industrial development
-
కేఐఏడీబీకి భూమిని తిరిగిచ్చేసిన రాహుల్ ఖర్గే
బెంగళూరు/శివాజీనగర: కర్ణాటకలో ముడా స్కాం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్ ‘మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్’ఏర్పాటుకు బెంగళూరులో ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలనే అభ్యర్థనను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 20న కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధి బోర్డు (కేఐఏడీబీ)కు రాసిన లేఖలో రాహుల్ ఖర్గే పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎమర్జింగ్ టెక్నాలజీలో మరిన్ని ఉద్యోగావకాశాలు కలి్పంచడమే సిద్ధార్థ విహార్ ట్రస్ట్ లక్ష్యమన్నారు. కళాశాల విద్యను అభ్యసించలేని విద్యార్థులకు సహాయం చేయడానికి కూడా దీనిని రూపొందించామని పేర్కొన్నా రు. పరిశ్రమలకు దగ్గరగా ఉండటం వల్ల యువతకు అవకాశాలు పెరుగుతాయనే కేఐఏడీబీ ఇండ్రస్టియల్ ఏరియాను ఎంచుకున్నామని లేఖలో స్పష్టం చేశారు. ఆ లేఖ కాపీలను కర్ణాటక మంత్రిగా ఉన్న మల్లికార్జున ఖర్గే చిన్న కుమారుడు ప్రియాంక్ ఖర్గే తన ‘ఎక్స్’హ్యాండిల్లో పంచుకున్నారు. సిద్ధార్థ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థలన్నీ లాభాపేక్ష లేని సంస్థలేనని, సీఏ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, పొందడానికి ట్రస్టుకు పూర్తి అర్హత ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే.. దురుద్దేశంతో కూడి న, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను నిరంతరం ఎదుర్కొంటూ ఏ విద్యాసంస్థా సమర్థవంతంగా పనిచేయదని, సామాజిక సేవే లక్ష్యంగా నడుస్తు న్న ట్రస్టును వివాదాల్లోకి నెట్టడం ఇష్టం లేకే ప్రతి పాదనను ఉపసంహరించుకుంటున్నట్లు కేఐఏడీబీకి ట్రస్టు లేఖ రాసిందని మంత్రి తెలిపారు. ఇటీవల అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన తనయుడు రాహుల్ ఖర్గేలకు చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల భూమిని మంజూరు చేసింది. కాగా, సిద్ధార్థ విహార్ ట్రస్టుకు భూమి కేటాయించడాన్ని బీజేపీ ఐటీ విభాగం ఇంచార్జ్ అమిత్ మాలవీయ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లహర్‌సింగ్ సిరోయాలు ఎక్స్‌లో వేదికగా ప్రశ్నించారు. ఇది కచ్చితంగా అధికార దురి్వనియోగం, బంధుప్రీతితో వ్యవహరించడమేనని పేర్కొన్నారు. కేఐఏడీబీ భూమి పొందడానికి ఖర్గే కుటుంబ సభ్యులు ఏరోస్పేస్ పారిశ్రామిక వేత్తలుగా ఎప్పడు మారారని ఎద్దేవా చేశారు. ముడా ప్లాట్ల కేటాయింపుల విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో 14 సైట్లను మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆమె తిరిగి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆ కేటాయింపుల్లో జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 మధ్య పరిశ్రమలకు జరిగిన భూ కేటాయింపుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా వివిధ పరిశ్రమల అభివృద్ధికే సర్కార్ రాయితీ, ప్రోత్సాహకాలు కల్పించిందని స్పష్టం చేసింది. అయితే భూ కేటాయింపు జరిగినా, ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం, కార్యకలాపాలు ప్రారంభించని ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి, స్టార్‌గేజ్, అనంత టెక్నాలజీ, జేటీ హోల్డింగ్స్.. కంపెనీల నుంచి దాదాపు 850 ఎకరాలను నాలుగు నెలల్లోగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుదీర్ఘ విచారణ అనంతరం సీజే ధర్మాసనం తీర్పు ఇస్తూ వాదనలను ముగించింది. ఎలాంటి టెండర్లు, ప్రకటనలు లేకుండా పలు కంపెనీలకు ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన ఛత్రి స్వచ్ఛంద సంస్థతోపాటు మరో ఇద్దరు హైకోర్టులో 2007లో పిటిషన్ దాఖలు చేశారు. గత పదేళ్లలో జరిపిన భూ కేటాయింపులపై సమీక్ష జరిపి మార్కెట్ విలువ ప్రకారం వసూలు చేయాలని, కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీల నుంచి భూమి వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. లీజు/అమ్మకం జరిపే ముందు టెండర్లు పిలిచిన తర్వాతే కేటాయింపులు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై 17 ఏళ్లకుపైగా విచారణ కొనసాగగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే.శ్రీనివాస్‌రావు ధర్మాసనం తాజాగా 72 పేజీల తీర్పు వెలువరించింది. వేలాది మందికి ఉద్యోగావకాశాలు.. ‘పిటిషనర్ వాదనల మేరకు.. çసహజ వనరులైన భూమి, గాలి, నీరు అత్యధిక ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) ఏర్పాటైంది. 2001 నుంచి 2006 మధ్య నామినేషన్ ప్రాతిపదికన టెండర్లు లేకుండా 4,156.81 ఎకరాలను కార్పొరేషన్ పలు కంపెనీలకు కేటాయించింది. అభివృద్ధి ముసుగులో వేల ఎకరాలను ప్రభుత్వం ప్రైవేట్‌కు కారుచౌకగా కేటాయించింది. ప్రభుత్వ వాదన మేరకు.. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి భూ కేటాయింపులు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో హైదరాబాద్‌లోనూ పరిశ్రమల ఏర్పాటు సహకరించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ రంగ అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుతో ఆర్థిక ప్రగతి పెంపొందించడానికి ప్రభుత్వం పలు విధానాలను రూపొందించింది. ఈ కేటాయింపులు చేసిన ఏడాది తర్వాత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో ఉండగా, అనేక పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఆ భూమికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సొమ్ము వసూలు చేయాలని ఆదేశిస్తే.. అది ప్రభుత్వ విధాన నిర్ణయాలకు విరుద్ధం అవుతుంది. ఈ దశలో జోక్యం చేసుకొని ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా, అన్ని కంపెనీలపైనే కాదు దానిపై ఆధారపడిన వారిపైనా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు భూ కేటాయింపుపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం. అయితే, భూ కేటాయింపులు జరిగినా ఇప్పటివరకు కార్యకలాపాలు ప్రారంభించని ఐదు కంపెనీల నుంచి దాదాపు 840 ఎకరాలను అధికారులు నాలుగు నెలల్లో వెనక్కి తీసుకోవాలి’అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిశ్రమల అభివృద్ధికి ఏపీఐఐసీ... ‘పారిశ్రామిక అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం 1973, సెపె్టంబర్ 26న ఏపీఐఐసీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో భాగంగా పరిశ్రమలను ఆకర్షించడమే రాష్ట్ర ప్రభుత్వ విధానంలోని ప్రధాన ఉద్దేశం. అయితే, ప్రభుత్వ ఆస్తుల కేటాయింపు విషయంలో విధానం పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉండాలి (ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది). భూకేటాయింపులకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తూ 2000, మే 25న జీవో 3 విడుదల చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఐటీ రంగానికి ప్రోత్సాహకాలు కల్పించడంలో అర్హతలు, విధివిధానాలు, దరఖాస్తులు, వాటి పరిశీలనా విధానం, షరతులు తదితరాలతో ప్రభుత్వ విధానానికి రూపకల్పన జరిగిందని చెప్పింది. రాష్ట్రంలో ఐటీ రంగం 2004–05లో 64.05 వృద్ధి సాధించగా, జాతీయ సగటు 34 శాతమే. 2007–08లో పరిశ్రమల ఎగుమతి రూ.8,270 కోట్లతో 41 శాతం ఉండగా జాతీయ సగటు 33.88 మాత్రమే.. ఐటీ రంగానికి సంబంధించి 1997 నుంచి 2007–08 దాకా 1584 యూనిట్లు ఏర్పాటు కాగా, రూ.26,122 కోట్ల ఎగుమతులు, రూ.10,101 కోట్ల పెట్టుబడులు, 2.39 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొంది. 2002–05, 2005–10 మధ్య ఐటీ పాలసీ కారణంగా హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ పరిశ్రమలు మాదాపూర్‌లో, బహుళ జాతీయ సంస్థలు, మైక్రో సాఫ్ట్, సీఏ, కాన్బో, యుబీఎస్, ఫ్రాంక్లిన్ అండ్ టెంపుల్టన్, విప్రో, హనీవెల్, అమెజాన్, తదితర బహుళజాతి కంపెనీలు ఏర్పాటయ్యాయి. రూ వందల కోట్ల పెట్టుబడులతో వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది’అని పేర్కొంది. భూ కేటాయింపుల్లో వివక్ష లేదు.. ‘భూకేటాయింపుల్లో దురుద్దేశాలు, వివక్ష ఉన్నట్టు పిటిషనర్ చెప్పలేదు. ఇవి లేకుండా ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షమని చెప్పలేం. ఈ కారణంగా పారిశ్రామిక అభివృద్ధికి రాయితీ మీద భూకేటాయింపులో ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భూకేటాయింపులపై చర్యలు తీసుకోంటోంది. భూకేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేం అంటూ పిటిషన్లో విచారణ ముగిస్తున్నాం’అని స్పష్టం చేసింది. -
జగన్ పాలనలో పెట్టుబడుల వెల్లువ
స్పష్టమైన విధానాలు, ప్రోత్సాహకాలు, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. కోవిడ్ సృష్టించిన సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం దెబ్బతిన్న సమయంలోనూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరిశ్రమలు నిలదొక్కుకొనేలా చర్యలు చేపట్టింది. ప్రోత్సాహకాలతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకొంది.సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కూడా వెల్లడించింది. కోవిడ్ తర్వాత పెట్టుబడులను ఆకర్షించడం, వాస్తవ రూపంలోకి తేవడంలో ఏపీ దూకుడును ప్రదర్శించినట్లు డీపీఐఐటీ విడుదల చేసిన తాజా గణాంకాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు వాస్తవ రూపంలోకి వస్తూ నిర్మాణ పనులు ప్రారంభించిన వాటిని మాత్రమే డీపీఐఐటీ వాస్తవ పెట్టుబడులుగా పరిగణనలోకి తీసుకుంటుంది.డీపీఐఐటీ తాజా నివేదిక ప్రకారం.. కోవిడ్ అనంతరం 2021 నుంచి ఈ ఏడాది మే వరకు రాష్ట్రంలో కొత్తగా 171 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.61,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో మరో 179 భారీ పరిశ్రమలు నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. దీంతో గడిచిన మూడున్నరేళ్ల కాలంలో రూ.76,278 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో అత్యధికంగా 2022లో రూ.45,301 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తేవడం ద్వారా దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. కోవిడ్ సమయంలో ఏ ఒక్క పరిశ్రమ మూత పడకూడదన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రీస్టార్ట్ ప్యాకేజీతో పరిశ్రమలను చేయిపట్టి నడిపించారు.వేగంగా అనుమతులు మంజూరు చేయడం ద్వారా ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా ఏటీసీ టైర్స్, సెంచురీ ప్లైవుడ్స్, బ్లూస్టార్, డైకిన్, డిక్సన్, ఆదిత్యబిర్లా ఫ్యాషన్స్, గ్రాసిం, ఐటీసీ, గోద్రేజ్, ఓఎన్జీసీ, లైఫిస్, క్యూలే ఫార్మా వంటి అనేక భారీ ప్రాజెక్టులు తమ వాణిజ్య కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించాయి. ఈ ఏడాది రూ.23,547 కోట్ల కొత్త పెట్టుబడులు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ 2024లో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో ఏపీ సత్తాను చాటుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఐదు నెలల్లో కొత్తగా 19 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.23,547 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు డీపీఐఐటీ వెల్లడించింది. ఇదే సమయంలో 34 ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.4,908 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇవి కాకుండా 2023లో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు వాస్తవ రూపంలోకి వస్తున్నాయని డీపీఐఐటీ తెలిపింది. ఇండ్రస్టియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమోరాండం దేశంలో పెట్టుబడులు పెట్టే సంస్థ డీపీఐఐటీలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకోసం ఇండ్రస్టియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమోరాండం (ఐఈఎం) సమర్పించాలి. ఇందులో పార్ట్–ఏ, పార్ట్–బీ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని నిర్మాణం ప్రారంభించే ముందు పెట్టుబడి మొత్తం, ఏమి ఉత్పత్తి చేస్తారు, సామర్థ్యం వంటి వివరాలతో పార్ట్–ఏ ఇవ్వాలి. ఆ తర్వాత పరిశ్రమ నిర్మాణం ప్రారంభించినట్లు లెక్కలు, నిర్మాణ పనులు, ట్రయిల్ రన్ పూర్తి చేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించినప్పుడు పార్ట్–బీ దరఖాస్తు చేయాలి. పార్ట్–బీ దరఖాస్తు చేస్తే ఆ పెట్టుబడి పూర్తిస్థాయిలో వాస్తవ రూపంలోకి వచ్చినట్లు లెక్క. -
పారిశ్రామికాభివృద్ధికి టాస్క్‌ఫోర్స్
సాక్షి, అమరావతి: వికసిత్ ఏపీలో భాగంగా 2047 నాటికి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకల్పన కోసం ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పలు రంగాల నిపుణులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. టాటా గ్రూపు చంద్రశేఖరన్ కో చైర్మన్‌గా ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సచివాలయంలో శుక్రవారం టాటాగ్రూపు చైర్మన్.. సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీన్లో భాగంగా పారిశ్రామికాభివృద్థికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఐటీ, విమానయానం, సోలార్, టెలీకమ్యూనికేషన్స్, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను వివరించిన సీఎం.. పెట్టుబడులు పెట్టాలని చంద్రశేఖరన్‌ను కోరారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో విస్తార, ఎయిర్ ఇండియా విమాన సరీ్వసుల సంఖ్యలను పెంచే అంశంపై చర్చించారు. అమరావతిలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్íÙప్లో టాటా గ్రూపు భాగస్వామ్యం కావాలన్న సీఎం కోరికను చంద్రశేఖరన్ స్వాగతించారు. అనంతరం చంద్రశేఖరన్ మంత్రి లోకేశ్‌తో సమావేశమయ్యారు. సీఐఐ ప్రతినిధుల బృందంతో భేటీ సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. అమరావతిలో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్íÙప్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ అవకాశాలపై ఆ బృందంతో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.అమరావతిలో అంతర్జాతీయ లా వర్సిటీ అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ముందుకొచ్చింది. ఈ మేరకు బీసీఐ చైర్మన్, సీనియర్ న్యాయవాది మన్నన్ కుమార్‌మిశ్రా నేతృత్వంలోని బృందం శుక్రవారం సీఎంను కలిసింది. సీఆర్డీఏ పరిధిలో ఈ యూనివర్సిటీ ఏర్పాటునకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌ను సీఎం ఆదేశించారు. బీసీఐ బృందంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, బీసీఐ ట్రస్ట్–పెరల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆలూరు రామిరెడ్డి తదితరులున్నారు. -
ఫోర్త్‌సిటీ ఏర్పాటులో మీ విజన్ అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతోపాటు అన్నిరంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్‌లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి నగరాన్ని సందర్శిస్తానని తెలిపారు. యంగ్‌లియూ నేతృత్వంలోని ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది. నగరానికి ఉన్న చరిత్ర.. పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను సీఎం రేవంత్ ఫాక్స్‌కాన్ బృందానికి వివరించారు.430 ఏళ్ల కింద పునాదిరాయి పడిన హైదరాబాద్‌లో అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్టు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగోనగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని సీఎం రేవంత్ వివరించారు. ఫోర్త్ సిటీలో విద్య. వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్–ఎలక్ట్రికల్, స్కిల్స్..ఇలా బహుముఖంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతోపాటు అవసరమైన మద్దతు అందజేస్తామని సీఎం ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇటీవల సీఎం రేవంత్ నేతృత్వంలో తమ బృందం అమెరికా, దక్షిణకొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను మంత్రి శ్రీధర్ బాబు యంగ్లియూకి వివరించారు.ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని యంగ్‌లియూ రేవంత్‌ను అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని.. అంతకుముందే తమ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని చెప్పారు.ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేశ్ రంజన్, డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి , ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిలతో పాటు డాక్టర్ ఎస్.కే. శర్మ, బాబ్చెన్, జొవూ, సూషొకూ, సైమన్సంగ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన ఆరు కొత్త పాలసీలకు ఎన్నికల కోడ్ ముగిసేలోగా తుదిరూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యకలాపాలపై మంగళవారం పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సూక్ష్మ, లఘు పరిశ్రమల కోసం ఎంఎస్ఎంఈ విధానం, ఎగుమతుల విధానం, నూతన లైఫ్‌సైన్సెస్, మెడికల్ టూరిజం, ఈవీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను కొత్తగా రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. కొత్త పాలసీల రూపకల్పన క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పాలసీలపై అధ్యయనం చేయాలని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా ఈ నూతన విధానాలు ఉండాలన్నారు. నేత, వస్త్ర పరిశ్రమకు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్, చేనేత కారి్మకులకు ఉపయోగపడేలా విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. -
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ వేసిన అడుగులు చక్కటి ఫలితాలిచ్చాయి. ప్రధానంగా పారిశ్రామికాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. ఎలాంటి హడావుడి లేకుండా అన్ని ప్రాంతాలకు భారీ పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా, అవి ఉత్పత్తిని ప్రారంభించేలా అన్ని విధాలా ఊతమందించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా టాటాలు, బిర్లాలు, అదానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు విదేశీ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని అచ్యుతాపురం వద్ద జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్ (అలయన్స్ టైర్స్ గ్రూపు), అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, లారస్ ల్యాబ్ వంటి దిగ్గజ సంస్థలు, విజయనగరంలో శారడా మెటల్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోస్తాంధ్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్, కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద పెన్సులిన్ తయారీ సంస్థ లూఫిస్ ఫార్మా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఐటీసీ స్పైసెస్ పార్కు, పిడుగురాళ్ల వద్ద శ్రీ సిమెంట్స్, నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ, క్రిభ్కో ఇథనాల్, గ్రీన్‌లామ్ సొల్యూషన్స్, గోకుల్ ఆగ్రో ప్రారంభం అయ్యాయి. రాయలసీమలోని చిత్తూరులో బ్లూస్టార్, డైకిన్, హావెల్స్, యాంబర్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్స్, టీసీఎల్, వైఎస్సార్ జిల్లాలో డిక్సన్, సెంచురీ ప్లేవుడ్స్, బిర్లా గార్మెంట్స్, కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ వంటి భారీ పెట్టుబడులు వచ్చాయి. ► చంద్రబాబు ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.59,970 కోట్లు ►ఈ 5 ఏళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల్లో రూ.78,514 కోట్ల పెట్టుబడులు ►వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాలేదంటూ ఎల్లో మీడియాతో కుట్ర చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. ►తప్పుడు సమాచారంతో యువతను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే చంద్రబాబు అండ్ కోకు ఈ వాస్తవాలు కనిపించవా... ►సంక్షేమంతో పాటు సమానంగా పరిశ్రమలకు అగ్రతాంబూలం ఇస్తే నీచమైన రాతలా.. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి ఇదీ జగన్ అంటే.. ►గత ప్రభుత్వంలా ఏటా పెట్టుబడుల సదస్సు అంటూ హడావుడి చేయలేదు. ఒక్కసారి మాత్రమే 2023లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించగా.. 386 ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఏ రాష్ట్ర పెట్టుబడుల సదస్సుకు రాని రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా విశాఖ రావడమే కాకుండా రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఐదేళ్లలో బిర్లాలు, అదానీ, మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి విచ్చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ► సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి. మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది తిరక్కుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఎంఎస్ఎంఈలకు పునరుజ్జీవం కోవిడ్ సమయంలో రీస్టార్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్ఎంఈలు మళ్లీ ఊపిరిపోసుకున్నాయి. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలతో ఆదుకుంటోంది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. నిర్వహణ వ్యయం తగ్గించి పెద్ద పరిశ్రమలతో పోటీ పడేలా క్లస్టర్ విధానాన్ని, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రూ.118 కోట్లతో జగన్ ప్రభుత్వం ర్యాంప్ కార్యక్రమం చేపట్టింది. చంద్రబాబు సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు ఉంటే.. ఇప్పుడు ఏడు లక్షలు దాటాయని ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక కారిడార్లతో రాష్ట్రం రికార్డులు పరిశ్రమలకు అన్ని రకాల మౌలికవసతులు ఒకే చోట లభించేలా మూడు పారిశ్రామిక కారిడార్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మూడు పారిశ్రామిక కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది. ►విశాఖ–చెన్నై కారిడార్(వీసీఐసీ) ►చెన్నై–బెంగళూరు కారిడార్ ►హైదరాబాద్–బెంగళూరు కారిడార్.. ఈ మూడూ అభివృద్ధి దశలో ఉన్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఇందులో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌గా రూపుదిద్దుకుంటోంది. తిరుపతి జిల్లాలోని 2,500 ఎకరాల్లో క్రిస్ సిటీ ఏర్పాటు కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలి్పస్తోంది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. విశాఖ–చెన్నై కారిడార్(వీసీఐసీ) విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా రెండు గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్లు తీర్చిదిద్దారు. విశాఖపట్నంలోని నక్కపల్లి–రాంబిల్లి క్లస్టర్లు, చిత్తూరు నోడ్‌లో ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో అంతర్గత మౌలిక సదుపాయాలు కల్పించారు. వీసీఐసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్టర్నల్ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్ జోన్‌లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్ జోన్‌లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేశారు. నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,051 కోట్ల పెట్టుబడులతో 9,030 ఉద్యోగాలు కల్పించారు. అచ్యుతాపురంలో మొత్తం 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు రాగా 60 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ► వీసీఐసీలో భాగంగా వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిలో 6,740 ఎకరాలలో పరిశ్రమల హబ్ తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. కొప్పర్తి కేంద్రంగా మోడల్ ఇండ్రస్టియల్ పార్కు, ఎంఎస్ఈ సీడీపీ, వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.2595.74 కోట్ల నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధికి కార్యాచరణ రూపొందించారు. అక్కడ 66 పరిశ్రమలు కొలువుదీరాయి. ప్లగ్ అండ్ ప్లే పరిశ్రమల కోసం ఇప్పటికే షెడ్ల నిర్మాణం పూర్తయింది. మొత్తం రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది. హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఈ కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ► పెట్టుబడుల సదస్సు అంటూ గత ప్రభుత్వం రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయని ఎల్లో మీడియాలో ఊదరగొట్టేశారు. కనీసం అందులో 10 శాతం పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోయేది. బాబు హయాంలో కనీసం 5 శాతం పెట్టుబడులు కూడా రాలేదు. దీనిపై మీ ఎల్లో మీడియాలో రాయించగలవా.. ►బాబు హయాంలో కేంద్ర సహకారం అందినా.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్నా.. పెట్టుబడుల ప్రవాహానికి అనుకూల వాతావరణం ఉన్నా.. తన సొంత అజెండాతో పారిశ్రామిక ప్రగతిని బాబు నిర్లక్ష్యం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే పరిశ్రమలకు పట్టం కడుతున్న వేళ.. కోవిడ్ లాక్‌డౌన్‌తో రెండేళ్లు ప్రపంచమంతా పడకేసింది. అయినా జగన్ గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. ►జగన్ పాలనలో రాష్ట్రంలో 163 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.78,514 పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. ఉత్పత్తి ప్రారంభించాయి. బాబు హయాంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు పెడితే.. జగన్ హయాంలో ఏటా రూ.15,702.8 కోట్ల పెట్టుబడులు పెట్టారు. వివిధ దశల్లో రూ.2.46 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందం జరిగిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. అదనంగా దావోస్ పర్యటనలో మరో రూ.1,26,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా యువతకు 38 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక ఫోన్ కాల్ దూరంలో మీకు నేను ఉన్నానంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఇచ్చిన అభయం వారి నమ్మకాన్ని రెట్టింపు చేసింది. గత మూడేళ్ల నుంచి పూర్తిగా 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు ఆధారంగా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్యం సర్వేలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 6 లక్షల మందికిపైగా ఉపాధి ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా రాష్ట్రంలో 6 లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తోంది. ఎంఎస్ఎంఈలు ఒక సంఘంగా ఏర్పడి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునే విధంగా క్లస్టర్ రూపంలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశారు. ఇందుకు ప్రతి జిల్లాలో కనీసం రెండు చొప్పున మొత్తం 54 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల్ని అందించేలా మరో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మరో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో టెక్నాలజీ సెంటర్ కొనసాగుతోంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో ఈ టెక్నాలజీ సెంటర్ అభివృద్ధి చేస్తున్నారు. బంధం కొనసాగిస్తాం ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టిన తాము భవిష్యత్తులో కూడా అదే బంధాన్ని కొనసాగిస్తాం. ఇందులో భాగంగా 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్ రిటైల్ ద్వారా రాష్ట్రంలో 1.20 లక్షల మంది కిరాణా వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాం. 6,000 గ్రామాల్లో సేవలు అందిస్తున్న రిలయన్స్ రిటైల్ ద్వారా రాష్ట్రంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలి్పస్తున్నాం. – ముఖేశ్ అంబానీ రెండు నెలల్లో రెండు యూనిట్లు ఆదిత్య బిర్లా గ్రూపు ద్వారా రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేశాం. వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఆరు వ్యాపారాల్లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. – కుమార్ మంగళం బిర్లా అర నిమిషంలోనే ఒప్పించారు మే నెలలో సీఎం జగన్‌ను కలిసి 30 సెకన్లు మాత్రమే మాట్లాడా. ఈ సందర్భంగా మా అబ్బాయి బయో ఇథనాల్ ప్లాంట్ స్థాపనకు వివిధ రాష్ట్రాలు పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహా్వనించారు. బయో ఇథనాల్ పాలసీని యూనిట్ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. –సీపీ గుర్నానీ, సీఈవో, టెక్ మహీంద్రా రాష్ట్రం వైపు ఐటీ దిగ్గజ సంస్థల చూపు దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రంలో తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఇన్ఫోసిస్, విప్రో, రాండ్‌స్టా్టండ్, బీఈఎల్, అమెజాన్ డీసీ వంటి అనేక దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. బీపీఓ కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన విశాఖ నగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఇన్ఫోసిస్ రాష్ట్రంలో తొలి డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడంతో.. విప్రో కూడా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. విశాఖ అనగానే పల్సస్ గ్రూపు, డబ్ల్యూఎన్ఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు బీచ్ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ల ఆకర్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఐటీ హబ్‌గా విశాఖ గత నాలుగేళ్లుగా రాష్ట్రంలోని ఐటీ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643గా ఉంది. అందులో సగం మందికి ఉద్యోగాలు దివంగత నేత వైఎస్సార్ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కొత్తగా 47,908 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 75,551కు చేరుకుంది. స్టార్టప్స్ కూడా 161 నుంచి 586కు చేరాయి. స్టార్టప్స్‌లో 2019 నాటికి 1,552 మంది పనిచేస్తుంటే ఇప్పుడు ఆ సంఖ్య 55,669కు చేరింది. ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) చెబుతున్నవే. తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ‘కల్పతరువు’తో పాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో ముందు వరుస పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను ప్రారంభించాం. ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్ ప్రారంభిస్తున్నాం. – సంజయ్ పూరి, ఐటీసీ సీఈవో -
రాజధాని హంగులు..సరికొత్త సొబగులు
అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వానికీ మొరపెట్టుకున్నారు... ఓటేసి గెలిపించిన ప్రతి ప్రతినిధికీ వినతులు అందించారు. కాలం మారిపోయింది.. తరాలు తరిగిపోయాయి. కానీ.. జిల్లాను పట్టి పీడిస్తున్న సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఇక ఆశలు వదిలేసుకున్న ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త కాంతులు చూపించింది.ఎవరొచ్చినా తీరదనుకున్న సమస్యలకు సైతం పరిష్కారం లభించింది. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. మామూలు జిల్లాగానే ఉండిపోతుందనుకున్న విశాఖకు రాజధాని యోగం పట్టింది. అందుకు అనుగుణంగా హంగులు సమకూరుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి, అల్లూరిజిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, పర్యాటకం పరుగులు పెడుతున్నాయి. –సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి/పాడేరు నగరంలో రోడ్ల విస్తరణ తూర్పు నియోజకవర్గం పరిధి హనుమంతవాక నుంచి కైలాసగిరి కూడలి వరకు పదేళ్లుగా నిలిచిపోయిన రోడుŠడ్ విస్తరణ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గంలో జగదాంబ జంక్షన్ నుంచి పాతనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ రాణిబోమ్మ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ, అన్నవరం సత్యదేవుని ఆలయ ఘాట్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొండవాలు ప్రాంతాల్లో రూ.9 కోట్లతో రక్షణ గోడలు నిరి్మంచారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగిలో గోస్తనీ నదిపై రూ.16.50 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హౌసింగ్ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గాజువాక హౌసింగ్ సొసైటీ భూములకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారు. జీవో నంబర్ 301, 388 పట్టాదారులకు టైటిల్ డీడ్స్ అందజేశారు. సుమారు రూ.1500 కోట్ల విలువైన భూమిని ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన అందజేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న 7026 మందికి కన్వేయషన్స్ డీడ్స్ అందించారు. 39 మంది ఉక్కు కర్మాగార నిర్వాసితులకు కన్వేయ¯న్స్ పట్టాలు, 40 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలందించారు. పారిశ్రామిక హబ్‌గా అనకాపల్లి జిల్లా ► కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలో ఒక వైపు సంక్షేమం, మరో వైపు నూతన పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. ► మాకవరపుపాలెం మండలం భీమబోయినపాలెంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మా ణం శరవేగంగా జరుగుతోంది. ► అనకాపల్లి మండలం కోడూరులో 70 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు కు స్థల సేకరణ పూర్తయింది. ► నక్కపల్లిలో డ్రగ్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ► కోమళ్లపూడిలో మరో ఎస్ఈజెడ్కు స్థల కేటాయింపు పూర్తయింది. భారీ పరిశ్రమలకు శ్రీకారం రాజధానిగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నంలో భారీ పరిశ్రమలు, ప్రాజెక్టుల స్థాపనకు మార్గం సుగమం చేశారు. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ.21,844 కోట్ల పెట్టుబడితో 39,815 మందికి ఉపాధి అవకాశాలు కలి్పంచేలా బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ► గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎనీ్టపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్.. వంటి బహుళ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ► ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమేజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. మరో 48 ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటితో పాటు 140కి పైగా స్టార్టప్‌లు నడుస్తున్నాయి. ► ఐదేళ్లలో జిల్లాలో 35 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే ఇక్కడ 120 భారీ పరిశ్రమలున్నాయి. మొత్తం వీటన్నింటి ద్వారా 14,114 మందికి ఉద్యోగాలు. మారిన ఏజెన్సీ రూపు రేఖలు కొత్తగా ఏర్పాటైన అల్లూరి జిల్లాలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు నడవడానికి కూడా దారిలేని గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలిగింది. విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఐదేళ్ల పాలనలో సుమారు రూ.100 కోట్లతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన రోడ్లను తారురోడ్లుగా మార్చారు. రూ.10 కోట్లతో జామిగుడ, గిన్నెలకోట గెడ్డలపై భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. మిషన్ కనెక్ట్ పాడేరు పేరుతో రూ.100 కోట్ల ఉపాధి హా మీ పథకం నిధులతో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ► పెదబయలు మండలంలోని ఇంజరి పంచాయతీలాంటి అత్యంత మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికి రూ.10 కోట్లతో తారురోడ్డు నిరి్మస్తున్నారు. ► రూ.500 కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ► పాడేరు జిల్లా ఆస్పత్రి కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చెందింది. చింతపల్లిలో రూ.20 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిరి్మస్తున్నారు. ఏజెన్సీ పర్యాటకం అద్భుతం ► అనంతగిరిలోని అంజోడ సిల్క్ ఫామ్‌లో పైన్ ప్లాంటేషన్ ఏర్పాటైంది. నీలగిరి చెట్లు పెరగడంతో అంజోడ పార్కు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. అక్కడ మంచు అందాలు కనువిందు చేస్తూ షూటింగులకు అనుకూలంగా మారింది. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో సుమారు రూ.70 లక్షలతో పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ► బొర్రా గుహల వద్ద గోస్తనీ లోయపై పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జిప్‌లైన్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఏపీటీడీసీ సుమారు రూ.65 లక్షలతో ఇక్కడ సాహసక్రీడల్ని ఏర్పాటు చేసింది. ► ఏజెన్సీ నయాగరాగా చెప్పుకునే చాపరాయి జలపాతం వద్ద రూ.40 లక్షలతో కాటేజీలు, రోప్‌వేలు ఏర్పాటు చేశారు. -
వైజాగ్ ని ఒక ఎకనామిక్ ఇంజిన్ ని చేస్తా..!
-
CM Jagan: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుడుతున్నారు. రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌తోపాటు పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.4,178 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న పలు పరిశ్రమలకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇవి కాకుండా రూ.655 కోట్లతో నెలకొల్పిన ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. మొత్తంగా సుమారు రూ.4,833 కోట్ల పెట్టుబడులు రానుండగా కొత్తగా 4,046 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తొలుత 8 చోట్ల రిలయన్స్ ప్లాంట్లు రిలయన్స్ బయో ఎనర్జీ రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్ధాల నుంచి బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.1,024 కోట్ల పెట్టుబడితో తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో బయో గ్యాస్ ప్లాంట్లను నెలకొల్పనుంది. తద్వారా 576 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.1,700 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వీటితో పాటు హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్, అన ఒలియో ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ వర్చువల్‌గా శంకుస్థాపనలతో పాటు పలు యూనిట్లను ప్రారంభిస్తారు. -
3 క్లస్టర్లుగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందడానికి వీలుగా మహా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కొత్త విధానంలో తెలంగాణను మొత్తం మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వరకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, ఆర్ఆర్ఆర్ తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్‌గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 2050 నాటికి హైదరాబాద్ తరహాలో తెలంగాణ అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నది తమ లక్ష్యమని, అందుకు తగ్గట్టుగా మహా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో స్నేహపూర్వకంగా మెలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులు శనివారం సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అత్యున్నత అభివృద్ధి సాధనే లక్ష్యం పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, రాయితీలు, ప్రోత్సాహకాల కోసం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని తీసుకుని వస్తామ సీఎం చెప్పారు. తెలంగాణలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే.. 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో అత్యున్నత అభివృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనే వాదనలకు భిన్నంగా తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందని అన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తాము తెచ్చే కొత్త పారిశ్రామిక విధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఫార్మా విలేజీల అభివృద్ధి ఫార్మా సిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని, ఫార్మా సిటీగా కాకుండా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని, వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా, కాలుష్య రహితంగా, పరిశ్రమలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు ఇతర అన్ని మౌలిక సదుపాయాలతో వీటిని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. రక్షణ, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్‌లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. స్కిల్ వర్సిటీలు ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులను గత ప్రభుత్వం మాదిరిగా భారంగా భావించటం లేదని సీఎం స్పష్టం చేశారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా చూస్తామని, యువతీ యువకులకు అవసరమైన నైపుణ్యాలు (స్కిల్స్) నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, సీఐఐ ప్రతినిధులు సి.శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, మోహన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సుచిత్రా కె.ఎల్లా, వనిత దాట్ల, రాజు, సంజయ్ సింగ్, ప్రదీప్ ధోబాలే, శక్తి సాగర్, వై.హరీశ్చంద్ర ప్రసాద్, గౌతమ్ రెడ్డి, వంశీకృష్ణ గడ్డం, శివప్రసాద్ రెడ్డి రాచమల్లు, రామ్, చక్రవర్తి, షేక్ షమియుద్దీన్, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పారిశ్రామికరంగ అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు సులభంగా లభించేలా చూస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్‌హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలిసింది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ చేపట్టిన ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రేవంత్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తామని, అన్ని రంగాలను ప్రోత్సహించేందుకు స్నేహపూర్వక విధానాలు అవలంబిస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు, ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో చేపట్టే భవిష్యత్తు ప్రాజెక్టులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. రెండేళ్లలో 25 వేల ఉద్యోగాలు... ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థగా పేరొందిన ఫాక్స్‌కాన్‌కు యాపిల్ ఐఫోన్‌తోపాటు గూగుల్, షియోమీ, అమెజాన్, హ్యూలెట్ పాకర్డ్, అలీబాబా, సిస్కో, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా వంటి దిగ్గజ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, మలేసియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాల్లో ఫాక్స్‌కాన్ కార్యకలాపాలు సాగిస్తోంది. భారత్‌లో శ్రీసిటీ (ఏపీ), శ్రీపెరంబదూర్ (తమిళనాడు), బెంగళూరు (కర్ణాటక)తోపాటు తెలంగాణ (కొంగరకలాన్)లో ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి. యాపిల్ ఐఫోన్లకు ఇయర్‌పాడ్స్ తయారీకి సంబంధించి తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాంటు నిర్మాణం కోసం ఈ ఏడాది మే 15న శంకుస్థాపన చేసింది. కొంగరకలాన్ ప్లాంటు ద్వారా దశలవారీగా లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే రెండేళ్లలో ఫాక్స్‌కాన్ కొంగరకలాన్ యూనిట్ ద్వారా 25 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. -
పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం వైఎస్సార్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బద్వేలు నియోజకవర్గం గోపవరం మండల పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కులో రూ.956 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన సెంచురీ ప్యానల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఉత్పత్తిని ఆయన ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే, కడప రిమ్స్ ప్రాంగణంలో అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన డా.వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డా. వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డా.వైఎస్సార్ క్యాన్సర్ కేర్ సెంటర్లతో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ భవనాలకు ముఖ్యమంత్రి జగన్ వేర్వేరుగా ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత.. ఆధునీకరించిన వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని, రూ.56.70కోట్లతో నిర్మించిన అంబేద్కర్ సర్కిల్–వై జంక్షన్ రోడ్డును, 15వ ఆర్థిక సంఘం, ‘కుడా’ సహకారంతో నిర్మించిన కోటిరెడ్డి సర్కిల్‌ను ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే జిల్లాలోని అర్హులైన 50 మంది దివ్యాంగులకు ముఖ్యమంత్రి జగన్ రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు అగ్నిమాపక విభాగం కొనుగోలు చేసిన రెస్క్యూ పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. సెంచురీ ప్యానెల్స్ పరిశ్రమ జిల్లా పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి అని సీఎం జగన్ అభివర్ణించారు. అన్ని మౌలిక సదుపాయాలతో సహా ఎకరా రూ.15 లక్షల రాయితీ ధరతో ఏపీఐఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల విస్తీర్ణంలో సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఏర్పాటైందన్నారు. లాంజ్ రూమ్‌లో కంపెనీకి సంబంధించిన వీడియోను తిలకించారు. సెంచురీ సంస్థ చైర్మన్ సజ్జన్ బజంకా, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశన్ బజంకా సంస్థ గురించి సీఎంకు వివరించారు. అనంతరం.. ప్రజలకు మెరుగైన వైద్యసేవలతో పాటు ఆరోగ్యకర సమాజం కోసం ఎంతోమంది వైద్యులను అందిస్తున్న రిమ్స్ (రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్).. మెడికల్ హబ్‌గా రాయలసీమకే తలమానికంగా మారిందని సీఎం జగన్ ప్రశంసించారు. జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ స్థాయిలో కూడా అత్యుత్తమ, మెరుగైన వైద్యసేవలు రిమ్స్ అందిస్తోందన్నారు. సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన వైద్యసేవలతో వేలాది మంది ప్రజలకు నిత్యం ప్రాణరక్షణ కల్పిస్తూ సంజీవనిగా రిమ్స్ పేరొందిందన్నారు. రిమ్స్ బోధనాసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రి, మానసిక వైద్యశాల, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందన్నారు. వైద్య విభాగాధిపతులు కేవలం వైద్యం వరకే పరిమితం కాకుండా ఆయా విభాగాల్లో పరికరాల నిర్వహణ, యాజమాన్యంపై ప్రత్యేక దృష్టిసారించి వైద్యరంగం పటిష్టత కోసం కృషిచేయాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు. స్మార్ట్ సిటీగా కడప ఇక కడప నగరాన్ని స్మార్ట్ సిటీగా చూడాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందని, కడపకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కడప నగరాభివృద్ధిలో భాగంగా పారిశుధ్యం, స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దడంలో మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. నగరం అభివృద్ధి కోసం పెట్టిన ప్రతిపాదనలు అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు కూడా చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని.. మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలు ప్రధాన రహదారులకు విస్తరణ పనులు చేపట్టి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కడపను అభివృద్ధి చేసి చూపించామన్నారు. అలాగే, నైపుణ్యతకు, నాణ్యతకు నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ అని, పుష్కలమైన పరిపాలన వనరులకు కేంద్ర బిందువుగా రాష్ట్రంలో నిలిచిందని సీఎం అభివర్ణించారు. రోడ్డుమార్గాన ఇడుపులపాయకు.. అనంతరం శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో ఇడుపులపాయకు వెళ్లాల్సి ఉంది. అయితే, కార్యక్రమాలు ఆలస్యం కావడంతో అనుకున్న సమయానికి హెలికాపర్టర్లో వెళ్లలేకపోయారు. ఏవియేషన్ అధికారుల సూచన మేరకు రోడ్డు మార్గాన రాత్రి 7గంటలకు ఇడుపులపాయకు చేరుకున్నారు. రాత్రికి అక్కడ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌లో బసచేశారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని ఆదివారం ఇడుపులపాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత నెమళ్ల పార్కు పక్కనున్న ఓపెన్ ఎయిర్ చర్చిలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంటారు. అనంతరం.. సింహాద్రిపురం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళ్తారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, ఎంపీ అవినాష్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, కడప మేయర్ కె. సురేష్‌బాబు, కుడా (కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ గురుమోహన్, ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్రెడ్డిలతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్, జేసీ గణేష్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కడప కమిషనర్ సీఎస్ఎస్ ప్రవీణ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో ‘సెంచురీ’... బద్వేలు నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో గోపవరం మండల పరిధిలో ఏర్పాటైన ఇండస్ట్రియల్ పార్కులో అన్ని మౌలిక సదుపాయాలతో సహా ఎకరా రూ.15 లక్షల రాయితీ ధరతో ఏపీఐఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల విస్తీర్ణంలో సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఏర్పాటైంది. రూ.956 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఈ పరిశ్రమలో.. మీడియం డెన్సిటీ ఫైబర్‌బోర్డు, హై ప్రెజర్ లామినేట్స్ ఉత్పత్తిని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. చెక్క పలకలు, అలంకరణ సంబంధ వుడ్ షీట్స్ తయారీలో దేశంలోనే ప్రసిద్ధిగాంచిన సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ సంస్థ.. 2,266 మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా.. ఈ ప్రాంతంలో ఏర్పాటైంది. మరోవైపు.. కంపెనీ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకును.. బద్వేలు నియోజకవర్గ రైతుల నుండే నేరుగా కొనుగోలు చేస్తోంది. భవిష్య అవసరాల కొరతను తీర్చేందుకు ఈ కంపెనీ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో 80,000 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను పెంచేందుకు స్థానిక రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే.. 1,000 మంది రైతులకు సంబంధించి 5,000 ఎకరాల్లో రాయితీ ధరతో చెట్లను నాటడానికి అవకాశం కల్పించారు. ఇక ఈ పరిశ్రమ నీటి అవసరాలకుగాను.. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నుండి 0.07 టీఎంసీల నీటిని కూడా కేటాయించింది. దీనికోసం.. రిజర్వాయర్ నుండి ప్లాంట్ సైట్ వరకు రూ.45 కోట్లతో వాటర్ పైప్‌లైన్ ఏర్పాటుచేశారు. అలాగే, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ఏపీఐఐసి ద్వారా రూ.19.11 కోట్లు వెచ్చించి 132 కేవీ విద్యుత్ లైన్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా రిమ్స్ ప్రాంగణంలో 452 పడకల సామర్థ్యంతో జి+4 అంతస్తులతో ఏ, బీ, సీ, డీ, ఈ బ్లాకులుగా డా. వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టింది. 2,38,062.46 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లను వెచ్చించింది. అందులో రూ.75 కోట్లు నిర్మాణ పనులకు, రూ.50 కోట్లు వైద్య పరికరాల కోసం ఖర్చుచేశారు. ఇందులో కార్డియాలజీ, న్యూరాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, కార్డియో థొరాసిక్–వాసు్కలర్ సర్జరీ, న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ మొదలైన 10 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి వైద్యసేవలు అందనున్నాయి. ఇందులో సాధారణ వార్డులో 300 పడకలు, పేషెంట్ కేర్ యూనిట్లు, 100 పడకల ఐసీయూ, 12 పడకల క్యాజువాలిటీ, 40 పడకలు ఇతరులకు కేటాయించారు. అంతేకాక.. 12 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, అన్ని సూపర్ స్పెషాలిటీలకు అనువైన సెంట్రల్ లాబొరేటరీ, రేడియాలజీ విభాగం, సీఎస్ఎస్డీ, సెంట్రల్ ఫార్మసీ, అధునాతన క్యాథ్ ల్యాబ్, అధునాతన బ్లడ్ బ్యాంక్, అధునాతన సీటీ, ఎమ్మారై స్కానింగ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. డా. వైఎస్సార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్.. మానసిక రోగులకు అత్యుత్తమ ఉపశమనం కలిగించేలా.. నిపుణులైన మానసిక వైద్యులతో వైద్యం, కౌన్సెలింగ్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సదుపాయాలతో.. రిమ్స్ ప్రాంగణంలో 100 పడకల మానసిక వైద్యశాలను రూ.40 కోట్లు వెచ్చించి నిర్మించింది. 97,844 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి+1 అంతస్తుతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 23 మంది వైద్యులు, 27 మంది నర్సింగ్ స్టాఫ్, 29 మంది పారామెడికల్ స్టాఫ్, 37 మంది ఇతర సహాయక సిబ్బంది మానసిక రోగులకు వైద్యసేవలు అందనున్నాయి. ఇందులో ప్రతిరోజు ఓపీ సేవలతో పాటు.. డెడిక్షన్ సెంటర్, బీపాడ్ క్లినిక్, స్కిజోఫ్రెనియా క్లినిక్ సేవలతో ఐపీ సేవలతో పాటు ఇంకా అనేకం అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ సెంటర్.. క్యాన్సర్ రోగులకు అధునాతన వైద్యసేవలతో సరికొత్త జీవితాన్నందించే దిశగా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సదుపాయాలతో రిమ్స్ ప్రాంగణంలోనే 100 పడకల క్యాన్సర్ కేర్ సెంటర్‌ను రూ.107 కోట్లతో నిర్మించింది. 1,58,295 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా జి+2 అంతస్తుతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 మంది వైద్యులతో పాటు ఇతర సిబ్బంది అందరూ కలిపి మొత్తం 148 సిబ్బందితో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందనున్నాయి. ఇందులో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలున్నాయి. ఇందులో 96 పడకల సాధారణ వార్డు, ఐసీయూ, క్యాజువాలిటీ, నాలుగు పడకల మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ వార్డు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక.. అధునాతన పరికరాలతో లీనియర్ యాక్సిలరేటర్, డే కేర్ ఫెసిలిటీ, పెయిన్ మరియు పాలియేటివ్ కేర్, పునరావాస సేవలు, లేబొరేటరీ, రేడియాలజీ సేవలు, బ్లడ్ బ్యాంక్ యూనిట్లు అందుబాటులో వున్నాయి. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి.. జిల్లాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాంపస్‌లో ఏర్పాటైన ఎల్వీ ప్రసాద్ నేత్ర ఆసుపత్రి.. టెరిటరీ నెట్‌వర్క్‌లో 4వ తృతీయ నేత్ర సంరక్షణ కేంద్రం. ఆంధ్ర రాష్ట్రంలో మూడవది. ఏపీ ప్రభుత్వం.. ఇతర దాతృత్వ ఫౌండేషన్ల మద్దతుతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. ఇక్కడ మొత్తం 66,600 చ.అ.ల విస్తీర్ణంలో 40 పరీక్షా గదులు, నాలుగు ఆధునిక ఆపరేషన్ గదులతో నిర్మితమైంది. వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక కంటి సంరక్షణ సేవల యూనిట్ మరియు అన్ని ఇతర ప్రత్యేక నేత్ర సంరక్షణ సేవలతో పాటు దృష్టి మెరుగుదల సేవలను అందిస్తుంది. రోజుకు సుమారు 400లకు పైగా ఔట్ పేషెంట్లకు పరీక్షలు, రోజుకు 60కి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించే సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. నైపుణ్యతకు, నాణ్యతకు నిదర్శనం వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్.. రూ.6 కోట్ల డీఎంఎఫ్ నిధులతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కలెక్టరేట్ భవనాన్ని ఆధునీకరించారు. ఇందులో అన్ని విభాగాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుతో పాటు మెకానికల్, ప్లంబింగ్, ల్యాండ్‌స్కేప్ డెవలప్మెంట్ వంటి సేవలను పునరుద్ధరించారు. అలాగే, పరిపాలనాపరమైన, ఉద్యోగుల పునశ్చరణ శిక్షణ కోసం సమగ్రమైన జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఉంది. సభా భవన్, స్పందన హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్ వంటి వేదికలలో ఓరియంటేషన్లు, శిక్షణతో సహా ఉద్యోగుల సామర్థ్య నిర్మాణ సెషన్లు ఇక్కడ నిర్వహిస్తారు. రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ.. శారీరక వైకల్యాలున్న వ్యక్తులు ఎదుర్కొనే చలనశీలత సవాళ్లను పరిష్కరించడానికి, వారికి సౌకర్యవంతమైన స్వతంత్ర రవాణా మార్గాలను అందించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను అర్హులైన వారికి పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కాంపోనెంట్ కింద జిల్లా పరిపాలన యంత్రాంగం, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిల సహకారంతో దివ్యంగుల జీవన ప్రమాణాలు, వారి జీవనోపాధి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. అంతేకాక.. ఏడీఐపీ పథకం కింద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నియోజకవర్గస్థాయి శిబిరాల్లో 6,509 మంది వికలాంగులకు సహాయాలు, సహాయక పరికరాలను పంపిణీ చేశారు. ఇందుకు మొత్తం రూ.5.85 కోట్లు వెచ్చించారు. అగ్నిమాపక ఉపకరణాల ప్రారంభోత్సవం.. వరదలు, తుపానులు మొదలైన ప్రకృతి విపత్కర సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే ఉద్దేశ్యంతో.. రూ.77.423 లక్షల వ్యయంతో.. వైఎస్సార్ జిల్లా అగ్నిమాపక విభాగం కొనుగోలు చేసిన రెస్క్యూ పరికరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. వీటిలో.. రెస్క్యూ బోట్లు, వీటిని నడపడానికి ఉపయోగించే అవుట్ బోర్డ్ మోటార్లు, బాధితులను వరద నీటిలో తేలియాడేలా చేయడానికి ఉపయోగించే లైఫ్‌జాకెట్లు, లైఫ్ బాయ్స్, రెస్క్యూ బోట్లను శుభ్రం చేసే పోర్టబుల్ పంపులు.. రెస్క్యూ రోప్‌లు ఉన్నాయి. -
సీమ సిగలో ‘సెంచురీ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో పేరున్న కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ కోవలో రాయలసీమ యువత, రైతులకు ప్రయోజనం చేకూరే మరో భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్లే ఉడ్ ప్యానల్స్ తయారీలో అగ్రగామి సంస్థగా పేరున్న సెంచురీ ప్యానల్స్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వైఎస్సార్ జిల్లా బద్వేల్ వద్ద గోపవరం పారిశ్రామిక పార్కులో రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సెంచురీ ప్యానల్స్‌ను శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అలాగే అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పిస్తోంది. సెంచురీ ప్యానల్స్‌కు డిసెంబర్ 23, 2021న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వెనుకబడిన ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పించింది. అంతేకాకుండా అనుమతులను వేగంగా మంజూరు చేసింది. దీంతో రెండేళ్లలోనే సెంచురీ ప్యానెల్స్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది. కలప ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి మొత్తం 490 ఎకరాల్లో గోపవరం వద్ద ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసింది. ఇందులో యాంకర్ యూనిట్‌గా సెంచురీ ప్యానల్స్‌కు 100 ఎకరాలను 33 ఏళ్ల లీజుకు కేటాయించారు. రైతులకు ప్రయోజనం సెంచురీ ప్యానల్స్‌లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్పీఎల్) మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్‌లను తయారు చేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలోని వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి యూకలిప్టస్ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో యూకలిç³్టస్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్ కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా యూకలిప్టస్ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం దక్కుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80 శాతం మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్‌కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్‌ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇ ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేల్లో యూనిట్ ఏర్పాటుకు సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీ, సబ్సిడీపై విద్యుత్ ఇచ్చాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శి, పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ సొంతూరులోనే ఉపాధి లభించింది.. 2018లో ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేశాను. అప్పటి నుంచి ఉపాధి కోసం బయటి నగరాలకు వెళ్లలేక ఊర్లోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నా. ఇప్పుడు గోపవరంలో సెంచురీ ప్యానల్స్ ఏర్పాటుతో నాలాంటి ఎంతోమందికి స్థానికంగానే ఉపాధి లభించింది. సొంత ఊరిలో ఉద్యోగం చేస్తానని కలలో కూడా ఊహించలేదు. సీఎం వైఎస్ జగన్ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. – కాళ్ల రాజేష్, బుచ్చనపల్లె, గోపవరం మండలం, వైఎస్సార్ జిల్లా ఇక ఉద్యోగం రాదనుకున్నా.. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు.– గుడి మెగురయ్య, కలసపాడు, వైఎస్సార్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు.. సెంచురీ ప్యానెల్స్‌కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ చెట్లు సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. – రూకల దేవదాసు, గోపవరం ప్రాజెక్టు కాలనీ, గోపవరం మండలం, వైఎస్సార్ జిల్లా -
ఓఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ మధ్యలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఇప్పటి వరకు కేటాయించిన భూములకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేటాయించిన భూముల్లో వినియోగంలో లేని వాటి వివరాలతోపాటు ఏర్పాటైన పరిశ్రమల స్థితిగతులపైనా నివేదిక సమర్పించాలన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలసి సోమవారం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు వీలుగా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)కు వెలుపల.. కొత్తగా నిర్మితమయ్యే రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు లోపల ఉండేలా భూములు గుర్తించాలన్నారు. విమానాశ్రయాలు, జాతీయ, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు 500 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ భూములు ఉండాలని రేవంత్ సూచించారు. సాగుకు యోగ్యం కాని భూముల్లో... సాగుకు యోగ్యం కాని భూములనే పరిశ్రమల ఏర్పాటుకు సేకరించడం ద్వారా రైతులకు నష్టం జరగదని రేవంత్ పేర్కొన్నారు. తద్వారా కాలుష్య సమస్య తగ్గడంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే ప్రభుత్వ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తద్వారా తక్కువ ధరలో భూములుఅందుబాటులోకి రావడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల తరలింపునకు ప్రత్యామ్నాయం సూచించాలని చెప్పారు. బల్క్‌డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు సంబంధించి మధ్యప్రాచ్య, యూరోపియన్ దేశాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. థర్మల్ విద్యుత్ బదులు సోలార్ పవర్ పారిశ్రామిక అవసరాల కోసం థర్మల్ విద్యుత్‌కు బదులుగా సౌర విద్యుత్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని, బాలానగర్ ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ సర్కారుతోనే పారిశ్రామిక అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ‘‘రైతుబంధు పెద్దవాళ్లకే ఇస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నాకు రెండెకరాలు ఉంది. సంవత్సరానికి 20వేలు వస్తుంది పెట్టుబడికి. మరొకాయనకు 10 ఎకరాలకు లక్ష రూపాయలు వస్తుంది. నాకు వస్తున్న 20వేల మీద సంతోషం లేదు. పక్కాయనకు వచ్చే లక్ష రూపాయల మీద దృష్టి ఉంది. పొలం ఎంత ఉంటే అంత వస్తుంది. అయినా డబ్బులున్న వాళ్లకు ఎందుకు ఇస్తున్నారన్న ప్రజల బాధను నేను అర్థం చేసుకోగలను. దీన్ని సరిదిద్దే అవకాశాన్ని పరిశీలిస్తాం. నాలుగు లేదా ఐదు ఎకరాలకు తగ్గించే విషయాన్ని ఆలోచిస్తున్నాం. ఈసారి ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా సరిదిద్దుతాం’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందని, లక్ష కోట్లు నష్టమని చెబుతూ.. ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని.. 147 టీఎంసీల నీరు లభ్యతగా ఉండేలా ప్లాన్ చేశామని చెప్పారు. రూ.80వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ ఆరోపించడం శోచనీయమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఖర్చు రూ.1,839 కోట్లు అని.. అందులో రెండు పిల్లర్లు కుంగితే లక్ష కోట్లు మునిగినట్టు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు ఇంజనీరింగ్ సమస్యలు సాధారణమేనని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వంతోనే అభివృద్ధి సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వంతోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని.. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సాధించిన ప్రగతి దీనికి నిదర్శన మని కేటీఆర్ చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పరిశ్రమలు వస్తున్నాయని.. ప్రభుత్వంలో స్థిరత్వం లేకపోతే ముందుగా దెబ్బతినేది పరిశ్రమలేనని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసే పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించడంతోపాటు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితులను తెచ్చామన్నారు. హైదరాబాద్ శివార్లతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా ముందుకు వచ్చాయని వివరించారు. తాను పూర్తి రాజకీయ నాయకుడిగా పారిశ్రామికవేత్తల మద్దతు కోసం ఈ సమావేశానికి వచ్చామన్నారు. రాష్ట్రంలో వేరేవాళ్లు అధికారంలోకి వస్తే వారు ప్రతిదానికి ఢిల్లీ వెళ్లి పర్మిషన్ తీసుకోవాలని, అన్ని రకాలుగా మెప్పించాల్సి వస్తుందని పేర్కొన్నారు. నాడు విద్యుత్ సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో అందరికీ తెలుసని, ఇప్పుడు 10 నిమిషాలు కూడా కరెంట్ పోతే తట్టుకోలేని స్థితికి వచ్చామని చెప్పారు. 2014కు ముందు హైదరాబాద్ శివార్లలో 14 రోజులకోసారి మంచినీళ్లు ఇచ్చేవారని.. ఇప్పుడు రోజూ వస్తున్నాయని తెలిపారు. రోజుకు 24 గంటలు నీళ్లు ఇవ్వాలనేది తమ ఆలోచన అని వివరించారు. ఈ సమావేశంలో సు«దీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా బుగ్గన దక్షిణ కొరియా పర్యటన
సాక్షి, అమరావతి: ఏపీ ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దక్షిణా కొరియాలో పర్యటిస్తున్నారు. వివిధ వాణిజ్యవేత్తలు, నిపుణులతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయగల అవకాశాలపై చర్చిస్తున్నారు. వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఏపీలో అనుసరించే కీలకాంశాలపై అధ్యయనం చేస్తున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తొలుత భారత రాయబారీ హెచ్.ఈ. అమిత్ కుమార్‌తో రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. ఏపీ ఆర్థికాభివృద్ధికి అవసరమైన అంశాలలో కొరియా భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి దిశగా కొరియాతో కలిసి పని చేసే అవకాశాలపైనా పరస్పరం చర్చించుకున్నారు. దక్షిణ కొరియా వ్యాపార విస్తరణకు అవసరమైన ఇండస్ట్రియల్ క్లస్టర్ ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు ఏపీ సంసిద్ధతతో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులు సహా సీ ఫుడ్ పై మరింత అవగాహన పెంచే బ్రాండింగ్ అంశంలో కలిసి ముందుకు సాగనున్నట్లు భారత్‌కు చెందిన సౌత్ కొరియా రాయబారి అమిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాయాబర కార్యాలయ ప్రతినిధి కె.స్వప్నిల్ తొరాట్ పాల్గొన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ సీఎఫ్ఓ సహా సంబంధిత ప్రముఖులతో ఆర్థిక మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మరింతగా కలిసి పని చేసే అవకాశాలపైనా ప్రధానంగా మంత్రి చర్చించారు. అందుకు ఐసీసీకే కూడా సానుకూలంగా స్పందించింది. పెట్టుబడులకు అవకాశమున్న ఏ అవకాశాన్నీ ఏపీ వదులుకోదన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.అందుకు అవసరమైన పరస్పర సహకారం ఎప్పుడూ ఉంటుందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొరియా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ సీఎఫ్ఓ పంకజ్ శ్రీ వాత్సవ, బీకేఎల్ పార్ట్ నర్ జాంగ్ బీక్ పార్క్, టాగివ్ వ్యవస్థాపకులు, సీఈవో పంకజ్ అగర్వాల్, సేజ్ స్ట్రాటజీస్ సీఈవో ఇంబం చోయ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక, నైపుణ్యాబివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్..కొరియా ట్రేడ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ప్రతినిధులను కలిశారు.ఏపీకి పెట్టుబడులను తీసుకురావడంలో 'కొట్రా' భాగస్వామ్యమవుతుందని మంత్రి వెల్లడించారు. కొట్రాకు బెంగుళూరులో నెట్ వర్క్ కార్యాలయం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆ ఏజెన్సీ మంత్రి బుగ్గనకి తెలిపింది. పర్యటన అనంతరం కొట్రా ప్రతినిధులు ఏపీకి వచ్చి అవసరమైన సహకారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని డైరెక్టర్ జనరల్ హియో జిన్వోన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చో ఈనం, డిప్యూటి డైరెక్టర్ జో యాండ్, రీసెర్చ్ టీమ్ డైరెక్టర్ హాంగ్ చంగ్సేక్, అసిస్టెంట్ మేనేజర్ పార్క్ మనిజోంగ్ పాల్గొన్నారు. దక్షిణా కొరియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయమైన సామ్యూక్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ లో కొరియన్ లాంగ్వేజ్ ల్యాబ్ ల ఏర్పాటుపై సామ్యూక్ విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ హ్యున్ హీ కిమ్ తో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చర్చించారు. కొరియన్ భాష నేర్చుకోవడం వలన ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశాలు, కొరియాలో మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచడమే తమ లక్ష్యమని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. వొకేషనల్ విద్యకు సంబంధించి సామ్యూక్ విశ్వవిద్యాలయం ఏపీకి అవసరమైన సహకారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొరియన్ భాష నేర్చుకోవడం వలన ప్లేస్ మెంట్లను మరింతగా పెంచవచ్చన్నారు. విద్యార్థుల మార్పిడితో యువతకు మరిన్ని అవకాశాలను కల్పించే మార్గాలను అన్వేషించే బాధ్యతను సామ్యూక్ విశ్వవిద్యాలయం 'ఎస్పీఓసీ'కి కేటాయించింది. ఈ కార్యక్రమంలో సామ్యూక్ విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ హ్యున్ హీ కిమ్, ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డీన్ జియెన్ షిన్, లైఫ్ సైన్సెస్ లో పోస్ట్ -డాక్టోరల్ పరిశోధకులు ఎస్. ఉమావతి, ఫార్మాలో పోస్ట్ -డాక్టోరల్ పరిశోధకులు ఏ.వి. ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
CM Jagan: స్థానికులకే ఉద్యోగాలు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు భేటీ జరిగింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ SIPB) పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అయితే.. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాల కల్పన కచ్చితంగా అమలు చేయాలని, అది సమగ్రంగా అమలవుతుందా? లేదా? అనేది ఆరు నెలలకొకసారి నివేదిక పంపాలని కలెక్టర్లు ఆదేశించారు సీఎం జగన్. అదే సమయంలో ప్రైవేట్ పరిశ్రమల్లో కూడా 75 శాతం, ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాల్సిందేనని తెలిపారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని తప్పకుండా అమలు చేయలని, స్థానికులకు ఉద్యోగాలు కల్పన క్రమంలోనే పరిశ్రమలకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని స్పష్టం చేశారాయన. ‘‘ఒక పరిశ్రమ సమర్థవంతా నడవాలంటే ఆ ప్రాంత ప్రజల మద్దతు అవసరం. రాబోతున్న పరిశ్రమల్లో కూడా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. రాష్ట్రంలో మానవవనరులు నైపుణాభివృద్ధికి కొరత లేదు. రైతుల వద్ద పంటల ఉత్పత్తుల, కనీస మద్దతు ధరకు కొనాల్సిందే!. ఇజ్రాయెల్ తరహా విధానాలనూ ఏపీలోనూ అమలయ్యేలా చూడాలని.. పరిశ్రమల్లో శుద్ధి చేసిన నీరు, డీ శాలినేషిన్ నీటినే వినియోగించేలా చూడాలని అధికారులకు సూచించారాయన. ఇదీ చదవండి: అవినీతి రహితం సంక్షేమ స్వర్ణయుగం -
మరింత వేగంగా వీసీఐసీ అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరో ముందడుగు పడింది. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధి మరింత వేగం కానుంది. ఈ కారిడార్‌లో ఇప్పటికే తొలి దశ కింద రూ.2,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పుడు రెండో దశ అభివృద్ధికి మార్గం సుగమమైంది. తొలి దశ అంచనా వ్యయంలో కొంత భాగం రుణంగా సమకూర్చిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) రెండో దశకు కూడా రుణం రూపంలో నిధులు సమకూర్చడానికి అంగీకరించింది. రెండో దశకు రూ. 1,632.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా అందులో రూ.1130 కోట్లు (141.12 మిలియన్ డాలర్లు) ఏడీబీ రుణంగా అందించనుంది. ఈ రుణంపై సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుమతి కోరుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ (డీఈఏ)తో పాటు రాష్ట్ర అధికారులకు ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కొనిషి లేఖ రాశారు. రెండో దశలో చిత్తూరు సౌత్ క్లస్టర్, రాంబల్లి, నక్కపల్లి క్లస్టర్స్‌లో స్టార్టప్ ఏరియాకు సంబంధించి ఏడు ప్రాజెక్టులను చేపడతారు. కేంద్రం నుంచి అనుమతిరాగానే ఈ పనులు ప్రారంభిస్తామని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 23,046 ఎకరాలు అభివృద్ధి వీసీఐసీ రెండో దశలో చిత్తూరు సౌత్ క్లస్టర్లో రూ.462.96 కోట్లతో 2,770 ఎకరాలు, నక్కపల్లి క్లస్టర్లో రూ.399.03 కోట్లతో 1,120 ఎకరాలు, రాంబల్లిలో రూ.149 కోట్లతో 396 ఎకరాలు అభివృద్ధి చేస్తారు. ఈ మూడు క్లస్టర్లను సమీపంలోని ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. ఇందులో భాగంగా అనకాపల్లి – అచ్యుతాపురం రోడ్డును రూ.243.02 కోట్లతో జాతీయ రహదారికి అనుసంధానిస్తారు. అదే విధంగా నాయుడుపేట క్లస్టర్‌ను రూ 120.78 కోట్లతో, రౌతు సురమాల క్లస్టర్‌ను రూ.67.42 కోట్లతో, నక్కపల్లి క్లస్టర్‌ను రూ.25.91 కోట్లతో ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రూ.164.70 కోట్లు భూ సేకరణకు ఖర్చవుతుంది. మిగిలిన మొత్తంతో ఈ ఏడు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు. రెండో దశలో మొత్తం 4,143.92 ఎకరాలను అభివృద్ధి చేస్తుండగా ఇప్పటికే 3,399.43 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా 744.49 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ రెండు దశలు పూర్తయితే పారిశ్రామిక అవసరాల కోసం 23,046 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. (చదవండి: థాంక్యూ సీఎం సార్ ! సీఎం జగన్ చిత్రపటానికి డీఎస్సీ 1998 ఉద్యోగుల క్షీరాభిషేకం ) -
ఉత్తరాంధ్రలో కొత్త చరిత్ర.. నౌపడ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
మనం అధికారంలోకి రాక ముందు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులు మాత్రమే ఉన్నాయి. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక, ఈ 46 నెలల కాలంలో మరో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. మరో మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు అప్రూవల్ తీసుకున్నాం. వేగవంతంగా నిర్మాణంలోకి తీసుకువస్తాం. తద్వారా పారిశ్రామికాభివృద్ధికి తీర ప్రాంతం వేదిక అవుతుంది. లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నౌపడ నుంచి సాక్షి ప్రతినిధి: మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజీ ఎత్తిపోతల పథకం, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టుల ద్వారా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. విశాఖ నుంచి 170 కిలోమీటర్లు, చెన్నై– కోల్‌కతా నేషనల్ హైవేకు కేవలం 14 కిలోమీటర్లు, ప్రధాన రైల్వే మార్గానికి 11 కిలోమీటర్ల దూరంలో 1,250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న మూలపేట పోర్టు.. రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇక్కడే 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని చెప్పారు. పోర్టు ఆధారిత, అనుబంధ పరిశ్రమలు, ఇతరత్రా లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందివచ్చే కార్యక్రమం చేపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని మూలపేట తీరంలో పోర్టు నిర్మాణానికి, ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్ ఎత్తిపోతల పథకానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సంతబొమ్మాళి మండలంలోని నౌపడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉంటే, అందులో ఏకంగా 193 కిలోమీటర్లు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఉందన్నారు. అయినా ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, కనీసం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఉండి ఉంటే ఈ జిల్లా చెన్నై, ముంబయిగా అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. ఈ విషయం తెలిసీ కూడా దశాబ్దాలుగా ఎవ్వరూ ఈ దిశగా అడుగులు వేసి, చిత్తశుద్ధి చూపలేదన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఇంకా ఏమన్నారంటే.. అభివృద్ధికి మూల స్తంభం ► మూలపేట ఇక మూలనున్న గ్రామం కాదు. ఇది అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తుంది. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మరో చెన్నై, ముంబయి కాబోతున్నాయి.మూలపేటలో మనం కట్టబోతున్న పోర్టు సామర్థ్యం ఏకంగా ఏడాదికి 24 మిలియన్ టన్నులు. ఈ పోర్టులో 4 బెర్తులు నిర్మిస్తున్నాం. ► ఈ రోజు నుంచి 24 నెలల్లో ఈ పోర్టు నిర్మాణం పూర్తవుతుంది. దాదాపు రూ.2,950 కోట్ల ఖర్చుతో పోర్టు నిర్మాణం చేపడుతున్నాం. ఇక్కడ ట్రాఫిక్ పెరిగి ఈ పోర్టు సామర్థ్యం వంద మిలియన్ టన్నులకు పెరిగే రోజు సమీపంలోనే ఉంది. దీన్ని ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడానికి 14 కిలోమీటర్ల పొడవున రోడ్డు, 11 కిలోమీటర్ల పొడవున రైలుమార్గం నిర్మిస్తున్నాం. ► ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టా బ్యారేజీ నుంచి పైపులైన్ వేసి 0.5 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి సరఫరా చేయడానికీ శ్రీకారం చుడుతున్నాం. ఇలా మౌలిక వసతులకు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తదితర వ్యయాలను కలిపితే మూలపేట పోర్టు నిర్మాణానికి మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము రూ.4,362 కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా. గంగపుత్రుల కళ్లల్లో మరింత కాంతి గంగపుత్రుల కళ్లల్లో మరిన్ని కాంతులు నింపడానికి, మత్స్యకార సోదరులకు మరింత అండగా ఉండేందుకు మూలపేట పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రూ.365.81 కోట్లతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. మంచినీళ్లపేటలో రూ.12 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి 2019 సెప్టెంబర్‌లో శ్రీకారం చుట్టాం. దాన్ని మరో రూ.85 కోట్ల ఖర్చుతో ఫిషింగ్ హార్బర్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. రైతుల శ్రేయస్సే లక్ష్యం ► వంశధార, నాగావళి నదులు ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల శ్రీకాకుళం జిల్లా ఇప్పటికీ సస్యశ్యామలం కాని పరిస్థితి. అప్పట్లో దివంగత నేత, నాన్న గారు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వంశధార ఫేజ్ 2, స్టేజ్ 2 కింద 33 కిలోమీటర్ల పొడవున కాలువల తవ్వకం, హిరమండలం రిజర్వాయర్‌ను 19 టీఎంసీల కెపాసిటీతో నిర్మాణ పనులకు అడుగులు వేగంగా వేయించారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఆ అడుగులు ముందుకు పడలేదు. ► నేరడి బ్యారేజ్ పూర్తయితే తప్ప హిరమండలం రిజర్వాయర్‌లో 19 టీఎంసీల కెపాసిటీతో నీరు పెట్టడం సాధ్యం కాదు. మీ బిడ్డ గతంలో ఏ ముఖ్యమంత్రి చూపని చొరవ చూపించారు. ఒడిశాకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలిసి నేరడి బ్యారేజ్ గురించి మాట్లాడారు. దాని పరిస్థితి అలానే ఉన్నా మధ్యేమార్గంగా మన రైతన్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి జరగాలన్న ఉద్దేశంతో రూ.176.35 కోట్లతో గొట్టా బ్యారేజ్‌పై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తున్నాం. ► మరోవైపు వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా ఆగçస్టు నెలలోనే పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం. మహానేత రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసేందుకు, మూడు నియోజకవర్గాల రూపురేఖలను మార్చేందుకు మరో రూ.400 కోట్లు ఖర్చయ్యే పనులకు ఈ రోజు శ్రీకారం చుట్టాం. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఊరట ► ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మొదలు పెట్టిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్‌లో ప్రారంభోత్సవం చేస్తాను. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమానికి రూ.700 కోట్లతో నాంది పలికాం. దీన్ని జూన్ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. అదే రోజున పాతపట్నం నియోజకవర్గంలో మరో రూ.265 కోట్లతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తూ శంకుస్థాపన చేస్తాను. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బేరీజు వేయండి ► ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించిన పరిస్థితులను ఒక్కసారి బేరీజు వేయండి. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, పార్వతీపురం, నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ► ఈ ప్రాంతంలో ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్న విషయం గమనించాలి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి జూన్‌లో శంకుస్థాపన చేస్తాం. మే 3వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి వీలుగా రూ.6,200 కోట్లతో ఆరు లైన్ల రహదారిని నిర్మించబోతున్నాం. తీర ప్రాంతంలో ఇలాంటి అభివృద్ధి గతంలో ఎందుకు జరగలేదో ఆలోచించండి. సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం ► ఏపీలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ విశాఖలో కాపురం పెడతాడని తెలియజేస్తున్నా. ► ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా, ఏ గ్రామం తీసుకున్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి కనిపిస్తోంది. స్కూళ్లు మారుతున్నాయి. కొత్తగా మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఉన్న ఆస్పత్రులన్నీ రూపురేఖలు మారుతున్నాయి. ► ప్రతి ఇల్లూ అభివృద్ధి కావాలి. నా అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనపడాలి. 46 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా సొమ్మును నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసింది. ► మీ బిడ్డ జగన్ డీబీటీ బటన్ నొక్కటం మాత్రమే కాదు... కులాలు, కుటుంబ చరిత్రలను మార్చాలన్న తపన, తాపత్రయంతో పని చేస్తున్నాడని గుర్తించాలి. నవరత్నాల పాలనతో ఇంటింటి చరిత్రను, సామాజిక వర్గాల చరిత్రను తిరగ రాస్తున్న ప్రభుత్వంగా, ప్రాంతాల చరిత్రలను, పారిశ్రామిక వాణిజ్య చరిత్రను కూడా మారుస్తున్నాం. -
గేమ్ ఛేంజర్.. పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: రేపటి తరాల భవిష్యత్, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పరితపిస్తున్న, శ్రమిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న అపార వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నారని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ (ఏపీ జీఐఎస్)పై శాసనసభలో శనివారం స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆ సదస్సులో రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ క్రమంలో 6,07,383 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో జీఐఎస్ గేమ్ చేంజర్ అని కొనియాడారు. వ్యూహాత్మక విధానాలతో విజయం రాష్ట్ర ప్రభుత్వం సమ్మిట్ నిర్వహించడానికి ముందు రోడ్‌షోలు, వివిధ దేశాల దౌత్యవేత్తలతో సమావేశాలు, కర్టెన్‌రైజర్ కార్యక్రమాలు నిర్వహించాం. తద్వారా తీసుకున్న చర్యలు, వ్యూహాత్మక విధానాల ద్వారా విజయం సాధించాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తలు అయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, భారత్ బయోటెక్ కృష్ణా ఎళ్ల, జీఎంఆర్ గ్రూప్స్, జీఎం రావు, ఇతరులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇంధన శాఖలో రూ.9.05 లక్షల కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యంలో రూ.3.38 లక్షల కోట్లు, పర్యాటక శాఖలో రూ.22,096 కోట్లు, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో రూ.41 వేల కోట్లు, వ్యవసాయ శాఖలో రూ.3,435 కోట్లు, పశు సంవర్థక శాఖలో రూ.1,020 కోట్లు చొప్పున రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెట్టుబడులకు వాస్తవ రూపం తీసుకు రావడం కోసం సీఎస్ అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పే వారి కోసం వైఎస్సార్ వన్ కింద 23 శాఖలకు సంబంధించి 96 క్లియరెన్స్‌లు 21 రోజుల్లో ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఏపీ ప్రభుత్వమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రం నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. అప్పట్లో ఏటా సగటున రూ.90 వేల కోట్ల లోపు మాత్రమే ఎగుమతులు ఉండేవి. మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నుంచి 2019–20లో రూ.1.04 కోట్లు, 2020–21లో రూ.1.24 లక్షల కోట్లు, 2021–22లో రూ.1.43 లక్షల కోట్లు, 2022–23లో డిసెంబర్ వరకు రూ.1.18 లక్షల కోట్ల చొప్పున ఎగుమతులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. వీటి పరిధిలో 48 వేల ఎకరాల భూమి పరిశ్రమలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన ఏకైక ప్రభుత్వం కూడా మాదే. ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం జగన్ ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్, ఇతరత్రా చర్యలతో ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా 13 లక్షల మందికిపైగా ఉపాధి లభించింది. బకాయిలతో కలిపి రూ.2800 కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించాం. మూడేళ్లలో రూ.56 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 111 భారీ పరిశ్రమలు తీసుకుచ్చాం. వీటిలో 73 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. మరో 88 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.16 వేల కోట్లతో మరో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచించిన నాయకులు నాడు వైఎస్సార్, నేడు సీఎం జగన్ మాత్రమే. టీడీపీ ప్రచారం అంతా అవాస్తవం. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థను మేం ఇబ్బంది పెట్టామా? అనకాపల్లి జిల్లాలో ఉన్న హెరిటేజ్ ప్లాంట్ నాలుగేళ్లుగా పన్ను చెల్లించలేదు. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి విప్లవాత్మక మార్పులతో పెట్టుబడులు సీఎం జగన్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. పరిశ్రమలకు విద్యుత్ శాఖ వెన్నెముక లాంటిది. ఇటీవల విశాఖలో మొత్తం రూ.13 లక్షల కోట్ల ఎంవోయూల్లో ఇంధన శాఖకు సంబంధించే రూ.8,85,515 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 2017లో చంద్రబాబు రూ.85,571 కోట్ల ఎంవోయూలు చేసుకుని 45,895 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినప్పటికీ ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. 2018లో రూ.67,115 కోట్లతో ఎంవోయూలు చేసుకుంటే ఇందులో కూడా ఉద్యోగాలు జీరోనే. మేం చేసుకున్న ఒప్పందాలన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. భూమి, నీళ్లు, ఇతర వనరులను సమర్థవంతంగా వాడుకునేలా కొత్త పాలసీలు తెచ్చాం. ఏ రాష్ట్రానికైనా పవర్ ఇచ్చేలా 2020లో రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీని తీసుకువచ్చాం. దీంతో సోలార్, ఎనర్జీ సంస్థలు వచ్చాయి. 29 పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల టెక్నికల్ కమర్షియల్ ఫీజబుల్ రిపోర్ట్ సిద్ధం చేశాం. మరికొన్ని చిన్న ప్రాజెక్టులకు నివేదికలు తయారు చేస్తున్నాం. మన దేశంలో 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుల స్థాపనలో ఎకరాకు రూ.31 వేలు చొప్పున రైతులకు లీజు లభిస్తుంది. – మంత్రి పెద్దిరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి ఆయనకు లోకజ్ఞానం ఉందా? దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్‌కు మాత్రమే వచ్చారంటే సీఎం జగన్ పట్ల వారు ఎంత నమ్మకంగా, సానుకూలంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఓ నాయకుడు తన పార్టీ పెట్టి పదేళ్లు అయ్యిందని సభ నిర్వహించి.. దారిన పోయే వారితో ఎంవోయూలు చేయించారని మాట్లాడారు. ఆ మనిషికి నిజంగా లోకజ్ఞానం ఉందా? పారిశ్రామిక వేత్తల గురించి కనీస అవగాహన ఉందా? పరిశ్రమలు తరలిపోతున్నాయి.. పారిశ్రామికవేత్తలు రావడం లేదని టీడీపీ చేసిన గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సులకు ఎప్పుడూ ఇలాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాలేదు. దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో సీఎం అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని స్వయంగా ముఖేష్ అంబానీ సమ్మిట్‌లో అన్నారు. జే అంటే జగన్.. జే అంటే జోష్.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని పునీత్ దాల్మియా ప్రశంసించారంటే ఇంతకంటే సర్టిఫికెట్ ఏం కావాలి? సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. పర్యాటక రంగంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఎంవోయూలు చేసుకున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి టార్చ్ బేరర్ సీఎం జగన్ 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, ఆశలను తన భుజస్కందాలపై వేసుకుని వాటిని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తున్న టార్చ్ బేరర్ సీఎం జగన్. ఈ ప్రయాణంలో భాగంగా రాష్ట్ర యువత భవిష్యత్‌కు భరోసానిచ్చేలా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తద్వారా దేశంతో పాటు, ప్రపంచాన్నే రాష్ట్రం వైపు చూసేలా చేశారు. ఈ సమ్మిట్ విజయవంతం అవ్వడంతో టీడీపీ నాయకులకు మైండ్ బ్లాంక్ అయింది. దీంతో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కన్నా దోపిడీ చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో రూ.రెండు వేల కోట్లు దోపిడీ చేసిన చరిత్ర లోకేశ్ ది. సీమెన్స్ కుంభకోణం రూపంలో రూ. 371 కోట్లు దోపిడీ చేశారు. ఈ కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది. – అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే -
Ap Budget 2023-24: పరిశ్రమలు, వాణిజ్యానికి రూ. 2,602 కోట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చి, ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ రాష్ట్రం పటిష్టతను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ వపర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, సెంచురీ ఫ్లైబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ఇతరప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్,న ఆర్వే, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్ల నుంచి ఏడు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధుల బృందాలు ఏపీ పారిశ్రామిక సామర్థ్యాలపై ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో నాలుగు సమావేశాలు జరిగాయి. 13.42 లక్షల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో ఏపీలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుంచి వచ్చిన ఈ విశేష, స్పందన, అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి, విశ్వసనీయతకు నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల అన్ని అవసరాల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ సర్వర్లు వన్ స్టాప్ షాప్‌గా ఉంటాయి. దీనిలో భాగంగా ఏప్రిల్ 2019, నుంచి 36,972 దరఖాస్తులు స్వీకరించండి. వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్‌లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. చదవండి: AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల డిసెంబర్ 2022 వరకు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూలు కులాలకు చెందిన 3,748 యూనిట్లకు షెడ్యూలు తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అలాగే ఈ ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు-క్లస్టర్ అభివృద్ధి (ఎమ్ఎస్ఈసీడీపీ) ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం ఐదు క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతే కాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోట్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి-ఏర్పేడు నోడ్లోని చిత్తూరు సౌత్ క్లస్టర్, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) కింద కడప నోడ్ కొప్పర్తి క్లస్టర్ ఈ మూడు పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెల్పింది. 3,155 ఎకరాలలో కొప్పర్తి సమీపంలో వైఎస్సార్ జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్ గా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకుని వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది దీని ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని 25,000 మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుంది. జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో, సంవత్సరానికి రెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగల సామర్ధ్యంతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని మొదటి దశలో 1000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయించింది. రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో దాదాపు 32,725 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కి.మీ పొడవున ఉన్న బి.టి. రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది. రూ. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కి.మీ. రాష్ట్ర రహదారుల, జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని సాధించింది. 'రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్' క్రింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ. పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారుల మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయించింది. -
పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్, కేంద్రమంత్రి గడ్కరీ (ఫొటోలు)
-
దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది: సీఎం జగన్
-
ఏపీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మంచి సహకారం
-
Special AV Of Energy Growth: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023
-
సీఎం జగన్ విజన్ అద్భుతం..!
-
సీఎం జగన్ విజన్.. ఏపీ NO.1గా ఉంది
-
సీఎం జగన్ డైనమిక్ లీడర్షిప్.. ఏపీకి పెద్ద వరం
-
సీఎం జగన్ సమక్షంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటన
-
ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు
-
ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి
-
ఏపీలో శ్రీ సిమెంట్ 5 వేల కోట్లతో పెట్టుబడులు.. 5 వేల మందికి ఉపాధి..
-
చాలా సంతోషంగా ఉంది.. సుస్థిర అభివృద్ధి ప్రపంచానికి చాలా ముఖ్యం
-
6లక్షల మందికి ఉపాధి అవకాశాలు: సీఎం జగన్
-
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పాలన..!
-
ఏపీ ప్రభుత్వం మద్దతు అమోఘం
-
మహానేత వైఎస్ఆర్ను గుర్తుచేసిన అపోలో వైస్ చైర్ పర్సన్ ప్రీతారెడ్డి..!
-
ఏపీలో రోడ్ కనెక్టవిటీ విద్యుత్ సోకార్యాలు చాలా బాగున్నాయి
-
టొరే ఇండస్ట్రీస్ ఎండీ మసహీరో హమగుచి స్పీచ్
-
Global Investors Summit 2023: ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి స్పీచ్
-
ఇండియా ఇండస్ట్రియల్ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతుంది..!
-
సమ్మిట్ ను ప్రారంభించిన సీఎం జగన్
-
లేజర్ షో... కార్పొరేట్ దిగ్గజాలు ఫిదా
-
డెలిగేట్స్‌కు సీఎం జగన్ ఘన స్వాగతం
-
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి స్వాగతం పలికిన సీఎం జగన్
-
విశాఖపట్నం : ఘనంగా ప్రారంభమైన జీఐఎస్-2023 (ఫొటోలు)
-
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: 92 MoUs worth INR 11,87,756 lakh crores
Updates.. స్టాల్స్‌ను పరిశీలించిన గడ్కరీ.. ► 150కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం స్టాల్స్‌ను పరిశీలించారు. జీఐఎస్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగం ►ఏపీకి పారిశ్రామిక వృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకం ►పోర్టులతో రహదారుల కనెక్టివిటీ బలోపేతం చేప్తాం ►పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యం ►ఏనీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయి ►ఏపీలో రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ. 20 వేల కోట్లు: కేంద్ర మంత్రి గడ్కరీ ►ఏపీలో పెట్టుబడులను ప్రకటించిన ముకేష్ అంబానీ ►ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు: ముకేష్ అంబానీ ►ఎనర్జీ డిపార్ట్మెంట్లో రూ, 8, 25, 639 కోట్ల పెట్టుబడులు పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు ► రూ.11లక్షల 87 వేల 756 కోట్ల విలువ కలిగిన 92 ఒప్పందాలు ►ఎన్టీపీసీ ఎంవోయూ(రూ. 2..35లక్షల కోట్లు) ►ఏబీసీ లిమిటెట్ ఎంవోయూ(రూ. 1.20 లక్షల కోట్లు) ►రెన్యూ పవర్ ఎంవోయూ(రూ. 97, 550 కోట్లు) ►ఇండోసాల్ ఎంవోయూ(రూ. 76, 033 కోట్లు) ►ఏసీఎమ్ఈ ఎంవోయూ(రూ. 68,976 కోట్లు) ►టీఈపీఎస్ఓఎల్ ఎంవోయూ( రూ. 65, 000 కోట్లు) ►జేఎస్‌డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు) ►హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు) ►అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు) ►గ్రీన్ కో ఎంవోయూ(47, 600 కోట్లు) ►ఓసీఐఓఆర్ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు) ► హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ (రూ. 30వేల కోట్లు) ► వైజాగ్ టెక్ పార్క్ (రూ. 21,844 కోట్లు) ► అదానీ ఎనర్జీ గ్రూప్ (రూ.21, 820 కోట్లు) ►ఎకోరెన్ ఎనర్జీ (రూ.15,500 కోట్లు) ►సెరంటికా ఎంవోయూ (రూ. 12,500 కోట్లు) ►ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (రూ.12వేల కోట్లు) ► అరబిందో గ్రూప్ (రూ.10, 365 కోట్లు) ►ఓ2 పవర్ ఎంవోయూ ( రూ.10వేల కోట్లు) ► ఏజీపీ సిటీ గ్యాస్ (రూ. 10వేల కోట్లు) ► జేసన్ ఇన్ఫ్రా ఎంవోయూ (రూ. 10వేల కోట్లు) ►ఆదిత్య బిర్లా గ్రూప్ (రూ. 9,300 కోట్లు) ►జిందాల్ స్టీల్ (రూ. 7500 కోట్లు) ►టీసీఎల్ ఎంవోయూ(రూ. 5,500 కోట్లు) ►ఏఎం గ్రీన్ ఎనర్జీ(రూ. 5,000 కోట్లు) ►ఉత్కర్ష అల్యూమినియం(రూ. 4,500 కోట్లు) ►ఐపోసీఎల్ ఎంవోయూ(రూ. 4,300 కోట్లు) ►వర్షిణి పవర్ ఎంవోయూ(రూ, 4,200 కోట్లు) ►ఆశ్రయం ఇన్ఫ్రా(రూ. 3,500 కోట్లు) ►మైహోమ్ ఎంవోయూ(3,100 కోట్లు) ►వెనికా జల విద్యుత్ ఎంవోయూ(రూ. 3000 కోట్లు) ►డైకిన్ ఎంవోయూ(రూ. 2,600 కోట్లు) ►సన్నీ ఒపోటెక్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు) ►భూమి వరల్డ్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు) ►అల్ట్రాటెక్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు) ►ఆంధ్రా పేపర్ ఎంవోయూ(ర. 2వేల కోట్లు) ►మోండాలెజ్ ఎంవోయూ(రూ. 1,600 కోట్లు) ►అంప్లస్ ఎనర్జీ(రూ. 1,500 కోట్లు) ►గ్రిడ్ ఎడ్జ్ వర్క్స్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►టీవీఎస్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►హైజెన్కో ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►వెల్స్పన్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►ఒబెరాయ్ గ్రూప్(రూ. 1,350 కోట్లు) ►దేవభూమి రోప్‌వేస్(రూ. 1,250 కోట్లు) ►సాగర్ పవర్ ఎంవోయూ(రూ. 1,250 కోట్లు) ►లారస్ గ్రూప్(రూ. 1,210 కోట్లు) ►ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్(రూ. 1,113 కోట్లు) ►డెక్కన్ ఫైన్ కెమికల్స్(రూ. 1,110 కోట్లు) ►దివీస్ ఎంవోయూ(రూ. 1,100 కోట్లు) ►డ్రీమ్ వ్యాలీ గ్రూప్(రూ. 1,080 కోట్లు) ►భ్రమరాంబ గ్రూప్(రూ. 1,038 కోట్లు) ►మంజీరాహోటల్స్ అండ్ రిసార్ట్స్(రూ. 1,000 కోట్లు) ►ఏస్ అర్బన్ డెవలపర్స్(రూ. 1,000 కోట్లు) ►శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్(రూ. 1,000 కోట్లు) ►ఎంఆర్కేఆర్ కన్స్టక్షన్స్(రూ. 1,000 కోట్లు) ►సెల్కాన్ ఎంవోయూ(రూ.1,000 కోట్లు) ►తుని హోటల్స్ ఎంవోయూ(రూ. 1,000 కోట్లు) ►విష్ణు కెమికల్స్(రూ. 1,000 కోట్లు) జీఐఎస్-2023లో సీఎం జగన్ ప్రసంగం ►త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని ►త్వరలో విశాఖ నుంచి పరిపాలన సాగిస్తాం ►ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ►ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నంబర్‌వన్ ►ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం ►నైపుణ్యాభివద్ధి కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి ►గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు ►రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయి ► దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు వస్తుంటే.. ఏపీలోనే 3 పారిశ్రామిక కారిడార్లు ►పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలతో నంబర్‌వన్‌గా నిలిచాం ►గ్రీన్ ఎనర్జీపై ప్రధాన ఫోకస్ ►తొలిరోజే 92 ఎంవోయూలు.. ► మొత్తం రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు ► మొత్తం 20 రంగాల్లో పెట్టుబడులు ►దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది ►340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి ► మొత్తం 340 ఏంవోయూలు.. 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ముఖేష్ అంబానీ స్పీచ్ ►సమ్మిట్‌లో భాగస్వామ్మనైందుకు సంతోషంగా ఉంది: ►పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు: ముఖేష్ అంబానీ ►ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి ►పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే వచ్చారు ►నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతుంది: ముఖేష్ అంబానీ సజ్జన్ భుజంకా స్పీచ్ ►ఏపీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మంచి సహకారం ►ఏపీలో మా కంపెనీ మరింత విస్తరణకు సిద్ధంగా ఉంది సెంచరీ ఫ్లై బోర్డ్స్ చైర్మన్ ►ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషకరం: కరణ్ అదానీ ►ఏపీలో మౌలిక సదుపాయాలు బాగాన్నాయి ►15 వేల మెగావాట్ల వపర్ ప్రాజెక్ట్ అభివృద్ధి -కరణ్ అదానీ, సీఈవో అదానీ పోర్ట్స్ ►ఏపీలో వేల కోట్ల పెట్టబడులు పెట్టబోతున్నాం రెన్యూ పవర్ ఎండీ సుమంత్ సిన్హా ►ఏపీలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉంది: ఒబెరాయ్ హోట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అర్జున్‌ఒబెరాయ్ ►సీఎం జగన్ దార్శనికతతో తొందరగా అనుమతలు భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా ప్రసంగం ►ప్రపంచానికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోంది ►ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి ►వాటిని సమర్ధవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి ►నైపుణ్యాభివృద్ధికి ఏపీ చేస్తున్న కృషి ప్రశంసనీయం సియాంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి స్పీచ్ ►విశాఖలో మరిన్ని సేవలు విస్తరిస్తాం ►ఏపీలో సంక్షేమ పథకాలు అద్భుతం ►ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం ►విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం ►పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది ►అమ్మఒడి, విద్యాకానుక, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవనె పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు స్పీచ్ ►సీఎం జగన్ విజన్ అద్భుతం ►సీఎ జగన్ దార్శనికత ప్రశంసనీయం ►ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది ►ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది ►ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది ►ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతండటంతో ఏపికి మరిన్ని పరిశ్రమలు ►రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయం ►ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు ►రూ. 10 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించిన నవీన్ జిందాల్ ►ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది ►రూ. 10 వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి ►ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది ►వేదికపై రూ. 10 వేల కోట్ల పెట్టుబడి ప్రకటించిన నవీన్ జిందాల్ మార్టిన్ ఎబర్ హార్డ్, టెస్లా కో ఫౌండర్ స్పీచ్ ►గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది ►గ్రీన్ ఎనర్జీ పట్ల ఏపీ ఆసక్తి ప్రశంసనీయం ►సుస్థిర అభివృద్ధి ప్రపంచానికి చాలా ముఖ్యం టోరే ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగూచి స్పీచ్ ►ఏపీ ప్రభుత్వం సహకారం మరువలేనిది ►పలు కీలక రంగాల్లో వెంటనే అనుమతులు కియా ఇండియా ప్రతినిధి కబ్ డోంగ్ లి ప్రసంగం ►రాష్ట్ర అభివృద్ధిలో కియా తన పాత్ర పోషిస్తుంది ►ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయి ►ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిస్తోంది ►ఏపీ ప్రభుత్వ మద్దతు అమోఘం శ్రీ సిమెంట్ చైర్మన్ హరిమోహన్ స్పీచ్ ►ఏపీలో నైపుణ్యమైన మానవ వనరులు ఉన్నాయి: ►జగన్ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారింది ►కర్బన రహిత వాతావరణం కోసం ఏపీ కృషి ప్రశంసనీయం ►ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్ తనదైన పాత్ర పోషిస్తోంది ►రూ. 5వేల కోట్లతో ఏపీలో శ్రీ సిమెంట్ పెట్టుబడులు ►శ్రీ సిమెంట్ ద్వారా 5 వేల మందికి ఉపాధి ►వేదికపైనే ప్రకటించిన శ్రీ సిమెంట్ చైర్మన్ హరిమోహన్ అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు ►ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్ కృషి అభినందనీయం ►ఏపీ సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది ►ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్పార్‌కృషిని గుర్తు చేసిన ప్రీతారెడ్డి ►ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించింది నాఫ్ సీఈవో సుమ్మిత్ బిదానీ ప్రసంగం ►పరిశ్రమలకు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం ►ఏపీలో రోడ్ కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యాలు బాగున్నాయి ►ఇన్వెస్టర్స్ సదస్సు పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగం మంత్రి బుగ్గన ప్రసంగం ►ఏపీలో సహజ వనురులు పుష్కలంగా ఉన్నాయి: మంత్రి బుగ్గన ►నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవలేదు ►పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి ►పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ►బిజినెస్ ఇండస్ట్రీలపై సీఎం జగన్ మంచి దార్శినికతతో ఉన్నారు ►ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది ►ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది ►ఇండియా ఇండస్ట్రియల్ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోంది జీఐఎస్‌లో మంత్రి అమర్నాథ్ ప్రసంగం ►రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు: మంత్రి గుడివాడ అమర్నాథ్ ►ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది ►సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ పాలన ►రాష్ట్రంలో సీఎం జగన్ సారథ్యంల బలమైన నాయకత్వం ఉంది ►ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉంది 10:36AM ► జ్యోతి ప్రజ్వలన అనంతరం సీఎస్ జవహర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం ►వీడియో ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం ఘనస్వాగతం ►అడ్వాంటేట్ ఆంధ్రప్రదేశ్‌పై పలు వివరాలతో వీడియో ప్రజంటేషన్ ►వివిధ రంగాల్లో ఏపీ సాధిస్తున్న పురోగతిపై వీడియో ప్రజెంటేషన్ 10:34AM ►విశాఖలో ఘనంగా ప్రారంభమైన జీఐఎస్ 10:32AM ► జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించిన సీఎం జగన్ 10:30AM ► జీఐఎస్‌లో ఏపీ రాష్ట్ర గీతం ‘మా తెలుగు తల్లికి’ ఆలాపన ► అలరించిన లేజర్ షో ► సభా వేదికకు చేరుకున్న సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023 ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణంలో పలువురు డెలిగేట్స్.. వారిని ఆత్మీయంగా పలకరిస్తున్న సీఎం జగన్ 10:10 AM ►జీఐఎస్‌కు చేరుకుంటున్న పారిశ్రామిక దిగ్గజాలు ►ప్రత్యేక కాన్వాయ్‌లో జీఐఎస్ సదస్సుకు ముఖేష్ అంబానీ ► పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి స్వాగతం పలికిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజినీ ►జీఐఎస్‌కు పారిశ్రామికవేత్తలు కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, నవీన్ జిందాల్, జీఎం రావు, జీఎంఆర్, ప్రీతారెడ్డి ►విశాఖ చేరుకున్న యూకే డిప్యూటీ హైకమిషనర్ 09:51AM ఏయూ ప్రాంగణానికి డెలిగేట్స్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023కు హాజరయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణానికి చేరుకుంటున్న డెలిగేట్స్. 09:30AM ఏయూ ప్రాంగణానికి బయల్దేరిన సీఎం జగన్ 👉 : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023కు హాజరయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణానికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. 👉 :దారిపొడవునా సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన విశాఖవాసులు ఆహుతులకు ఆత్మీయ స్వాగతం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023కు హాజరవుతున్న ఆహుతులకు సాంప్రదాయ నృత్యరూపకాలతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్న కళాకారులు. 👉: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023.. దేశ, విదేశీ కార్పోరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలో పారిశ్రామిక అభివృద్ధి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవితకు దగ్గరగా ప్రస్తుత సదస్సు జరగబోతుంది. కీలక పెట్టుబడులే ప్రధాన లక్ష్యం 👉 : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 👉 : దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 👉 : 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్టిన్ ఎబర్ హార్డ్డ్, హరిమోహన్ బంగూర్, సజ్జన్ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్‌లు సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేట్ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 14 రంగాల్ని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం 👉: రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. 👉: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అండ్ అప్పరెల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ తదితర రంగాలపై ఫోకస్ చేస్తోంది. 👉: ఈ రంగాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆడియో వీడియో విజువల్ ప్రదర్శన అనంతరం సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రసంగించనున్నారు. 👉: సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న మరో గదిలో 20కి పైగా బ్రేక్ అవుట్ బిజినెస్ సెషన్లు జరగనున్నాయి. సభా ప్రాంగణంలోనే సీఎం కార్యాలయం.. లాంజ్, సమావేశ మందిరం, వ్యక్తిగత గదులను సిద్ధం చేశారు. ఆ పక్కనే మంత్రులకు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్ సౌకర్యం కల్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Global Investment Summit: విశాఖ ధగ ధగ
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధుల బృందం: రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా దేశ, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023కు వేదికగా విశాఖ సిద్ధమైంది. పారిశ్రామిక అభివృద్ధికి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవికతకు దగ్గరగా జరగబోతున్న ఈ సదస్సు కోసం ప్రపంచ వాణిజ్యవేత్తలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్టిన్ ఎబర్ హార్డ్డ్, హరిమోహన్ బంగూర్, సజ్జన్ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. నేటి ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్‌లు సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేట్ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజలు 14 రంగాల్ని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం ► రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ► రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అండ్ అప్పరెల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ తదితర రంగాలపై ఫోకస్ చేస్తోంది. ► ఈ రంగాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆడియో వీడియో విజువల్ ప్రదర్శన అనంతరం సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రసంగించనున్నారు. ► సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న మరో గదిలో 20కి పైగా బ్రేక్ అవుట్ బిజినెస్ సెషన్లు జరగనున్నాయి. సభా ప్రాంగణంలోనే సీఎం కార్యాలయం.. లాంజ్, సమావేశ మందిరం, వ్యక్తిగత గదులను సిద్ధం చేశారు. ఆ పక్కనే మంత్రులకు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్ సౌకర్యం కల్పించారు. ► సభా ప్రాంగణంలో అత్యంత ఆకర్షణీయంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దీని చుట్టూ వివిధ కంపెనీలకు చెందిన స్టాల్స్ ఉంటాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థకు సంబంధించిన కార్యాలయ నమూనా, లేపాక్షి హస్త కళా ప్రదర్శన స్టాల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏరోస్పేస్, మారిటైమ్ బోర్డు, కియా మోటర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తదితర పరిశ్రమలకు చెందిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. దారులన్నీ.. వైజాగ్ వైపే.. ► వేదికకు ఎదురుగా ఏయూకు చెందిన మరో 25 ఎకరాల మైదానాన్ని పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, కేంద్ర మంత్రులు 25కు పైగా ఛార్టర్డ్ ఫ్లైట్స్‌లో రానున్నారు. వాటికి విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తొలిరోజు రాతిర సాగరతీరం సమీపంలోని వుడాపార్క్ ఎంజీఎం గ్రౌండ్స్‌లో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 500 డ్రోన్లతో లేజర్ ప్రదర్శన ద్వారా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సీఎం ముఖాముఖి తొలిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు 21 మంది కార్పొరేట్ ప్రముఖులు ప్రసంగించనున్నారు. 150కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను సీఎం కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం వైఎస్ జగన్.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, కేఎం బిర్లా, కరణ్ అదానీ, అర్జున్ ఒబెరాయ్, సంజీవ్ బజాజ్, ఎబర్‌హార్డ్, నవీన్ జిందాల్, సుమిత్ బిదానీ తదితరులతో ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వారికి స్వయంగా వివరించనున్నారు. రెండో రోజు శనివారం ఉదయం 9.15 నుంచి 10.45 గంటల వరకు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఉదయం ఎంవోయూల అనంతరం ముగింపు సమావేశంలో 10 మందికిపైగా కార్పొరేట్ ప్రముఖులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్బానంద సోనోవాల్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఉత్పత్తికి సిద్ధమైన పలు యూనిట్లను ముఖ్యమంత్రి జీఐఎస్ వేదిక నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న వైఎస్సార్సీపీపీ నేత విజయసాయిరెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం సాక్షి, విశాఖపట్నం: ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’లో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు స్వాగతం పలికారు. అనంతరం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
CM Jagan: పెట్టుబడులతో రండి
విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా. విశాఖలో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని మీ అందరినీ కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఏపీలో పరిశ్రమల స్థాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియచేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వివిధ దేశాల దౌత్యాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతోపాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్ సన్నాహక సదస్సుకు హాజరయ్యారు. అత్యుత్తమ సౌకర్యాలు ‘విశాఖపట్నంలో మార్చి 3, 4వతేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. దీనికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటులో మీకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. ఏ పారిశ్రామికవేత్తకైనా ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని కూడా హామీ ఇస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రారంభోపన్యాసంతో పాటు సదస్సు చివరలో ఏపీలో పెట్టుబడులకు గల సానుకూలతలను సీఎం వివరించారు. ‘విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతుంది. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నా. విశాఖలో పెట్టుబడులకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సమ్మిట్‌కు హాజరు కావాలని మీ అందరినీ వ్యక్తిగతంగా కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్ధాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియచేయాలి’ అని సీఎం జగన్ సూచించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్, అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ అధికారులు జవహర్ రెడ్డి, కరికాలవలవన్, సృజన శరవేగంగా అనుమతులు.. చౌకగా సదుపాయాలు పరిశ్రమలకు అనుమతుల విషయంలో రాష్ట్రంలో సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం అమలులో ఉందని సీఎం జగన్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని, శరవేగంగా అనుమతులివ్వడం ద్వారా పారిశ్రామికవేత్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అనుకూలంగా ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్తు, నీటి సదుపాయం లాంటివి దేశంలో మిగిలిన ప్రాంతాల సగటు కంటే చాలా తక్కువగా, సరసమైన ధరలకే అందిస్తున్నట్లు వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ విషయంలో ఏపీలో పుష్కలమైన వనరులు ఉన్నాయని, 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే 14,680 మెగావాట్ల ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు జరిగాయని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి ఏపీలో వివిధ రంగాల్లో ఉన్న అపార అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూ రూపొందించిన వీడియోను సదస్సులో ప్రదర్శించారు. ఏపీలో అనుకూలతలు ఇవీ.. పెట్టుబడులకు ఆంధ్రపదేశ్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవని సన్నాహక సదస్సులో సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా అపార పెట్టుబడుల అవకాశాలను సోదాహరణంగా ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గురించి మీరే (ప్రతినిధులు) ఇంతకుముందు చెప్పారని గుర్తు చేస్తూ పెట్టుబడులతో ముందుకొచ్చేవారికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలియచేశారు. 11.43 శాతం జీఎస్డీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా, అగ్రగామిగా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ దేశంలోనే నంబర్‌వన్ స్ధానంలో ఉంది. పరిశ్రమల స్ధాపనకు మేం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తోనే నెంబర్‌వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. తద్వారా పరిశ్రమల స్ధాపనకు, పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అనుకూలంగా ఉందో స్పష్టమవుతోంది. ► రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. 6 విమానాశ్రయాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతుంటే అందులో ఏపీలోనే మూడు కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక వేత్తలకు ఏ స్ధాయిలో ప్రోత్సాహం ఇస్తున్నామో తెలియచేసేందుకు ఇదే నిదర్శనం. ► రాష్ట్రంలో 48 రకాల ఖనిజాల లభ్యత ఉంది. ఇవన్నీ వివిధ ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉన్నాయి. ► రాష్ట్రంలో పలు ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లున్నాయి. వీటిలో ప్రధానంగా టాయ్ క్లస్టర్లు, పుడ్ ప్రాసెసింగ్, టెక్ట్స్‌టైల్, సిమెంట్ క్లస్టర్లు, మెడికల్ డివైజెస్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ► ఏపీ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. పరిపాలనపరమైన విషయాల్లో కూడా మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఏపీని మన రాష్టంగా భావించండి. ► అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూటర్ అవార్డు (పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్) ఈటీ–2022, బెస్ట్ స్టేట్ ఫర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఎనర్షియా అవార్డు– 2022, క్రాప్ అచీవర్ అండ్ లాజిస్టిక్స్ ఈజ్ (లీడ్స్ 2022 రిపోర్ట్) తదితర అవార్డులు ఏపీకి లభించాయి. ఇవన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వెల్లడిస్తున్నాయి. -
Bapatla District: పారిశ్రామికాభివృద్ధికి అడుగులు
సాక్షి, బాపట్ల: జిల్లాలో తీర ప్రాంతం విస్తరించి ఉండడంతో అటు పర్యాటకం, ఇటు పారిశ్రామికంగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త అవకాశాలు కల్పిస్తూ, ప్రోత్సహిస్తుంది. నూతనంగా ఏర్పడ్డ బాపట్ల జిల్లాలో 74 కిలోమీటర్ల తీర ప్రాంతం విస్తరించి ఉంది. సూర్యలంక, పాండురంగాపురం, రామచంద్రాపురం, ఓడరేవు, కృపానగర్, అడవిపల్లెపాలెం బీచ్‌లు పర్యాటకానికి అనువుగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు. తీరంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుండడంతో స్టార్ హోటళ్లను తలదన్నేలా రిసార్ట్స్ వెలుస్తున్నాయి. అతిథ్య రంగం కూడా పుంజుకుంటుంది. తీర ప్రాంతం వెంబడి రొయ్యలు, చేపల సాగు విస్తృతంగా చేస్తుండడంతో ఆక్వా పరంగా రొయ్యల హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు ఐదు ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు మరో 18 హేచరీలు ఉన్నాయి. ఆయా యూనిట్లలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, చీరాల పరిధిలోని ఓడరేవు హార్బర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో పనులు చేస్తున్న ఆ ప్రాజెక్టులు పూర్తయితే అనుబంధంగా మరెన్నో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ► తాజాగా కేరళకు చెందిన టెడ్ఎక్స్ ఛాయిస్ గ్రూప్ విద్యారంగంలో ఎన్నో విజయాలు సాధించిన ఆ సంస్థ జిల్లాలోని తీర ప్రాంతంలో ఆక్వా రంగంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. తీరం వెంబడి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆ ప్రాజెక్టు డీపీఆర్ కూడా పూర్తిచేసి అనుమతులు కోసం పంపారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు రూపకల్పన జరగనుంది. ► క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. 80 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రం, 5 శాతం లబ్ధిదారులు వాటాగా ఇస్తూ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పిస్తోంది. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధానం అమలులో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. బాపట్లలో భావపురి రైస్ క్లస్టర్ పౌండేషన్ ద్వారా రూ.10 కోట్ల వ్యయంతో ధాన్యం ఆరబెట్టే మిషనరీతోపాటు ఫోర్టిఫైడ్ బియ్యం తయారీ మిషనరీ ఏర్పాటు చేశారు. ► ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా జిల్లాకు 104 ప్రాజెక్టులకుగాను రూ.30.60 కోట్లు మంజూరయ్యాయి. ఆ పథకానికి ఇప్పటికే 80 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 32 మందికి రూ.94.50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో 15 గ్రౌండింగ్ అయ్యాయి ► చీరాల పరిధిలోనే ఈపూరుపాలెం వద్ద ఏపీఐఐసీ ద్వారా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 44.57 ఎకరాల్లో లే–అవుట్ వేసి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. స్మాల్ ఇండస్ట్రీయల్తో ఎంతో మందికి ఉపాధి లభించనున్నది. ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహమిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పారిశ్రామికంగా అడుగులు పడుతున్నాయి. తీరంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన పథకాలు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడనున్నాయి. – ఎన్ మదన్మెహన్, పరిశ్రమల శాఖ జీఎం, బాపట్ల -
పరిశ్రమలకు నీరు.. ప్రగతి పనులకు జోరు
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కొత్త పరిశ్రమలు నెలకొల్పడంతోపాటు వాటికి అవసరమైన మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన సమకూరుస్తోంది. ప్రధానంగా పరిశ్రమలకు నీటిని తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటవుతున్న కొత్త పరిశ్రమలకు జీఎన్ఎస్ఎస్ పరిధిలోని సాగునీటి వనరుల నుంచి, తెలుగుగంగ పరి«ధిలోని ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు చేస్తోంది. దీంతోపాటు ఆయా ప్రాజెక్టుల నుంచి పరిశ్రమలకు గ్రావిటీ, పైపులైన్ల ద్వారా నీటిని తరలించేప్రక్రియను మరింత వేగవంతం చేసింది. తాజాగా కొప్పర్తి పారిశ్రామికవాడకు బ్రహ్మంసాగర్ నుంచి నీటిని తరలించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ. 100.18 కోట్లతో ప్రత్యేక పైపులైన్ నిర్మాణానికి సిద్ధమైంది. ఇప్పటికే సదరు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండరు ప్రక్రియ ముగిసిన అనంతరం పనులు మొదలు కానున్నాయి. 80 సెంటీమీటర్ల విస్తీర్ణంతో మైదుకూరు నుంచి కొప్పర్తి వరకు 32.4 కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్ నిర్మిస్తున్నారు. ఈ పైపులైన్ ద్వారా 46 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) చొప్పున నీటిని తరలించనున్నారు. ఆర్టీపీపీ పైపులైన్‌కు అనుసంధానం ప్రస్తుతం బ్రహ్మంసాగర్ నుంచి ఆర్టీపీపీకి ప్రభుత్వం పైపులైన్ల ద్వారా నీటిని తరలిస్తోంది. ఇందుకోసం 1.4 టీఎంసీల నీటి కేటాయింపులు చేశారు. 2010 మార్చిలో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన పైపులైన్ ద్వారా ప్రతిరోజు ఆర్టీపీపీకి నీటిని తరలిస్తున్నారు. మరోవైపు మైలవరం నుంచి ఆర్టీపీపీకి నీటి కేటాయింపులు ఉన్నాయి. వైఎస్ జగన్ పాలనలో తగినంత నీరు వైఎస్ జగన్ ప్రభుత్వం కొలువుదీరాక గడిచిన మూడేళ్లుగా గండికోటలో పుష్కలంగా నీరు నిల్వ పెట్టడంతో మైలవరానికి సైతం నీరు చేరుతోంది. దీంతో మైలవరం నుంచి 0.4 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ఆర్టీపీపీకి తరలించే అవకాశం ఏర్పడింది. బ్రహ్మంసాగర్ నుంచి పైపులైన్ ద్వారా పూర్తి స్థాయిలో ఆర్టీపీపీకి నీటిని తరలించే పరిస్థితి లేదు. దీంతో ఇదే పైపులైన్ ద్వారా మైదుకూరు నుంచి కొప్పర్తి వరకు మరో కొత్త పైపులైన్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే కొప్పర్తికి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొప్పర్తికి 0.6 టీఎంసీల నీరు మాత్రమే అవసరం కావడంతో ఆర్టీపీపీ పైపులైన్ నుంచే నీటిని తీసుకునే వెసలుబాటు ఉంది. మైదుకూరు నుంచి కేవలం 32.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పర్తికి నీరు తీసుకునే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి సగానికి సగం ఖర్చు తగ్గుతుంది. దీంతో ఈ పథకానికి మొగ్గుచూపిన ప్రభుత్వం ఆ మేరకు పైపులైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెండరు ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే అగ్రిమెంటు ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలుపెట్టనున్నారు. వీలైనంత త్వరగా పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేసి కొప్పర్తికి నీటిని అందించనున్నారు. నీటి తరలింపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో కొప్పర్తిలో పరిశ్రమల నిర్మాణ పనులు మరింత వేగం అందుకోనున్నాయి. స్థలాల కేటాయింపుతోపాటు తగినంత నీటి సౌకర్యం అందుబాటులో ఉండడంతో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కొప్పర్తిలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కొప్పర్తికి నీటి కేటాయింపు ప్రక్రియ వేగవంతం కొప్పర్తి పారిశ్రామికవాడలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఇక్కడికి నీటి తరలింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. బ్రహ్మంసాగర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని కేటాయించారు. బ్రహ్మంసాగర్ నుంచి ఆర్టీపీపీకి వెళ్లే పైపులైన్ ద్వారా మైదుకూరు నుంచి కొప్పర్తి వరకు కొత్త పైపులైన్ ఏర్పాటు చేసి నీటిని తరలించనున్నాం. రూ. 100.18 కోట్లతో పైపులైన్ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాం. త్వరలోనే పనులు మొదలు కానున్నాయి. – వి.విజయరామరాజు, కలెక్టర్, వైఎస్సార్ జిల్లా నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు కొప్పర్తి పారిశ్రామికవాడకు మరిన్ని కొత్త పరిశ్రమలు తరలి రానున్నాయి. ఇప్పటికే పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రానున్న కొత్త పరిశ్రమలకు స్థలాలు కేటాయిస్తున్నాం. స్థలాలతోపాటు కొప్పర్తి పారిశ్రామికవాడకు నీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. బ్రహ్మంసాగర్ నుంచి ఇక్కడికి పైపులైన్ ద్వారా 0.6 టీఎంసీల నీటిని తరలిస్తున్నాం. అన్ని వసతులు అందుబాటులో ఉండడంతో కొప్పర్తిలో మరిన్ని కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. – రాజోలి వీరారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలశాఖ సలహాదారు -
మైనింగ్ సంస్కరణలతో మరింత పారిశ్రామికాభివృద్ధి
సాక్షి, అమరావతి/చెన్నై: గనుల లీజుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపడితే మరింత పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ఇండియా సిమెంట్స్ ఏర్పాటై 75 ఏళ్లుపూర్తయిన సందర్భంగా చెన్నైలో శనివారం నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మంత్రి బుగ్గన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నపురాయి వంటి కీలక ఖనిజాల లీజులకు సంబంధించి కేంద్ర ఎంఎండీఆర్ పాలసీలో కొద్దిపాటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 1946లో 1.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదలైన ఇండియా సిమెంట్స్ ప్రస్థానం... ఇప్పుడు 6 మిలియన్ టన్నులకు చేరిందని, దృఢమైన భారతజాతి నిర్మాణంలో ఈ సంస్థ కీలక భాగస్వామిగా నిలిచిందని అన్నారు. ఇండియా సిమెంట్స్‌కు ఆంధ్రప్రదేశ్‌కు పటిష్టమైన బంధం ఉందని, రాష్ట్రంలో సిమెంట్ పరిశ్రమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: పారిశ్రామిక స'పోర్టు'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోర్టులను ఆసరాగా చేసుకుని పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఇందుకోసం అవసరమైతే ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని నియమించాలని సూచించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీబీ) ఆమోదించిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా సీఎస్, సీఎంవో అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలకు చేయూత అందించి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు – మౌలిక వసతులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు.. ఇంటర్నెట్, ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక కారిడార్లపై దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. పరిశ్రమలు – మౌలిక వసతులపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు పరిశ్రమలు ప్రారంభం కావడమే కాకుండా అవి నిలదొక్కుకునేలా చర్యలు తీసుకోవాలి. పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలకు చేదోడుగా నిలవాలి. వీటివల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి లభించి నిరుద్యోగం తగ్గుతుంది. అందుకే ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకునేలా నిరంతరం చేయూతనివ్వాలి. ఎంఎస్ఎంఈలపై మన ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా మరే ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ క్రియాశీలకంగా వ్యవహరించాలి. విదేశాల్లో ఎంఎస్ఎంఈల రంగంలో ఉత్తమ విధానాలపై పరిశీలన చేసి ఇక్కడ అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఇతర దేశాల్లోని ప్రతిష్ట్మాత్మక ఎంఎస్ఎంఈ పార్కులతో ఒప్పందాలు కుదుర్చుకునే అంశాలను పరిశీలించాలి. ఏయే రంగాల్లో ఎంఎస్ఎంఈలు నడుస్తున్నాయి? వాటిని ఇక్కడకు రప్పించడం ద్వారా ఆదాయం, ఉద్యోగాల కల్పన ఎలా చేయవచ్చో ఆలోచన చేయాలి. ఎంఎస్ఎంఈ పార్కుల నిర్వహణ విధానాలను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ, ఉత్పత్తుల తయారీలో అత్యాధునిక విధానాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలు పరిశీలనలో భాగం కావాలి. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. మార్కెట్లో అవకాశాలున్న ఉత్పత్తులు ఎంఎస్ఎంఈల నుంచి వచ్చేలా తగిన తోడ్పాటు అందించాలి. డిసెంబర్‌కు పూర్తిస్ధాయిలో ఇంటర్నెట్.. డిసెంబర్ నాటికి అన్ని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లను ఫైబర్‌తో అనుసంధానించి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. 5జీ సేవలను గ్రామాలకు చేరవేసే విధంగా టెలికాం కంపెనీలతో ఏపీఎస్ఎఫ్ఎల్ పని చేయాలి. డిజిటల్ లైబ్రరీలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా వేల్పులలో నెలకొల్పిన డిజిటల్ లైబ్రరీ ద్వారా సుమారు 30 మంది అక్కడ నుంచే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఇలాంటి లైబ్రరీలు వస్తే సొంతూరి నుంచే ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే డిజిటల్ లైబ్రరీల ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. దేశంలోనే ఇదొక వినూత్న వ్యవస్థ గా ఆదర్శంగా నిలుస్తుంది. బల్క్‌డ్రగ్ పార్కుపై ఫార్మా కంపెనీల ఆసక్తి రాష్ట్రానికి మంజూరైన కాకినాడ బల్క్‌డ్రగ్ పార్కులో కంపెనీల ఏర్పాటుకు ఇప్పటికే ప్రధాన ఫార్మా కంపెనీల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పార్కు నిర్మాణ ప్రణాళికను సీఎం జగన్‌కు వివరించడంతోపాటు గత మూడేళ్లలో పారిశ్రామిక ప్రగతి వివరాలను అధికారులు తెలియచేశారు. ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈల కోసం రెండు క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ సమీర్‌శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ఎన్.భరత్ గుప్తా, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ షన్మోహన్, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ మధుసూదన్‌రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐడీసీ ఛైర్పర్సన్ బండి పుణ్యశీల, ఏపీటీపీసీ ఛైర్మన్ కె.రవిచంద్రారెడ్డి, ఏపీఎండీసీ ఛైర్ పర్సన్ షమీమ్ అస్లాం, ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి, ఇండస్ట్రియల్ ప్రమోషన్ సలహాదారు రాజీవ్‌కృష్ణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సలహాదారు లంక శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జూన్‌కు నాలుగు ఫిషింగ్ హార్బర్లు పోర్టు అనుబంధ పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేయాలి. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ప్రస్తుతమున్న పారిశ్రామిక నోడ్స్‌తో పాటు కొత్తగా అభివృద్ధి చేయనున్న మచిలీపట్నం, దొనకొండ నోడ్లకు అదనంగా భావనపాడు, రామాయపట్నం నోడ్లను అభివృద్ధి చేయాలి. రామాయపట్నం పోర్టును ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం 2024 మార్చి నాటికి కాకుండా 2023 డిసెంబర్‌కు పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. మచిలీపట్నం, భావనపాడు పోర్టు పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. మొదటి విడతలో నిర్మిస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను 2023 జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి. రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లపైనా దృష్టి పెట్టాలి. -
పరిశ్రమలకు బెస్ట్.. ఏపీ
విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘గ్రీన్ ఎనర్జీ’పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. రాయలసీమ ప్రాంతం ఇందుకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం రూ.72,188 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తూ రైతులు గ్రూపుగా ముందుకొస్తే వారి పొలాల్లో విండ్, సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఏటా ఎకరానికి రూ.30 వేల చొప్పున ప్రభుత్వం లీజు చెల్లిస్తుంది. తద్వారా రైతులకు నికర ఆదాయంతో పాటు వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోందని, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా అడుగులు వేస్తూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తోందన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఏర్పాటైన ‘రామ్‌కో సిమెంట్స్’ కర్మాగారాన్ని బుధవారం ఆయన ప్రజల సమక్షంలో బజర్ నొక్కి ప్రారంభించారు. అంతకు ముందు ఫ్యాక్టరీలోని పరికరాలు, టెక్నాలజీ, ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామ్‌కో ఇండస్ట్రీ వల్ల మన ప్రాంతానికి, మనకు మంచి జరుగుతుందన్నారు. మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో లైమ్ స్టోన్ మైన్స్ ఉన్నప్పటికీ గతంలో ఎలాంటి పరిశ్రమలు లేవని.. ప్రస్తుతం ఇక్కడ 2 మిలియన్ టన్నుల క్లింకర్, 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటైందన్నారు. తద్వారా 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుందని, ఇది తొలి దశ మాత్రమేనని.. రాబోయే రోజుల్లో యాజమాన్యం దీన్ని విస్తరిస్తుందని అన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన వసతులు వస్తాయని, సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ – సామాజిక బాధ్యత) వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరుగుతుందని తెలిపారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండాలని చట్టం చేయడం వల్ల మన పిల్లలకు మంచే జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తొలిదశలో వెయ్యి మందికి ఉద్యోగాలు ► మన ప్రాంతంలో రామ్‌కో సిమెంట్‌ను స్థాపించిన వెంకట్రామరాజా అన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు. రూ.2,500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంటులో తొలి దశలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. పనులు వేగంగా పూర్తి చేసింది. ► గొప్ప మార్పునకు ఈ ఫ్యాక్టరీ నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు దీనికంటే మరొక ఉదాహరణ అవసరం లేదు. ఎమ్మెల్యే, కలెక్టర్ నుంచి నా వరకు అందరి సహకారంతో ఎలాంటి జాప్యం జరగకుండా 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేశారు. ► 1961లో రామ్‌కో సిమెంట్స్ ప్రస్థానం మొదలైంది. రోజుకు 200 టన్నులు అంటే ఏటా 0.4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదలు పెట్టిన ప్లాంటు ఈ రోజు 20 మిలియన్ టన్నుల సామర్థ్యం దాకా అడుగులు వేసింది. ప్రతిచోటా వీరి యూనిట్లు బాగా పని చేస్తున్నాయి. 5 చోట్ల ఉత్పత్తి యూనిట్లు.. మరికొన్ని చోట్ల గ్రైండింగ్ యూనిట్లు.. మొత్తం 11 యూనిట్లు ఉన్నాయి. అన్నిచోట్ల సామర్థ్యాన్ని పెంచుతూ పోతున్నారు. ఇక్కడ ప్రారంభమైన ప్లాంట్‌కు ఇకపై కూడా మనందరి సహకారం అందిస్తే త్వరితగతిన మరింత అభివృద్ధి, విస్తరణకు దోహద పడుతుంది. ► కొద్ది రోజుల కిందట గ్రీన్కో 5,400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి, పంప్డ్ స్టోరేజ్‌తో చేపట్టిన రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటుకు పునాది రాయి వేశాను. ఈ ప్రాజెక్టు వల్ల కర్నూలు జిల్లాలో 2,600 ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వ సహకారం బావుందని వాళ్లే చెబుతున్నారు.. ► ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఇది చాలా కీలకం. ఈ మధ్య కాలంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. పరిశ్రమల నిర్వాహకులతో ఇక్కడి పరిస్థితులపై అభిప్రాయాలు తీసుకుని మార్కులు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న సహాయం, ప్రోత్సాహకాలు కలిపి పరిశ్రమలకు రాష్ట్రం బాగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ► మన రాష్ట్రం, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు గురించి, చేయి పట్టుకుని నడిపిస్తున్న తీరు గురించి పారిశ్రామికవేత్తలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మనకు మొదటి స్థానం వచ్చింది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగింది. 2021–22లో దేశంలో అత్యధిక గ్రోత్‌రేట్ 11.43 శాతంతో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇది గొప్ప మార్పునకు అవకాశం. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మనమంతా మద్దతు ఇస్తున్నాం కాబట్టే ఇంతగా మంచి జరుగుతోంది. రూ.1000 కోట్లతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ► రాష్ట్రంలో ఇటీవలే రూ.1000 కోట్లతో గ్రాసిమ్ ఇండస్ట్రీని ప్రారంభించాం. దీనిని కుమార మంగళం బిర్లా ఏర్పాటు చేశారు. 1,150 ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అపాచీ ఫ్యాక్టరీని రూ.700 కోట్లతో చిత్తూరు, పులివెందులలో చేపట్టాం. ► దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడితో టీసీఎల్ ప్యానల్ ఉత్పత్తి చేపడుతోంది. 3,100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖలో ఏటీసీ టైర్స్ దాదాపు రూ.2,200 కోట్ల పెట్టబడితో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. రామాయపట్నం పోర్టుకు పునాది రాయి వేశాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ లేదా పోర్టు ► ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ఆరు పోర్టులు ఉన్నాయి. ఈ మూడేళ్లలో మరో నాలుగు పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడు) నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు తీసుకొస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్, పోర్టు ఉండేలా.. తద్వారా ఎగుమతులు పెంచేలా ప్రణాళికలు రచిస్తున్నాం. ► 2021–22లో రాష్ట్రం నుంచి రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీన్ని రాబోయే ఐదేళ్లలో రూ. 3.40 లక్షల కోట్లకు పెంచేలా లక్ష్యంగా నిర్దేశించుకుని అడుగులు వేగంగా వేస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా మూడు పారిశ్రామిక కారిడార్లు.. వైజాగ్–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరును అభివృద్ధి చేస్తున్నాం. ► వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ పార్క్, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, తిరుపతిలో మరో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే మన పిల్లలకు ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యే పరిస్థితి వస్తుంది. మరిన్ని పరిశ్రమలు మన రాష్ట్రం వైపే చూసే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. పారిశ్రామికవేత్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం. పూర్తి సహకారం అందిస్తాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, అంజాద్ బాషా, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గుంగుల ప్రభాకర్‌రెడ్డి, చల్లా భగీరథరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ పాల్గొన్నారు. భూమికి లీజు.. పిల్లలకు ఉద్యోగాలు గ్రీన్ డోసాల్, ఆర్సిలర్ మిట్టల్, అరవిందో, అదానీ వాళ్లకు రూ.72,188 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాం. 3–4 ఏళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తయితే 20 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు.. రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేల చొప్పున లీజు ఇచ్చేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. 30.. 50.. ఎన్ని ఏళ్లయినా ఏటా లీజు డబ్బులు ఇస్తాం. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతాం. ఈ మేరకు అగ్రిమెంట్లు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఒక ప్రాంతంలో కనీసం 1,500 నుంచి 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా అందుబాటులో ఉండేలా చూస్తే.. రైతులు, గ్రామాలు ముందుకొస్తే ఆ భూముల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు చేపడతాం. తద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరింత అభివృద్ధి చేస్తాం ఇక్కడ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు కలెక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు పూర్తిగా సహకరించారు. వేగంగా పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ సహకారంతో ప్లాంటును మరింత అభివృద్ధి చేస్తాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో మా వంతుగా సహకారం అందిస్తాం. – వెంకట్రామ రాజా, రామ్‌కో ఎండీ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్.. పారిశ్రామికంగా రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తోంది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో పరిశ్రమలు ఎలాంటి వాతావరణంలో నడుస్తున్నాయో చెప్పేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’లో మనం ప్రథమ స్థానంలో ఉండటమే నిదర్శనం. ఏపీ ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్’ రాష్ట్రంగా ఉంది. సముద్రతీరం, జాతీయ రహదారులు, పోర్టుల కనెక్టివిటీ లాంటి అంశాలు పరిశ్రమల రాక, అభివృద్ధికి దోహదపడుతున్నాయి. వీటన్నిటికీ తోడు గొప్ప ముఖ్యమంత్రి అండగా ఉండటం మన అదృష్టం. అనకాపల్లి నియోజకవర్గంలో కూడా రామ్‌కో ప్లాంటు ఉంది. ఇక్కడ మూడో ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావడం పట్ల ఆనందంగా ఉంది. – గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి -
ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏమీ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయి. కోవిడ్ సహా ఎన్నో సవాళ్లు ఎదురైనా మన ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది. 98.4 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వంగా నిలిచాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగున్నా ఓ దొంగల ముఠా దుష్ప్రచారం చేస్తోంది. గోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం బాగున్నా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర జీడీపీ పెరుగుదల గతంలో కంటే బాగుంది. కోవిడ్ సంక్షోభంలోనూ జీడీపీ పెరుగుదల కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడ్డాం. కోవిడ్ దెబ్బకు దేశాల్లో డీజీపీ తగ్గిపోయింది. దేశంలో పలు రాష్ట్రాల్లోనూ జీడీపీ తగ్గింది. 2018-19లో జీడీపీ 5.36 ఉంటే ఇప్పుడు 6.89 శాతం ఉంది. దేశంలో జీడీపీ పరంగా ఆరోస్థానానికి చేరుకున్నాం. జీడీపీ పరంగా దేశంలో గతంలో 21వ స్థానంలో ఉంటే ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నాం. గ్రోత్ రేట్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. దేశ జీడీపీలో గతంలో రాష్ట్రవాటా 4.45% ఉంటే ఇప్పుడు 5శాతానికి పెరిగింది. దేశంలో నాలుగు రాష్ట్రాల్లోనే జీడీపీ పెరుగుదల నమోదైంది. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్లే ఆర్థిక వ్యవస్థ మెరుగైంది. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, పెన్షన్లు, రైతు భరోసా వంటి పథకాలతో పేదలను ఆదుకోవడం వల్ల ఏపీ పాజిటివ్ గ్రోత్‌రేట్ సాధించింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. సరైన సమయంలో ప్రజలకు ఆర్థిక చేయూత అందించాం. ప్రభుత్వం చేస్తున్న మంచిని జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర అప్పులపై ఎల్లోమీడియా దుష్ప్రచారం అప్పులపై ఎల్లోమీడియా, చంద్రబాబు రోజూ దుష్ప్రచారం చేస్తున్నారు. విభజన నాటికి రాష్ట్ర రుణాలు రూ.1.26 లక్షల కోట్లు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.2.69 లక్షల కోట్లు. బాబు హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 123శాతం అప్పులు పెరిగాయి. ఈ మూడేళ్లలో 3.82 లక్షల కోట్లకు రుణాలు చేరాయి. మూడేళ్లలో పెరిగిన రుణం 41.83 శాతం మాత్రమే. ఈ మూడేళ్లలో రాష్ట్ర అప్పులు 12.73శాతం మాత్రమే. ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువ. 2014 నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు 14,028 వేల కోట్లు. చంద్రబాబు దిగిపోయేటప్పటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు 59,257కోట్లు. ఈ మూడేళ్లో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.1.71 లక్షల కోట్లకు చేరాయి. గత అప్పుతో కలుపుకుంటే రుణాలు రూ.4.99లక్షల కోట్లకు చేరాయి. ఈ మూడేళ్లలో పెరిగిన రుణం 52శాతం మాత్రమే. గత ప్రభుత్వం హయాంలో పెరిగిన రుణాలు 144 శాతం. చంద్రబాబు హయాంలో 17.45 శాతం అప్పులు పెరిగాయి. మన హయాంలో 12.73శాతం మాత్రమే పెరిగాయి. ఈ వాస్తవాలు రాయకుండా దుష్పచారం చేస్తున్నారు. కేంద్రంతో పోలిస్తే తగ్గిన ఏపీ ప్రభుత్వం అప్పు 2014-19 వరకు కేంద్ర అప్పులు 59% పెరిగితే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు 123శాతానికి పెరిగాయి. ఈ మూడేళ్లలో కేంద్ర రుణాలు రూ.135లక్షల కోట్లకు పెరిగాయి. మూడేళ్లలో కేంద్రం అప్పులు 43.8 శాతం పెరిగాయి. ఈ మూడేళ్లో రాష్ట్ర రుణాలు 3.82లక్షల కోట్లకు పెరిగాయి. ఈ మూడేళ్లలో 41.4శాతం పెరిగాయి. కేంద్రంతో పోలిస్తే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తగ్గింది. చంద్రబాబు హయాంలో కేంద్రం కంటే రాష్ట్ర అప్పులు ఎక్కువగా ఉండేవి. అప్పుల గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. ఎవరి హయాంలో దోచుకో పంచుకో తినుకో జరిగిందో తెలియాలి. అప్పులు తిరిగి చెల్లించలేకపోతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సొంత ఆదాయం గతంలో 62వేల కోట్లు. ఇప్పుడు 75వేల కోట్లు. మూల ధనవ్యయం అసలు జరగడం లేదని దుష్పచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగానే మూలధన వ్యయం ఉంది. గత ప్రభుత్వం కింద 76,139 కోట్లు ఖర్చు చేసింది. మనం మూడేళ్లలో రూ.55,086 కోట్లు ఖర్చు చేశాం. మూలధన వ్యయం తక్కువగా ఉందన్నది అవాస్తవమని సీఎం జగన్ అన్నారు. -
ఆంధ్రకు వరం ఈ కొత్త ‘పార్క్’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో అంతర్భాగం పారిశ్రామిక ప్రగతి. దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సహజ వనరులు, మానవ వనరులు గరిష్ఠ స్థాయిలో సద్వినియోగం అవుతాయి. అదే సమయంలో సర్వజనుల అవసరాలు తీరుతాయి. ఇవి ప్రజల ప్రాణాలకు సంబంధించినవి అయినప్పుడు వారి జీవన ప్రమాణ స్థాయి కూడా పెంచుతాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా మన రాష్ట్రానికి కేటాయించిన ‘బల్క్ డ్రగ్ పార్క్’ (బీడీపీ) మనకు ఈ ప్రయోజనాలు అన్నింటినీ కలుగజేయనున్నది. శక్తిమంతమైన పొరుగు రాష్ట్రాలను కాదని కేంద్రం దీనిని మనకు ఇవ్వటం గమనార్హం. అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే కర్ణాటకలోనూ ఉన్నా... దాన్ని పక్కన పెట్టి మన రాష్ట్రానికి ప్రాధాన్యత నివ్వటం హర్షణీయం. ‘బల్క్ డ్రగ్ పార్క్’ కేటాయించడానికి కేవలం కేంద్ర ఉదారత మాత్రమే కారణం కాదు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్డు, రైలు, నౌకా రవాణా, విద్యుత్తు, నీటి సదుపాయాలు లాంటి మానవ నిర్మిత, సహజ మౌలిక సదుపాయాలు అనేకం ఉన్నాయి. విదేశీ వాణిజ్యానికి కావాల్సిన ఓడరేవులున్న తీరప్రాంతం ఉంది. నైపుణ్య మానవ వనరులు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అనేకం ఉన్నాయి. వీటితోపాటు గోదావరి జిల్లాల్లో విజయ వంతంగా నడుస్తున్న పలు రకాల పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా బల్క్ డ్రగ్స్‌కు కావాల్సిన అనేక రకాల రసాయనాలు, ఇతర ముడి పదార్థాలు సరఫరా చేయగల సామర్థ్యం ఉన్న సంస్థలు అనేకం ఉన్నాయి. ఇటీవల నూతనంగా సామర్లకోటలో ఆదిత్య బిర్లా గ్రూపు నెలకొల్పిన ‘ఆల్కలీ’ పరిశ్రమ కూడా రాబోవు పార్క్ అవసరాలను మరింతగా తీర్చగలదు. ఫార్మా రాజధానిగా పేరుగాంచిన హైదరాబాదులో ఎన్నో ఫార్మా కంపెనీలను సృష్టించి అంతరించిన ఐడీపీఎల్ ఉండేది. దానికి అవసరమైన సమస్త రసాయనాలు, ఆమ్లాలు, వాయు వులు అనేకం తణుకు, కొవ్వూరు, సగ్గొండ ఫ్యాక్టరీల నుండి సప్లై అవుతుండేవి. వ్యవసాయాధార చక్కెర కర్మాగారాలు రైతు శ్రేయస్సు కొరకు తణుకు, చాగల్లు, ఉయ్యూరు లాంటి చోట్ల నెలకొని ఉన్నాయి. ఆ కర్మాగారాలలో చక్కెరతో పాటు మొలాసిస్ వస్తుంది. దాని నుండి ఆల్కహాల్, ఇతర ఆర్గానిక్ రసాయనాలు తయారు చేస్తారు. అవి బల్క్ డ్రగ్స్ తయారీలో వాడతారు. వీటి కారణం గానే ఇప్పటికే తణుకులో ఆస్ప్రిన్, సాలిసిలిక్ యాసిడ్ తయారీ జరుగుతోంది. అంతరిక్ష నౌకల్లో వాడే రాకెట్ లిక్విడ్ ఇంధనం కూడా తణుకులోనే తయారవడానికి ఈ రసాయనాల లభ్యత ముఖ్య కారణం. తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే ఈ బీడీపీలోని సంస్థలకు ఇవన్నీ అమర్చి పెట్టినట్లు అందుబాటులో ఉంటాయి. ఈ పార్క్ కేటాయింపులో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఉంటారు. ఈ పార్క్‌లో ఫార్ములేషన్, ప్యాకింగ్, టెస్టింగ్ లాబ్స్, రవాణా, ఫైనాన్స్ లాంటి అనుబంధ సంస్థలు వస్తాయి. అందువల్ల మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాలుష్య నివారణ, నియంత్రణ, పారిశ్రామిక భద్రత, సామాజిక బాధ్యత వంటి విషయాల్లో ఎలాంటి రాజీ పడని సీఎం నేతృత్వంలో.. రాష్ట్రం పారిశ్రామిక వృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశిద్దాం. (క్లిక్: శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి) - బి. లలితానంద ప్రసాద్ కార్పొరేట్ వ్యవహారాల నిపుణులు -
ఉపాధి, ఉత్పత్తులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి
ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో పారిశ్రామికాభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఇప్పటికే రాష్ట్రంలో పెట్టిన యూనిట్లను త్వరిత గతిన పూర్తి చేసి ఉత్పత్తి ప్రారం భించేలా చర్యలు చేపట్టింది. ప్రతి నెలా రాష్ట్రంలో పరిశ్రమల ప్రారంభోత్స వాలు, శంకు స్థాపనలు నిర్వహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది సత్ఫలితాల నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అంటే ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలో 22 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా, వీటి ద్వారా రూ. 20,682 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ తన తాజా నివేదికలో వెల్లడించింది. తొలి ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించిన ప్రధాన కంపెనీల్లో గ్రాసిం ఇండస్ట్రీస్, పానా సోనిక్ లైఫ్ సైన్స్ సొల్యూషన్స్, కాప్రికాన్ డిస్టిలరీ, ఆంజనేయ ఫెర్రో అల్లాయిస్, నోవా ఎయిర్, తారక్ టెక్స్టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ లాంటివి ఉన్నాయి. కోవిడ్ సంక్షోభం కుదిపివేసిన 2020, 2021తో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో రెట్టింపు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 2019లో 42 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ. 9,840 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా... 2021లో రూ. 10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత రెండున్నరేళ్లలో మొత్తం 111 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా మొత్తం రూ. 40,872 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. పారిశ్రామికవేత్తల నుంచి కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన అందిన నాటి నుంచి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో చేయూత అందించేలా ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు, సేవలు అందిస్తోంది. తాజాగా విశాఖ వద్ద ప్రముఖ జపాన్ కంపెనీ యకహోమా గ్రూపు సంస్థ ఏటీసీ టైర్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈవో నితిన్... మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటును కొనియాడారు. సాధారణంగా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందనీ, రాష్ట్రంలో మాత్రం ‘సింగిల్ డెస్క్’ విధానంలో వేగంగా మంజూరయ్యాయనీ తెలిపారు. దీంతో రికార్డు సమయంలో 15 నెలల్లోనే తొలిదశ యూనిట్‌ను ప్రారంభించడమే కాకుండా రెండో దశ పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించినట్లు నోవా ఎయిర్ ప్రతినిధులు వెల్లడించారు. 2020 డిసెంబర్లో నిర్మాణం ప్రారంభించి 11 నెలల్లోనే పనులు పూర్తి చేశామనీ, దీనివల్ల 250 టన్నుల ఆక్సిజన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందనీ తెలిపారు. గత రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా రూ. 24,956 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ నివేదిక పేర్కొంది. 2020 జనవరి నుంచి 2022 జూన్ నాటికి కొత్తగా 129 భారీ యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరునెలల కాలంలో కొత్తగా 23 కంపెనీలు రూ. 5,856 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిశ్రామికీకరణ విధానాలను పునఃసమీక్షిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ఆధునిక సాంకే తిక పరిజ్ఞానాన్ని అందిస్తూ, ఉత్పత్తి పెంచుతూ, ఆర్థిక చేయూతను ఇస్తూ ఉద్యోగ, ఉపాధులు కల్పిస్తోంది ప్రభుత్వం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో 28,343 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ. రూ. 47,490.28 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి లభించింది. ఇందులో 28,247 ఎంఎస్ఎంఈలు ఉండగా 96 భారీ యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో రూ. 1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రతి విద్యార్థినీ అత్యుత్తమ నైపుణ్యాలతో ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఉద్యోగాన్వేషణలో అత్యంత కీలకమైన సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించడంపై 1.62 లక్షల మంది విద్యార్థులకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ అందజేస్తోంది. రూ. 465 కోట్ల వ్యయమయ్యే ఈ శిక్షణను మైక్రోసాఫ్ట్ సంస్థ రాష్ట్ర విద్యార్థులకు దాదాపు రూ. 32 కోట్లకే అందిస్తోంది. అది కూడా విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ కోర్సులే కాకుండా ‘లింక్డిన్’ ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేస్తున్నారు. దీని ద్వారా లింక్డిన్లోని టెక్నాలజీ, క్రియేటివిటీ, బిజినెస్ విభాగాల్లో 8 వేలకు పైగా కోర్సులు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. (క్లిక్: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!) వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు–2023లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా పటిష్ఠ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేలా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్యంతో భారీస్థాయి పెట్టుబడి దారులతో జనవరి తర్వాత ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే మరిన్ని ఉద్యోగాలు అందు బాటులోకి వస్తాయి. (క్లిక్: ఇంగ్లిష్ వెలుగులు చెదరనివ్వొద్దు) - డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ -
‘వెయిట్ లాస్ ట్రీట్మెంట్తో లోకేష్‌కు మైండ్ లాస్’
సాక్షి, తాడేపల్లి: పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఓర్వలేకపోతున్నారని, అందుకే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఉదయం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా అది వారే తెచ్చినట్లు లోకేష్ చెబుతున్నారని, వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టే సంస్థలను వందల సంఖ్యలో తెచ్చామంటున్నారని, వాళ్ల నాన్న చంద్రబాబుకు వాటికి శంకుస్థాపన చేసే సమయం కూడా లేదని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అదే నిజమైతే.. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడుల జాబితా విడుదల చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు రోజూ మతి తప్పి మాట్లాడుతుంటే.. లోకేష్ వెయిట్ లాస్ కోసం ట్రీట్మెంట్ తీసుకుని మైండ్ లాస్ చేసుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు.. అభివృద్ధిని అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అవకాశం ఇచ్చినా ఆయన ఏం చేయలేకపోయారు. కానీ, ఇప్పుడు మేం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం. వనరుల్ని గుర్తించి.. రాష్ట్రాన్ని దేశవిదేశాలకు ప్రమోట్ చేస్తున్నాం. అయినా కూడా భరించలేక ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాటలకు, చేసిన ఎంవోయూలకు పొంతనే లేదని విమర్శించారు మంత్రి అమర్నాథ్. టీడీపీ ఒక డ్రామా కంపెనీ అని అభివర్ణించిన మంత్రి అమర్నాథ్.. నేపాల్ గుర్ఖాలకు సూటూ బూటూ తగిలించి ఎంవోయూలు చేసిన ఘనత చంద్రబాబుదని, అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒకవైపు తాము అభివృద్ధి చేస్తుంటే.. ప్రతీది తామే చేశామంటూ చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని, ప్రజలు అంతా గమనిస్తుంటారని చంద్రబాబు, నారా లోకేష్‌లకు హితవు పలికారు. అసలు మీరు చేసిన అభివృద్ధి ఏంటి? రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మీ(చంద్రబాబు) హయాంలో ఎందుకు ఉపయోగించలేదు..?. అసలు ఐదేళ్లలో అసలు మీరు ఏమీ చేసారో చెప్పండి. సమ్మిట్ల పేరుతో డ్రామా చేయడం తప్ప మీరు చేసింది ఏమిటి..?. మీరు చేసిన MOU లకు ఒక్కసారి సమాధానం చెప్పగలరా..?. ఒక్క ఫోన్ కాల్ తో ప్రతి సహకారం అందిస్తామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. వార్డ్ మెంబర్‌గా గెలవలేని నువ్వు(నారా లోకేష్‌ను ఉద్దేశించి).. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శలను తిప్పి కొట్టారు మంత్రి అమర్నాథ్. జగన్ ప్రజల మేలు కోరతారు.. చంద్రబాబు చావు కోరే రకం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి, సంతోషం అనే నాలుగు స్థంభాలపై పాలన సాగుతోందని మంత్రి చెప్పారు. ప్రభుత్వాలుగా కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలే ఉంటాయి కానీ, మోదీ దగ్గరకు వెళ్లి చంద్రబాబు లాగా వేషాలు వేయడం చేతకాదని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల మంచి కోరితే.. చంద్రబాబు చావు కోరే రకం అని తెలిపారు. బ్రాహ్మణితో తగవులు ఉంటే మీ ఇంట్లో పరిష్కరించుకోండి అని లోకేష్‌కి హితవు పలికారు. ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోని సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతమ్మను రాజకీయాల్లోకి లాగి బ్రాహ్మణిని తిట్టించాలన్నదే లోకేష్ ఉద్దేశమా అని ప్రశ్నించారు. లోకేష్‌లా బీచ్, స్విమ్మింగ్ పూల్ చదువులు సీఎం జగన్ చదవలేదన్నారు. సీఎం ఏమి చదివారో అందరికీ తెలుసునన్నారు. టీడీపీని కాపాడడం పవన్ బాధ్యత మోదీ దగ్గర వేషాలు వేసే తత్వం పవన్ కళ్యాణ్‌ది అని, అదసలు కాపుల పార్టీ కాదని, కమ్మ జనసేన అని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ‘పార్టీని నడుపుతున్నది నాదెండ్ల మనోహర్ కాదా?. ఈ రాష్ట్రంలోని కాపులు జనసేనను మీదేసుకునే పరిస్థితి లేదు. దమ్ముంటే 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తాం అని చెప్పమనండి. అసలు పవన్ కళ్యాణ్ బాధ్యత వైజాగ్ ను కాపాడటం కోసం కాదు...టీడీపీనీ కాపాడటం ఆయన బాధ్యత అంటూ చురకలు అంటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పెద్ద పారిశ్రామికవాడల్లో టెక్స్టైల్ పార్కులు రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. 100 ఎకరాలకు పైబడి ఉన్న పెద్ద పారిశ్రామికవాడల్లో టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయంలో చేనేత, వస్త్ర పరిశ్రమ, ఆప్కో, లేపాక్షి, ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆప్కో ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించేలా మార్కెటింగ్ కన్సల్టెంట్‌ను నియమించాలన్నారు. కొత్త జిల్లా కేంద్రాలు, డిమాండ్ ఉన్న చోట్ల లేపాక్షి షోరూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని చెప్పారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలివ్వడంలో మేం రాజీపడడం లేదు. ఎంఎస్ఎంఈలకు పాత బకాయిలు కూడా ఇస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి, సంతోషం అనే నాలుగు స్థంబాల మీద సీఎం జగన్ పాలన కొనసాగుతోందని, పరిశ్రమల ఏర్పాటు.. ఉపాధి కల్పన ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహంలో ముందెన్నడూ చూపనంత చొరవ! -
8 నెలల్లో 27 పరిశ్రమలు.. పారిశ్రామిక క్యాలెండర్ రెడీ
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి ఉధృతి తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిపై దృష్టిసారించింది. వచ్చే రెండేళ్లలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వాటిని వాస్తవరూపంలోకి తీసుకురావడం, ప్రతిపాదిత యూనిట్లలో త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఎనిమిది నెలల్లో రూ.50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న 27 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ నెలలో ఏ యూనిట్ ఉత్పత్తికి సిద్ధమవుతుందన్న సమాచారాన్ని సేకరించిన పరిశ్రమల శాఖ ఒక క్యాలెండర్ సిద్ధంచేసింది. దీని ఆధారంగా ప్రతీనెలా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా వచ్చే ఎనిమిది నెలల్లో కనీసం 27 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల రూ.23,286 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడమే కాకుండా 20,974 మందికి ఉపాధి లభిస్తుంది. జపాన్‌కు చెందిన యోకోహామా గ్రూపునకు చెందిన ఏటసీ టైర్స్, ఆన్‌రాక్ అల్యూమినియం, రామ్‌కో సిమెంట్, టాటా కెమికల్స్, బ్లూస్టార్ఏసీ, శారదా మెటల్స్ విస్తరణ, ఓఎన్జీసీ వంటి యూనిట్ల నుంచి త్వరలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలను తీసుకుంటోంది. 24 కంపెనీల పనులకు భూమిపూజ వచ్చే మార్చిలోగా 24 కొత్త కంపెనీలకు అనుమతులు మంజూరు చేసి భూమిపూజ చేయించి, వాటి నిర్మాణం ప్రారంభించేలా కూడా అధికారులు ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్రంలోకి కొత్తగా రూ.24,038 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 54,019 మందికి ఉపాధి లభిస్తుంది. అదానీ గ్రూపు వైజాగ్ టెక్‌పార్క్ పేరుతో రూ.14,634 కోట్లతో ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ రూ.3,982 కోట్లు, రూ.1,500 కోట్లతో మల్క్ హోల్డింగ్స్ అల్యూమినియం తయారీ యూనిట్‌తోపాటు పలు ఫార్మా, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు పనులు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధంచేశారు. అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. ఇన్ఫోసిస్ వంటి అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలవడం పరిశ్రమల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. రానున్న కాలంలో ప్రతినెలా ఒక భారీ పరిశ్రమ ప్రారంభోత్సవం, శంకుస్థాపన ఉండేలా ప్రణాళికలు సిద్ధంచేశాం. – గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మూడేళ్లలో 2.48 లక్షల మందికి ఉపాధి ఇక రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల కాలంలో 28,343 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ.47,490.28 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 28,247 ఎంఎస్ఎంఈలు ఉండగా, 96 భారీ యూనిట్లు ఉన్నాయి. ఇవికాక.. మరో రూ.1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది. అలాగే, ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. ఇవికాక.. సుమారు రూ.2.50 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నాయి. -
సింహపురి సిగలో మరో మణిహారం
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు హడావుడి శంకుస్థాపనకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పరిమితం కాగా, చిత్తశుద్ధితో నిర్మాణ పనులు చేపట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అవసరమైన భూసేకరణ పూర్తయింది. ఈనెల 20న పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం సింహపురి ఉన్నతికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంది. విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూనే పారిశ్రామికాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణం చేయనున్నారు. ఉదయగిరిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. జిల్లా ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగా జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇదివరకే అదానీ కృష్ణపట్నం పోర్టు సమీçపంలో క్రిస్ సిటీకి కేంద్ర పర్యావరణ అనుమతులు వచ్చాయి. మరోవైపు బయో ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదించింది. ఎగుమతులకు తగినట్లుగా.. రాష్ట్రానికి విశాల సముద్ర తీరం ఉంది. మునపటి రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి సిమెంట్, ఐరన్, పొగాకు ఇంకా పలురకాల ఖనిజాలు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. బొగ్గు, ఎరువులు తదితరాల దిగుమతి జరుగుతోంది. ఈ వ్యవహారమంతా ప్రస్తుతం అదానీ కృష్ణపట్న ం పోర్టు ద్వారా కొనసాగుతోంది. తదుపరి చెన్నై ఓడరేవు అందుబాటులో ఉంది. ఉత్పత్తుల ఎగుమతులకు కృష్ణపట్నం ఓడరేవు సామర్థ్యం సాధ్యపడకపోవడంతో రామాయపట్నం పోర్టు తెరపైకి వచ్చింది. 25 మిలియన్ టన్నుల సామర్థ్యంలో రూ.10,640 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టనున్నారు. మొత్తం 19 బెర్తులు కట్టనున్నారు. తొలివిడతలో ఒకటి కోల్, రెండు బెర్తులు కంటైనర్లు, ఒక బెర్త్ మల్టీపర్పస్ కోసం నిర్మించదలిచారు. పోర్టుకు అనుబంధంగా ఏపీఐఐసీ పరిధిలో భూసేకరణ చేస్తున్నారు. అందులో అనుబంధ పరిశ్రమలు రానున్నాయి. ఎంతో ప్రాధాన్యం కలిగిన రామాయపట్నం పోర్టు నిర్మాణం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల హామీగా మిగిలిపోవడం మినహా కార్యరూపం దాల్చలేదు. గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో హడావుడిగా శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎలాంటి పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.3,736 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. పోర్టుకు అవసరమైన 803 ఎకరాలను సేకరించారు. ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పెద్దఎత్తున ఉద్యోగాలు చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో క్రిస్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులో వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దక్కనుంది. తొలిదశ కోసం పర్యావరణ అనుమతులు, కండలేరు ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అనుమతులు పూర్తయ్యాయి. అలాగే సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో–ఆపరేటీవ్ లిమిటెడ్ (క్రిబ్కో) పరిధిలో రూ.560 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ చేపట్టనున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. కష్టాలు తొలగిపోతాయి రామాయట్నం పోర్టు నిర్మిస్తే అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఇది శుభపరిణామం. జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమలతో యువత వారి అర్హతకు తగ్గట్లుగా ఉపాధి పొందుతారు. పారిశ్రామికాభివృద్ధితో కష్టాలు తొలగిపోతాయి. – వంశీ, నవాబుపేట యువతకు మంచిరోజులు జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఇప్పటికే అనేక పరిశ్రమలు నెల్లూరుకు వచ్చాయి. మరిన్ని ఏర్పాటుతో యువతకు బాగా ఉద్యోగాలొస్తాయి. వారికి మంచి రోజులొచ్చాయి. – అరవ యాకుబ్, స్టౌన్‌హౌస్‌పేట -
కొలువుల ఖిల్లా నెల్లూరు జిల్లా.. కృష్ణపట్నం వద్ద రూ.5,783 కోట్లతో..
పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న జిల్లా.. కొలువుల ఖిల్లాగా మారనుంది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందుకు బీజాలు పడ్డాయి. సింహపురి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారు. జిల్లా నలుదిశలా సమగ్రాభివృద్ధి కోసం ప్రయత్నాలు ముమ్మరయ్యాయి. లక్షలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. నిర్దిష్టమైన పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది. క్రిస్‌సిటీకి కేంద్ర పర్యావరణ అనుమతులు సాధించింది. బయో ఇథనాల్ ఫ్లాంట్, వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. సాక్షి, నెల్లూరు: విశాల సముద్రతీరం.. అత్యధిక విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు.. అందుబాటులో రహదారి, జల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్న జిల్లా పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం తప్ప.. పారిశ్రామిక జాడల్లేని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీజాలు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణపట్నంపోర్టుకు అనుబంధంగా క్రిస్ సిటీకి ఏర్పాటుకు అన్ని అనుమతులు లభించాయి. క్రిబ్కో పరిధిలో బయో ఇథనాల్ ప్లాంట్, నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో రూ.100 కోట్లతో ఆస్పత్రి, మెట్ట ప్రాంతం ఉదయగిరిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. యువతకు ఉద్యోగాల వెల్లువ జిల్లాలో యువతకు వెల్లువగా ఉద్యోగాలు రానున్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో క్రిస్ సిటీ ఏర్పాటు కానుంది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 2.96 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు, 1.71 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దక్కనుంది. తొలి దశలో రూ.1,500 కోట్లతో 2,006 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం పర్యావరణ అనుమతులు, కండలేరు ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అనుమతులు లభించాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో–ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) పరిధిలో రూ.560 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగాకాశాలు లభించనున్నాయి. చదవండి: (AP: పరిశ్రమలకు భారీ ఊరట.. ఆంక్షలు ఎత్తివేత) ఆక్వా ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెన్నారాయునిపాళెం నుంచి తడ వరకు 169 కిలో మీటర్ల మేర సముద్ర తీరం ఉంది. సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న 2 లక్షల మంది మత్స్యకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 46 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతుంది. రెట్టింపు స్థాయిలో ఎగుమతి చేసుకునే అవకాశాలను అందిపుచ్చుకునే చర్యలను చేపట్టుతోంది. అక్వా ఉత్పత్తులు ఆర్బీకేలకు అనుసంధానం చేసి ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం అడుగులు పడ్డాయి. ఉదయగిరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో ఉదయగిరి ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టు ప్రాంగణంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్ట ప్రాంతంలో వ్యవసాయ యూనివర్సిటీ అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగానికి ప్రయోజనకారిగా మారనుంది. విద్యార్థులకు యూనివర్సిటీ అందుబాటులోకి రావడమే కాకుండా పరిశోధనలు ద్వారా అదునాతున వంగడాలు మెట్ట ప్రాంతం ఉన్నతికి యోగ్యకరంగా మారనుంది. రూ.100 కోట్లతో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కేటాయిస్తూ నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు వద్ద నూతన ఆస్పత్రి నిర్మాణానికి 4 ఎకరాలు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం చొరవతో పారిశ్రామికాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కృష్ణపట్నంలో క్రిస్‌సిటీ, సర్వేపల్లి వద్ద క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు కావడం శుభ పరిణామం. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ మంత్రి అయిన కొద్ది రోజులకే రూ.560 కోట్లతో ప్లాంటు మంజూరు కావడం గర్వంగా ఉంది. ఈ ప్లాంటు వల్ల సుమారు 500 మందికి ఉద్యోగ, ఉపా«ధి అవకాశాలు లభిస్తాయి. యువతకు ఇది సంతోకరమైన విషయం. – రాగాల వెంకటేశ్వర్లు, రైతు, కృష్ణపట్నం పారిశ్రామిక ప్రగతి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పలు పరిశ్రమలు రాగా, ప్రస్తుతం కృష్ణపట్నంలో క్రిస్ సిటీ, సర్వేపల్లి వద్ద క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్‌తో పాటు కొడవలూరు మండలంలోకి మరో పరిశ్రమ రావడంతో జిల్లా పారిశ్రామికంగా ప్రగతి పథంలో నడుస్తుంది. భవిష్యత్‌లో జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుంటారు. – తలతోటి ప్రసన్నకుమార్, చంద్రశేఖర్‌పురం, కొడవలూరు మండలం ఉపాధి అవకాశాలు మెండు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పరిశ్రమలు వస్తున్నాయి. దీంతో మావంటి విద్యను అభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుంది. ముఖ్యంగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. ఇది అభినందనీయం. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వస్తే మరింత ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – కాగోల్లు పవన్, బీటెక్ విద్యార్థి, దండిగుంట, విడవలూరు మండలం -
‘కొప్పర్తి’లో కేంద్ర బృందం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్–జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ప్రతినిధులు హెచ్‌కే నంద, డిప్యూటీ సెక్రటరీ పూర్ణేందుకాంత్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్‌బాబు, రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, ఏపీఐఐసీ అధికారుల బృందం శనివారం పర్యటించింది. ఇక్కడ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు గల అనుకూలతలు మౌలిక వసతులను కేంద్ర బృందం పరిశీలించింది. పార్క్ అభివృద్ధికి అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యాలను సైతం వీక్షించింది. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి, టెక్స్టైల్స్ ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని కేంద ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. పక్కనే విమానాశ్రయం ఉండటం.. కడప, తిరుపతి, బెంగళూరు విమానాశ్రయాలు సమీపంలోనే ఉండటం.. కృష్ణపట్నం, చెన్నై పోర్టులు సైతం అందుబాటులో ఉండటంతో ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు మరింత అనుకూలమని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. కృష్ణాపురం నుంచి కొప్పర్తి వరకు రైల్వేలైన్ కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రతినిధులు సూచించారు. ఇక్కడి నుంచి ఎగుమతుల కోసం ఏవియేషన్ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని సూచించారు. 1,186 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 1,186 ఎకరాల్లో ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం మిత్ర) పథకం కింద కొప్పర్తిలో టెక్స్టైల్స్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుమారు రూ.1,100 కోట్లతో కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం మిత్ర కింద కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ విభాగం నుంచి పార్క్ అభివృద్ధికి 30 శాతం ఆర్థిక సాయం అందించనుంది. మిగిలిన 70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చొరవతో జిల్లా పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా సాగుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి పేర్కొన్నారు. ఈ టెక్స్టైల్ పార్క్ వల్ల 10 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన చెప్పారు. -
సీఐఎస్ఎఫ్ ఒక కర్మయోగి: అమిత్ షా
ఘజియాబాద్: కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం( సీఐఎస్ఎఫ్) ఒక కర్మయోగిలాగా పారిశ్రామికాభివృద్ధి, ప్రైవేట్ ఉత్పత్తి యూనిట్ల రక్షణలో పాలుపంచుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసించారు. ఇకపై సంస్థ హైబ్రిడ్ మోడల్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. హైబ్రిడ్ మోడల్లో భాగంగా నాణ్యమైన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫై చేయాలన్నారు. తద్వారా వివిధ పారిశ్రామిక, ఉత్పత్తి యూనిట్ల రక్షణకు ప్రైవేట్ ఏజెన్సీల సేవలు ఉపయోగపడతాయని చెప్పారు. ఇండియా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉందని, ఇందులో భాగంగా కొత్తగా అనేక ఉత్పత్తి యూనిట్లు పుట్టుకువస్తాయని, వీటి రక్షణలో సీఐఎస్ఎఫ్ నూతన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సంస్థ 53వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. హైబ్రిడ్ మోడల్‌ను పెంపొందించడం వల్ల 1–5 వేల మంది సిబ్బందితో సేవలనందించే ప్రైవేట్ సంస్థలు వస్తాయన్నారు. వీటికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా సీఐఎస్ఎఫ్ బాధ్యతల బరువు పంచుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ సిబ్బంది 354 యూనిట్లకు రక్షణ కల్పిస్తున్నారు. ప్రైవేట్ రంగ ఏజెన్సీలు ప్రస్తుతం కేవలం 11 కంపెనీలకే రక్షణ బాధ్యతలు అందిస్తున్నాయని, ఇవి మరింత పెరిగేలా కృషి చేయాలని షా సూచించారు. -
శ్రీసిటీని సందర్శించిన కేంద్ర కమిటీ
వరదయ్యపాళెం: ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల సవరణ (ఆర్వోడీటీఈపీ) నిర్ణయ కమిటీ బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. మాజీ కేంద్ర హోం, వాణిజ్య కార్యదర్శి జీకే పిళ్ళై (రిటైర్డ్ ఐఏఎస్) నేతృత్వంలో రిటైర్డ్ సీబీఈసీ స్పెషల్ సెక్రటరీ వైజీ పరాండే, కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ (రిటైర్డ్) గౌతమ్ రే కమిటీ సభ్యులుగా సందర్శనకు రాగా వీరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ అసన్ అహ్మద్, డిప్యూటీ డీజీఎఫ్టీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. శ్రీసిటీ ఎస్ఈజెడ్, డీటీజెడ్‌లోని పరిశ్రమల సీనియర్ మేనేజర్లతో వీరు పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. పిళ్ళై మాట్లాడుతూ..తక్కువ వ్యవధిలో శ్రీసిటీ సాధించిన పారిశ్రామిక వృద్ధిని ప్రశంసించారు. ఎగుమతులపై సుంకాలు, పన్నులు ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎగుమతులకు ఆర్ఓడీటీఈపీ రేట్లను నిర్ణయించడానికి ఎగుమతి అథారిటీ పరిశ్రమల అభిప్రాయాలను తమ కమిటీ సేకరిస్తుందన్నారు. పన్నులు, సుంకాల రీయింబర్స్‌మెంట్‌ను సులభతరం చేయడానికి తమ ఉత్పత్తుల ధరలను నిర్దేశిత ఫార్మాట్లో ఇవ్వాలని కంపెనీలకు సూచించారు. కమిటీకి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. -
పట్టుబట్టి పరిశ్రమించి..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి కోసం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తుదిశ్వాస వరకు కృషి చేశారని పరిశ్రమ వర్గాలు, అధికార యంత్రాంగం గుర్తు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే దుబాయ్‌లో ఏపీ పెవిలియన్ ద్వారా రూ.5,150 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించేలా కృషి చేశారని, కోవిడ్ సమయలో చిన్న పరిశ్రమలను ఆదుకోవడం, కొత్త విధానాల రూపకల్పనలో పారిశ్రామికవేత్తల అభిప్రాయాలకు విలువనిచ్చారని పేర్కొంటున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి విశేష కృషి పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మేకపాటి గౌతమ్‌రెడ్డి తన పనితీరుతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మాటలు కాకుండా చేతలతో పనితీరు నిరూపించుకున్నారనేందుకు గణాంకాలే నిదర్శనమని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. విధానాల రూపకల్పనలో ప్రత్యేక ముద్ర జూన్ 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,004 సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.6,012 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 1,30,112 మందికి ఉపాధి లభించనుంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి మంత్రిగా ఉండగా ప్రభుత్వ సహకారంతో 78 భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.35,038 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చడమే కాకుండా 51,925 మందికి ఉపాధి లభించింది. ఇదే సమయంలో 53 భారీ ప్రాజెక్టులు, 5 ప్రభుత్వ రంగ సంస్థలు రూ.1,29,562 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఇవి వాస్తవరూపం దాలిస్తే 1,60,768 మందికి ఉపాధి లభిస్తుంది. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2020–23, వైఎస్ఆర్ ఈఎంసీ కొప్పర్తి ఎలక్ట్రానిక్ పాలసీ, జగనన్న వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ పాలసీ 2020–23, జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం పాలసీ 2020–23, ఏపీ ఐటీ పాలసీ 2021–24 రూపకల్పనలో గౌతమ్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు. మౌలిక వసతులకు పెద్ద పీట... పరిశ్రమలను ఆకర్షించాలంటే మెరుగైన మౌలిక వసతులు ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు అనుగుణంగా పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై మంత్రి గౌతమ్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. రికార్డు సమయంలో వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో 801 ఎకరాల్లో వైఎస్ఆర్ ఈఎంసీ, 3,155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను ప్రారంభించడంతో పాటు కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ అనుమతులు సాధించడంలో విశేష కృషి కనబరిచారు. అనంతపురం, విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు గట్టిగా కృషి చేశారు. రాష్ట్రంలో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, రెండు స్కిల్ యూనివర్సిటీలు, 30 స్కిల్ కాలేజీల నిర్మాణంలో మంత్రి చొరవను గుర్తు చేసుకుంటున్నారు. మంత్రిగా ఉండగా ఐటీ రంగంలో రూ.4,800 కోట్ల విలువైన 35,000 ఉద్యోగాల కల్పనకు కృషి చేశారు. చివరి వరకు పారిశ్రామిక ప్రగతి కోసం కృషి చేశారు. ఇటీవల దుబాయ్ పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించడంలో విజయవంతం అయ్యారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిది. – సీవీ అచ్యుత్‌రావు, అధ్యక్షుడు, ఫ్యాప్సీ పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్ది ప్రచారం చేయడంలో విజయవంతమయ్యారు. కోవిడ్ సమయంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మంత్రి గౌతమ్‌రెడ్డి కృషిని మరవలేం. ఆయన మరణం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద దెబ్బ. – డి.తిరుపతి రాజు, చైర్మన్, సీఐఐ ఏపీచాప్టర్ మంత్రి గౌతమ్‌రెడ్డి నిత్యం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి కోసం పరితపించారు. పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఆయనతో కలిసి పని చేయటాన్ని గౌరవంగా భావిస్తున్నాం. ఆయన అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటు. – కృష్ణ ప్రసాద్, ప్రెసిడెంట్, ఏపీ చాంబర్స్ విశాఖపట్నం: మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తీవ్రంగా కలచివేసింది. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్‌రెడ్డిని మృత్యువు కబళించడం బాధాకరం. – డాక్టర్ గేదెల శ్రీనుబాబు, పల్సస్ సంస్థ సీఈవో -
రాష్ట్రానికి మరో ఎక్స్‌ప్రెస్ హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రానుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా చెన్నై–సూరత్ కారిడార్‌కు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఇటీవల ఆమోదం తెలిపింది. దేశంలో తూర్పు, పశ్చిమ పోర్టులను అనుసంధానించే ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో 320 కి.మీ. ఏపీలో నిర్మించనున్నారు. మొత్తం రూ. 50 వేల కోట్ల అంచనాతో ఆమోదించిన ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాచబాట పడనుంది. మరోవైపు చెన్నై–విశాఖపట్నం, ముంబై–ఢిల్లీ కారిడార్లతో కూడా దీనిని అనుసంధానించాలని ప్రణాళిక రూపొందించడం రాష్ట్రానికి మరింత ఉపయుక్తంగా మారనుంది. తూర్పు, పశ్చిమాలను అనుసంధానిస్తూ.. దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య సరుకు రవాణాలో వ్యయ, ప్రయాసలను తగ్గించేందుకు చెన్నై–సూరత్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం చెన్నై నుంచి సూరత్‌కు నెల్లూరు, హైదరాబాద్, షోలాపూర్, పుణెల మీదుగా వెళ్లాల్సి ఉంది. అలాగే రాయలసీమ నుంచి చిత్రదుర్గ, దావణగెరె, బెల్గాం, కొల్హాపూర్, పుణెల మీదుగా ప్రయాణించాల్సి ఉంది. ఈ రెండు మార్గాలు ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినవి. కొత్త ప్రాజెక్టుతో చెన్నై నుంచి మన రాష్ట్రంలోని తిరుపతి, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్ణాటకలో కోస్గి, రాయచూర్, మహారాష్ట్రలోని షోలాపూర్, నాసిక్ మీదుగా గుజరాత్‌లోని సూరత్ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కానుంది. దాంతో దక్షిణాది నుంచి సూరత్‌కు 350 కి.మీ. దూరం తగ్గడంతోపాటు 6 గంటల ప్రయాణ సమయం కలసి వస్తుంది. ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో తమిళనాడులో 156 కి.మీ., ఏపీలో 320 కి.మీ., తెలంగాణలో 65 కి.మీ., కర్ణాటకలో 176 కి.మీ, మహారాష్ట్రలో 483 కి.మీ., మిగిలినది గుజరాత్లో నిర్మించనున్నారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించడం కోసం ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. డీపీఆర్ ఖరారయ్యాక ప్రాజెక్టును చేపట్టి రెండేళ్లలో పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఊతం.. చెన్నై–సూరత్ కారిడార్ మన రాష్ట్రంలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు, కడప, కర్నూలు, దొనకొండ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఆ ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది. చెన్నై–సూరత్ కారిడార్ నిర్మాణం పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. పశ్చిమాసియా దేశాల నుంచి భారత్‌కు సూరత్ పోర్ట్ ముఖద్వారంగా ఉంది. కాబట్టి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పారిశ్రామిక ఉత్పత్తులను పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ కారిడార్ ద్వారా నేరుగా సూరత్ పోర్టుకు తరలించవచ్చు. ఇక దేశంలో వస్త్ర పరిశ్రమకు సూరత్ కేంద్రంగా ఉంది. మన రాష్ట్రంలో నగరి, వెంకటగిరి, ధర్మవరం, చీరాల, మంగళగిరి ప్రాంతాల్లోని చేనేత ఉత్పత్తులను సూరత్ మార్కెట్‌కు తరలించేందుకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. మన రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్టుతోపాటు కొత్తగా నిర్మించనున్న బందరు, రామాయపట్నం పోర్టులను సూరత్ పోర్టుతో అనుసంధానానికి సాధ్యపడుతుంది. ఇక చెన్నై–సూరత్ కారిడార్ దిగువన చెన్నై– విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌తోనూ ఎగువన ముంబై–ఢిల్లీ కారిడార్‌తోను అనుసంధానించనున్నారు. తద్వారా అతి పెద్ద పారిశ్రామిక కారిడార్ రూపొందనుంది. దీంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. -
దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా..
సాక్షి, అమరావతి: పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు దిగ్గజ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో నమోదైన పలు భారీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఆయా కంపెనీల అధినేతలు పలువురు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో ప్రముఖ కంపెనీల రాక.. స్టాక్ మార్కెట్లో నమోదైన 15కిపైగా కంపెనీలు గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. రూ.లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన సన్‌ఫార్మా, ఐటీసీ, అదానీ, ఓఎన్జీసీ, ఆదిత్య బిర్లా గ్రూపు, అరబిందో, కాంకర్, బీఈఎల్, జిందాల్ స్టీల్, ఎస్సార్ స్టీల్, డిక్సన్, బ్లూస్టార్, సెంచరీ ఫ్లైవుడ్, శ్రీ సిమెంట్ లాంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టు బడులు పెడుతున్నాయి. సన్‌ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వీ ముఖ్యమంత్రితో సమావేశమై రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐటీసీ సంస్థ గుంటూరులో తొలి ఫైవ్‌స్టార్ హోటల్‌ను నెలకొల్పడమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో కూడా ఐటీసీ పాలు పంచుకుంటోంది. సుమారు రూ.7.50 లక్షల కోట్ల విలువైన అదానీ గ్రూపు కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు విశాఖలో రూ.14,634 కోట్లతో 200 ఎంవీ డేటా సెంటర్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా రూ.24,990 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, బీఈఎల్ లాంటి కేంద్ర సంస్థలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఏపీలో రూ.96,400 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 79,700 మందికి ఉపాధి లభించనుంది. ఒక్క ఓఎన్జీసీనే తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్లు వెచ్చిస్తుండటం గమనార్హం. ఓఎన్జీసీ చైర్మన్ సుభాష్ కుమార్ గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించిన సంగతి తెలిసిందే. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై ప్రధానంగా చర్చించారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో బీఈఎల్ యూనిట్ల పనులు జరుగుతుండగా విశాఖలో హెచ్‌పీసీఎల్ రూ.17,000 కోట్ల పెట్టుబడులను పెడుతోంది. పీఎల్ఐపై ప్రత్యేక దృష్టి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ రంగంలో బ్లూస్టార్, డిక్సన్ లాంటి లిస్టెడ్ కంపెనీలను ఆకర్షించగా ఫార్మా, ఆటోమొబైల్, టెక్స్టైల్ రంగాల్లో కూడా భారీ పెట్టుబడులను రప్పించేలా చర్చలు జరుపుతోంది. దేశాన్ని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేలా 13 రంగాల్లో రూ.1.97 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఇచ్చేలా పీఎల్ఐ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం విధానం రాష్ట్ర సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానమని స్పష్టమైంది. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. సాంకేతికతను వినియోగించుకుని అత్యంత నిపుణులైన మానవ వనరులను సిద్ధం చేయడం ద్వారా ప్రజల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ముందడుగు వేస్తున్నారు. ఔషధ రంగంలో మా ఆలోచనలను ఆయనతో పంచుకున్నాం. ఏపీలో ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్ ఏర్పాటు ద్వారా ఔషధాల ఎగుమతి మా లక్ష్యం. – సన్‌ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వి. ఏపీలో మరో రూ.400 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌తో మాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం బాగుంది. త్వరలో మరో రూ.400 కోట్ల మేర ఏపీలో పెట్టుబడి పెట్టనున్నాం. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కార్యక్రమాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగస్వాములు కావడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వెచ్చిస్తాం. – గుంటూరులో ఐటీసీ ఫైవ్‌స్టార్ హోటల్ ప్రారంభోత్సవంలో సంస్థ చైర్మన్, ఎండీ సంజీవ్ పూరి -
గ్రామీణ పరిశ్రమలకు ఏపీ సర్కారు ఊతం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 5 వేలకు పైగా జనాభా గల గ్రామాల్లో విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా కొత్తగా త్రీ ఫేజ్ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది జూలైలోగా పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా.. అవసరమైతే కొంత గడువు పొడిగించి సంబంధిత గ్రామాలన్నిటిలోనూ విద్యుత్ లైన్లు వేయాలని డిస్కంలు భావిస్తున్నాయి. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రోత్సాహమిస్తున్నారు. చదవండి: పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు మొదలైన కొత్త లైన్ల ఏర్పాటు వ్యవసాయోత్పత్తులకు మంచి ధర కల్పించేలా ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం తర్వాత ఈ రంగం అతిపెద్ద ఉపాధి వనరుగా మారడంతో మెరుగైన ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం దీనికి ప్రాధాన్యతనిస్తోంది. ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను నిర్వహించే రైతులకు తక్కువ ధరకే విద్యుత్ అందిస్తారు. ఇందుకు అనుగుణంగా గ్రామీణ కుటీర పరిశ్రమలకు కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం వ్యవసాయ బోర్లకు 3 ఫేజ్ విద్యుత్‌ను 9 గంటల పాటు అందిస్తున్నారు. మిగతా సర్వీసులకు సింగిల్ ఫేజ్ ఇస్తున్నారు. అయితే కుటీర పరిశ్రమలు, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లకు ప్రత్యేకంగా త్రీ ఫేజ్ లైన్లు వేయాల్సి వస్తోంది. దీనికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగా అవుతోంది. పైగా యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు డిస్కంలు కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నాయి. 33/11 కేవీ సబ్ స్టేషన్ నుంచి గ్రామాలకు 11 కేవీ విద్యుత్ లైన్లు, అల్యూమినియం కండక్టర్లు, 110 కేవీ ట్రాన్స్ఫార్మర్లతో నేరుగా లైన్లు వేస్తున్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలో 123 గ్రామాలు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 123 గ్రామాలను సర్వే ద్వారా గుర్తించాం. వీటిలో 3 ఫేజ్ విద్యుత్ లైన్లు వేసేందుకు రూ.44 కోట్లు వెచ్చిస్తున్నాం. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్ సీపీడీసీఎల్ పరిధిలో రూ.60 కోట్లతో.. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) పరిధిలోని విజయవాడలో 31, సీఆర్డీఏ పరిధిలో 10, గుంటూరు జిల్లాలో 30, ప్రకాశం జిల్లాలో 34 గ్రామాలను గుర్తించాం. ఈ 105 గ్రామాల్లో రూ.60 కోట్లతో లైన్లు వేస్తున్నాం. – జె.పద్మాజనార్ధనరెడ్డి, సీఎండీ, సీపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ పరిధిలోనూ కొత్త లైన్లు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) పరిధిలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని 112 గ్రామాల్లో త్రీ ఫేజ్ విద్యుత్ లైన్లు వేయాలని నిర్ణయించాం. ఇప్పటికే 32 గ్రామాలకు లైన్లు వేశాం. 80 గ్రామాలకు పనులు జరుగుతున్నాయి. ఈ మొత్తం పనులకు రూ.65.19 కోట్లు ఖర్చవుతోంది. – హెచ్.హరనాథరావు, సీఎండీ, ఎస్పీడీసీఎల్ -
పారిశ్రామిక ప్రగతిలో కలికితురాయి ‘కొప్పర్తి’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక దశ, దిశను మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. తక్షణం వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా అభివృద్ధి చేసిన షెడ్లతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన ఈ రెండు పారిశ్రామిక పార్కులను సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించనున్నారు. వైఎస్సార్ ఈఎంసీలో దాదాపు 28 యూనిట్లు రూ.1,052 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. వీటి ద్వారా సుమారు 14,100 మందికి ఉపాధి లభించనుంది. కొప్పర్తిలో అభివృద్ధి చేసిన నాలుగు షెడ్లను ఉత్పత్తి ప్రారంభించడం కోసం ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్‌కు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ యూనిట్లో సెక్యూరిటీ సర్వైలైన్స్ సిస్టమ్స్, డిజిటల్ వీడియో రికార్డర్స్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను అభివృద్ధి చేయనుంది. ఇక్కడ ఏర్పాటయ్యే మరికొన్ని కంపెనీలు ► డిక్సన్.. 1200 మందికి ఉద్యోగాల కల్పన. టీవీలు, ల్యాప్టాపులు, ఐఓటీ పరికరాల తయారీ. ► సెల్కాన్ రిజల్యూట్ ఎలక్ట్రానిక్స్.. 1500 మందికి ఉద్యోగాలు. స్మార్ట్ఫోన్లు, మొబైల్ హ్యాండ్సెట్లు, ట్యాబ్లెట్లు, పీసీ యాక్ససరీలు, సెట్‌టాప్ బాక్సులు, గిగాబైట్ ఎథర్నెట్ ఆప్టికల్ నెట్వర్క్ (జీపీఓఎన్) తయారీ. ► ఆస్ట్రం టెక్నికల్ భాగస్వామి చంద్రహాస్ ఎంటర్ ప్రైజస్.. 1,300 మందికి ఉద్యోగాలు. పవర్ బ్యాంక్స్, కేబుల్స్, చార్జర్లు, హెడ్‌ఫోన్స్, డిజిటల్ బోర్డుల తయారీ. ► యూటీఎన్పీఎల్ కంపెనీ.. 500 మందికి ఉద్యోగాలు.. మొబైల్ ఫోన్లు, చార్జర్లు, తదితర పరికరాల తయారీ. ► వీవీడీఎన్ టెక్నాలజీస్.. రూ.365 కోట్ల పెట్టుబడితో 5,400 మందికి ఉద్యోగాలు. 5జీ, ఏఐ, ఎంఐ, బ్లాక్ చెయిన్, బిగ్ డేటా, అనలిటిక్స్ రంగంలో ఉత్పత్తులు. ► బ్లాక్ పెప్పర్, హార్మనీ కంపెనీలు.. రూ.1800 కోట్ల పెట్టుబడులతో వందలాది మందికి ఉపాధి అవకాశాలు. ► ఎంఎస్ఎంఈ కంపెనీలకు కూడా ప్రాధాన్యత. రూ.84.29 కోట్లతో 18 ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు. తద్వారా 1200 మందికి ఉద్యోగాలు. భూములు అప్పగింత ద్వారా ఈ యూనిట్ల పనులు ప్రారంభం కానున్నాయి. ► ఇండస్ట్రియల్ ప్రమోషన్‌తోపాటు, ఈఎంసీలో పెట్టుబడులకు అవకాశాలను తెలియజెప్పడం ద్వారా కంపెనీలను ఆకర్షించడానికి తైవాన్ ట్రేడ్ డెవలప్మెంట్ కౌన్సిల్, బిజినెస్ రష్యా, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎంఎస్ఎంఈ, ఎల్సీనా, ఐఈఎస్ఏ, ఐపీసీఏ, సీపీపీఏలతో ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకోనుంది. -
ఆర్భాటాలు లేకుండా అభివృద్ధి పథం
దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆకర్షించిన పెట్టుబడుల విషయంలో మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడం మంచి పరిణామం. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఏపీకి ఇన్ని ప్రతిపాదనలు రావడం హర్షణీయం. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పరిశ్రమలు రావేమోనన్న ఆందోళన ఉండేది. ప్రస్తుతం పెట్టుబడులలో ఏపీ రెండో స్థానంలో ఉండడంతో టీడీపీ మీడియా ఇంతవరకు అసత్య ప్రచారం చేసిందన్నది నిర్ధారణ అవుతోంది. కడప జిల్లాలో ఎలక్ట్రానిక్, లెదర్ కాంప్లెక్స్, కృష్ణపట్నం వద్ద 3 వేల కోట్లతో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు.. నాలుగు నుంచి ఆరు ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకోవడం వంటి పరిణామాలన్నీ శుభ సంకేతాలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఏపీ ప్రజలకు కాస్త మంచిరోజులు వచ్చినట్లుగా ఉన్నాయి. అందుకే కొన్ని శుభ సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ యూనిట్ ఏర్పాటు దిశగా ఒక అడుగు పడింది. కాకినాడ వద్ద పెట్రో కారిడార్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం, రాష్ట్రం మధ్య సంప్రదింపులు ఆరంభం కావడం, వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు అవడం మంచి సంకేతమే అని చెప్పాలి. విభజన చట్టం ప్రకారం సుమారు 25 వేల కోట్ల పెట్టుబడితో యాంకర్ ఇన్వెస్ట్మెంట్గా రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆయన భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ అంతకుముందు ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఈ పరిణామం జరగడం ఆశాజనకంగా ఉంది. ఒకసారి ఈ యాంకర్ రిఫైనరీ ఏర్పాటైతే, పెట్రో కారిడార్‌గా ఇది అభివృద్ధి చెంది వివిధ రకాల పరిశ్రమలు వస్తాయని, తద్వారా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కేంద్రం ఇందుకు పూర్తిగా సహకరిస్తేనే సాధ్యం అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏడేళ్లకు ఈ ప్రాజెక్టు కాస్త కదలడం ఆశాజనకంగా ఉందని చెప్పాలి. ఏపీలో రిఫైనరీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ఇదే కాదు. తొలి త్రైమాసంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మహారాష్ట్ర రూ.54,714 కోట్ల పెట్టుబడులతో మొదటి స్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ రూ.29,784 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఆ తర్వాత స్థానంలో ఉన్న గుజరాత్ రూ.26,530 కోట్లు, తమిళనాడు రూ.24,000 కోట్లు, కర్ణాటక రూ.14,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు పొందగా, తెలంగాణ రాష్ట్రం రూ.12,961 కోట్ల పెట్టుబడులు పొందుతోందని ప్రాజెక్ట్స్ టుడే అనే సంస్థ నివేదిక వెల్లడించింది. సాధారణంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉంటాయి. వీటితో ప్రస్తుతం ఏపీ పోటీపడటం ఆసక్తికరంగా ఉంది. దేశంలో ఈ ప్రాజెక్టులు, పరిశ్రమలు నిజంగానే ఆచరణ రూపం దాల్చవచ్చన్న అభిప్రాయం ఉంది. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఏపీకి ఈ ప్రతిపాదనలు రావడం హర్షణీయం. వీటిలో నీటిపారుదల ప్రాజెక్టుల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ప్రజల జీవన స్థితిగతులను పెంచేవే. ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే తరహాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండి ఉండవచ్చు. ఉమ్మడి ఏపీ విభజన జరిగిన తర్వాత ఏపీకి పరిశ్రమలు రావేమోనన్న ఆందోళన ఉండేది. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్న తర్వాత ఈ అనుమానం మరింత పెరిగింది. అయితే అదే సమయంలో గత సీఎం చంద్రబాబు విశాఖలో సదస్సులకు, దేశదేశాలు తిరిగి పెట్టుబడులు ఆకర్షించడానికి వందల కోట్లు వ్యయం చేసేవారు. వాటిద్వారా వాస్తవంగా ఎంత పెట్టుబడి వచ్చిందో నిజాలు చెప్పి ఉంటే ఇబ్బంది ఉండేదికాదు. కాని 20 లక్షల కోట్లు పెట్టుబడి అని, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేశాయని ప్రచారం చేయడంతో అది అబద్ధమని అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల పరిశ్రమలు రాలేదని బీజేపీతో చెడిన తర్వాత చంద్రబాబే స్వయంగా చెప్పేవారు. జగన్ ప్రభుత్వం వచ్చాక పలు పరిశ్రమలు వెళ్లిపోయాయని, తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున తన మీడియా ద్వారా ప్రచారం చేయిం చింది, చేయిస్తోంది. టెంపుల్టన్ అనే కంపెనీ ఆర్థిక సమస్యలతో ఇండియాలో తన కార్యకలాపాలు తగ్గించుకుంటే, అదేదో జగన్ ప్రభుత్వం వల్ల వెనక్కి పోతున్నట్లుగా దిక్కుమాలిన ప్రచారానికి పాల్పడిందన్న విశ్లేషణలు వచ్చాయి. అనంతపురం నుంచి కియా కార్ల ఫ్యాక్టరీ తరలిపోతోందని వదంతి పుట్టించారు. కానీ ఆ కంపెనీ మరో 400 కోట్ల అదనపు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. అది కూడా శుభ పరిణామమే. ప్రస్తుతం పెట్టుబడులలో రెండో స్థానంలో ఉండడంతో టీడీపీ మీడియా అసత్య ప్రచారం చేసిందన్నది నిర్ధారణ అవుతోంది. ఇటీవలి కాలంలో కడప జిల్లాలో ఎలక్ట్రానిక్, లెదర్ కాంప్లెక్స్‌లకు జగన్ శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం వద్ద సుమారు 3 వేల కోట్లతో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రామాయపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, భావనపాడులతో సహా మొత్తం నాలుగు నుంచి ఆరు ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. విశాఖపట్నంలో ఆదాని డేటా సెంటర్‌కు 130 ఎకరాల భూమి కేటాయించారు. విశాఖపట్నంలో స్టీల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలలో పనిచేసే ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ నిపుణులు తమ గ్రామాలకు వచ్చి అక్కడ వైఫై ఆధారంగా పని చేయడం వల్ల గ్రామాలలో కొత్త కళ సంతరించుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ఇచ్చింది. తమిళనాడులోని అంబత్తూరు పారిశ్రామికవాడలో స్థలం తగ్గిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం వల్ల, చిత్తూరు జిల్లాలో 2 వేల ఎకరాల భూమిని తీసుకుని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటికి తోడు సీఎం జగన్ అమలు చేసిన చేయూత పథకం కింద చిన్న, చిన్న యూనిట్లను పెట్టినవారి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు రిలయన్స్, ఐటీసీ తదితర సంస్థలతో ఒప్పం దాలు చేసుకున్నారు. పాల ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసే కృషిలో భాగంగా అమూల్ సంస్థను ఏపీకి తీసుకువచ్చారు. ఇలా ఆయా స్కీముల అమలుకు అడుగులు పడుతుండటం సంతోషకరం. ప్రభుత్వపరంగా ఎన్ని లక్షల ఉద్యోగావకాశాలు సృష్టించినా, ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ఆరు లక్షల ఉపాధి అవకాశాలు ఇచ్చి, తాజాగా పదివేల ఉద్యోగాలకు పైగా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించినా, కొందరు దానిపై విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు అసలు ప్రభుత్వంలో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయని అనేవారు. అయినా జగన్ ఆ విషయంలో చేసిన కృషి చిన్నదేమీ కాదు. అయినా ప్రభుత్వంతో పాటు, ప్రైవేటురంగంలో కూడా ఇతోధికంగా అవకాశాలు రావల్సి ఉంటుంది. కేంద్రం ప్రత్యేక హోదాను ఇచ్చినట్లయితే పెట్టుబడులు మరింత అధికంగా వచ్చి ఉండేవి. కొత్తగా భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయితే కూడా ఆ ప్రాంత అభివృద్ధికి అది దోహదపడుతుంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కార్యరూపం దాల్చితే రాయలసీమలో ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. అంతేకాక అమరావతి ప్రాంతంలో అగ్రికల్చరల్ హబ్ తదితర రంగాలకు చెందిన యూనిట్లు వస్తే ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. గతంలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి జగన్‌పై కేసులు పెట్టిన నేపథ్యంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య వాన్‌పిక్ ప్రాజెక్టు కూడా సీబీఐ కేసులో చిక్కుకుని ఆగిపోయింది. ఆ ప్రాజెక్టు కూడా క్లియర్ అయితే ఏపీలో పరిశ్రమల స్థాపన వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది. ప్రచారం హంగామా లేకుండా ఏపీ ప్రభుత్వం వీటిని చేసుకుపోవడం కూడా మంచిదే. లేకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి శుభ సంకేతాలే కాని, పూర్తిగా ప్రాజెక్టులూ, పరిశ్రమలూ వచ్చేశాయని అనుకోరాదు. అందుకోసం ప్రభుత్వం ఇంకా చాలా కృషి చేయవలసి ఉంది. అప్పుడే పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి. వైఎస్ జగన్‌పై ఏర్పడిన విశ్వసనీయత అంశం ఇందుకు బాగా దోహదపడవచ్చు. అందువల్ల వైఎస్ జగన్‌కు, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులకు ఆల్ ద బెస్ట్ చెబుదాం. కొమ్మినేని శ్రీనివాస రావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
‘పరిశ్రమలు రావాలంటే సులభమే.. కానీ’
సాక్షి, విజయనగరం : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మార్గాలు అన్వేషించి భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా వ్యవస్థ రూపొందించాలని సీఎం జగన్ ఎప్పుడూ కోరుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమలు రావాలంటే సులభమే కానీ కాలుష్యంతో కూడిన పరిశ్రమలు వస్తే అది అభివృద్ధికి దొహదపడదని అన్నారు. ఇదే సీఎం ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. కాలుష్యంతో కూడిన పరిశ్రమలు రాష్ట్రానికి వద్దని సీఎం వైఎస్ జగన్ చెబుతుంటారని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం చూస్తే సీఎం విజన్ అర్థమైపోతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: కర్నూలు ఎయిర్‌పోర్టుకు డీజీసీఏ అనుమతులు మంచి విద్యార్థులను తయారు చేస్తే చాలని, వారిలో ఓ పారిశ్రామికవేత్తకు ఉన్న లక్షణాలు అలవడతాయని పేర్కొన్నారు. మూడు ప్రాథమిక అంశాలు విద్యా, ఉపాధి, ఆరోగ్యంపైన ఎక్కువ దృష్ట పెడితే భవిష్యత్తులో అభివృద్ధిని చూడనవసరం లేదన్నది తమ ఉద్దేశ్యమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగానే వెళ్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించబోతున్నామని తెలిపారు. పరిశ్రమలకు రాయితీలు అవసరమే కానీ పాత విధానంలో ఇస్తే సరికాదన్నది తమ అభిప్రాయమని, 97 వేల ఎంఎస్ఎంఈ లకు 11 వందల కోట్లు రాయితీ రూపేనా ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. మేరిటైమ్ బోర్డును స్థాపించి పోర్టు, హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రోడ్ బ్రిడ్జ్ కనెక్టివిటీలను బలోపేతం చేస్తున్నామని, వ్యాపార రంగాన్ని మరిత సులభతరం చేస్తున్నామని పేర్కొన్నారు. -
నేడు అపాచీ ఫుట్‌వేర్‌కు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రముఖ పాదరక్షల తయారీ సంస్థ ఇంటెలిజెంట్ సెజ్ (అపాచీ) ఏర్పాటు యూనిట్‌కు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం పులివెందుల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కులో 28 ఎకరాలను ఏపీఐఐసీ ఇంటెలిజెంట్ సెజ్‌కు కేటాయించింది. ఇది చిత్తూరు జిల్లా ఇనగలూరులో రూ.350 కోట్ల పెట్టుబడి అంచనాతో పది వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాటు చేయనున్న యూనిట్‌కు అనుబంధంగా పులివెందులలో కాంపోనెంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. సుమారు రూ.70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా 2,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. గురువారం సీఎం జగన్ భూమి పూజ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. భారీ వర్షాల వల్ల పనులు ఆలస్యం కావడంతో పులివెందుల ఆటో పార్కు, వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ శంకుస్థాపన కార్యక్రమాలను సంక్రాంతి తర్వాతకు వాయిదా వేసినట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. సీఎంకు స్వాగతం పలుకుతున్న మంత్రి సురేశ్ కాగా, సీఎం జగన్ 3 రోజుల పర్యటన కోసం బుధవారం వైఎస్సార్ జిల్లాకు చేరుకున్నారు. మధ్యాహ్నం సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లి నుంచి విమానంలో బయలుదేరి 4.30కు కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ్నుంచి 4.45కు హెలికాప్టర్లో బయలుదేరి 5.15 గంటలకు ఇడుపులపాయకు చేరుకున్నారు. సాయంత్రం 6.15కి అక్కడి నుంచి కారులో బయలుదేరి 6.20కి ఇడుపులపాయ వైఎస్సార్ అతిథి గృహానికి చేరుకున్నారు. సీఎంకు ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. -
వేగంగా నైపుణ్యాభివృద్ధి కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, భవనాల నిర్మాణం అత్యంత నాణ్యతగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ► ఆర్థిక శాఖ అధికారులతో కూర్చొని కాలేజీల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలి. పనులు త్వరగా మొదలు పెట్టాలి. వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపై యువతకు శిక్షణ ఇవ్వాలి. ► హై ఎండ్ స్కిల్స్‌తో పాటు ప్రతి కాలేజీలో ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపై శిక్షణ ఇవ్వాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కాలేజీ ఉండేలా చూసుకుంటూ రాష్ట్రంలో 30 కాలేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి. నైపుణ్యాల అభివృద్ధి, ఉత్తమ మానవ వనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్ధిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషిస్తాయి. నైపుణ్యాభివృద్ధి కాలేజీలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి, అధికారులు 20 చోట్ల స్థలాల గుర్తింపు ► కాలేజీల కోసం ఇప్పటి వరకు దాదాపు 20 చోట్ల స్థలాలను గుర్తించామని, మిగిలిన చోట్ల కూడా ఆ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీల్లో వివిధ కోర్సులకు పాఠ్యప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. అధికారులు ఇంకా ఏం చెప్పారంటే.. ► ఫినిషింగ్ స్కిల్ కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. మొత్తం 162కిపైగా కోర్సులు ఉంటాయి. ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయి. ► పరిశ్రమల అవసరాలపై సర్వే. ఆ సర్వే ప్రకారం కోర్సులు నిర్ణయించాం. పాఠ్య ప్రణాళిక తయారీలో సింగపూర్ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్ హాల్ లారెన్‌స్టెన్ (యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్), డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ భాగస్వామ్యాన్ని తీసుకున్నాం. ► మరో 23 ప్రఖ్యాత సంస్థలతో భాగస్వామ్యం కోసం ఎంఓయూలకు సిద్ధమయ్యాం. ఇంకో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయి. ల్యాబ్ ఏర్పాట్లు, పాఠ్య ప్రణాళికలో వీరి సహకారం తీసుకుంటున్నాం. ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బయోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయి. ► సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇక వైజాగ్– చెన్నై పారిశ్రామిక కారిడార్ పరుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలకమైన వైజాగ్– చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) పనులు ఇక వేగంగా జరగనున్నాయి. తూర్పు తీరంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఎంతో కీలకమైన వీసీఐసీ పనులు కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్న విషయం తెలిసిందే. ఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిసి చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా4 క్లస్టర్లలో కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ట్రాంచ్1, ట్రాంచ్2 కింద రూ.3,512.67 కోట్ల విలువైన వీసీఐసీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను చేపట్టడానికి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలన్ గురువారం అనుమతులు మంజూరు చేశారు. ట్రాంచ్1లో వీసీఐసీ కారిడార్‌లో రహదారుల విస్తరణ, విద్యుత్, మురుగునీటి శుద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టడానికి రూ.1,869.01 కోట్లు, ట్రాంచ్–2లో నాలుగు పారిశ్రామిక కస్టర్లను రూ.1,643.66 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. చిత్తూరు నోడ్‌లో ఏపీఐఐసీకి చెందిన 2,770 ఎకరాల్లో చిత్తూరు దక్షిణ క్లస్టర్లో రూ.660 కోట్లతో కీలకమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. విశాఖపట్నం నోడ్‌లో అచ్యుతాపురం క్లస్టర్లో ఏపీ సెజ్, రాంబిల్లి పారిశ్రామిక వాడలకు అవసరమైన 95 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి సరఫరా చేయడానికి రూ.303.60 కోట్లు వ్యయం చేయనున్నారు. అదే విధంగా 392 ఎకరాల రాంబిల్లి పారిశ్రామిక వాడలో రూ.198 కోట్లతో మౌలిక వసతులు, అదే విధంగా నక్కపల్లి క్లస్టర్లో 1,120 ఎకరాల్లో రూ.376 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నారు. వీటికితోడు ఏపీ మెడ్‌టెక్ జోన్లో రూ.106.06 కోట్లతో అంతర్గత మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. -
పెట్టుబడులకు స్వర్గధామం
సాక్షి, హైదరాబాద్: ‘టీఎస్–ఐపాస్ ద్వారా ఇప్పటివరకు రూ.1,96,404 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అనుమతించిన 12,021 పరిశ్రమల్లో 75 శాతం పైగా కార్యకలాపాలను ప్రారంభించాయి. రానున్న రోజుల్లో రాష్ట్రానికి రూ. 45,848 కోట్ల పెట్టుబడులు మెగా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయి, తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. 2019–20 పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ మంగళవారం ఇక్కడ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుతో పోల్చితే 2019–20లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) 8.2 శాతం నమోదైందని మంత్రి పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2018–19లో 4.55 శాతం ఉండగా, 2019–20లో 4.76 శాతానికి పెరిగిందన్నారు. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,34,432 తో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,28,216 అన్నారు. దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. ‘నెట్ ఆఫీస్ అబ్జర్షన్ విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అత్యత్తుమ జీవన ప్రమాణాల విషయంలో హైదరాబాద్ మరోసారి ప్రథమ స్థానం దక్కించుకుంది. నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిర అభివృద్ధి సూచికల్లో బెస్ట్ పెర్ఫామింగ్ స్టేట్ గా రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. కరోనా సంక్షోభంలో తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయి. రిలీఫ్ ఫండ్ కు రూ.150 కోట్లతో పాటు ఇతరత్రా కాంట్రిబ్యూషన్ రూపంలో అందించారు’అని తెలిపారు. ఫార్మా రంగంలో.. ఈసారి కూడా హైదరాబాద్ ఫార్మా మరియు లైఫ్ సైన్స్ రంగంలో జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో తన వాటాను 35 శాతంగా కొనసాగించింది. 800 ఫార్మా, బయోటెక్, మెడికల్ టెక్నాలజీ కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటి వ్యాపార విలువ 50 బిలియన్ డాలర్లు. వచ్చే దశాబ్దకాలంలో 100 బిలియన్ డాలర్లకు పెంచాలని, 4 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. నోవార్టిస్ తన డిజిటల్ ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ యూనిట్‌కు ఎస్ఎంటీ కంపెనీ పునాది వేసింది. రూ.250 కోట్లతో 20 ఎకరాల్లో మెడికల్ డివైస్ పార్క్‌లో ఈ పరిశ్రమ రానున్నది. 1,500 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. మెడికల్ డివైస్ పార్క్‌లో సుమారు 25 కంపెనీలు తమ కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. జీనోమ్ వ్యాలీ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికి 200 కంపెనీలతో సుమారు 10 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. శాండజ్, టీసీఐ కెమికల్స్, యాపన్ బయో, వల్లర్క్ ఫార్మా ఇలాంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. సింజిన్ కంపెనీ జీనోమ్ వ్యాలీలో రూ.170 కోట్లతో పరిశ్రమను స్థాపించింది. 1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ కంపెనీలను ఒకేచోట చేర్చేందుకు రూ.100 కోట్ల పెట్టుబడితో ఎంఎన్ పార్క్ బిల్డింగ్ కోసం జినోమ్ వ్యాలీలో పునాదిరాయి వేయడం జరిగింది. హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ (నిమ్జ్) గుర్తింపునిచ్చింది ‘ఏరోస్పేస్’లోనూ సత్తా.. ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్లో ఉత్తమ రాష్ట్రంగా కేంద్ర విమానయాన శాఖ నుంచి రాష్ట్రానికి పురస్కారం వరించింది. జీఎంఆర్ విమానాశ్రయం ప్రపంచంలోనే మూడో గ్రోయింగ్ ఎయిర్ పోర్టుగా అవార్డు అందుకుంది. నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ సుమారు ఐదు డిఫెన్స్ ప్రాజెక్టులను హైదరాబాద్‌కు తీసుకురావడంతో 600 మందికి ఉపాధి లభించనుంది. 2.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.350 కోట్లతో జీఎంఆర్ బిజినెస్ పార్కును శంషాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.300 కోట్లతో ఏడు ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఒక మెగా ఫుడ్ పార్క్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు కార్యకలాపాలను ప్రారంభించేందుకు పనులు ప్రారంభించాయి. చేనేత, వస్త్ర రంగంలో.. సిరిసిల్లలో 60 ఎకరాల్లో అప్పారెల్ పార్క్‌ను, మరో వీవింగ్ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతున్నది. 88 ఎకరా ల్లో 50 ఇండస్ట్రియల్ షెడ్ల నిర్మాణంతో 4,416 పవర్ లూ మ్లు, 60 వార్పిన్ యూనిట్లను ఏర్పాటు చేసే అవ కాశం ఉంది. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో రూ.960 కోట్లతో 300 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు కు యంగ్ వన్ కంపెనీ తుది దశ ఒప్పందా న్ని కుదుర్చుకుంది. 12 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చందన్వెల్లిలో వెల్స్పన్ గ్రూపు రూ.1,150 కోట్లతో కేవలం 14 నెలల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. వేయి మందికి ఉపాధి లభించింది. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో రూ.327 కోట్లతో 30 ఎకరాల్లో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గణేశా ఈకోస్పియర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో వెయ్యిమందికి ఉద్యోగాలు లభిస్తాయి. రిటైల్ రంగంలో.. 20 వేల చదరపు అడుగులతో గచ్చిబౌలిలో తెలంగాణలోనే లార్జెస్ట్ డెలివరీ సెంటర్‌ను అమెజాన్ స్టార్ట్ చేసింది. వాల్ మార్ట్ రాష్ట్రంలో 5వ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించింది. -
మరో ఐదు ‘శ్రీసిటీ’లు
సాక్షి, అమరావతి: భారీఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన మల్టీ ప్రొడక్ట్ సెజ్ ‘శ్రీసిటీ’ తరహాలో అన్ని వసతులతో ఐదు పారిశ్రామిక పార్కులను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తోంది. గురువారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనంలో ఉన్న ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ తొలిసారి సమావేశమైంది. ఈ భేటీలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టాస్క్‌ఫోర్స్ కమిటీ వైస్ చైర్మన్ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్, టాస్క్‌ఫోర్స్ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పంచాయతీ రాజ్, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఐదు డిజిగ్నేటెడ్ క్లస్టర్స్, పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా రక్షణ–ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా–హెల్త్‌కేర్, టెక్స్టైల్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగా అన్ని వసతులతో డిజిగ్నేటెడ్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లగ్అండ్ప్లే విధానంలో విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించుకునే విధంగా ఈ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ♦ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న దేశాలను గుర్తించి వాటి కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా దేశాల్లో స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ♦ పెట్టుబడి ప్రతిపాదనలు వేగంగా వాస్తవరూపం దాల్చడం కోసం దేశాల వారీగా, రంగాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ♦ ప్రతిపాదన వచ్చిన 30 రోజుల్లో పరిశ్రమకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, మానవ వనరులను అందించే విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ♦ పారిశ్రామిక పాలసీతో పాటు, ఐటీ–ఎలక్ట్రానిక్స్ పాలసీలను జూన్ 26న విడుదల చేసేందుకు కృషిచేస్తున్నామని మంత్రి చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా వచ్చే నాలుగేళ్లలో పెద్దఎత్తున సంపద సృష్టిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ♦సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉండే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ముందుకు నేడు వచ్చే సుమారు రూ. 18,000 కోట్ల విలువైన 25 పెట్టుబడి ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు. నేతన్నల స్థితిగతులపై సర్వే చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సర్వే చేపట్టాలని చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చేనేతల స్థితిగతులపై గురువారం సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెలలో అందించే ‘నేతన్న నేస్తం’ సాయానికి అర్హులైన వారి జాబితాను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కేంద్రం ఆదుకుంటే తప్ప పరిశ్రమలు తిరిగి పుంజుకునే అవకాశం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ తయారీ రంగం ఉత్పత్తిలో, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు గణనీయమైన భాగస్వామ్యం ఉందని, రాష్ట్రంలో పరిశ్రమల రంగం నిలదొక్కుకోవడానికి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. ఏ రంగాల్లో సహకారం కోరుతున్నది లేఖలో వివరించారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఎంఎస్ఎంఈల కోసం నిధి ఏర్పాటు చేయండి ► మాంద్యంలో జీతాల భారాన్ని ఎంఎస్ఎంఈలు తట్టుకోవడానికి వీలుగా నిధి ఏర్పాటు చేయండి. ► లాక్డౌన్ సమయంలో పరిశ్రమలు మూసివేసిన కాలాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. లాక్డౌన్ కాలానికి కార్మికులకు జీతాలు చెల్లించడానికి రాజీవ్‌గాంధీ శ్రామిక్ కల్యాణ్ యోజన, అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన కింద ఈఎస్ఐ నిధులను వినియోగించుకోవాలి. ► 10 శాతానికి మించి సిబ్బందిని తొలగించని యూనిట్ల యాజమాన్యాలకు.. పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ చెల్లింపు లను 6 నెలలు లేకుండా మారటోరియం విధించాలి. ► సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు.. వర్కింగ్ కేపిటల్ మీద నెలవారీ కిస్తీలు, వడ్డీలను వాయిదా వేయాలి. ► ఈ ఏడాది మార్చి 15 నుంచి డిసెంబర్ 31 వరకు వడ్డీ రేటును 7 శాతానికి పరిమితం చేయాలి. వర్కింగ్ కేపిటల్‌ను అదనంగా 25 శాతం తాత్కాలికంగా మంజూరు చేయాలి. ఎంఎస్ఎంఈలు తీసుకున్న టర్మ్ లోన్స్ చెల్లింపు విషయంలో 12 నెలల పాటు మారిటోరియం విధించాలి. వస్త్ర ఉత్పత్తుల రంగానికి చేయూత ఇవ్వాలి ► ఆర్బీఐ రుణ పునర్ వ్యవస్థీకరణ పథకం కింద బ్యాంకులు ఇచ్చిన అసలు, వడ్డీ వసూళ్లపై నాలుగు త్రైమాసికాలు మారటోరియం విధించాలి. ► కాటన్ యార్న్‌పై కేంద్ర పన్నులు, లెవీల రాయితీ, ఐఈఎస్, ఎంఈఐఎస్ పథకాల నుంచి లబ్ధి పొందేలా చూడాలి. ► ముడి వస్తువులు, రంగులు, రసాయనాలు, విడి భాగాలపై యాంటి డంపింగ్ డ్యూటీ, కస్టమ్ సుంకం నుంచి మినహాయింపు ఇవ్వాలి. ► వస్త్ర ఎగుమతి దారులు వేతనాలు ఇవ్వడానికి రుణం మంజూరు చేయాలి. ► సెజ్‌ల్లో ఉండే ఎగుమతి ఆధారిత టెక్స్టైల్ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన 50 శాతం ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విక్రయించుకోవడానికి ఆరు నెలలు అనుమతించాలి. ఫార్మా రంగానికి ఊతం ఇవ్వండి ► ఎక్కువగా దిగుమతులు చేసుకునే ఏపీఐని వ్యూహాత్మక రంగంగా గుర్తించాలి. ముడి వస్తువుల ఉత్పత్తి సరఫరాకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. ఏపీఐల ఎగుమతులపై పరిమితులు సడలించాలి. ► జీఎస్టీ రీయింబర్స్, ఇతర లెవీలను త్వరితగతిన చెల్లించాలి. అత్యవసరమైన మందులను వినియోగదారుడికి అందుబాటులోకి తేవాలి. భౌతిక దూరం నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలి. ► ప్రధానమైన ముడి పదార్థాల దిగుమతికి ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో అనుమతివ్వాలి. దిగుమతి సుంకం విధానాన్ని సమీక్షించాలి. నిబంధనలు సడలించి ఉత్పత్తి పెంచడానికి అవకాశమివ్వాలి. ► కొత్త ఫార్మా క్లస్టర్లకు రాయితీలు ఇవ్వాలి. భారీ ఏపీఐ పార్కులకు ఆర్థిక సాయం అందించాలి. కొత్త పెట్టుబడులకు ఫాస్ట్ ట్రాక్ అనుమతివ్వాలి. చైనా నుంచి ముడి పదార్థాల దిగుమతి తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. ఏపీఐ పార్కుల ఏర్పాటుకు సింగిల్ విండోలో అనుమతులివ్వాలి. కొత్త ఔషధాల పరిశోధనలు, అభివృద్ధికి రాయితీలు ఇవ్వాలి. ఎగుమతుల కోసం పోర్టులు, ఎయిర్ పోర్టులు ► ఉద్యోగుల జీతాలు, అద్దెలు, ఇతర అవసరాలను భరించేందుకు ఎగుమతి దారులకు వడ్డీ లేని రుణాలు అందించాలి. మార్చి నుంచి మే వరకు ఈపీఎఫ్ ఆర్గనైజేషన్, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని మాఫీ చేయాలి. ► బిల్ ఆఫ్ ఎంట్రీ, కస్టమ్స్ డ్యూటీ చెల్లింపు గడువులో మినహాయింపులు ఇవ్వాలి. డిఫర్డ్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ సదుపాయాన్ని కొనసాగించాలి. ► ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ డిస్చార్జ్ సర్టిఫికెట్ కోసం డీజీఎఫ్టీ వద్ద పెండింగులో ఉన్న కేసులకు సంబంధించి బ్యాంకు గ్యారంటీనీ మరో ఆరు నెలల వరకు పొడిగించకూడదు. ► షిప్పింగ్ లైన్ డెమరేజ్ చార్జీలు, సీఎఫ్ఎస్ చార్జీలు మాఫీ చేయాలి. క్లియరెన్స్ సమయం సాధారణ స్థితికి వచ్చే వరకు ఎగుమతి కంటైనర్ల లేట్ బీఎల్ ఫీజులు మాఫీ చేయాలి. ► మరో ఆరు నెలల వరకు ఒరిజినల్ షిప్పింగ్ డాక్యుమెంట్ల స్కాన్ కాపీలను కస్టమ్స్ అధికారులు ఆమోదించాలి. ఎగుమతుల కోసం కొన్ని పోర్టులు, ఎయిర్ పోర్టులను ప్రత్యేకంగా గుర్తించాలి. ► ఎగుమతి చేసే ఉత్పత్తుల తయారీకి అవసరమైన సరుకు దిగుమతి చేసుకునేందుకు ఎల్సీలకు బ్యాంకులు ప్రాధాన్యమివ్వాలి. ఎగుమతి చేయాల్సిన కంసైన్మెంట్లను పరిశ్రమలు, గిడ్డంగుల నుంచి నేరుగా కస్టమ్స్ కేంద్రాల వద్దకు తీసుకువెళ్లేందుకు అనుమతించాలి. ► గడువు దాటిన ఇ–వే బిల్లుల కాలపరిమితిని పొడిగించేందుకు, అపరాధ రుసుమును మాఫీ చేసేందుకు జీఎస్టీ నిబంధనలు, ఇ–వే బిల్ పోర్టల్లలో అవసరమైన సవరణలు చేయాలి. ► 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు చేసే అన్ని ఎగుమతులపై కనీసం 2 శాతం డ్యూటీని తగ్గించాలి. బకాయిలు ఇప్పించండి ► ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ శాఖల నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు, సరఫరాలో జాప్యం జరుగుతున్నందున వాటికి ఎలాంటి జరిమానాలు విధించ రాదు. ► కోవిడ్ –19 నేపథ్యంలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గడువును పున:సమీక్షించి, ఎలాంటి అపరాధ రుసుం వసూలు చేయకూడదు. ► ఎంఎస్ఎంఈలకు ఈఎండీల నుంచి మాత్రమే కాకుండా సెక్యూరిటీ డిపాజిట్, ఫర్మార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి ఆరు నెలలు మినహాయింపు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈల విద్యుత్ చార్జీలను రద్దు చేయాలి. ► ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు, సేవా రంగానికి ఏడాదికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య టర్నోవర్ ఉండే సంస్థలకు జీఎస్టీ ఫైలింగ్ చేసేలా నిబంధన విధించారు. దాన్ని కోటి రూపాయలకు పెంచేలా చర్యలు తీసుకోవాలి. ► వ్యాపార కార్యకాలాపాలు సాధరాణ స్థాయికి చేరే వరకు జీఎస్టీ వసూళ్లను వాయిదా వేయాలి. ఇదే తరహాలో వ్యాట్, ఐఎఫ్ఎస్టీని కూడా వాయిదా వేయాలి. ఎగుమతులకు సంబంధించిన డాక్యుమెం ట్లు బ్యాంకులకు సమర్పించే గడువును పొడిగించాలి. ఆటో మొబైల్ రంగానికి లబ్ధి చేకూర్చాలి ► కొత్త వాహనాలపై జీఎస్టీ రేట్లు తగ్గించాలి. ద్రవ్య లభ్యత పెంచే విధంగా జీఎస్టీ చెల్లింపు వాయిదా వేయాలి. ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన ఎగుమతిదారులకు డ్యూటీ డ్రాబ్యాక్, జీఎస్టీ రిఫండ్లు చెల్లించాలి. ► చిన్న పరిశ్రమల్లో కార్మికులను ఆదుకునే విధంగా మూడు నెలల పాటు వేతన సబ్సిడీ ఇవ్వాలి. పన్ను చెల్లింపులు వాయిదా వేయాలి. చిన్న కంపెనీలకు తక్కువ వడ్డీ రేటుకే సిడ్బీ వంటి సంస్థల ద్వారా అధిక వర్కింగ్ కేపిటల్ రుణాలు మంజూరు చేయాలి. ► బీఎస్–6 వాహనాల కాల పరిమితి 6 నెలలకు పెంచాలి. పోర్టు వెయిటింగ్ చార్జీలు రద్దు చేయాలి. లేదా తిరిగి చెల్లించాలి. దిగుమతులపై ఆధారపడిన కంపెనీలకు టర్మ్ లోన్లపై మారటోరియం విధించాలి. ► రాష్ట్రాల మధ్య సప్లై చైన్‌ను ప్రోత్సహించాలి. అవకాశం ఉన్న చోట్ల ఆన్లైన్లో ఆటోమొబైల్ అమ్మకాలను ప్రోత్సహించాలి. గనుల రంగాన్ని ఆదుకోవాలి ► ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజ ఆధారిత పరిశ్రమలు 8 ఉన్నాయి. 55 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే 40 యూనిట్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం అనిశ్చితి వల్ల సిమెంట్ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది. ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం వుంది. ► జాతీయ మౌలిక సదుపాయాల కల్పన కింద చేపట్టిన పనులకు సంబంధించిన నిధులను విడుదల చేయాలి. ► రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వడానికి ప్యాకేజీ ప్రకటించాలి. రుణాల చెల్లింపుపై మారిటోరియం విధించాలి. ట్రేడ్ ఫైనాన్స్ వ్యయాలను తగ్గించాలి. ► ప్రాజెక్టులు తిరిగి ప్రారంభించడానికి ప్రత్యేక ప్యాకేజీ కింద పెట్టుబడి సాయం అందించాలి. మైనింగ్ ప్రాజెక్టుల్లో కార్మికులకు వేతనాల రాయితీ ఇవ్వాలి. పన్నులను తగ్గించాలి. ► వ్యూహాత్మక రంగంలో పరిశ్రమల ఏర్పాట్లుకు లోన్ గ్యారంటీ కల్పించాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి రక్షించడానికి బీమా సదుపాయం కల్పించాలి. ఆహార శుద్ధి పరిశ్రమలకు చేయూత ► చైనా, అమెరికా తదితర దేశాలకు ఎగుమతులపై ఆంక్షలు విధించినందున ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ బాగా దెబ్బతింది. ► రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, క్లస్టర్ ప్రాజెక్టులు, మెగా ఫుడ్ పార్కులు, బహుళ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి జోన్లు, కోల్డ్‌చైన్ మౌలిక వసతులు అన్నీ కలిపి 3వేలకుపైగా ఉన్నాయి. కనుక ఈ రంగానికి ఇలా సహకారాన్ని అందించండి. ► ప్రత్యేక రుణాలు మంజూరు చేయడం ద్వారా నిర్వహణ పెట్టుబడిని మరింతగా అందుబాటులోకి తేవాలి. జీఎస్టీ, విద్యుత్ చార్జీలు, ఎగుమతి సుంకాలు ఉప సంహరించాలి. స్వల్ప కాలిక రుణాలు అందించాలి. ► అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆసియా దేశాలకు మత్స్య ఉత్పత్తుల ఎగుమతులను వెంటనే పునఃప్రారంభించాలి. పెరిషబుల్ ఉత్పత్తులకు డిస్కౌంట్ రేట్లతో కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి. ► సుంకాల చెల్లింపులో జాప్యంపై అదనపు మొత్తాన్ని మినహాయించాలి. ఆహార ఉత్పత్తులను రవాణా చేసే వాహనాలు రాష్ట్రాల సరిహద్దులు దాటడంలో ఆలస్యం లేకుండా చూడాలి. భవిష్యత్తులో ఈ చర్యలు తీసుకోవాలి ► పోర్టుల వద్ద క్వాలిటీ టెస్టింగ్ సదుపాయాలతో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లను నిర్మించాలి. భారతదేశం నుంచి ఎగుమతులకు మరింత «డిమాండ్, ధర లభించేలా కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ► వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు పొలాల నుంచి పోర్టుల వరకు సరైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రుణాల మీద వడ్డీని రద్దు చేయాలి. తక్కువ వడ్డీతో కొత్త రుణాలు మంజూరు చేయాలి. ► చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ఎగుమతుల క్లస్టర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ రేట్లకు అందుబాటులోకి తేవాలి. -
'విశాఖ కేంద్రంగా 50వేల ఐటీ ఉద్యోగాలు'
సాక్షి, విశాఖపట్నం : పరిశ్రమల మధ్య ఉన్న వ్యత్యాసం, అంతరాన్ని తొలగించి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త పరిశ్రమల పాలసీ అనేది సింపుల్‌గా, పారదర్శకంగా, సెల్ఫ్ పోలీసింగ్ పాలసీగా ఉంటుందని తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి పరిశ్రమల రాయితీ కింద 4600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండేదని, త్వరలోనే వాటిని క్లియర్ చేస్తామని మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో జరిగిన సమావేశంలో ఈ ఏడాది విశాఖ కేంద్రంగా 50 వేల ఐటీ ఉద్యోగాలు, ఒక స్కిల్ యునివర్సిటీ, 26 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, 4 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి వెల్లడించారు. కాగా వీటి ఏర్పాటుకు 4 పారామీటర్లలో అధ్యయనం చేసి 45 నివేదిక ఇవ్వాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. అయితే స్కిల్ యునివర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక వనరుల లభ్యత, అనుకూల ప్రాంతం, కరిక్యలమ్ ఏ విధంగా ఉండాలనేదానిపై ముఖ్యమంత్రిని అడిగినట్లు పేర్కొన్నారు. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను కూడా భాగస్వామ్యం చేయాలని, దానివల్ల అవి మరింత అప్‌గ్రేడ్ అయ్యే అవకాశముందని సీఎంను వివరించినట్లు తెలిపారు. (పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది) అదాని డేటా సెంటర్ ను మార్చమని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని, వాస్తవంగా డేటా సెంటర్లు చాలా అవసరం అన్నారు. కానీ డేటా సెంటర్ లొకేషన్ మార్పు పై సోషల్ మీడియాలో అనవసరంగా దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని గౌతమ్ రెడ్డి తెలిపారు. సచివాలయం పేరిట ఐటీ కంపెనీలను వెళ్లిపోవాలని, ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, ఐటీ కంపెనీలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంటే, ఉన్న కంపెనీలను ఎలా బయటకు పంపిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ఐటీ కంపెనీలపై చేస్తున్న అనవసర ప్రచారాలు మానుకుంటే మంచిదని గౌతమ్ రెడ్డి హితభోద చేశారు. -
రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు: ఒడిషా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 2025 నాటికి కొత్తగా రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని ఒడిషా ప్రభుత్వం తెలిపింది. అలాగే 30 లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నామని ఒడిషా పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ నితిన్ జవాలే వెల్లడించారు. నిర్ధేశిత లక్ష్యాన్ని గడువు కంటే ముందే చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఒడిషాలో పెట్టుబడి అవకాశాలు అన్న అంశంపై ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు, పెట్రో రసాయనాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీ, ఐటీఈఎస్, వాహనాలు, వాహన విడిభాగాల తయారీని ప్రధాన రంగాలుగా ప్రోత్సహిస్తామని వివరించారు.