సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా పోర్ట్ స్టేడియంలో ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కాగడ వెలిగించి టోర్నమెంట్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేపటి నుంచి వచ్చే నెల 9 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నమెంట్‌లో 422 టీమ్‌లు పాల్గొంటున్నాయి. (చదవండి: సీఎం జగన్ బర్త్‌డే: 20వేల మందితో భారీ ర్యాలీ)
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తిలో వజ్ర సంకల్పం ఉండాలని..దీనికి నిదర్శనం సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఆయన ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. యువశక్తి అంతా ఈ రోజు ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ లో భాగస్వామ్యం అవుతున్నారని పేర్కొన్నారు. అత్యత్తమ ప్రతిభ కనబరిచి గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి సచిన్, ధోనీ లాంటి వారు ఎదిగారని తెలిపారు. ప్రతి ఏడాది ఇదే స్థాయిలో అన్ని క్రీడలు బాట్మింటన్, కబడ్డీ, టెన్నిస్ అన్ని రంగాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment