ఐదేళ్లలో సమూలంగా మారిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రూపురేఖలు
దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ఎంఎస్‌ఎంఈల స్థాపనతో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు
కొత్తగా ఏర్పడిన అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోనూ మౌలిక వసతులు
ఓ వైపు పర్యాటకంగా... మరోవైపు పారిశ్రామికంగా పురోగమనం
రోడ్ల విస్తరణతో మెరుగుపడుతున్న రవాణా వ్యవస్థ
అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వానికీ మొరపెట్టుకున్నారు... ఓటేసి గెలిపించిన ప్రతి ప్రతినిధికీ వినతులు అందించారు. కాలం మారిపోయింది.. తరాలు తరిగిపోయాయి. కానీ.. జిల్లాను పట్టి పీడిస్తున్న సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఇక ఆశలు వదిలేసుకున్న ప్రజలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్త కాంతులు చూపించింది.ఎవరొచ్చినా తీరదనుకున్న సమస్యలకు సైతం పరిష్కారం లభించింది. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. మామూలు జిల్లాగానే ఉండిపోతుందనుకున్న విశాఖకు రాజధాని యోగం పట్టింది. అందుకు అనుగుణంగా హంగులు సమకూరుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి, అల్లూరిజిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, పర్యాటకం పరుగులు పెడుతున్నాయి. –సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి/పాడేరు
నగరంలో రోడ్ల విస్తరణ
తూర్పు నియోజకవర్గం పరిధి హనుమంతవాక నుంచి కైలాసగిరి కూడలి వరకు పదేళ్లుగా నిలిచిపోయిన రోడుŠడ్ విస్తరణ పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గంలో జగదాంబ జంక్షన్ నుంచి పాతనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ రాణిబోమ్మ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ, అన్నవరం సత్యదేవుని ఆలయ ఘాట్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొండవాలు ప్రాంతాల్లో రూ.9 కోట్లతో రక్షణ గోడలు నిరి్మంచారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగిలో గోస్తనీ నదిపై రూ.16.50 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
హౌసింగ్ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గాజువాక హౌసింగ్ సొసైటీ భూములకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారు. జీవో నంబర్ 301, 388 పట్టాదారులకు టైటిల్ డీడ్స్ అందజేశారు. సుమారు రూ.1500 కోట్ల విలువైన భూమిని ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన అందజేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న 7026 మందికి కన్వేయషన్స్ డీడ్స్ అందించారు. 39 మంది ఉక్కు కర్మాగార నిర్వాసితులకు కన్వేయ¯న్స్ పట్టాలు, 40 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలందించారు.
పారిశ్రామిక హబ్‌గా అనకాపల్లి జిల్లా
► కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలో ఒక వైపు సంక్షేమం, మరో వైపు నూతన పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది.
► మాకవరపుపాలెం మండలం భీమబోయినపాలెంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మా ణం శరవేగంగా జరుగుతోంది.
► అనకాపల్లి మండలం కోడూరులో 70 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు కు స్థల సేకరణ పూర్తయింది.
► నక్కపల్లిలో డ్రగ్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
► కోమళ్లపూడిలో మరో ఎస్‌ఈజెడ్‌కు స్థల కేటాయింపు పూర్తయింది.
భారీ పరిశ్రమలకు శ్రీకారం
రాజధానిగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నంలో భారీ పరిశ్రమలు, ప్రాజెక్టుల స్థాపనకు మార్గం సుగమం చేశారు. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ.21,844 కోట్ల పెట్టుబడితో 39,815 మందికి ఉపాధి అవకాశాలు కలి్పంచేలా బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు.
► గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎనీ్టపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్.. వంటి బహుళ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి.
► ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్‌ఎస్, అమేజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. మరో 48 ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటితో పాటు 140కి పైగా స్టార్టప్‌లు నడుస్తున్నాయి.
► ఐదేళ్లలో జిల్లాలో 35 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే ఇక్కడ 120 భారీ పరిశ్రమలున్నాయి. మొత్తం వీటన్నింటి ద్వారా 14,114 మందికి ఉద్యోగాలు.
మారిన ఏజెన్సీ రూపు రేఖలు
కొత్తగా ఏర్పాటైన అల్లూరి జిల్లాలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు నడవడానికి కూడా దారిలేని గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలిగింది. విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఐదేళ్ల పాలనలో సుమారు రూ.100 కోట్లతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన రోడ్లను తారురోడ్లుగా మార్చారు. రూ.10 కోట్లతో జామిగుడ, గిన్నెలకోట గెడ్డలపై భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. మిషన్ కనెక్ట్ పాడేరు పేరుతో రూ.100 కోట్ల ఉపాధి హా మీ పథకం నిధులతో రోడ్ల నిర్మాణం జరుగుతోంది.
► పెదబయలు మండలంలోని ఇంజరి పంచాయతీలాంటి అత్యంత మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికి రూ.10 కోట్లతో తారురోడ్డు నిరి్మస్తున్నారు.
► రూ.500 కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల పనులు దాదాపు పూర్తికావచ్చాయి.
► పాడేరు జిల్లా ఆస్పత్రి కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చెందింది. చింతపల్లిలో రూ.20 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిరి్మస్తున్నారు.
ఏజెన్సీ పర్యాటకం అద్భుతం
► అనంతగిరిలోని అంజోడ సిల్క్ ఫామ్‌లో పైన్ ప్లాంటేషన్ ఏర్పాటైంది. నీలగిరి చెట్లు పెరగడంతో అంజోడ పార్కు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. అక్కడ మంచు అందాలు కనువిందు చేస్తూ షూటింగులకు అనుకూలంగా మారింది. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో సుమారు రూ.70 లక్షలతో పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
► బొర్రా గుహల వద్ద గోస్తనీ లోయపై పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జిప్‌లైన్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఏపీటీడీసీ సుమారు రూ.65 లక్షలతో ఇక్కడ సాహసక్రీడల్ని ఏర్పాటు చేసింది.
► ఏజెన్సీ నయాగరాగా చెప్పుకునే చాపరాయి జలపాతం వద్ద రూ.40 లక్షలతో కాటేజీలు, రోప్‌వేలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment