సాక్షి, విజయవాడ: అన్ని పర్యాటక ప్రాంతాల్లో బొట్ల ఆపరేషన్ ప్రారంభిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సిద్దంగా 196 బొట్లు ఉన్నాయని, వాటి ప్రారంభానికి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. వరద పరిస్థితులను బట్టి బొట్లను అందుబాటులోకి తెస్తామని, పర్యాటక ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెఇపారు. విశాఖలో బంగ్లాదేశ్ షిప్ వచ్చిందని, అందులో రెస్టారెంట్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విశాఖ, విజయవాడ, హుస్సేన్ సాగర్ కలిపి కొత్త బొట్లను పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని మళ్ళీ భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని, ఆన్‌లైన్‌లో యోగా, ఇంగ్లీష్ శిక్షణ ఇస్తున్నామన్నారు. అంతేగాక రూ. 2 కోట్ల 20 లక్షలతో ఒంగోలులో స్టేడియం నిర్మించామని ఆయన తెలిపారు.
వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్‌ను రూ. 3 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేస్తామని అవంతి పేర్కొన్నారు. విశాఖ బీచ్‌రోడ్‌లో కోడి రామ్మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, విశాఖఆర్‌కే బీచ్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రివర్ టూరిజంకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఎటిఎంలా వాడారని, ప్రధానమంత్రి కూడా చంద్రబాబు అవినీతిని విమర్శించారన్నారు. బాబు పోలవరం ప్రాజెక్టుపై రాజకీయం చేయడం తగదని, వరదల సమయంలో కూడా సీఎం జగన్ సమర్థవంతంగా పని చేశారన్నారు. వరదలు వస్తే ఇంత వేగంగా రైతులకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా అని మంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment