
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభించారు.
అంబేద్కర్, పూలే ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, సీఎం జగన్ బడుగు బలహీనర్గాలకు చేసిన మంచిని వివరిస్తామని మంత్రి బొత్స అన్నారు. కొన్ని పత్రికలు, టీవీలు యాత్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎలాంటి అవినీతి లేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగినట్లు అవినీతి ఈ ప్రభుత్వంలో జరగలేదన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడయితే ఎందుకు జైలులో ఉంటారు.. కన్ను బాగోలేదని బెయిల్ ఇచ్చారు.. మళ్లీ నాలుగు వారాల తరువాత మళ్ళీ జైలుకు రమ్మనారు’’ అని మంత్రి పేర్కొన్నారు
ఇది బడుగు బలహీనర్గాల ప్రభుత్వం: రాజన్న దొర
డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ, మా ప్రభుత్వం బడుగు బలహీనర్గాల ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను 98 శాతానికి పైగా సీఎం జగన్ అమలు చేశారు.. హామీలు ద్వారా బడుగు బలహీనర్గాలు ఎక్కువ లబ్ది పొందారని మంత్రి అన్నారు.
ఎన్నికల ఫలితమే సమాధానం చెబుతుంది: ముత్యాల నాయుడు
డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు మాట్లాడుతూ, తనపై ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని, ఆరోపణ చేసిన ప్రతిసారి ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నానన్నారు. ‘‘నా పనితనానికి వచ్చే ఎన్నికల ఫలితమే సమాధానం చెబుతుంది. సభకు వచ్చి జనాలను చూస్తే మాడుగుల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని ముత్యాల నాయుడు అన్నారు.
చదవండి: చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
Comments
Please login to add a commentAdd a comment