వి.మాడుగుల (విశాఖపట్నం) : రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వడానికి మండల ఇంజనీర్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. విశాఖపట్నం జిల్లా వి.మాడుగుల మండల ఇంజనీర్‌గా పని చేస్తున్న సీహెచ్.అంబేడ్కర్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.44 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు.