ఉద్దానం సమస్య చంద్రబాబు హయాంలో కూడా ఉన్నా పరిష్కారం చూపలేదు సరికదా కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. సమాజం గురించి పట్టని ఇలాంటి క్యాన్సర్ గడ్డలను ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి. పక్క రాష్ట్రంలో ఉంటూ ఏడుపుతో మనపై పడుతున్న వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి.
ఈ ఏడుపులన్నింటినీ కేవలం మరో మూడు నెలలు భరించండి. మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. ఇలా ధైర్యంగా అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా? – సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్క రోజులో వచ్చింది కాదని, ఆ కష్టాలు చంద్రబాబు హయాంలోనూ ఉన్నా దశాబ్దాల పాటు ఎందుకు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై ప్రజలందరూ ఆలోచించాలని విన్నవిస్తున్నట్లు చెప్పారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ విపక్షాల వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.
నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్
ఏ ఒక్కరిపైనా మానవత్వం, మమకారం లేని మనిషి ఈ చంద్రబాబు. తన సొంత నియోజకవర్గం కుప్పానికి గతంలో ఎప్పుడూ నీరిచ్చిన చరిత్రే లేదు. కుప్పానికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా అది జరిగింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. మరి సొంత నియోజకవర్గం, తనను ఎమ్మెల్యేగా దశాబ్దాలుగా గెలిపించిన నియోజకవర్గాన్నే పట్టించుకోని ఈ వ్యక్తికి ఉత్తరాంధ్రపై ఏం ప్రేమ ఉంటుంది? ఈ పెద్దమనిషి దత్తపుత్రుడిగా ఒక యాక్టర్‌ను పెట్టుకొని డ్రామాలు ఆడతాడు.
ఆ దత్తపుత్రుడు మొన్న తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడుతూ అన్న మాటలు వింటే ఆశ్చర్యం అనిపించింది. తాను తెలంగాణలో పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానంటాడు. తన దురదృష్టం అంటాడు. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబుకు పార్టనర్.
బర్రెలక్క బెటర్..
ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్. ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లు ఎన్నో తెలుసా? చివరికి ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడి అభ్యర్థులకు రాలేదు. డిపాజిట్లు కూడా రాలేదు.
ఏడుపులే.. ఏడుపులు
అక్కచెల్లెమ్మలను, పొదుపు సంఘాల్ని నిలువునా ముంచేసిన చంద్రబాబుకు ఇవాళ మనం పార్టీలకు అతీతంగా మంచి చేస్తుంటే ఏడుపు. 31 లక్షల ఇంటి పట్టాలు అక్కచెల్లెమ్మల చేతిలో పెడితే ఏడుపు. 22 లక్షల ఇళ్లను కట్టిస్తుంటే ఏడుపు. పేద పిల్లల బతుకులు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలని తపిస్తూ పేద పిల్లలు వెళ్తున్న గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు తీసుకొస్తే ఏడుపు. గోరుముద్ద, నాడు–నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ బడుల్లో పెడితే ఏడుపు. 6వ తరగతి, ఆపై తరగతుల పిల్లలకు, ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్‌పీ ప్యానల్స్ తెస్తే ఏడుపు.
8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు. ఏకంగా 35 లక్షల ఎకరాలు హక్కులేని భూములకు, అసైన్డ్ భూముల మీద పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కలి్పస్తే ఏడుపు. 99 శాతం హామీలను నెరవేరుస్తుంటే ఏడుపు. లంచాలు, వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా రూ.2.40 లక్షల కోట్లు జమ చేస్తుంటే ఏడుపు. మరో 1.70 లక్షల కోట్లు నాన్ డీబీటీగా పేదలకు ఇస్తున్నా కూడా ఏడుపే ఏడుపు.
పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజని, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, వరుదు కళ్యాణి, నర్తు రామారావు, దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, జిల్లా పరిషత్ చైర్మన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాసరావు, హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
నాన్ లోకల్స్.. ఒకటే ఏడుపులు
ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్లు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని మీ బిడ్డ అంటే అడ్డుకుంటున్న దుర్మార్గం వారిది. ఉత్తరాంధ్రలో ఒక బిల్డింగ్ కట్టినా వీళ్లు ఏడుస్తారు. మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానన్నా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పోర్టు వస్తుందన్నా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామంటే ఏడుస్తారు.
ఓ చంద్రబాబు, ఓ రామోజీరావు, దత్తపుత్రుడు, రాధాకృష్ణ, టీవీ 5 వీళ్లంతా ఒక దొంగల ముఠాగా తయారై మనమీద పడి ఏడుస్తుంటారు. వీళ్లలో ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. ఉండేది హైదరాబాద్‌లో. అలాంటి నాన్ లోకల్స్.. ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? మన రాజధానులు ఎక్కడ ఉండాలి? అని శాసిస్తారా? ఈ నాన్ లోకల్స్ చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రంలో జరగాలట. అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు. వారు ఏనాడూ ఇవ్వని విధంగా మనం ఇంటింటికీ పెన్షన్ ఇస్తుంటే కూడా ఏడుపు.
వారి హయాంలో ఇచ్చిన వెయ్యి పింఛన్‌ను మనం రూ.2250తో ప్రారంభించి ఏకంగా రూ. 3 వేలు చేస్తుంటే ఏడుపు. దోపిడీని అరికట్టి, జన్మభూమి కమిటీలను రద్దు చేసి, ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రతి పేద వాడికీ తోడుగా ఉండి నడిపిస్తుంటే ఏడుపు. వారు ఇవ్వని విధంగా ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 2.10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ఏడుపు. వారి ఐదేళ్ల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఆర్బీకే వ్యవస్థ, పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ.. ఇవన్నీ అందిస్తున్నందుకు ఏడుపు.
Comments
Please login to add a commentAdd a comment