విశాఖ : విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అధికార తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గపోరుకు మాడుగుల శుక్రవారం వేదిక కాబోతుంది. ఎడముఖం..పెడముఖంగా జిల్లా పార్టీలో గ్రూపులకు ఆజ్యం పోస్తున్న రాష్ట్రమంత్రులు, అనకాపల్లి ఎంపీ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు రూ.6.31కోట్ల విలువైన భారీ ఎత్తున అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలకు నేడు శ్రీకారం చుడుతున్నారు.
అయితే ఇప్పటికే మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్ మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. తాను లేనప్పుడు ఏ విధంగా శంకుస్థాపన కార్యక్రమాలు తలపెడతారంటూ అవంతి శ్రీనివాస్... జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్‌కే లేఖ ఇవ్వడంతో పాటు అడ్డుకోకపోతే సభాహక్కుల నోటీసు ఇస్తానంటూ హెచ్చరికలు చేశారు. మరోవైపు అయ్యన్నపాత్రుడి పర్యటనను చివరి నిముషం వరకు అడ్డుకోవాలని పట్టుదలతో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం విఫలయత్నం చేస్తోంది. దీంతో మాడుగులలో అయ్యన్న పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
విశాఖలో రచ్చకెక్కిన టీడీపీ విభేదాలు
Published Fri, Feb 27 2015 10:25 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement