పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
విశాఖ విద్య: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డీఎస్సీ నిర్వహణకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. విద్యాశాఖ వర్గాలు, నిరుద్యోగ అభ్యర్థుల్లో బుధవారం దీనిపై సర్వత్రా చర్చ సాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ వస్తోందని నిరుద్యోగ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీలో జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి. వీటిలో క్యాడర్ వారీగా ఎన్ని ఉన్నాయనే దానిపై అభ్యర్థులు ఆరా తీశారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన నియామకాల ప్రక్రియ ఉండటంతో ఉపాధ్యాయ కొలువు దక్కించుకునేందుకు అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమశాఖ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీలో ఖాళీలను గుర్తించారు.
పట్టుదలతో సిద్ధమవుతున్నా..
డీఎడ్ పూర్తి చేశాను. డీఎస్సీ ప్రిపరేషన్ కోసమని నర్సీపట్నం ప్రాంతం నుంచి నా భర్తతో కలసి విశాఖ నగరానికి వచ్చాం. ఎలాగైనా డీఎస్సీలో పోస్టు దక్కించుకోవాలనే పట్టుదలతో సిద్ధమవుతున్నాను. అనుకున్నట్లుగానే మెగా డీఎస్సీకి ప్రభుత్వం ఆమోదించటం సంతోషంగా ఉంది.
– సింగంపల్లి వెంకట లక్ష్మి,
కల్యాణలోవ, అనకాపల్లి జిల్లా
కాలేజీలకు క్రేజ్ పెరుగుతుంది
డీఎస్సీ నోటిఫికేషన్లు తరచూ ఉంటే, బీఈడీ, డీఎడ్ శిక్షణా కళాశాలలకు ఆదరణ ఉంటుంది. ఈ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా మెగా డీఎస్సీ ఉంటుందని అంతా ఊహించినదే. నిరుద్యోగ అభ్యర్థులు కూడా అదే నమ్మకంతో ప్రిపరేషన్‌లో ఉన్నారు. మొత్తానికి అంతా శుభసూచికమే.
– గొట్టేట రవి, సీనియర్ ఫ్యాకలీ్ట, ప్రభుత్వ డైట్ కాలేజీ, భీమునిపట్నం
సీఎం మాట నిలుబెట్టుకున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నట్లుగానే డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులు అందుబాటులోకి వస్తారు. దీని వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులపై కూడా భారం తగ్గుతుంది. నోటిఫికేషన్ నాటికి ఇంకాస్తా పోస్టులు పెరుగుతాయనే నమ్మకం ఉంది.
– చొక్కాకుల సూర్యనారాయణ, వైఎస్సార్ టీఎఫ్ అధ్యక్షుడు, విశాఖ జిల్లా
సంతోషంగా ఉంది
మెగా డీఎస్సీకి ప్రభుత్వం ఆమోదించటం సంతోషంగా ఉంది. డీఎడ్ చేసి గతంలో డీఎస్సీ రాశాను. ప్రస్తుతం బీఈడీ మాథ్య్ మెథడాలజీతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ప్రయతి్నస్తున్నాను. టీచర్ పోస్టు సాధించాలని 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. పోస్టుల సంఖ్య పెంచితే బాగుండేది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందనే నమ్మకం ఉంది.
–కొమ్ము సూర్యకళ, ముడిదాం, విజయనగరం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment