జగిత్యాల టైగర్స్‌కు టైటిల్ | TCSS cricket cup champion jagityala tigers | Sakshi
Sakshi News home page

జగిత్యాల టైగర్స్‌కు టైటిల్

Published Wed, Aug 10 2016 2:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

జగిత్యాల టైగర్స్‌కు టైటిల్

జగిత్యాల టైగర్స్‌కు టైటిల్

హైదరాబాద్: సింగపూర్ తెలంగాణ కల్చరర్ సొసైటీ (టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన వార్షిక క్రికెట్ టోర్నమెంట్‌లో జగిత్యాల టైగర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టు ఫైనల్లో హీరోయిక్ బుల్స్‌ను ఓడించింది. విజేతలకు బతుకమ్మ సంబరాల్లో బహుమతులు అందించనున్నారు. మొత్తం ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు తలపడ్డాయి.

గ్రూప్-ఏలో తెలంగాణ లయన్స్, ఇండియన్ రూలర్స్, కరీంనగర్ నైట్ రైడర్స్, భాగ్యనగర్ రైడర్స్ జట్లు ఉండగా... గ్రూప్-బిలో హీరోయిక్ బుల్స్, జగిత్యాల టైగర్స్, 11 స్టార్స్, స్మాషర్స్ యునెటైడ్ జట్లు తలపడ్డాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడంతో పాటు... తెలంగాణ వారందరినీ ఒకే తాటి మీదకు తెచ్చేందుకు ఏటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని టీసీఎస్‌ఎస్ అధ్యక్షుడు బండ మాధవరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement