Madugula Assembly Constituency
-
మాడుగుల ఇన్చార్జి ఎంపీపీగా రాజారామ్
రాజారామ్‌కు ఉత్తర్వుల కాపీ అందజేస్తున్న జెడ్పీ సీఈవో పోలినాయుడు మాడుగుల: వైస్ ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్‌కు ఇన్చార్జి ఎంపీపీ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జెడ్పీ సీఈవో ఎం. పోలినాయుడు సోమవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో రాజారామ్‌కు ఆర్డర్ కాపీ అందజేశారు. మాడుగుల ఎంపీపీ రామధర్మజ వ్యక్తిగత కారణాలతో తన పదవికి ఇటీవల రాజీనామా చేసిన విదితమే. దీంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆ బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కిముడు రమణమ్మ, వైస్ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాస్, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ గోపాల్‌రావు, ససర్పంచ్ ఎడ్ల కళావతి, వీరవిల్లి కోఆపరేటివ్ పర్సన్ ఇన్చార్జి కొరుకొండ చెల్లంనాయుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు కాత వెంకటరమణ పాల్గొన్నారు. -
మాడుగుల ఎంపీపీ పదవికి రామధర్మజ రాజీనామా
మాడుగుల రూరల్ : మాడుగుల మండల పరిషత్ అధ్యక్ష పదవికి వేమవరపు రామధర్మజ (పెదబాబు) సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఉమ్మడి జిల్లా పరిషత్ సీఈవో ఎం.పోలినాయుడుకు అందజేశారు. తాను ఎంపీటీసీగా కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈవో పోలినాయుడు మాట్లాడుతూ ఎంపీపీ రాజీనామా లేఖను కలెక్టర్ అమోదం కోసం పంపిస్తామన్నారు. పెదబాబు మాట్లాడుతూ తనకు రెండున్నర సంవత్సరాలు పాటు సహకరించిన ఎంపీటీసీ సభ్యులు, నాయకులకు, ఉద్యోగులకు కృతజ్జతలు తెలిపారు. -
ప్రజలకు చేసిన మంచిని వివరిస్తున్నాం: మంత్రి బొత్స
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్, పూలే ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, సీఎం జగన్ బడుగు బలహీనర్గాలకు చేసిన మంచిని వివరిస్తామని మంత్రి బొత్స అన్నారు. కొన్ని పత్రికలు, టీవీలు యాత్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎలాంటి అవినీతి లేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగినట్లు అవినీతి ఈ ప్రభుత్వంలో జరగలేదన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడయితే ఎందుకు జైలులో ఉంటారు.. కన్ను బాగోలేదని బెయిల్ ఇచ్చారు.. మళ్లీ నాలుగు వారాల తరువాత మళ్ళీ జైలుకు రమ్మనారు’’ అని మంత్రి పేర్కొన్నారు ఇది బడుగు బలహీనర్గాల ప్రభుత్వం: రాజన్న దొర డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ, మా ప్రభుత్వం బడుగు బలహీనర్గాల ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను 98 శాతానికి పైగా సీఎం జగన్ అమలు చేశారు.. హామీలు ద్వారా బడుగు బలహీనర్గాలు ఎక్కువ లబ్ది పొందారని మంత్రి అన్నారు. ఎన్నికల ఫలితమే సమాధానం చెబుతుంది: ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు మాట్లాడుతూ, తనపై ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని, ఆరోపణ చేసిన ప్రతిసారి ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నానన్నారు. ‘‘నా పనితనానికి వచ్చే ఎన్నికల ఫలితమే సమాధానం చెబుతుంది. సభకు వచ్చి జనాలను చూస్తే మాడుగుల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని ముత్యాల నాయుడు అన్నారు. చదవండి: చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు