శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని భావనపాడు, కళింగపట్నం హార్బర్లను అభివృద్ది చేయడంతోపాటు పారిశ్రామిక అభివృద్దిలో హార్బర్లను ఒక భాగంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. అయితే ఇప్పుడు కాకపోయినా ప్రాధ్యాన్యత, వరుస క్రమం ఆధారంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని కలెక్టర్ తెలిపారు.
గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి తొలిసారిగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంతో పాల్గోని, శుక్రవారం సాయంత్రం కలెక్టర్ జిల్లాకు చేరారు. అక్కడ సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన శుక్రవారం తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల పరిస్థితులు, వనరులు, అవసరాలు తదితర ఆంశాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి తెలిపానన్నారు. జిల్లాలో భావనపాడు, కళింగపట్నం హర్బర్లు అభివృద్ది అవసరంపై వివరించానన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్దికి ఏడు మిషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. దీని ద్వారా అన్ని శాఖలు అబివృద్ది జరుగుతుందన్నారు.
సమావేశంలో ఎక్కువగా అభివృద్ది కావాల్సిన అంశాలపై చర్చ సాగిందని ఆయన తెలిపారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమలు చేయడానికి అధికారులందరి సహకారం తీసుకోవాలని, ఏఏ శాఖలను సమన్వయం చేసుకోవాలో మిషన్లులో తెలిపారని కలెక్టర్ వివరించారు. జిల్లాలో పరిశ్రలు అవసరం ఉందని, నూతన పారిశ్రామిక విధానం ద్వారా అన్ని ప్రాంతాలను అబివృద్ది చేయాలని కోరానన్నారు. పలాసలో జీడి పరిశ్రమ, తీర ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి, అనుంబంద పరిశ్రమలు, ఉద్దానం ప్రాంతంతో కొబ్బరి, వాటి అనుంబందంగా ఉండే పరిశ్రమలు, ఈ ఉత్పత్తుల అమ్మకాలకి కావాల్సిన సదుపాయాలు కల్పన తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
పర్యాటక కేంద్రాల అబివృద్దికి కూడా చర్యలు తీసుకోవాలని, దీనికోసం ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారన్నారు. మిషన్లులో భాగంగా పర్యాటక రంగానికి కూడా ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఇది తొలి సమావేశం కావడంతో ఎక్కువగా శాఖల మధ్య సమన్వయం, అభివృద్దికి కావాల్సిన వనరులు, పారిశ్రామిక రంగం, మహిళా సంక్షేమంపై చర్చలు సాగాయన్నారు. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారని, ఆయన కూడా జిల్లా అభివృద్దికి కావాల్సిన అంశాలను వివరించారని కలెక్టర్ తెలిపారు.
అభివృద్ధి అంశాలపై చర్చించా..!
Published Sat, Aug 9 2014 4:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement