Cricket cup
-
మెల్బోర్న్లో కేసీఆర్ క్రికెట్ కప్..
-
‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా పోర్ట్ స్టేడియంలో ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కాగడ వెలిగించి టోర్నమెంట్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేపటి నుంచి వచ్చే నెల 9 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నమెంట్లో 422 టీమ్‌లు పాల్గొంటున్నాయి. (చదవండి: సీఎం జగన్ బర్త్‌డే: 20వేల మందితో భారీ ర్యాలీ) ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తిలో వజ్ర సంకల్పం ఉండాలని..దీనికి నిదర్శనం సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఆయన ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. యువశక్తి అంతా ఈ రోజు ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ లో భాగస్వామ్యం అవుతున్నారని పేర్కొన్నారు. అత్యత్తమ ప్రతిభ కనబరిచి గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి సచిన్, ధోనీ లాంటి వారు ఎదిగారని తెలిపారు. ప్రతి ఏడాది ఇదే స్థాయిలో అన్ని క్రీడలు బాట్మింటన్, కబడ్డీ, టెన్నిస్ అన్ని రంగాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. -
‘సీఎం జగన్ లక్ష్యాన్ని సాధించారు’
సాక్షి, విశాఖపట్నం: ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నెల 21న సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం పోర్ట్ స్టేడియంలో ‘వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్’ షెడ్యూల్, థిమ్ సాంగ్, జెర్సీని విడుదల చేశారు. ఆయనతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. (చదవండి: టీడీపీ జాతీయ పార్టీనా?: ఎమ్మెల్యే వంశీ) ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం పెరుగుతుందన్నారు. యువతను అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మంచి క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 20 రోజులు పాటు జరగనున్న ఈ పోటీల్లో 422 టీంలు పాల్గొంటాయని వెల్లడించారు. ప్రతి ఏడాది ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ పోటీలు ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. (చదవండి: ‘అమరావతి ఉద్యమం ఒక ఫేక్’) ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి విశాఖపట్నంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సన్నాహక సభ ఈరోజు అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో జరిగింది. ఈ సభకు సంబంధించిన దృశ్యాలు. pic.twitter.com/PNqBbkLjjG — Vijayasai Reddy V (@VSReddy_MP) December 19, 2020 -
ఐసోలేషన్ క్రికెట్ కప్..
-
వైరల్: ఐసోలేషన్ క్రికెట్ కప్.. ఐసీసీ ట్వీట్
హైదరాబాద్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. మహమ్మారి కరోనా దెబ్బకు టోక్యో ఒలింపిక్స్, టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్, ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీలు, సిరీస్‌లు వాయిదా పడటమో లేక రద్దవ్వడమో జరిగాయి. దీంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్డౌన్ సమయంలో కొందరు ఆటగాళ్లు తమ వ్యాపకాలు, వంటలకు సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే మరికొంత మంది తమ మెదడుకు మేత వేస్తూ సృజనాత్మకంగా ఆలోచించి వీడియోలను రూపొందిస్తున్నారు. టీమిండియా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అండ్ టీం తమ క్రియేటివిటీని ఉపయోగిస్తూ ‘ఐసోలేషన్ క్రికెట్ కప్’ పేరిట వినూత్న వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘లాక్డౌన్ సమయంలో మేము క్రికెట్‌ను ఎక్కువగా మిస్సవుతున్నాం. అందుకే మాకు మేమే సొంతంగా మా ఇంట్లోనే ఓ లీగ్‌ను ప్రారంభించాం. అదే ఐసోలేషన్ క్రికెట్ కప్(ఐసీసీ)’ అంటూ వేద కృష్ణమూర్తి ట్వీట్ చేశారు. బ్యాటర్, బౌలర్, అంపైర్, కామెంటేటర్, కీపర్, ఫీల్డర్, ఆడియన్స్ ఇలా అందరూ ఉన్న ఈ లీగ్‌కు సంబంధించిన వీడియోను సైతం పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కూడా వేద ప్రారంభించిన క్రికెట్ లీగ్‌కు ఫిదా అయింది. అంతేకాకుండా త్వరలోనే ఐసోలేషన్ క్రికెట్ కప్ తారాస్థాయికి చేరుకుంటుందని సరదాగా వ్యాఖ్యానించింది. ఇక వేద అండ్ టీంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ ఆలోచన బాగుందని, లైవ్ కామెంటరీ రియలిస్టిక్‌గా ఉందని, ఆడియన్స్ చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: టి20 ప్రపంచకప్‌ను రద్దు చేయకండి ప్రియాంక, కరీనా ఇష్టం.. స్టెయిన్ కష్టం -
జగిత్యాల టైగర్స్‌కు టైటిల్
హైదరాబాద్: సింగపూర్ తెలంగాణ కల్చరర్ సొసైటీ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన వార్షిక క్రికెట్ టోర్నమెంట్లో జగిత్యాల టైగర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టు ఫైనల్లో హీరోయిక్ బుల్స్‌ను ఓడించింది. విజేతలకు బతుకమ్మ సంబరాల్లో బహుమతులు అందించనున్నారు. మొత్తం ఈ టోర్నమెంట్లో 8 జట్లు తలపడ్డాయి. గ్రూప్-ఏలో తెలంగాణ లయన్స్, ఇండియన్ రూలర్స్, కరీంనగర్ నైట్ రైడర్స్, భాగ్యనగర్ రైడర్స్ జట్లు ఉండగా... గ్రూప్-బిలో హీరోయిక్ బుల్స్, జగిత్యాల టైగర్స్, 11 స్టార్స్, స్మాషర్స్ యునెటైడ్ జట్లు తలపడ్డాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడంతో పాటు... తెలంగాణ వారందరినీ ఒకే తాటి మీదకు తెచ్చేందుకు ఏటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని టీసీఎస్ఎస్ అధ్యక్షుడు బండ మాధవరెడ్డి అన్నారు. -
క్రికెట్ కప్పులో ఫ్యాన్స్ తుఫాన్
బ్యాటులన్ ధ్యాయేత్.. పరుగుల్ ఆవాహయామి బంతులన్పూజయామి.. వికెట్లు సమర్పయామి టెస్టాకారం క్రికెట్ సర్వం.. వన్డేహం విశ్వక్రీడాయాం.. ట్వంటీ ట్వంటీ నమస్తుభ్యం.. గ్రౌండే కదా సమరాంగణం సర్వాభిమాన శోభితే తత్ప్రణమామి క్రికెటాయ నమః ! ఏ దేశంలో క్రికెట్ పూజిపబడుతుందో అదే భారతదేశం. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇక్కడ క్రికెట్క్రీడాకారులు ఆరాధ్య దైవాలు. ఇది చెప్పక్కర్లేని వాస్తవం. క్రికెట్ అభిమానులు పండుగ చేసుకునే కాలం వచ్చేసింది. క్రేజీఆల్.. ఒకప్పట్లా ఇప్పుడు క్రికెట్ అభిమానం రోడ్లపై వెల్లువెత్తి పూజలందుకోవడం కనిపించట్లేదేమో. కానీ క్రికెట్ మోజు, క్రేజు ఏ మాత్రం తగ్గలేదు, తగ్గదు కూడా. పైకి వ్యక్తం చేయకపోయినా.. అభిమానం ప్రకటించకపోయినా.. క్రికెట్ మన జీవితాల్లో భాగమైపోయింది. మనకు క్రికెట్ కేవలం ఒక ఆటకాదు అది మన దేశ గౌరవం. ఒక పక్కన ఈ క్రీడకు అంతటి సామాజిక హోదా ఇస్తూనే మనం దాన్ని మన జీవితంలో అంతర్భాగం చేసేసుకున్నాం. క్రికెట్ మన ఎంటర్టైన్మెంట్. అందుకే ఏ రూపంలో క్రికెట్ వచ్చినా దాన్ని ఆదరించేస్తాం. ఎప్పటికీ వన్నె తగ్గని అచ్చమైన టెస్టులైనా, నిఖార్సయిన వన్డేలైనా, చిట్టి టీట్వంటీలైనా సందర్భానికి తగ్గట్టు పండుగ చేసుకుంటాం. మ్యాచ్ కాలమానమే కొలమానం.. ఐపీఎల్ సంబరాలు పూర్తవగానే ట్రై సిరీస్ మ్యాచులు చూసేస్తాం. ఇప్పడు ప్రపంచ కప్ సమరానికి కళ్లప్పగించేశాం. క్రికెట్‌కి ఒక సీజన్ అంటూ లేదు. ఎక్కడ క్రికెట్ ఉంటే అక్కడ అభిమానం ఉంటుంది. ఆదివారం హైదరాబాద్ రోడ్లు సహజంగానే కొంత ఫ్రీగా దర్శనమిస్తుంటాయి. కానీ, క్రికెట్ అభిమానానికి కొలమానం కావాలంటే ఆదివారం ఇండియా మ్యాచ్ ఉంటే రోడ్డుపైకి వచ్చి చూడండి (అదీ మ్యాచ్ వదిలే ధైర్యం మీకుంటే). కర్ఫ్యూ పెట్టినట్టు సిటీ బోసిపోతుంది. గెలిస్తే పండుగే. ఓడినా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. మంచి కాలం మించకుండా.. క్రికెట్ సీజన్ ఒకప్పుడు ఏడాదికోసారి వచ్చేది. ఇప్పుడు ప్రతి సీజన్లోనూ క్రికెట్ ఉంటోంది. క్రికెట్లోని ఆయా సీజన్లకు తగ్గట్టుగా మార్కెట్ కూడా తనని తాను మార్చుకుంటోంది. నిన్నటి దాకా.. కూల్ డ్రింక్స్, స్నాక్స్ మాత్రమే క్రికెట్‌కి జతగా కనిపించేవి. కానీ, ఇప్పుడు అవీ ఇవీ కావు అన్నీ క్రికెట్ సీజన్‌ని వాడుకుని సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడుతున్నాయి. వస్త్రాలు, ఫోన్లు, కార్లు, టీవీలు, చాక్లెట్లు, బైకులు, ఆఖరకు క్రికెట్ యాప్‌లు కూడా. కావేవీ క్రికెట్‌కి అనర్హం ! తింటూ క్రికెట్, నడుస్తూ, మాట్లాడుతూ, నిద్రిస్తూ కూడా క్రికెట్ ధ్యాసే. పనివేళల్లో కూడా ఆట మిస్‌కాకుండా అప్డేట్లు, రికార్డింగ్‌లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. పందెం నష్టం.. పొందకు లాభం.. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా ప్రత్యక్షంగా చూడటానికి స్టేడియాలకు వచ్చే అభిమానుల్లో అధిక శాతం భారతీయులే ఉంటున్నారట. పైగా ఆ మ్యాచ్‌లో ఇండియా ఆడితే.. టికెట్లు తెగ అమ్ముడవుతాయని నిర్వాహకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొత్త రికార్డులు సైతం సృష్టించేశామట. కిందటి ఆదివారం మెల్బోర్న్లో సౌత్ ఆఫ్రికా, ఇండియా మ్యాచ్‌కి వచ్చిన ప్రేక్షక మహాశయుల్లో 70 వేల మంది మనవారేనట. దాదాపు 80 శాతం మంది భారత అభిమానులతో స్టేడియం త్రివర్ణ శోభితమైంది. ఇంతటి పిచ్చి అభిమానం ఉన్న దేశానికి చీడ పీడ బెట్టింగ్ భూతం. అభిమానాన్ని వీక్నెస్గా మార్చుకుని బేరం సాగించే దుస్సంప్రదాయానికి నిజమైన క్రీడాస్ఫూర్తి బలైపోతోంది. ఇప్పటి వరకు పందెం బరిలోకి కోళ్లు, గుర్రాలనూ మాత్రమే దింపాం. ఆ మూగజీవాలకు గెలుపు లక్ష్యం తప్ప డబ్బుతో పనిలేదు. కానీ మన గెలుపోటముల సరదా మనుషులపై పందెం కట్టే స్థాయికి దిగజారిపోయింది. ఎక్కడ పందెం ఉందో అక్కడ డబ్బు ఉంది. ఎక్కడ డబ్బుందో అక్కడ మాఫియా ఉంది. మూగజీవాల్లా డబ్బుకు అతీతంగా ఉండగలిగే అస్తిత్వాన్ని మన క్రీడాకారులకు ప్రసాదించు భగవాన్. ‘డబ్బుకు, పందానికీ తావులేని అభిమానాన్ని మా గుండెల్లో నింపు భగవాన్’ ఇంత పెద్ద కోరికలు ఆ భగవంతుడే తీర్చగలడు. కానీ, నా వంతు బాధ్యత నేను చేయగలను. చిన్న పందానికి కూడా లొంగకుండా నిజమైన క్రీడాస్ఫూర్తితో క్రికెట్ చూడటం. గెలుపోటములు రెండిట్లోనూ కిక్కుంది. ఆ కిక్ కోసం క్రికెట్‌ను ప్రేమించే కోట్లాది మందిలో ఓ అభిమానిగా హ్యాపీ క్రికెటింగ్.