madugula
-
మాడుగుల వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
గ్రామస్థులు ఎటాక్...బండారు జంప్..
-
నాపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని నిలపెట్టుకుంటాను: అనురాధ
-
ఎన్ఆర్ఐ కి సీట్లు ఇస్తే చిత్తుచిత్తుగా ఓడిస్తాం
-
పేదల సంక్షేమ రాజ్యం
‘వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేదల సంక్షేమ రాజ్యం వచ్చింది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పేద, బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమం అందుతోంది. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’ అని అనకాపల్లి జిల్లా మాడుగుల సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సాక్షి, అనకాపల్లి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేదల సంక్షేమ రాజ్యం వచ్చిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం అనకాపల్లి జిల్లా మాడుగుల వద్ద జరిగిన బహిరంగ సభలో వేలాది ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాష్ట్రంలో అందుతున్న సంక్షేమం మరే రాష్ట్రంలోనూ అందడంలేదని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఇందులో మూడింట రెండు వంతులు బడుగు, బలహీన వర్గాలకే అందుతున్నాయని తెలిపారు. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకే సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారని, దీనివల్ల సామాజిక సాధికారత సాధ్యమైందని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు. జనవరి ఒకటి నుంచి ప్రభుత్వం సామాజిక పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతున్నారని చెప్పారు. రెండు వేళ్లు చూపించే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలకు వృద్ధులు ఇకపై మూడు వేళ్లు చూపించాలని అన్నారు. పేదల ఉన్నతి కోసం సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే అలీబాబా 40 దొంగలు హేళన చేశారని, చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి మనవళ్లు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదవచ్చా అని నిలదీశారు. ఇదీ పేదలపై వారికి ఉన్న ప్రేమ అని అన్నారు. సీఎం జగన్ పాలనలో నేరుగా లబ్ధి: డిప్యూటీ సీఎం రాజన్నదొర చంద్రబాబు పాలనలో పేదల కోసం అరకొరగా ఖర్చు చేశారని, అందులోనూ అధికభాగం టీడీపీ నేతలే తినేసేవారని, సీఎం జగన్ పాలనలో ప్రతి పేదవాడికి నేతలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధి జరుగుతోందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర చెప్పారు. బడుగు, బలహీనవర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఇంతలా అభివృద్ధి చెందుతున్నారంటే అందుకు జగనన్న సంక్షేమ పాలనే కారణమని తెలిపారు. టీడీపీ హయాంలో పేదలకు ఖర్చు చేసిన దానికి మూడు రెట్లు సీఎం జగన్ వెచ్చిస్తున్నారని చెప్పారు. గతంలో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు మళ్లీ మన ముందుకు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అవినీతి రహిత సంక్షేమ పాలన: మంత్రి ధర్మాన రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం సీఎం జగన్‌తోనే సాధ్యమైందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రోడ్ వేస్తేనో, బిల్డింగ్ కడితేనో అభివృద్ధి కాదని, పేదవాడి జీవన ప్రమాణాలు పెరగాలని, సీఎం జగన్ ఇదే చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ పథకాలను హేళన చేసిన చంద్రబాబే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానని అంటున్నారన్నారు. సమాజాభివృద్ధికి విద్య ఎంత అవసరమో సీఎం జగన్‌కు తెలుసునని, అందుకే ప్రతి పేద పిల్లవాడికి యూనిఫారం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ మీడియం చదువు, ఫీజ్ రీయింబర్స్మెంట్ అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ప్రజల సొమ్ము వారి ఖాతాల్లో వేసుకున్నారని, సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక పథకాల సొమ్ము ప్రజల ఖాతాల్లో వేస్తున్నారని, అప్పటికీ ఇప్పటికీ తేడా ప్రజలు గమనించాలని కోరారు. అవినీతి జరిగిందని చంద్రబాబు కూడా ఏనాడూ అసెంబ్లీలో ప్రశ్నించలేకపోవడమే వైఎస్ జగన్ స్వచ్ఛమైన పాలనకు నిదర్శనమని చెప్పారు. దొంగ కంపెనీలు క్రియేట్ చేసి స్కిల్ పేరిట అవినీతి చేసి జైలు పాలైన చంద్రబాబు తప్పు చేయలేదంటే ఎవరు నమ్ముతారన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. మీ మనవడు ఈ విషయం అడగలేదా?: మంత్రి గుడివాడ ‘స్కిల్ కుంభకోణంలో అడ్డంగా దొరికి రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లిన చంద్రబాబు మనవడు తాతేడని అడిగితే విదేశాలకు వెళ్లారని చెప్పామని బాబు సతీమణి భువనేశ్వరి ఇటీవల ఒక సభలో చెప్పారు. మరి తాత విడుదలైనప్పుడు అదే మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తీసుకెళ్లారు. విదేశాలకు వెళ్లిన తాత ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రావాలి కదా.. జైలు నుంచి ఎందుకు వచ్చావు తాతా అని మనవడు అడగలేదా’ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ సభలో చమత్కరించారు. చంద్రబాబుకు ఇటీవల జనసేన అనే ఒక ఖరీదైన చేతికర్ర దొరికిందన్నారు. ఎన్ని కోట్లు పెట్టినా ప్రజల అభిమానాన్ని మాత్రం వారు కొనలేరని అన్నారు. -
ప్రజలకు చేసిన మంచిని వివరిస్తున్నాం: మంత్రి బొత్స
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్, పూలే ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, సీఎం జగన్ బడుగు బలహీనర్గాలకు చేసిన మంచిని వివరిస్తామని మంత్రి బొత్స అన్నారు. కొన్ని పత్రికలు, టీవీలు యాత్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎలాంటి అవినీతి లేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగినట్లు అవినీతి ఈ ప్రభుత్వంలో జరగలేదన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడయితే ఎందుకు జైలులో ఉంటారు.. కన్ను బాగోలేదని బెయిల్ ఇచ్చారు.. మళ్లీ నాలుగు వారాల తరువాత మళ్ళీ జైలుకు రమ్మనారు’’ అని మంత్రి పేర్కొన్నారు ఇది బడుగు బలహీనర్గాల ప్రభుత్వం: రాజన్న దొర డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ, మా ప్రభుత్వం బడుగు బలహీనర్గాల ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను 98 శాతానికి పైగా సీఎం జగన్ అమలు చేశారు.. హామీలు ద్వారా బడుగు బలహీనర్గాలు ఎక్కువ లబ్ది పొందారని మంత్రి అన్నారు. ఎన్నికల ఫలితమే సమాధానం చెబుతుంది: ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు మాట్లాడుతూ, తనపై ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని, ఆరోపణ చేసిన ప్రతిసారి ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నానన్నారు. ‘‘నా పనితనానికి వచ్చే ఎన్నికల ఫలితమే సమాధానం చెబుతుంది. సభకు వచ్చి జనాలను చూస్తే మాడుగుల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని ముత్యాల నాయుడు అన్నారు. చదవండి: చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు -
ఎల్లలు దాటనున్న మాడుగుల హల్వా!
సాక్షి, విశాఖపట్నం : నోట్లో వేసుకోగానే మైమరపించే మాడుగుల హల్వా రుచిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనిని ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చేయడంతో పాటు.. భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు అడుగులేస్తోంది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఒప్పందం కుదుర్చుకుంది. జీడి పప్పు.. బాదం పలుకులు.. కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే.. గోధుమ పాలు.. వీటన్నింటినీ రాతి రుబ్బు రాయితో గంటల పాటు సానబెట్టి.. ఆపై కట్టెల పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపెట్టగానే పుట్టుకొస్తుందీ హల్వా. మాడుగులలో 1890వ సంవత్సరంలో దంగేటి ధర్మారావు కుటుంబం మాత్రమే దీనిని తయారు చేసేది. ప్రస్తుతం ఈ వ్యాపారంపై అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మొట్టమొదటిగా ‘మాడుగుల హల్వా’ ఎంపిక మాడుగుల హల్వా వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తేవడమే కాకుండా విదేశాల్లో దర్జాగా విక్రయించేందుకు అవసరమైన చేయూతనందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించనుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ)లో భాగంగా ఈ పరిశ్రమని అభివృద్ధి చేయనుంది. ఇందుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తాయి. యంత్రాల్ని సమకూర్చడం, స్కిల్స్ అప్‌గ్రేడ్ చేయడం, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వంటివి కల్పిస్తారు. వీటితో పాటు.. మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలో తొలిసారి మాడుగుల హల్వాని ఎంపిక చేశారు. ఇకపై ఈ హల్వా.. ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్‌గా మార్కెట్లో లభించనుంది. ఇందుకు కావాల్సిన వసతుల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. పథకంలో భాగంగా ఏడాది పాటు ప్యాకేజింగ్ మెటీరియల్, గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అద్దె, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఎలాంటి పెట్టుబడి భారం లేకుండా హల్వాని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన వ్యయంలో 50 శాతం వరకూ గ్రాంట్ కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. భౌగోళిక గుర్తింపునకు ఒప్పందం.. వందేళ్ల చరిత్ర గల మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్ సొసైటీ శుక్రవారం ఎంవోయూను కుదుర్చుకుంది. ఈ గుర్తింపు కోసం అవసరమయ్యే రుసుములు, ఇతర ఖర్చులకు సంబంధించి రూ.3 లక్షల వరకూ ప్రభుత్వమే భరించనుంది. వచ్చే ఆరు నెలల్లోపు మాడుగుల హల్వాకు కూడా భౌగోళిక గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ గుర్తింపు వస్తే ఇక ఈ పేరుతో ఇక్కడి నుంచి తప్ప మరెవరూ, ఎక్కడా మాడుగుల హల్వాను తయారు చేయలేరు. వారసత్వ సంపదగా గుర్తింపు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక తినుబండారాలు తయారు చేసే పరిశ్రమలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ చిరు వ్యాపారం మాదిరిగానే మిగిలిపోయాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేసి.. వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాదిరిగా దీని అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాం. ఆ తర్వాత మిగిలినవాటిపైనా దృష్టిపెడతాం. – కేజే మారుతి, ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ -
Natural Farming: ఏపీ స్ఫూర్తితో మేఘాలయలో ప్రకృతి సాగు
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ప్రకృతిసాగు వైపు అడుగులేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇటీవలే మేఘాలయ రాష్ట్ర అధికారులు, గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి గిరిజనులు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేసింది. మేఘాలయలో ప్రకృతి వ్యవసాయ పరివర్తన కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించే క్రమంలో మేఘాలయ స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ సొసైటీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుసాధికార సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులకు చెందిన నిట్టపుట్టు పరస్పర సహాయ సహకార సంఘం మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు మేఘాలయలో ప్రకృతిసాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక సహాయం అందించనుంది. మేఘాలయలో ఘరో, ఖాశీ హిల్స్‌లో ఎంపిక చేసిన ఐదు బ్లాకుల్లో 20గ్రామాల రైతులను ప్రకృతి వ్యవసాయ రైతులుగా తీర్చిదిద్దడంతోపాటు బలమైన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ) వ్యవస్థ రూపకల్పనకు చేయూతనిస్తుంది. ఇందుకోసం 10 మంది సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల బృందం మేఘాలయాకు వెళ్లింది. ఈ బృందం అక్కడి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, ప్రాజెక్టు బృందంతో కలిసి పనిచేస్తుంది. ఎంపికచేసిన బ్లాకుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రకృతిసాగు చేపట్టడం ద్వారా వాటిని రిసోర్స్ బ్లాకులుగా తీర్చిదిద్దనున్నారు. ఇంగ్లిష్ స్థానిక భాషల్లో ప్రకృతిసాగు విధానాలు, పాటించాల్సిన పద్ధతులపై మెటీరియల్ తయారుచేసి ఇస్తారు. సిబ్బందికి శిక్షణతోపాటు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రస్థాయిలో కో ఆర్డినేట్ చేసేందుకు స్టేట్ యాంకర్‌ను నియమిస్తారు. సీజన్ల వారీగా రెండు రాష్ట్రాల కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రకృతి వ్యవసాయ అనుభవాలు, ఉత్తమ అభ్యాసాలను పరస్పరం పంచుకోవడానికి కృషిచేస్తారు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
అనకాపల్లి, అల్లూరి జిల్లాల మీదుగా 10 కి.మీ. రహదారి నిర్మాణం
మాడుగుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవాపురం వరకు.. దట్టమైన అడవిలో నుంచి సాగే 10 కిలోమీటర్ల రహదారి.. 15 ఏళ్ల క్రితమే నిర్మాణం ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. అటవీ శాఖ అనుమతులు లభించక మధ్యలోనే నిలిచిపోయింది. ఇన్నాళ్లకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రూ.2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం చకచకా సాగుతోంది. కాకులు దూరని కారడవిలో పొక్లెయిన్లతో జంగిల్ క్లియరెన్స్ చేస్తూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. సాక్షి, అనకాపల్లి: అడవి బిడ్డలకు త్వరలో డోలి కష్టాలు తీరనున్నాయి. చదువు కోవాలని ఆశపడే విద్యార్థుల కలలు నెరవేరబోతున్నాయి. అటవీ ఉత్పత్తులను విక్రయించడానికి రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొత్తంగా ప్రగతి పరవళ్లు తొక్కబోతోంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో మాడుగుల నుంచి దేవాపురం వరకు కీలకమైన రహదారి నిర్మాణం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీడీఏ సహకారంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రహదారి కొండలు, గుట్టల మీదుగా సాగుతుంది. పక్కా రోడ్డు వేయడం కష్టసాధ్యమే అయినా ఈ సత్సంకల్పాన్ని సుసాధ్యం చేయాలని అందరూ శ్రమిస్తున్నారు. వాణిజ్యంలో ప్రత్యేక గుర్తింపు మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు మధ్యనున్న మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయంటే దానికి కారణం సరైన రహదారి లేకపోవడమే. వందేళ్ల క్రితమే మాడుగుల వాణిజ్య రంగంలో గుర్తింపు పొందింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో పండించిన పిప్పలి, పసుపు, బత్తాయి, నారింజ, అరటి, చింతపండు, సపోట, మొక్కజొన్న, అనాస, సీతాఫలం, అలచందలు, తదితర పంటలు మాడుగుల చేరుకుంటాయి. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఏడాదికి వందల టన్నుల్లో రవాణా జరుగుతుంది. సరైన రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో మాడుగుల మండలంలో కొన్ని గ్రామాలతోపాటు నేటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 30 గ్రామాలు ఈనాటికీ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయాయి. దేవాపురం, అయినాడ, సలుగు పంచాయతీల పరిధిలో ఉన్న ఈ గ్రామాలవారు నిత్యావసర సరుకులతోపాటు ఇతర వస్తువులు కావాలంటే 10 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దిగి మాడుగుల రావల్సి వచ్చేది. గిరిజనులు పండించిన పంటలను కావిళ్లతో, గంపలతో నడుచుకుంటూ తీసుకువస్తారు. రహదారి సౌకర్యం లేక ఈ ప్రాంత విద్యార్ధులను చదివించడానికి కూడా ఇష్టం చూపించరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం ఆ గ్రామాలు అల్లూరి జిల్లాలో ఉన్నాయి. గతంలో సగంలోనే నిలిచిన రోడ్డు పనులు 15 ఏళ్ల క్రితం మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరస్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖ అనుమతి లేకపోవడంతో అక్కడితో పనులు నిలిపోయాయి. చాలామంది రాజకీయ నాయకులు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి పూనుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాడుగుల–దేవాపురం రోడ్డుకు మోక్షం కలిగింది. గత ఎన్నికలకు ముందే ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దానిని నెరవేరుస్తూ అటవీ శాఖ అడ్డంకులున్నా అధిగమించి ప్రస్తుతం రోడ్డు నిర్మాణం శరవేగంతో చేస్తున్నారు. రెండు జిల్లాలకు చెందిన 13 మండలాల్లో గల 30 గ్రామాల రైతులు, చిరు వ్యాపారస్తులు, ప్రజలు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గిరిపుత్రులకు అండగా ప్రభుత్వం గిరిజనమంటే సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అమితమైన ప్రేమ. వారి అభివృద్ధికి, వారి గ్రామాలకు రోడ్డు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మాడుగుల నుంచి దేవాపురం వరకు రహదారి సౌకర్యం లేపోవడంతో గిరిజన గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడంతో అటవీశాఖ అనుమతులు లభించాయి. మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు ఇప్పటికే రహదారుల నిర్మాణం జరుగుతోంది. –బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం రుణపడి ఉంటాం.. గత 30 ఏళ్లుగా దేవాపురం రోడ్డు కోసం పోరాడుతున్నాము. గతంలో మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరాలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖాధికారుల అనుమతులు లేకపోవడంతో అప్పట్లో రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఇన్నళ్లకు మా కల నెరవేరుతోంది. రెండు జిల్లాల ప్రజలు సీఎంకు, డిప్యూటీ సీఎంకు రుణపడి ఉంటారు. – వేమవరపు వెంకటరమణ, మాడుగుల మాజీ సర్పంచ్ త్వరితగతిన నిర్మాణ పనులు ఇటీవల అటవీశాఖ అనుమతులు లభించాయి. గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాం. దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులను రూ.2 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టాం. వర్షాలు లేకుండా ఉంటే నెల రోజుల్లో ఫార్మేషన్ పూర్తి చేస్తాం. మరో ఆరునెలలలోపు ఈ రోడ్డు అప్‌గ్రెడేషన్ కూడా పూర్తిచేస్తాం. ఇది పూర్తయితే రెండు జిల్లాల్లో గల 13 మండలాల్లో గల 30 గిరిజన గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. – రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ పీఓ -
తీరని విషాదం: కారు రూపంలో మృత్యువు..
మాడుగుల (విశాఖ): పండగకు అత్తవారింటికి ఎంతో సంతోషంతో బయలుదేరిన ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని విషాదం నింపింది. కారు రూపంలో మృత్యువు చిన్నారిని కబళించింది. గ్రామస్తుల కథనం మేరకు ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలో డి. సురవరం గ్రామానికి చెందిన మువ్వల జగన్నాథం భార్య చింతల్లి, కుమార్తెలు కుసుమ(5), సిరి(3)తో కలిసి పండగ నిమిత్తం శుక్రవారం సాయంత్రం రావికమతం మండలం బలుసుపాలెంలోని అత్తవారింటికి బైక్‌పై బయలుదేరాడు. గ్రామం దాటుతుండగానే చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టడంతో పెద్ద కుమార్తె కుసుమ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. జగన్నాథం, భార్య చింతల్లి, చిన్న కుమార్తె సిరికి కాళ్లు, తలపై బలమైన గాయాలయ్యాయి. కారు రోడ్డుపక్కన పల్లపు ప్రాంతంలోకి దూసుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వచ్చిన 108 వాహనంలో వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. జగన్నాథం పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. చింతల్లి, సిరి మాడుగుల ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. కుసుమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించామని ఎస్ఐ రామారావు తెలిపారు. చదవండి: (భర్తను చెట్టుకు కట్టేసి.. మహిళపై గ్యాంగ్‌రేప్!) -
రుచిలో మేటి మాడుగుల హల్వా
కాకినాడ కాజాకు, బందరు లడ్డూకు.. ఆత్రేయపురం పూతరేకులకు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మధురమైన ప్రత్యేకత ఉంటుంది. మప విశాఖ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మాడుగుల హల్వా. పేరులోనే కాదు రుచిలో కూడా దీనికి సాటి మరొకటి లేదని చెప్పక తప్పదు. ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో 132 ఏళ్ల క్రితం పుట్టిన ఈ హల్వా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. మాడుగుల: మాడుగులలో 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో పుట్టిన హల్వా నేడు విదేశాల్లో సైతం నోరూరిస్తోంది. మాడుగుల అంటే హల్వాగానే ఖ్యాతి పెరిగింది. గతంలో హల్వా మాడుగులలోనే లభ్యమయ్యేది. ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్ కూడా విస్తరించింది. ఆన్లైన్ ఆర్డరిస్తే ఎంత దూరమైనా హల్వా పంపించే స్థాయికి మార్కెట్..నెట్వర్క్ అభివృద్ధి చెందింది. జీడి, బాదం పలుకులతో పాటు కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే..గోధుమ పాలుతోపాటు రాతి రుబ్బి రాయితో గంటలు పాటు సాన పట్టి కర్రలు పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపట్టగానే పుట్టుకొచ్చేదే మాడుగుల హల్వా. సినీతారలు ఫిదా అరకు, పాడేరు ప్రాంతాల్లో జరిగే సినీ షూటింగ్‌లకు ప్రముఖ హీరోహీరోయిన్లు మాడుగుల హల్వా రుచికి ఫిదా అయినవాళ్లే. హల్వాను లొట్టలేసుకుని తిన్నవారే..అందుకే ఈ ప్రాంతానికి సినీ తారలు ఎవరొచ్చినా కచ్చితంగా హల్వా రుచి చూడకుండా వెళ్లరు. పర్యాటక ప్రాంతాలు వీక్షించేందుకు వచ్చే పర్యటకులు మాడుగుల హల్వా రుచి చూడకుండా వెళ్లరు. విశాఖ అందాలను చూసేందుకు ఎంత ఉవ్విళ్లూరతారో.. మాడుగుల హల్వా తినేందుకు కూడా అంతే ఆసక్తి కనబరుస్తారు. అందుబాటులో ధరలు మాడుగులలో మేలు రకం కిలో రూ 500కాగా రెండో రకం కిలో రూ.400. స్థానిక వ్యాపారంతో పాటు పార్సిల్ ద్వారా ఇతర ప్రాంతాలకు ప్రతి రోజు ఎగుమతి జరుగుతోంది. మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. దంగేటి కుటుంబం మాత్రమే తయారీ చేసేవారు. తయారీ గుట్టురట్టవ్వడంతో మాడుగుల పట్టణానికి చెందిన దాసరి కుటుంబీకులు కూడా హల్వా పాకం, పదునును కనిపెట్టడంతో ప్రస్తుతం సుమారు 20 షాపులకుపైగా ఏర్పాటయ్యాయి. విదేశాలకు హల్వా రుచులు మాడుగులకు చెందిన కొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పండగలకు, శుభకార్యాలకు మాడుగుల వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు విదేశీ స్నేహితుల కోసం హల్వా తీసుకువెళ్లడం..ఆ రుచికి వారు మైమరచిపోవడం ఈ స్వీటుకున్న క్రేజ్ తెలియజేస్తుంది. హైదరాబాద్ చిత్రపురి హౌసింగ్ సొసైటీ జనరల్ సెక్రటరీ, సినీ నటుడు కాదంబరి కిరణ్‌కు మాడుగుల హల్వా అంటే చెప్పలేని ఇష్టం. అంతేకాదు చిత్రపురి కార్మికులకు తన స్నేహితుడైన కేజేపురం గ్రామానికి చెందిన పుట్టా ప్రసాద్ బాబుతో హల్వా రప్పించి పంపిణీ చేస్తుంటారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, భద్రాచలం, చెన్నై లాంటి నగరాల్లో కార్తీక ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, కోటి దీపాలంకరణ సమయాల్లో ఇక్కడ నుంచి హల్వా తీసుకెళ్లి వందలాది మంది నిరుద్యోగులు జీవనం సాగిస్తుంటారు. హల్వా టర్నోవర్ సాధారణ రోజుల్లో ఒక్కో షాపులో రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు విక్రయిస్తారు. పండగ, పర్యాటకుల రద్దీ ఉన్న సమయాల్లో రూ.4 వేలకు పైగా వ్యాపారాలు జరుగుతాయి. ఈ ఒక్కో షాపు నెలకు రూ.5లక్షలకు పైగానే వ్యాపారం సాగిస్తోంది. 5 వేల మందికి ఉపాధి మాడుగుల కేంద్రంగా తయారయ్యే హల్వా వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుంచి విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు ఎగుమతి చేస్తున్నారు. హల్వా సృష్టి కర్త దంగేటి ధర్మారావు నుంచి అతని కుమారుడు, మనుమలు, ముని మనవళ్లు హల్వా తయారీలో నిష్ణాతులు. తరాలు మారుతున్న హల్వా రుచి ఏ మాత్రం తగ్గలేదు. మాడుగుల నుంచి ఢిల్లీ తదితర ప్రాంతాలకు ప్రతి రోజు హల్వా విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. అరకు షూటింగ్‌కు వచ్చిన అల్లు అర్జున్, విజయశాంతి, రాజకీయ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సైతం నాటి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారని వ్యాపారులు దంగేటి మోహన్ , దాసరి ప్రసాద్ చెబుతున్నారు. అలాగే నాటి ప్రధాని ఇందిరా గాంధీ గత 40 ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు హల్వా రుచి చూసి..ఢిల్లీకి పంపాలని అప్పటి సీనియర్ నాయకుడు వేమరవపు వెంకటరమణకు చెప్పారట. అంతలా మాడుగుల హల్వా రుచి అందరి మనసు గెలుచుకుంది. పోస్టల్ కవర్ పై .. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసే హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. మాడుగుల వాసులు తయారు చేసే ఈ రకమైన హల్వాకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉందని అంతర్జాతీయంగా కూడా ప్రచారం జరిగింది. గోధుమ పాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి వాటితో మాడుగుల వాసులు తయారు చేసే హల్వా కూడా తపాలా శాఖ విడుదల చేసిన పోస్టల్ కవర్ల పై ఉండటంతో విస్తృత ప్రచారం జరుగుతోంది. మాడుగుల టు ప్యారిస్ మాది విశాఖ జిల్లా మాడుగుల మండలం సత్యవరం గ్రామం. ఉద్యోగరీత్యా ప్యారిస్‌లో 8 ఏళ్లుగా స్థిరపడ్డాం. మాడుగుల ఎప్పుడు వచ్చినా హల్వా తీసుకెళ్లి ప్యారిస్‌లో ఉన్న స్నేహితులకు ఇస్తుంటా..ఇండియా వచ్చినప్పుడు హల్వా మర్చిపోవద్దు అంటూ స్నేహితులు పదేపదే చెబుతుంటారు. –గోపిశెట్టి వెంకటేష్, మెకానికల్ ఇంజనీర్, ప్యారిస్ తరాలుగా ఒకటే రుచి తాతలు నాటి క్వాలిటీని నేటికీ కొనసాగిస్తున్నాం. ఆవు నెయ్యి, బాదం జీడి పలుకులు, గోధుమ పాలతో చేసే హల్వా రుచి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందుబాటు «ధరల్లో విక్రయాలు జరుపుతున్నాం. హల్వా తయారీలో మా ముత్తాత ధర్మారావు టెక్నిక్ అనుసరిస్తున్నాం. అందుకే రుచిలో ఒకలా ఉంటుంది. –దంగేటి మోహన్,హల్వా తయారీదారుడు మాడుగుల -
వివాహిత అదృశ్యం.. పాపం ఏమైందో..?
