bhoopal reddy
-
ఏసీబీ సోదాలు.. కోట్లలో బయటపడ్డ అడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు
సాక్షి,హైదరాబాద్ : రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాడి ఆగస్ట్ నెలలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.5కోట్లకు పైచీలుకు స్థిర,చర ఆస్తుల గుర్తించారు.అయితే రూ.4కోట్ల 19లక్షల విలువైన ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు. రూ.8లక్షల లంచం తీసుకుంటూఈ ఆగస్ట్ 13న రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. తాజాగా మరోసారి సోదాలు నిర్వహించగా భూపాల్‌రెడ్డి వద్ద భారీ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు. -
భోజనం చేశాక అకస్మాత్తుగా ఎక్కిళ్లు.. ఇంతలోనే విషాదం!
మెదక్: ఎక్కిళ్లు ఓ ట్రాక్టర్ డ్రైవర్‌ను బలితీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఖానాపూర్(కె)లో చోటుచేసుకుంది. గ్రామనికి చెందిన నర్వ సాయిలు(39) పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి భోజనం చేశాక అకస్మాత్తుగా ఎక్కిళ్లు మొదలయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఈలోగా సాయిలు మృతిచెందాడు. ఎక్కిళ్లు రావడంతో గుండెపోటుకు గురైనట్టు 108 సిబ్బంది తెలిపారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఇవి చదవండి: శరణ్యా ఎక్కడమ్మా..? అంటూ తల్లి వేదన.. 'పొదల్లో పడేశా.. చెరువులో వేశానంటూ భర్త సమాధానం..! Follow the Sakshi TV channel on WhatsApp: -
ప్రొటెం చెర్మన్‌గా వి భూపాల్‌రెడ్డి నియామకం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ప్రొటెం చెర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన భూపాల్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళసై ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 4 నుంచి భూపాల్ రెడ్డి ప్రొటెం చెర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఎన్నికై చైర్మన్ పదవిని దక్కించుకున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ల పదవీకాలం గురువారంతో ముగిసింది. చదవండి: భూముల డిజిటల్ సర్వేపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం -
'కిరణ్‌పై తెలంగాణ ప్రభుత్వంతో విచారణ జరిపిస్తాం'
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అన్నారు. శుక్రవారం టి. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భూపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని మొత్తం లోక్‌సభ, శాసనసభ స్థానాలలో విజయం సాధించి సోనియాకు కానుకగా ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా రాజీనామా చేసిన కిరణ్‌పై ఎమ్మెల్సీలు ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్ తన పదవికి రాజీనామా చేసే ఆరునెలల ముందు నుంచి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఆయన అవినీతిపై విచారణ జరిపించాలని త్వరలో తెలంగాణ ప్రాంతంలో ఏర్పడే ప్రభుత్వాన్ని కోరతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతిని తొలగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సాధించుకుని శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రాబోతున్న తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికేందుకు భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ వరకు గన్‌పార్క్ వరకు భారీగా ర్యాలీ చేపడుతున్నట్లు టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.