టూరిస్టులకు శుభవార్తనందించిన ఏపీ ప్రభుత్వం | AP Govt will Allow Tourists from September 1st Week - Sakshi
Sakshi News home page

టూరిస్టులకు శుభవార్తనందించిన ఏపీ ప్రభుత్వం

Published Tue, Aug 18 2020 3:56 PM | Last Updated on Tue, Aug 18 2020 5:01 PM

Tourists will Allow From September 1st week in Andhra Pradesh - Sakshi

సాక్షి, సచివాలయం: కరోనా కారణంగా పర్యాటక ప్రాంతాలన్నీ బోసిపోయాయి. అయితే సెప్టెంబర్ మొదటివారం నుంచి పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతినిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20న పర్యాటక రంగ నూతన పాలసీని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. త్వరలో సింహాచల దేవస్థానంలో 'ప్రసాద్‌' పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. కొండపల్లి ఫోర్ట్‌, బాపు మ్యూజియంలను సీఎం జగన్ ప్రారంభిస్తారు పేర్కొన్నారు. తొట్లకొండలో బుద్ధుని మ్యూజియం, మెడిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు వైఎస్ఆర్‌ క్రీడా పురస్కారాలు అందజేస్తామన్నారు. పీపీఈ పద్ధతిలో రాష్ట్రంలో మూడు ఇంటర్నేషనల్ స్టేడియంలను ఏర్పాటు చేస్తామని  అవంతి తెలిపారు. 

చదవండి: ‘హైదరాబాద్‌లో దాక్కుని తప్పుడు ఆరోపణలా..’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement