సాక్షి,హైదరాబాద్ : రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాడి ఆగస్ట్ నెలలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.5కోట్లకు పైచీలుకు స్థిర,చర ఆస్తుల గుర్తించారు.అయితే రూ.4కోట్ల 19లక్షల విలువైన ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు.
రూ.8లక్షల లంచం తీసుకుంటూ
ఈ ఆగస్ట్ 13న రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. వ్యక్తి ధరణి వెబ్ సైట్‌లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. తాజాగా మరోసారి సోదాలు నిర్వహించగా భూపాల్‌రెడ్డి వద్ద భారీ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment