సాక్షి, విశాఖపట్నం: ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాధించారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నెల 21న సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం పోర్ట్ స్టేడియంలో ‘వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్’ షెడ్యూల్, థిమ్ సాంగ్, జెర్సీని విడుదల చేశారు. ఆయనతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. (చదవండి: టీడీపీ జాతీయ పార్టీనా?: ఎమ్మెల్యే వంశీ)
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం పెరుగుతుందన్నారు. యువతను అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మంచి క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 20 రోజులు పాటు జరగనున్న ఈ పోటీల్లో 422 టీంలు పాల్గొంటాయని వెల్లడించారు. ప్రతి ఏడాది ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ పోటీలు ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. (చదవండి: ‘అమరావతి ఉద్యమం ఒక ఫేక్’)
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి విశాఖపట్నంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సన్నాహక సభ ఈరోజు అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో జరిగింది. ఈ సభకు సంబంధించిన దృశ్యాలు. pic.twitter.com/PNqBbkLjjG
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 19, 2020
Comments
Please login to add a commentAdd a comment