మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లిలో విషాదం చోటుచేసుకుంది.
మాడుగుల: రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే కాంట్రావత్ తండాకు చెందిన గణేష్(15), సురేశ్(15), మోహన్(15)లు గ్రామ సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరులో ఈతకెళ్లారు.
ప్రమాదవశాత్తూ లోతును గుర్తించలేక నీటిలో మునిగి ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.