కోట్లు.. రెండో దశలో రూ.72 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
ఆయన జీవితమే సంగీతం: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ ప్రజల భాష సంగీతం. మనసును కదిలించేది, మనిషిలో చైతన్యాన్ని రగిలించేది సంగీతం. కర్ణాటక సంగీత చరిత్రలో మంగళంపల్లి బాలమురళీకృష్ణతో పోల్చదగిన ప్రతిభావంతుడు మరొకరులేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో మంగళవారం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక సంగీతంలోనే కాదు.. భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే అంతటి విలక్షణ కళాకారుడు లేరని పేర్కొన్నారు. కీర్తిధన సంపాదనలో ఆరోహణే తప్ప అవరోహణ ఎరుగని గొప్ప కళాకారుడన్నారు. ఆ గొప్ప కళామేధావి తెలుగువారు కావడం గర్వకారణమని ఆయన చెప్పారు. రాబోయే తరాలకు బాలమురళీకృష్ణ గొప్పతనాన్ని తెలియజేయాలన్నారు. కలెక్టర్ వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని, ఆ మరిమళమే బాలమురళీకృష్ణ అని పేర్కొన్నారు. అంతటిగొప్ప కళాకారుడు జయంత్యుత్సవాల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. కళాకారులు వంకాయల వెంకటరమణమూర్తి, డాక్టర్ పంతుల రమ, ఎం.శ్రీనివాస నరసింహామూర్తి, కె.సరస్వతి, గురువిల్లి అప్పన్న, డాక్టర్ మండపాక శారద, ధనవాడ ధర్మారావు, డాక్టర్ బీకేడీ ప్రసాద్, ధనుంజయ పట్నాయక్‌లను మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్ వినయ్‌చంద్ సత్కరించారు. అంతకుముందు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు పి.అరుణ్‌బాబు, కల్పనా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
పాపికొండల విహారయాత్ర ప్రారంభం..
సాక్షి, తూర్పుగోదావరి : గత 21 నెలలు గా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమైంది. గోదావరి నదికి హారతి ఇచ్చి పాపికొండల విహారయాత్ర ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయిల్ రన్లో మంత్రి అవంతి పాల్గొన్నారు. కచ్చులూరు దుర్ఘటన, కొవిడ్ పరిస్థితుల కారణంగా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిపి వేసినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి పాపికొండల బోటింగ్‌కు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా గండిపోచమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. చదవండి: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం -
విశాఖలో వందలాది ఎకరాలు కబ్జా చేశారు: మంత్రి అవంతి
-
కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ఆళ్ల నాని
సాక్షి, విశాఖపట్నం: షీలానగర్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో 300 ఆక్సిజన్ బెడ్లు కలిగిన కోవిడ్ కేర్ సెంటర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాటు చేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కోవిడ్ కేర్ సెంటర్: మంత్రి ఆళ్ల నాని 30 మంది వైద్యులు, 90 మంది నర్సులతో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం అని అభినందించారు. ప్రస్తుత పరిస్థితిలో ఆక్సిజన్ అవసరం చాలా ఉందని.. ఆక్సిజన్ సరఫరాకి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఆస్పత్రుల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ప్రతి బెడ్‌కు ఒక్కో సిలిండర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్ కేర్ సెంటర్.. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు: ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ప్రభుత్వం వైద్యం అందిస్తోందని.. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఆక్సిజన్ వైఫల్యం వల్ల కోవిడ్ బాధితులు ఇబ్బంది పడకూడదన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లో పెషెంట్ల అటెండెన్స్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని రక్షణ చర్యలు ఏర్పాటు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’ YS Jagan: సీఎం జగన్ లేఖతోనే కదలిక -
సీఎం వైస్. జగన్ అందిస్తున్న పాలనపై ప్రజలు విశ్వాసం ఉంచారు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు ఉద్యమానికి మద్దతు
-
మోదీ పేరు ఎత్తితే బాబుకు వణుకు పుడుతోంది
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందని తెలిపారు. తమకు తెలిసి జరుగుతోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే అన్ని పక్షాలను తీసుకెళ్లి సమస్య వివరిస్తామని తెలిపారు. తాము కేంద్రంతో రాజీ పడితే పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నిస్తామని అన్నారు. పార్లమెంట్లో బలం ఉంటే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్రాన్ని విమర్శించకుండా తమపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యేవరకు ఉద్యమానికి మద్దతుగా ఉంటామని వెల్లడించారు. సబ్బంహరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. సబ్బంహరికి సిగ్గుంటే టీడీపీకి రాజీనామా చేయాలని, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని కాకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పార్టీలో సబ్బంహరి ఎలా ఉంటారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. పార్లమెంట్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై ప్రశ్నించానని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. కేంద్ర వైఖరిని తెలుసుకునేందుకు ప్రశ్నించినట్టు తెలిపారు. టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారని, వాళ్లెవరైనా ప్రశ్నించారా అని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడిందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణపై ప్రశ్నించాలన్నారు. స్టీల్ ప్లాంట్‌కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడుతామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడుతున్నాడని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. త్యాగాల పునాదులపై విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మించారని, ప్రధాని మోదీ పేరు ఎత్తితే చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. చదవండి: ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి: సీఎం జగన్ చదవండి: భగ్గుమన్న స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం -
సీఎం జగన్‌కు విశాఖ అంటే ఎంతో ఇష్టం..
సాక్షి, విశాఖ: సీఎం జగన్మోహన్రెడ్డికి విశాఖ నగరంపై ప్రత్యేక మమకారం ఉందని, ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు కలిగి ఉన్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయడానికి ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా వెనక్కు తగ్గేది లేదని, విశాఖ రాజధాని కావడం తధ్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబు, అతని తనయుడు లోకేశ్ బాబుకు విశాఖలో పర్యటించే అర్హత లేదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంద్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలవడంతో బంద్ విజయవంతమయ్యిందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలతో టీడీపీ ఖేల్ ఖతం అవుతుందన్న ఆయన.. ఆ పార్టీని ఆల్ బెవర్స్ అండ్ డెకాయిట్స్ పార్టీ(ఏబీసీ పార్టీ) అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన హయాంలో తప్పుడు డాక్యుమెంట్లతో అనుయాయులకు విలువైన భూములు కట్టబెట్టడాన్ని ఆయన ప్రస్థావించారు. త్వరలో విశాఖలో లక్షా 90 వేల మందికి సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో బంద్ విజయవంతం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌కు ప్రభుత్వ సహకారం తోడవడంతో బంద్ విజయవంతమైందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. విశాఖ ఉక్కుకు మద్దతుగా ప్రధానికి లేఖ రాసేందుకు కూడా చంద్రబాబుకు ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. వైయస్సార్సీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవుతుందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పొస్కో ఏపీకి రావడం నిజమే కానీ.. ప్రభుత్వం కృష్ణ పట్నం, భావనపాడులో పరిశ్రమ ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు గల్లి గల్లి తిరుగుతున్నారని, మా నాయకుడు జగన్మోహన్రెడ్డికి ఆ అవసరం లేదని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలే స్వచ్ఛందంగా తమకు ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలేవైనా రిజల్ట్ ఎప్పుడూ వైఎస్సార్సీపీ అనుకూలంగానే వస్తుందన్నారు. -
‘ఉక్కు’ ఉద్యమం ఉధృతం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఎదుట కార్మికులు శుక్రవారం రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే నాగిరెడ్డి సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికుడు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌పై జేఏసీ.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 18న స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించిన జేఏసీ.. ఈ నెల18నే స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించింది. గాజువాకలో ఈనెల 18న కార్మికుల బహిరంగ సభ నిర్వహించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సన్నాహాలు చేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. అమరుల త్యాగాలు తెలియకుండా మాట్లాడటం బాధాకరమన్నారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. (చదవండి: ప్రైవేటీకరణకు బీజం పడింది చంద్రబాబు హయాంలోనే..) ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం! -
నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ నిర్ణయంపై మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని మండిపడ్డారు. ఇందులో కుట్రకోణం దాగుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: కన్నబాబు ‘‘కరోనా సెకండ్ వేవ్ ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. నిమ్మగడ్డ ఎవరి డైరెక్షన్లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఈ ఎన్నికల షెడ్యూల్ వెనక కుట్ర కోణం ఉంది’’ అని మంత్రి కన్నబాబు అన్నారు. ఇక నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు. ‘‘ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడమేంటి. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం’’ అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా’’ అని మండిపడ్డారు.(చదవండి: సుప్రీం కోర్టు, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎస్ఈసీ నిమ్మగడ్డ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. ఇక నిమ్మగడ్డ ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నట్లు ఉందని కరణం ధర్మశ్రీ విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని విజ్ఞప్తి చేశారు. అనంత వెంకటరామిరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభ్యర్థనను ఎస్ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను కాదని నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.