మాడుగుల రూరల్(విశాఖ జిల్లా): ముకుందపురం గ్రామానికి చెందిన వివాహిత చెలిబోయిన దేవి (22) ఈ నెల ఒకటో తేదీ రాత్రి నుంచి కనిపించడంలేదని శుక్రవారం ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ రామారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. చోడవరం మండలం ఖండిపల్లి గ్రామానికి చెందిన పోలిబాబుతో దేవికి ఏడాది క్రితం వివాహం జరిగింది. చదవండి: కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది.. అయితే ఇటీవల సొంతూరు మాడుగుల మండలం ముకుందపురం వచ్చిన ఆమె ఈ నెల ఒకటో తేదీ రాత్రి నుంచి కనిపించలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆమె ఆచూకీ తెలిసినవారు 9440796091, 08934–224233 నంబరుకు తెలియజేయాలని ఎస్ఐ కోరారు. -
ఆశల దీపం ఆరిపోయింది.. మంచి ప్రయోజకురాలిని చేద్దామన్న తల్లిదండ్రులు కలలు
అమ్మా నాన్నలకు టాటా చెబుతూ.. నగుమోముతో బడికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు విగత జీవులై తిరిగి వచ్చారు. మృత్యుపాశాలతో రోడ్లపై తిరిగే వాహనాలు వారిని బలిగొన్నాయి. జి.మాడుగుల మండలంలో పదో తరగతి చదువుతున్న బాలిక తండ్రి బండిపై ఇంటికి తిరిగి వస్తుండగా బొలెరో ఢీకొని మృతి చెందింది. పెందుర్తిలో మరో బాలిక పాఠశాల విరామ సమయంలో రోడ్డుపైకి వెళ్లి లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. జి.మాడుగుల: పాఠశాల విడిచి పెట్టాక తండ్రి బండిపై ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం పాలైంది. ఆమె తమ్ముడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ విషాద సంఘటన జి.మాడుగులలో ఆస్పత్రి (పీహెచ్సీ) జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. జి.మాడుగుల పంచాయతీ నేరోడివలస గ్రామానికి చెందిన కిముడు నూకరాజు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కూతురు వర్షిణి (15), ఆరో తరగతి చదువుతున్న కొడుకు ప్రశాంత్‌లను తన మోటార్ బైక్‌పై ఇంటికి తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వారపు సంత ముగించుకొని నిత్యవసర దుకాణదార్లను నర్సీపట్నం వైపు తీసుకువెళుతున్న బొలెరో పికప్ వాహనం ఆస్పత్రి జంక్షన్ వద్ద బైక్‌ను ఢీకొంది. వర్షిణి తీవ్రంగా గాయపడటంతో పీహెచ్‌సీకు తరలించగా అక్కడ మృతి చెందింది. ప్రశాంత్‌కు కుడిచేయి విరిగిపోయింది. నూకరాజు సురక్షితంగా బయటపడ్డారు. సిబ్బందితో ఎస్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసి బొలెరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చలాకీగా.. చదువులో చురుగ్గా.. ఈ ప్రమాదంలో మృతి చెందిన వర్షిణి చలాకీగా.. చదువులో చురుగ్గా ఉండేది. తమ కుమార్తెను మంచి ప్రయోజకురాలిని చేద్దామని తల్లిదండ్రులు కలలు కన్నారు. తండ్రి నూకరాజుది పేద కుటుంబం. వ్యవసాయం, కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జి.మాడుగులలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నాడు. అతనికి వర్షిణి, ప్రశాంత్ కాకుండా మరో కుమార్తె ఉంది. పదో తరగతికి చేరుకున్న తమ ముద్దుల పట్టి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళుతుందనుకుంటే.. తమ చేతులతోనే కాటికి పంపాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరి తరం కాలేదు. -
ఆదర్శంగా నిలుస్తున్న బూడి ముత్యాల నాయుడు
-
మాడుగుల నాగఫణి శర్మ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
-
విషాదం: పెద్దేరులో నలుగురు చిన్నారులు మృతి
సాక్షి, విశాఖపట్నం: అంతవరకు ఆనందంగా చిందులేసిన చిన్నారుల ముఖాలు వాడిపోయాయి.. నిత్యం కిలకిల నవ్వులతో తల్లిదండ్రులకు కన్నుల పండువగా నిలిచే ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి.. నలుగురు చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది.. మాడుగుల మండలం జమ్మదేవిపేట పంచాయితీ లోవ గవరవరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెద్దేరు కాలువకు దుస్తులు ఉతకడానికి వెళ్లారనుకొని వంతాల వెంకట ఝాన్సీ (10), వంతాల వెంకటగౌతమ్ షరి్మల (భవ్య) (7), వంతాల జాహ్నవి (11), నీలాపు మహీధర్ (7) ప్రమాద స్థలానికి వెళ్లారు. అక్కడ తల్లిదండ్రులు లేకపోవడంతో నీటిలో దిగి ప్రమాదానికి లోనయ్యారు. వారంతా దగ్గరి బంధువులే.. వరుసకు అన్నదమ్ముల పిల్లలే. గంట వ్యవధిలోనే ఈ దారుణం జరిగింది. నాలుగు కుటుంబాల్లో కలత రేపింది. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం వంతాల వెంకట ఝాన్సీ తల్లిదండ్రులకు ఏౖMðక కుమార్తె. కూలినాలి చేసి గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదివిస్తున్నారు. ఉన్నత చదువులు చదివించాలనున్న ఆశయం ఆదిలోనే నీరిగారిపోయిందని తండ్రి చినబాబు రోదిస్తున్నాడు. వంతాల వెంకట గౌతమ్ç Üషరి్మల అక్క రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తమ్ముడున్నాడు. నీలాపు మహేందర్ రెండో తరగతి చదువుతున్నాడు. ఒక్కడే కొడుకు కావడంతో తండ్రి నాగరాజుకు పోడు వ్యవసాయం చేసి చదివిస్తున్నాడు. వంతాల జాహ్నవి (భవ్య) తల్లిదండ్రులతో చింతపల్లి మండలం రాజుపాకలు గ్రామంలో ఉంటోంది. కరోనా వల్ల బడులు లేకపోవడంతో బంధువుల ఇంటికి గవరవరం వచ్చి, ఈ ప్రమాదానికి లోనైంది. పిల్లలకు పోస్టుమార్టం వద్దని ఎంపీడీఓ ఎం.పోలినాయుడు, ఇన్చార్జి తహసీల్దార్ సత్యనారాయణలను తల్లిదండ్రులు కోరారు. పెద్దల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయిస్తామని వారు బదులిచ్చారు. ఎస్ఐ పి.రామారావు, సర్పంచ్ కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ పార్టీ మండల అధ్యక్షుడు తాళ్ళపురెడ్డి వెంకట రాజారామ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో చిన్నారులను ఒడ్డుకు చేర్చారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలకు నిలయం మాడుగుల రూరల్: పెద్దేరు జలాశయం పరిసర ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. ఈ రిజర్వాయర్ నుంచి వచ్చే కాలువలు మృత్యునిలయాలవుతున్నాయి. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ నీటి లోతు గురించి తెలియక చిక్కుల్లో పడుతున్నారు. లోవ గవరవరం వద్ద సోమవారం నలుగురు చిన్నారులు జలసమాధి అయిన దారుణం ఒక్కటే కాదు.. ఈ నెల 11న బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట వద్ద నదిలోకి దిగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 2018లో లోవ కొత్తపల్లి మావూళ్లమ్మ గుడి ప్రాంతంలో విహార యాత్రకు వచ్చిన ముగ్గురు యువ ఇంజినీర్లు ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు నీటి ప్రవాహం పెరిగినప్పుడు కూడా గతంలో ఇద్దరు పెద్దేరు నది లో పడి గల్లంతయ్యారు. కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడి ప్రమాద పరిస్థితి గురించి తెలుస్తుందని స్థానికులు సూచిస్తున్నారు. -
అలుపెరగని సేవకి... డాక్టర్ పద్మావతి!
గురజాల: గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల పీహెచ్సీలో పనిచేస్తోన్న డాక్టర్ జి.పద్మావతి కోవిడ్ వారియర్‌గా కరోనా రోగులకు నిర్విరామ సేవలు అందిస్తున్నారు. పీహెచ్సీలో పద్మావతితో పాటు మరో డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ సెలవులో ఉండటంతో పద్మావతి ఒక్కరే సేవలు అందిస్తున్నారు. అనుమానితులకు కరోనా పరీక్షలు చేయించడం నుంచి వ్యాక్సినేషన్ వరకు అన్నీ డాక్టర్ పద్మావతి పర్యవేక్షిస్తున్నారు. నిత్యం పీహెచ్సీ పరిధిలో పదుల సంఖ్యలో కరోనా టెస్టులు, వందల సంఖ్యలో కోవిడ్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మాడుగుల పీహెచ్సీ పరిధిలో 95 మందికి పైగా కరోనా రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించి, వారికి సలహాలిచ్చి త్వరగా కొలుకునే విధంగా పద్మావతి చర్యలు తీసుకుంటున్నారు. వరండాలోనే నిద్ర... డాక్టర్ పద్మావతికి పదేళ్లు, ఏడేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. రోజూ వైద్యశాలలో కోవిడ్ అనుమానితులకు పరీక్షలు చేయించిన తరువాత ఇంటికి వెళ్తే పిల్లలకు ఇబ్బందులు వస్తాయనే భావనతో వారిని తన పుట్టింటికి పంపించారు. విధుల అనంతరం ఇంటికి వెళ్లినా బయట నుంచే తన భర్త శ్రీహర్ష, అత్త బాగోగులు తెలుసుకుంటున్నారు. ఇంటి వరండాలో ఉన్న గదిలోనే నిద్రిస్తున్నారు. భర్త కూడా వైద్యుడు కావడంతో ఆమెను ప్రోత్సహిస్తున్నారు. సేవలోనే సంతృప్తి.. కోవిడ్ రోగులకు సేవ చేయడం ఎంతో తృప్తినిస్తోంది. రామాపురానికి చెందిన ఒక వృద్ధుడు కోవిడ్ బారిన పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటే, అతని కుమారుడు ఆస్పత్రికి తీసుకురావడం కుదరదని చెప్పాడు. వెంటనే అతని ఇంటికి ప్రైవేట్ అంబులెన్సును పంపి, అతనికి ఆక్సిజన్ అందించి గుంటూరుకు రిఫర్ చేయడంతో ఆ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతని ప్రాణాలను కాపాడినందుకు ఎంతో ఆనందంగా ఉంది. – జి పద్మావతి, మాడుగుల పీహెచ్సీ వైద్యురాలు -
పెళ్లి కొడుకు మృతి, 9మందికి తీవ్రగాయాలు
సాక్షి, జి.మాడుగుల (పాడేరు): మండలంలో గడుతూరు పంచాయతీ మగతపాలెం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి వ్యాన్ బోల్తా ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండగా, 35 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. గూడెంకొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ, కడుగుల గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వంతాల శివ వారం రోజుల క్రితం మగతపాలెం గ్రామానికి చెందిన గిరిజన యువతిని వివాహం చేసుకున్నాడు. కడుగుల గ్రామం నుంచి వ్యాన్‌లో నవ వధూవరులు, వారి బంధువులు చుట్టరికం నిమిత్తం గురువారం మగతపాలెం వచ్చారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రి 45 మంది వ్యాన్‌లో తిరుగు పయనమయ్యారు. (దారుణం: అత్యాచారం.. ఆపై నోట్లో గడ్డిమందు పోసి) మగతపాలెం సమీపంలోని ఘాట్‌రోడ్డుకు వచ్చేసరికి వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇదే వ్యాన్‌లో ఉన్న పెళ్లి కొడుకుతో పాటు, కడుగుల గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సీదరి పొట్టి, వంతాల పండు, వంతాల శివ, రవి, శ్రీరాములు, కృష్ణ, పవన్బాబు, వంతాల వెంకటరావుతోపాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా పెళ్లికొడుకు వంతాల శివ మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. -
విశాఖ: జి మాడుగులలో రోడ్డుప్రమాదం
-
లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్య
సాక్షి, గుంటూరు(మాడుగుల) : లైంగిక వేధింపులు తాళలేక వివాహిత మహిళ గనిపల్లి మరియకుమారి (24) మంగళవారం అర్ధ రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడుగుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి అన్నారావు తన అక్క కూతురైన మరియకుమారిని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. బడ్డీకొట్టు నడుపుతూ, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గనిపల్లి దిలీప్‌లెవి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా దిలీప్‌లెవి తన సెల్ ఫోన్‌ను పిల్లలతో మరియకుమారి వద్దకు పంపించి ఆమెతో మాట్లాడాలంటూ లైంగికంగా వేధిస్తున్నాడు. ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లినా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దిలీప్‌లెవి గతంలో రెండు మొబైల్స్‌ను పంపించగా మరియకుమారి భర్త అన్నారావు తీసుకొని గొడవపడ్డారు. మంగళవారం సాయంత్రం మరో మొబైల్‌ఫోన్ పిల్లలతో పంపించగా గమనించిన భర్త తీసుకొని ఆమె తల్లి, తమ్ముడికి విషయం తెలిపాడు. తమ్ముడు దారివేముల సునీల్ అక్కను మందలించగా తనకు ఏ పాపం తెలియదని, దిలీప్‌లెవి తనను చాలా కాలంగా వేధిస్తున్నాడని బోరున విలపించింది. అనంతరం మనస్తాపానికి గురైన మరియకుమారి అర్ధరాత్రి సమయంలో భర్త నిద్రపోతుండగా ఇంట్లో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున నిద్రలేచిన భర్తకు భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలికి తొమ్మిదేళ్ల మానసిక దివ్యాంగుడైన కుమారుడు అశోక్, పదేళ్ల ప్రమీళ, మూడేళ్ల లతిక, 14 నెలల రుషి ఉన్నారు. అమ్మా...లే అంటూ పిల్లలు దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సంధ్యను చిదిమేశాయి!
వెదురుకొమ్మల కోసం అడవికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారి అనుకోని ప్రమాదంలో చిక్కకొని ప్రాణాలు కోల్పోయింది. కందిరీగలు దాడి చేసి కుట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషాద సంఘటన జి.మాడుగుల మండలంలో చోటుచేసుకోగా..వంతాల సంధ్య మృత్యువుఒడిలోకి చేరింది. కందిరీగల దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు. సాక్షి, జి.మాడుగుల : కె.కోడాపల్లి పంచాయతీ కవలపూలు పైవీధి గ్రామానికి చెందిన వంతాల సుబ్బారావు, వంతాల సీత భార్యభర్తలు. వీరితో పాటు ముగ్గురు ఆడపిల్లలు, గ్రామానికి చెందిన మరో ముగ్గురు గిరిజనులు కలసి గన్నేరుపుట్ట గ్రామం వద్ద అడవికి గురువారం సాయంత్రం సమయంలో వెదురుకొమ్ములు సేకరించటానికి వెళ్లారు. ఇంతలో కందిరీగలు గుంపుగా వచ్చి వీరిపై దాడి చేయగా వీరిలో అయిదుగురు వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు. వంతాల సీత, వంతాల సంధ్య (6), 3 సంవత్సరాల వయస్సు గల వంతాల లక్ష్మిలపై కందిరీగలు, కొండ ఈగలు దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారాన్ని ఆశ వర్కర్ వైద్య సిబ్బందికి తెలిజేశారు. దీంతో అంబులెన్స్ పంపించి హుటాహూటిన జి.మాడుగుల పీహెచ్‌సీకి రాత్రి ఎనిమిది గంటల సమయంలో తరలించారు. వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ వైద్యం అందిస్తున్న సమయంలో వంతాల సంధ్య మృతి చెందింది. మృతురాలి తల్లి సీత, వంతాల లక్ష్మిలకు చికిత్స అందించారు. వీరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా కందిరీగల దాడిలో తీవ్రంగా గాయపడిన వంతాల సీత, 3 సంవత్సరాల వంతాల లక్ష్మిలకు మరోసారి వైద్యం అందించేందుకు శుక్రవారం ఉదయం వైద్య సిబ్బంది, ఏఎన్ఎం సుమిత్ర, హెల్త్ అసిస్టెంట్ సప్పి బాలయ్యలు కవలపూలు గ్రామానికి ప్రయాసపడి కాలినడక వెళ్లారు. సీత, లక్షిలను వైద్యం చేయింటానికి అంబులెన్స్ ఏర్పాటు చేసి ఎంత బతిమిలాడిన ససేమిరా అన్నారు. దీంతో భాషా సంస్కృతులతో వైద్యానికి ఒప్పించి పాడేరు కమ్యూనిటీ ఆస్పత్రికి తలించి వైద్యం చేయించారు. సీత, లక్ష్మిలు ఆరోగ్యంగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
పేరు గల మాడుగుల హల్వా
మాడుగుల హల్వా ఘుమఘుమలు ఎల్లలు దాటాయి.నాలుగు తరతరాలు గడుస్తున్నాహల్వాకు ఆదరణ తగ్గలేదు.నేటికీ నిత్య మధురంగా ఉంటూ,అందరి నోటినీ పలకరిస్తోంది.విశాఖపట్టణం వచ్చినవారికి, మాడుగుల కూడా ఒక పర్యాటక ప్రదేశమే.సుమారు 125 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మాడుగుల హల్వా ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్... మాడుగుల పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చేది నోరూరించే హల్వా. ఈ తీయని పేరు సముద్ర తీరాలు దాటింది. విశాఖపట్టణానికి వచ్చినవారు, అక్కడి ప్రదేశాలను సందర్శించాక, నేరుగా మాడుగుల చేరుకుంటారు. నేతి వాసనతో ఘుమఘుమలాడే హల్వా రుచి చూస్తారు. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఆ హల్వాకు మాడుగుల హల్వా అని పేరు వచ్చింది. 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో పురుడు పోసుకుంది ఈ హల్వా. ఇంతింతై వటుడింతౖయె నుంచి త్రివిక్రముని స్థాయికి చేరినక ఈ హల్వా దేశ సరిహద్దులు దాటింది. హల్వా పుట్టుక మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు సుమారు 130 ఏళ్ల కిందట మిఠాయి వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో బూడిద గుమ్మడి, కొబ్బరికాయలతో హల్వా తయారు చేసి అమ్మేవారు. కొంతకాలం తరవాత ఏదో ఒక కొత్త రకమైన స్వీట్ తయారుచేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన... తియ్యని హల్వా రూపంలో ఆచరణలోకి వచ్చింది. మాడుగుల హల్వా తయారీ విధానం మంచి రకం గోధుమలను మూడు రోజుల పాటు నానబెట్టి, రుబ్బి, గోధుమ పాలు తీస్తారు. ఆ పాలను ఒక రోజు పులియబెట్టి ఆ తర్వాత పెద్ద పాత్రలో పోస్తారు. నెయ్యి, బెల్లం జత చేసి, మంట మీద ఉంచి, పాలు బాగా మరిగి దగ్గర పడేవరకు కలిపి దింపేస్తారు. జీడి పప్పు, బాదం పప్పులతో అలంకరిస్తారు. హల్వా తయారీ వినడానికి, చూడటానికి సులువుగానే అనిపిస్తుంది కానీ, పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కొద్దిగా కష్టమే. మాడుగుల వాతావరణం, అక్కడి నీటిలో ఉండే గొప్పదనం వల్లే ఇంత రుచి వస్తుందని మాడుగుల వాస్తవ్యులు గర్వంగా చెప్పుకుంటారు. ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా హల్వాకు మాడుగుల కుటుంబం వారికి వచ్చిన రుచి రావటం లేదని అందరూ చెబుతుంటారు. వారికి మాత్రమే అంత రుచి రావడానికి వారు కొన్ని కారణాలు చెబుతారు. గోధుమలను రోటిలో రుబ్బడంలో నైపుణ్యం ప్రదర్శించడం, రుబ్బిన పాలను ఇనుప కళాయిలో వేసి, పాకం వచ్చే వరకు అదే వేడిలో మరగ పెట్టి హల్వా పాకం తయారు చేయడం మాడుగుల హల్వాకు రుచి రావడానికి కారణాలు. హల్వాలో పెరుగుతున్న రకాలు మొదటలో హల్వా ఒకటే రకం ఉండేది. విక్రయాలు పెరగడంతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి హల్వాను... ఆవు నెయ్యి బాదం పప్పు బెల్లం గోధుమ పాలు; డాల్డా జీడి పప్పు బెల్లం గోధుమ పాలు; డాల్డా గోధుమపాలు నెయ్యి చక్కెరలతో మూడు రకాలుగా తయారుచేస్తున్నారు. పెరుగుతున్న షాపులు మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. కొన్నాళ్ల తరవాత వారి హల్వా తయారీ విషయం బయటకు తెలియడంతో మరో మూడు కుటుంబాలు కూడా హల్వా తయారుచేయడం ప్రారంభించారు. రుచిలోను, క్వాలిటీలోనూ దంగేటివారి హల్వా ఎక్కడా రాజీ పడలేదు. ఎన్ని షాపులు వచ్చినా దంగేటి వారి హల్వా షాపుకే మంచి పేరు ఉంది. రెండు వేల కుటుంబాలకు ఆధారం మాడుగుల హల్వా వ్యాపారం కారణంగా సుమారు 2000 కుటుంబాలు సుఖవంతమైన జీవనం సాగిస్తున్నాయి. మాడుగులలో ఉన్నత చదువులు చదువుకుని ఇతర దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు వారంతా తప్పనిసరిగా హల్వా తీసుకెళ్ళి అక్కడ వారికి రుచి చూపిస్తున్నారు. నాలుగు తరాలుగా తగ్గని ఆదరణ... దంగేటి ధర్మారావు నుండి అతని కుమారుడు కొండలరావు, మనుమడు దంగేటి మూర్తి, ముని మనముడు మెహన్ వరకూ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అరకులోయకు షూటింగులకు వచ్చే సినీ నటులు ఈ హల్వాను తప్పక రుచి చూస్తారు. దివంగత ముఖ్యమంత్రి వై.స్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ హల్వా రుచి చూశారు. హల్వా ద్వారానే మాడుగుల ప్రసిద్ధి మత్స్య వంశ రాజుల పాలనలో మాడుగుల సామ్రాజ్యం ఉండేది. వారి పరిపాలనలో మాడుగుల ప్రాంతానికి పేరుప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, హల్వా ద్వారానే మాడుగులకు దేశవిదేశాలలో మంచి గుర్తింపు వచ్చింది. మాడుగుల నుండి వచ్చామని ఎవరితోనైనా అనగానే, ‘‘హల్వా తెచ్చారేమిటి బాబూ, అదెలా తయారువుతుంది. మళ్లీ ఎప్పుడు వస్తావు, మీరు వచ్చినపుడు హల్వా తీసుకురావడం మరవకండి’’ అని పలకరించడం పరిపాటిగా మారిపోయిందని స్థానికులు చెబుతారు. - కరణం నారాయణరావు, సాక్షి, మాడుగుల, విశాఖపట్నం జిల్లా తరాలుగా ఒకటే రుచి నేటికీ కొనసాగిస్తున్నాం... ఆవు నెయ్యి, గోధుమలు, కూలీల ధరలు పెరిగినా, లాభాలు ఆశించకుండా, ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్నాం. మా ముత్తాత ధర్మారావు కనిపెట్టిన హల్వాను క్వాలిటీ తగ్గకుండా నేటి వరకు ఒకే విధంగా తయారు చేస్తున్నాం. అడ్రసు చెబితే చాలు ఎంత దూరమైన అందజేస్తున్నాం. - దంగేటి మోహన్, మునిమనుమడు, మాడుగుల -
వహ్వా.. హల్వా!
కాకినాడ కాజాకు, బందరు లడ్డూకు.. ఆత్రేయపురం పూతరేకులకు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మధురమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ వరుసలోనే విశాఖ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మాడుగుల హల్వా. పేరులోనే కాదు రుచిలో కూడా దీనికి సాటి మరొకటి లేదని చెప్పక తప్పదు. ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో 128ఏళ్ల క్రితం పుట్టిన ఈ హల్వా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సాక్షి, మాడుగుల: విశాఖ జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన మిఠాయి వ్యాపారి దంగేటి ధర్మారావుకు 1890 ప్రాంతంలో కొత్తరకమైన మిఠాయి తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. అంతే.. బూడిద గుమ్మడి, కొబ్బరి కాయ రసంతో హల్వా తయారుచేశారు. దీని తయారీ ఎలాంటే.. ముందుగా మేలు రకం గోధుమలు 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీయాలి. వాటిని ఒక రోజు పులియబెట్టాలి. ఆ తరువాత గోధుమ పాలు, నెయ్యి కలిపి దగ్గరకు మరిగే వరకు కలపాలి. ఆ పాకాన్ని దించి వాటిపై ఫ్లేవర్ కోసం జీడిపప్పు బాదం పప్పు వేయాలి. మాడుగుల హల్వా యవ్వన శక్తి పెంచడంతోపాటు శరీర స్థితిని నిలకడగా ఉంచుతుందని స్థానికుల నమ్మకం. పెరుగుతున్న షాపులు మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. దంగేటి కుటుంబంలో మాత్రమే హల్వా తయారీ జరిగేది. అయితే, తయారీ గుట్టు రట్టవ్వడంతో ప్రస్తుతం వ్యాపారం విస్తరించింది. ఇక్కడ తయారవుతున్న హల్వాను మొబైల్ వ్యాన్ల ద్వారా పార్శిళ్లు, కొరియర్ల ద్వారా ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాలకు పంపిస్తున్నారు. కాగా, ఇటీవల వరకు మేలు రకాన్ని కేజీ రూ.260 వరకు విక్రయించిన తయారీదారులు ముడిసరుకుల ధరలు పెరగడంతో దానిని రూ.400కు పెంచక తప్పలేదు. 1,500 కుటుంబాలకు ఆధారం మాడుగుల కేంద్రంగా తయారయ్యే హల్వా వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా 1500 మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుండి విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు దళారులు తీసుకెళ్లి విక్రయిస్తారు. విదేశాల్లో ఉంటే స్థానికులు ఇక్కడకు వచ్చి వెళ్ళినపుడల్లా హల్వాను తీసుకెళ్లడం పరిపాటి. ఇలా దేశ విదేశాలకు మాడుగుల హల్వా పరిచయమైంది. అంతేకాక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు జరిగినా ఇది ఉండడం ఆనవాయితీ. ప్రముఖుల మెప్పు పొందిన హల్వా విశాఖ జిల్లా అరుకు షూటింగ్‌లకు వచ్చే సినీ ప్రముఖులు చాలామంది ఈ హల్వా రుచిచూసి వహ్వా అన్నవారే. దివంగిత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారు. అలాగే, ఇందిరాగాంధీ 40 ఏళ్ల కిందట ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హల్వా రుచి చూసిన వారేనని స్థానిక సీనియర్ వ్యాపారులు చెబుతున్నారు. ఇలా దంగేటి ధర్మారావు సృష్టించిన ఈ హల్వాను అతని కుమారుడు కొండలరావు, మనుమడు మూర్తి, ముని మనముడు మోహన్ వరకూ నాలుగు తరతరాలుగా మిఠాయి ప్రియుల మన్ననలు అందుకుంటున్నారు. మాడుగుల హల్వా రుచి అద్భుతం మాడుగుల వచ్చినపుడల్లా అమెరికాకు హల్వా తీసుకెళ్లి స్నేహితులుకు అందజేస్తుంటాను. పుట్టింది మాడుగుల మండలం సత్యవరం గ్రామం. కానీ, ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్నాను. ఫంక్షన్లకు, పండుగలకు కొరియర్ల ద్వారా అమెరికాకు తెప్పించుకుంటున్నాం. – గోకేడ వెంకటేశ్వర సత్యనారాయణ తరాలుగా ఒకటే రుచి తాతల నాటి క్వాలిటీని నేటికీ కొనసాగిస్తున్నాం. ఆవు నెయ్యి, గోధుమలకు, కూలీలకు ధరలు పెరిగినా పెద్దగా లాభాలు ఆశించకుండా సామాన్యులుకు అందుబాటులో «ధరలో ఉంచుతున్నాం. మా హల్వా రుచికరంగా ఉండడానికి ఇక్కడి నీరే కారణం. – దంగేటి మోహన్, హల్వా వ్యాపారి, మాడుగుల -
526 కేజీల గంజాయి పట్టివేత
మాడుగుల: విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల మండలం, గరికిబంద చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ అండ్ ప్రొబిషిన్ అధికారులు వాహానాలు తనిఖీలు నిర్వహించారు. వాన్లో అక్రమంగా తరలిస్తున్న 526 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు పరారయ్యారు. పోలీసులు వ్యాన్, బైక్ సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి
మాడుగుల: రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే కాంట్రావత్ తండాకు చెందిన గణేష్(15), సురేశ్(15), మోహన్(15)లు గ్రామ సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరులో ఈతకెళ్లారు. ప్రమాదవశాత్తూ లోతును గుర్తించలేక నీటిలో మునిగి ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.